జూన్‌ 5 ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవం


‌ప్రపంచ పర్యావరణంలో  త్వరితగతిన పెనుమార్పులు సంభవిస్తున్నాయన్నది గత కొంత కాలంగా మనం చూస్తున్నాం. ఇవి విపరీత పరిణామాలు. మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఉత్పాతాలు. దాదాపు అన్ని ఖండాలలోనూ ఇదే పరిస్థితి. మంచు తుఫానులు, ఆకస్మిక వరదలు, టోర్నడోలు, పెద్దపెద్ద వడగళ్ల వానలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడడం దాదాపు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో పరిపాటి అవుతుండగా, ప్రజలు తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు. వర్షాభావంతో ఎడారి ప్రదేశాలైన గల్ఫ్ ‌దేశాలలోకూడా గత కొద్ది కాలంగా పడుతున్న విపరీత వర్షాలు, వరదలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విపరీత వాతావరణ మార్పులకు కారణాలు విశ్లేషించి మానవాళి తగురీతిగా ప్రపంచ కార్యకలాపాలను అనుసంధానిస్తే పరిస్థితులు కొంతవరకూ విరుగుడు ఉండవచ్చేమో అనిపిస్తోంది.

పెరుగుతున్న విపరీత వాతావరణ మార్పులు, పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా యునైటెడ్‌ ‌నేషన్స్ ఈ ‌సంవత్సరము “Inspired by Nature. For Climate. For Our Future”.  అంటే.. ‘ప్రకృతిని చూసి స్ఫూర్తి పొంది మన భవిష్యత్తును, మన వాతావారణాన్ని మనమే కాపాడుకోవాలి’ అనే నినాదాన్ని ప్రవేశపెట్టింది. ఈ నినాదాన్ని ప్రపంచ మంతా తెలియచేయాలనీ, పాటించాలనీ యునైటెడ్‌ ‌నేషన్స్ ‌వరల్డ్ ఎన్విరాన్మెంట్‌ ‌పోగ్రాం ద్వారా ప్రపంచ మంతా చాటుతూ, వాతావరణాన్ని కాపాడుకు నేందుకు తక్షణ చర్యలు తీసుకోవడవ•, అనుకూల పర్యావరణాన్ని దృఢ పరచుకోవడవ, మనకు ఈ భూమి, ప్రకృతి ఇచ్చే ప్రతికూల సంకేతాలను ప్రజలం దరూ గమనించి ప్రతిస్పందిస్తూ వాతావరణాన్ని పరిరక్షించుకోవడవ•. ఈ దిశలో ఈ సంవత్సరం చేయవలసిన ముఖ్య ప్రయత్నాలిలా ఉన్నాయి. 1. ఈ విషయాలు ప్రచారం చేయడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను స్వచ్చందంగా జరిపే దేశం (host country) అజర్‌ ‌బైజాన్‌, ఆదేశపు రాజధాని బకు నగరం.

  1. అందరూ ఈ ప్రయత్నంలో భాగస్వాములై ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని అనుకూల వాతావరణాన్ని సాధించుకుందాం. 3. 2026లో వాతావరణం-ఈ విశ్వంలో ఉన్న గ్రహాలన్నిటి స్థితిగతులతో, ముఖ్యంగా భూమి పై జరుగుతున్న విపరీత వాతావరణ మార్పులతో ముడిపడి ఉందని, హానికరంగా మారుతున్న/దిగజారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నాయని, ప్రకృతిని పరిరక్షించుకోవడమే మన మనుగడకు కీలకం. ఆ దిశలో పని చెయ్యాలి.

ఈ విషయంలో అజర్‌ ‌బైజాన్‌ ‌పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం అభివృద్ధికై తీసుకుంటున్న చర్యలు: 1. పచ్చదనం పెంపొందించుకోవడానికి, సంప్రదాయ ఇంధన వనరులను (రెన్యువబుల్‌ ఎనర్జీ సోర్సస్‌) ఉపయోగించుకోవడానికి చాలా వేగవంత మైన కార్యప్రణాళికను అమలుచేయడం. 2. కర్బన ఉద్గారాలను 2035 కల్లా దాదాపు 40% తగ్గించడానికి చేసుకున్న పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి పనిచేయడం. 3. పునరుత్పాదక వనరుల (రెన్యువబుల్‌ ఎనర్జీ సోర్సస్‌) ‌వినియోగం 2030 కల్లా 30% పెంచడం. 4. 230 MW గారాడగ్‌ ‌సోలార్‌ ‌ప్లాంట్‌ ‌సహా 240 MW  కిజీ అబషేరోన్‌ ‌విండ్‌ ‌ఫామ్‌ ‌ప్రాజెక్టలను అతిరిక్తంగా 1 GW సామర్ధ్యం త్వరలోనే కలిగిఉండడానికి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తి చేసే ప్రణాళికలతో పనిచేస్తుంది. 5.:బకు నగరంలో సుస్థిర పట్టణాభివృద్ధి (అర్బన్‌ ‌సస్టైనబిలిటీ సాధించే దిశగా పయనిస్తూ ఆధునిక /తక్కువ ఇంధన ఉద్గారాలను విడుదలచేసే/లేదా పూర్తిగా ఉద్గారాలు లేని బస్సులను ఉపయోగించడం. పెట్రోల్‌ /‌డీజిల్‌కి ప్రత్యామ్నాయ్యంగా ఎలక్ట్రిక్‌ ‌రవాణా/మెషినరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడం. నీటి ఎద్దడి ప్రాంతాలలో తక్కువ నీటితో చేసే ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడం నిర్వీర్యమైన పర్యావరణ వ్యవస్థను పునరుజ్జీవింపచేయడము మొదలైనవి చేపడుతోంది.

ఇంకా ప్రకృతి, ప్రజల మీద పర్యావరణ కాలుష్యం భారం పడకుండా ప్లాస్టిక్‌ ‌వేస్ట్ ‌తగ్గించడం, కొత్త, మరింత ప్రభావవంతమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలను రూపొందించడం, వాణిజ్య కలాపాలలో 15 మైక్రోన్‌ ‌సింగల్‌ యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ఉపయోగం నిషేధించడం మొదలైన అనేక చర్యలు చేపడుతోంది. ఈ దేశం తీసుకుంటున్న ఇంకా ఇలాంటి మరెన్నో పర్యావరణ పరిరక్షణ విధానాలు ఎంతో అభినందనీయమైనవి కదా!

అతివేగంగా మారుతున్న ప్రపంచ పర్యావరణ స్థితిగతులను గమనిస్తే, ముఖ్యంగా 21వ శతాబ్దంలో గత రెండు దశాబ్దాలుగా వాతావరణ, పర్యావరణ సంబంధమైన అనేక విపరీత పరిణామాలు, ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొన్నిసార్లు శాస్త్రజ్ఞులకు, పర్యావరణవేత్తలకు ఇవి విస్మయాన్ని కలిగిస్తూ, పర్యావరణ పరిరక్షణ రంగంలో ఇంకా లోతైన పరిశోధనలు జరగాలనే అవసరాన్ని, ప్రపంచంలోని అన్ని దేశాలు రోజు రోజుకూ క్షీణిస్తున్న పర్యావరణ పరిరక్షణకై అనేక జాగ్రత్తలు, జీవన శైలిలో మార్పులు చేపట్టాలని సూచిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాలలో పర్యావరణ అసమ తుల్యతతో ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలు: గత రెండు దశాబ్దాలలో ప్రపంచ పర్యావరణంలో త్వరితగతిన మార్పులు, ఎన్నడూ లేనంత భూ ఉపరితల వేడి పెరగడం, ధ్రువాలలోని మంచు నిల్వలు తగ్గిపోవడం, కర్బన ఉద్గారాల విపరీత పెరుగుదల. అయితే అనేక దేశాలు సమాంతరంగా సాంప్రదాయేతర ఇంధనాలు (రెన్యువబుల్‌ ఎనర్జీ సోర్సస్‌) ‌వాడడం, అడవుల పెంపకం లాంటి అనుకూల చర్యలు తీసుకున్నప్పటికీ ముఖ్యంగా సముద్ర ఉపరితలం నుంచి వీచే వేడిగాలులు ఎక్కువై పోయాయి. తీవ్రమైన తుఫానులు, విపరీతమైన వర్షాలు, వరదలు జీవ వైవిధ్యంపై ప్రభావం చూపాయి. ఎన్నో పక్షి, జీవ, జంతుజాతులు అంతరించి పోతున్నాయి.

ఈ విషయంలో యునైటెడ్‌ ‌నేషన్స్ ఆధ్వర్యంలో 2015లో పలుదేశాల మధ్య జరిగిన పారిస్‌ అ‌గ్రిమెంట్‌ (ఒక ఆశాకిరణం)వివరాలు ఇలా ఉన్నాయి.

  1. ఈ పారిస్‌ అ‌గ్రిమెంట్‌ ‌పలు భాగస్వామ్య దేశాలు తప్పకుండా పాటించవలసిన ఒక అంతర్జాతీయ ఒప్పందం.
  2. దీంట్లో 195 దేశాలు 2015లో జరిగిన యునైటెడ్‌ ‌నేషన్స్ ‌క్లైమేట్‌ ‌కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాయి.
  3. ఈ అగ్రిమెంట్‌ ‌ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సగటు ఉష్ట్నోగ్రతలను పెరగనీయకుండా నిరోధించి కనీసం 2 డిగ్రీలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం. అంటే ప్రపంచంలో విచ్చలవిడి పారిశ్రామీకరణ జరగక ముందు ఉన్న ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీ తక్కువ స్థాయికి చేరుకోవడం.

 4.ఈ లక్ష్యాలను ప్రతిదేశం తన జాతీయ స్థాయిలో తగిన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి తీవ్రమైన కృషి చేయడం.

 5.పై లక్ష్యాలను సాధించడానికి చేసిన ప్రతిజ్ఞ ఎంతవరకూ నెరవేరుతోందన్నది ప్రతి 5 సంవత్సరా లకు ఒకసారి సమీక్షించుకోవడం. 5 ఏళ్లకొకసారి సభ్య దేశాలు పోగ్రెస్‌ ‌రిపోర్ట్‌ను సమర్పించడం. ఈ అగ్రిమెంట్‌ ‌కింద అన్ని సభ్యత్వ దేశాలు ఎటువంటి పురోగతిని సాధిస్తున్నాయన్నది దఫ దఫాలుగా సమీకృతంగా సమీక్షించడం,తద్వారా ప్రపంచం అనుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో పురోగతిని పొందడం.

  1. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతికత, సహాయక నిధులిచ్చి ఆ దేశాలు పర్యావరణాన్ని అభివృద్ధి పరచడం. వాతావరణం లోచోటుచేసుకొనే ప్రతికూల మార్పులను అరికట్టడంలో సహాయపడడం.
  2. పారిస్‌ అ‌గ్రిమెంట్‌ ‌ప్రతి సభ్యదేశానికీ వాయు ఉద్గారాలను తగ్గించడంలో తమదైన లక్ష్యాలను నిర్దేశించుకునే వెసులుబాటు కల్పించింది. దీనిద్వారా సభ్యదేశాలు తమ ప్రణాళికలను సమర్పించడం, తమ లక్ష్యాలను కనీసం 5 ఏళ్లకు ఒకసారి సవరించుకోవడం. ఈ దిశలో ప్రపంచ వ్యాప్తంగా సభ్యదేశాలలో పారదర్శకత రావడం, జవాబుదారీతనాన్ని పారిస్‌ అ‌గ్రిమెంట్‌ ‌నొక్కి చెబుతోంది.

‘పారిస్‌’ ఒప్పందలో భారత్‌ ‌కీలకపాత్ర : భారతదేశం పారిస్‌ అ‌గ్రిమెంట్‌లో సభ్యురాలు, అతి క్రియాశీలక దేశం. తదనుగుణంగా తన అనుసమర్ధన (ఇన్స్ట్రుమెంట్‌ ఆఫ్‌ ‌రాటిఫికేషన్‌) ‌ను భారతదేశం యునైటెడ్‌ ‌నేషన్స్ ఆర్గనైజేషన్‌కు అక్టోబర్‌ 02,2016‌న సమర్పించింది. ప్రపంచం లోని ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ, తదనుగుణ పరిమాణంలో కర్బన ఉద్గారాలను విడుదల చేసే దేశం గా తన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో పారిస్‌ అ‌గ్రిమెంట్‌ ‌ద్వారా నిర్దేశిం చుకున్న లక్ష్యాలను (వీటినే నేషనల్‌ ‌డిటర్మినేషన్స్ అం‌టాము) చేరుకోవడానికి భారతదేశం చురుకుగా ముందుకు సాగుతోంది. భారతదేశం పారిస్‌ అ‌గ్రిమెంట్‌కి అనుగుణంగా ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టింది.

  1. అగ్రిమెంట్‌పై ఏప్రిల్‌ 22,2016 ‌న సంతకాలు చేసిన కొద్దికాలంలోనే తన ఆమోదాన్ని ధ్రువపరచింది.
  2. దేశ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను తన ప్రతిజ్ఞలను United Nations Framework Convension on Climate Change (UNFCCC) కి సమర్పించింది. మృత్తిక నుండి సేకరించిన ఇంధన వినియోగాన్ని, ఉద్గారాల విడుదల తగ్గించడం ఇందులోని ప్రధాన అంశాలు.
  3. 2070 కల్లా దీర్ఘకాలిక ప్రణాళికగా నెట్‌ ‌కారబోన్‌ ‌జీరో ఎమిషన్‌ ‌సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశం తీసుకున్న ఈ నిర్ణయాలు విజయవంతంగా అమలుచేయడంలో మనందరి పాత్ర ఎంతైనా ఉంది కదా మరి!

అధిక జనాభా కలిగి, ఆర్థిక ప్రగతిలో దూసుకు పోతున్న భారత్‌ ‌పర్యావరణ పరిరక్షణకై నిర్దేశించు కున్న లక్ష్యాలను సాధించడానికి చాలా కృషి చేస్తోంది. ముఖ్యంగా దేశం వ్యవసాయ ఆధారితం కాగా, ఇంకా 60% వరకు ప్రజలు గ్రామాలలోనే ఉంటున్నారు. వీరి జీవనసరళి మారాలంటే వీళ్లు ఆర్థికంగా ఎదగాలి. అందుకు పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు అధికంగా స్థాపించాల్సి వస్తోంది. దీన్నే సోషియో ఎకనామిక్‌ ‌ప్రెషర్‌ అం‌టాము. అధిక పరిశ్రమలవల్ల కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. పరిశ్రమలకు, వాణిజ్య కార్యకలాపాలకు పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌బొగ్గు ఆధారిత విద్యుత్తు ఎక్కువ అవసరమవుతాయి. వీటివల్ల కాలుష్యం పెరిగే అవకాశముంది, కాబట్టి ఆర్థిక ప్రగతితో పాటు పర్యావరణ సమతుల్యత సాధించడం భారత్‌కు పెను సవాలుగా మారిందనుకోవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా అటు పరిశ్రమ నిర్వాహకులు, వాణిజ్య సంస్థలు, ఇటు ప్రజలు మరింత బాధ్యతతో వ్యవహరించి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తే భారత్‌ అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలదు. అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో శుభ్రత ఇంకా పెరగాలి. దీనికి ప్రభుత్వాలు నిర్భంధ స్వచ్ఛ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలి. ప్రజలందరూ ఏకతాటిగా దీనికి సహకరించాలి. భారత్‌ ‌పర్యావరణ పరిరక్షణలో అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ముఖ్యంగా వ•డు దిశలలో విపరీతమైన కృషి చేయాలి. అవి:. 1. ఇంధన పొదుపు, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం 2. చెత్త తగ్గింపు 3. అన్ని కార్యకలాపాలలో చట్టాలలో నిర్దేశించిన పరిమితులకు లోబడి కాలుష్య నియంత్రణ పాటించాలి. ఈ ‘వరల్డ్ ఎన్విరాన్మెంట్‌ ‌డే-2026 (జూన్‌ 5) ‌సందర్భంగా ప్రజలందరూ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వంతో సహకరించి, కాలుష్యాన్ని నియంత్రించి ఈ ప్రపంచంలో కాలుష్యం తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తారని ఆశిద్దాం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE