ఫ్లై దుబాయ్‌ ‌విమానంలో కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌మచ్చర్‌పై కో-పైలట్‌ ‌హమామ్‌ అల్‌-‌హమామీ దాడి చేయడానికి గల కారణాలపై యూఏఈసౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ ‌దేశాల భద్రతా సంస్థలు జరుపుతున్న సంయుక్త దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు కో-పైలట్‌ ‌తీవ్రమైన ఇస్లామిక్‌ ఉ‌గ్రవాద భావజాలం కలవాడని ఇజ్రాయెల్‌ ‌ప్రధాని బెంజమిన్‌ ‌నెతన్యాహు, దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లోని అతడి పాత ఖాతాలను పరిశీలించగా, ఉగ్రవాద సంస్థ ‘అల్‌-‌ఖైదా’కు సంబంధించిన అనుమానాస్పద లింకులు, ఫోటోలు లభ్యమయ్యాయి. దుబాయ్‌ ‌నుంచి ఇజ్రాయెల్‌ ‌రాజధాని టెల్‌ అవీవ్‌ ‌వెళ్తున్న విమానాన్ని గాల్లోనే కూల్చేయాలనే (లేదా ఇజ్రాయెల్‌లోనే పేల్చేయాలనే) కుట్రపన్ని, ఈ దాడికి పాల్పడ్డాడని స్పష్టమైంది. అందుకే కాక్‌పిట్‌లో అత్యవసర సమయాల్లో వాడే క్రాష్‌ ‌యాక్స్ (‌గొడ్డలి)తో కెప్టెన్‌పై దాడి చేసి, విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు.

విమానంలో కో-పైలట్‌ ‌హమామ్‌ అల్‌-‌హమామీ దుశ్చర్యంతో కాక్‌పిట్‌లోకి వచ్చిన ప్రయాణికులు, సిబ్బంది అతడిని పట్టుకుని కట్టేసిన తర్వాత.. ‘నన్ను చంపేయండి’ (కిల్‌ ‌మి కిల్‌ ‌మి)అని గట్టిగా అరవడాన్ని బట్టి అతడు ఆత్మాహుకి సిద్ధపడే విమానం ఎక్కాడని స్పష్టమవు తోంది. ఈ కో-పైలట్‌ ‌యూఏఈలో జన్మించి నప్పటికీ తండ్రి ఒమన్‌ ‌దేశానికి, తల్లి సిరియాకు చెందినవారుగా దర్యాప్తులో తేలింది. అతడి తీవ్రవాద ధోరణ, భద్రతాపరమైన ముప్పును ముందే గుర్తించిన ఒమన్‌ ఎయిర్‌ ‌సంస్థ, అతడు విమానాలు నడపకుండా గతంలోనే నిషేధం విధించింది. అయినప్పటికీ అతడు ఫ్లై దుబాయ్‌లో ఎలా చేరాడు? అనుమతి ఎలా లభించిందనే కోణంలో •••ఏఈ అటార్నీ జనరల్‌ ‌లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనను యూఏఈ ‘ఉగ్రవాద దాడి యత్నం’ గా పరిగణించి పూర్తి స్థాయి దర్యాప్తును వేగవంతం చేసింది.

సంచలనం సృష్టించిన ఉదంతం

సెప్టెంబర్‌ 30,2026‌న జరిగిన ఫ్లై దుబాయ్‌ ‌విమాన ఉదంతం అంతర్జాతీయ విమానయాన రంగంలో పెను సంచలనం సృష్టించింది. భారతీయ పైలట్‌ ‌సమయస్ఫూర్తి వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (యూఏఈ)‌లోని దుబాయ్‌ ‌నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌కు ఫ్లై దుబాయ్‌ ‌బోయింగ్‌ 737 ‌మ్యాక్స్ (‌ఫ్లైట్‌ ఎఫ్‌జెడ్‌ 1073) ‌విమానం 174 మంది ప్రయాణికులు (వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌ ‌పౌరులు, 27 మంది పిల్లలు ఉన్నారు), సిబ్బందితో బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, ఒమన్‌కు చెందిన కో-పైలట్‌ ‌హమామ్‌ అల్‌-‌హమామీ ఒక్కసారిగా తీవ్రవాద ధోరణితో (ఆత్మాహుతి మిషన్‌) ‌విమానాన్ని కూల్చివేయడానికి ప్రణాళిక వేశాడు. కాక్‌పిట్‌లో ఉన్న భారతీయ కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌మచ్ఛర్‌ ‌పై గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు. దాడి జరిగిన వెంటనే విమానం నియంత్రణ కోల్పోయి, కేవలం 30 సెకన్లలో 33 వేల అడుగుల నుంచి సుమారు 14 వేల అడుగుల కిందకు పడిపోవడం ప్రారంభించింది. కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌మచ్ఛర్‌ ‌తీవ్ర రక్తస్రావంతో కాక్‌పిట్‌ ‌ఫ్లోర్‌పై పడిపోయి నప్పటికీ, ప్రాణాలను పణంగా పెట్టి చివరి ప్రయత్నంగా లోపలి నుంచి కాక్‌పిట్‌ ‌డోర్‌లాక్‌ను తెరవగలిగాడు. ఆ వెంటనే కొందరు ఇజ్రాయెల్‌ ‌ప్రయాణికులు, క్యాబిన్‌ ‌సిబ్బంది లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను బంధించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఫ్లై దుబాయ్‌ ‌మరో పైలట్‌ ‌విమాన నియంత్రణను చేతుల్లోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబుక్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా, సురక్షితంగా ల్యాండ్‌ ‌చేశారు.

మోదీ, బెంజామిన్‌ ‌నెతన్యాహుల స్పందన

ఈ ఘటనపై ఇజ్రాయిల్‌ ‌ప్రధాని బెంమిన్‌ ‌నెతన్యాహు తీవ్రంగా స్పందిస్తూ, భారతీయ పైలట్‌ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు. అలాగే, కాక్‌పిట్‌ ‌లోకి దూసుకెళ్లి, కో పైలట్‌ను అణచివేసిన ఇజ్రాయెల్‌ ‌ప్రయాణికుడు యానివ్‌ ‌హయున్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇది జిహాదీ శక్తుల పనేనని ఇజ్రాయెల్‌ ‌రక్షణ మంత్రి ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారతీయ పైలట్‌ ‌సాహసాన్ని ప్రశంసిస్తూ, ఈ ఘోర ముప్పు తప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌లో కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌మచ్ఛర్‌ ‌పేరు మారుమోగి పోతోంది. 170 మందికి పైగా ఉన్న తమ దేశ పౌరులను (యూదులను) కాపాడినందుకు ఇజ్రాయెల్‌ ‌మీడియా, ప్రజలు స్మిత్‌ను దేవుడిలా చూస్తున్నారు. లక్షలాది మంది ఇజ్రాయెల్‌ ‌పౌరులు సోషల్‌ ‌మీడియా వేదికగా భారతదేశానికి, పైలట్‌ ‌స్మిత్‌కు ధన్యవాదాలు తెలిపారు. స్మిత్‌ ‌మచ్ఛర్‌ను ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హీరోగా కొని యాడారు. అక్టోబర్‌ 2‌న వీడియో కాల్‌లో మాట్లాడి, అతని ధైర్యసాహసాలను ప్రశంసించారు. ‘నీ శౌర్యం, సమయస్ఫూర్తి వందలాది ప్రాణాలను కాపాడాయి. దేశం మొత్తం నీ పట్ల గర్విస్తోంది’ అని మోదీ ‘ఎక్స్ ’‌లో పోస్ట్ ‌చేశారు. ‘నా కళ్లు వ•సుకున్నా విమానానికి ఏం జరుగుతుందో చెప్పగలను’ అని స్మిత్‌ ‌ప్రధాని మోదీకి ఫోన్‌లో చెప్పారు. కో-పైలట్‌ ‌దాడి చేసిన ఆ భయంకరమైన సమయంలో ధైర్యం కోసం హనుమాన్‌ ‌చాలీసా పఠించానని మచ్చర్‌ ‌ప్రధానికి వివరించారు. ‘నాకు ఎప్పుడు బాధగా అనిపించినా, కష్టాల్లో ఉన్నా వెంటనే హనుమాన్‌ ‌చాలీసా పఠిస్తాను. ఆ భగవంతుడే (హనుమంతుడే) నన్ను కాపాడాడని బలంగా నమ్ముతున్నాను’ అని స్మిత్‌ ‌భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మీరు హనుమాన్‌చాలీసా గురించి చెప్పిన విషయాలు విన్నాక, మీకు ఇలాంటి గొప్ప సంస్కారాన్ని, విలువలను నేర్పించి పెంచినందుకు మీ తల్లి గీతాబెన్‌ ‌గారికి నేను ప్రణామాలు చేస్తు న్నాను’’ అని మోదీ కొనియాడారు. ఈ సంభాషణలో కెప్టెన్‌ ‌స్మిత్‌ను ప్రధాని మోదీని తన ‘‘అతిపెద్ద రోల్‌ ‌మోడల్‌ (ఆదర్శం)’’గా అభివర్ణించారు. కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌సాహసం పట్ల దేశం గర్విస్తోందని భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు కూడా ప్రకటించారు. చికిత్స పొందుతున్న కెప్టెన్‌ ‌స్మిత్‌ ‌మచ్ఛర్‌ను యూఏఈ యువరాజు హమ్దాన్‌ ‌బిన్‌ ‌మహమ్మద్‌ ‌స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ధైర్యసాహసాలను దుబాయ్‌ ‌ప్రజల తరపున ప్రశంసించారు. ఈ గాయాలను పెద్ద సమస్యగా చూడట్లేదని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ విమానం నడుపుతాను’ అని స్మిత్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

సౌదీ అరేబియా స్పందన

విమానంలో ఉన్న ఇజ్రాయెల్‌ ‌వైద్యులు విమానం ల్యాండ్‌ అయ్యేంత వరకు స్మిత్‌కు ప్రథమ చికిత్స అందించారు. విమానం తమ దేశంలోని తబుక్‌ ‌ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. స్మిత్‌కు తక్షణమే తమ దేశ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడింది. మెరుగైన వైద్యం కోసం యూఏఈ రాజధాని అబుదాబికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించి పర్యవేక్షిస్తోంది. యూఏఈలో భారత రాయబారి డా. దీపక్‌ ‌మిట్టల్‌ ‌స్వయంగా ఆసుపత్రికి వెళ్లి స్మిత్‌ ‌మచ్చర్‌ను, ఆయన కుటుంబాన్ని కలిశారు.

కాగా,దాడికి పాల్పడిన ఒమన్‌ ‌జాతీయుడిని  సౌదీ అక్కడికక్కడే అరెస్ట్ ‌చేసి విచారించింది. అయితే, పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, ఈ ఘటనను రాజకీయ వివాదంగా మార్చకుండా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌దర్యాప్తు సంస్థలకు నిందితుడిని అప్పగించే పక్రియపైనే సౌదీ దృష్టి పెట్టింది.

 విమానాల భద్రతకు సరికొత్త సవాలు!

ఈ భద్రతా ఉల్లంఘన నేపథ్యంలోఇజ్రాయెల్‌కు నడిచే తన అన్ని విమాన సర్వీసులను ఫ్లై దుబాయ్‌ ‌సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. ఇజ్రాయెల్‌ అం‌తర్గత భద్రతా సంస్థ ‘షిన్‌ ‌బెట్‌’ ‌కూడా విమానాశ్రయాల వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. ఇకపై విదేశాల నుంచి (ముఖ్యంగా గల్ఫ్ ‌దేశాల నుంచి) ఇజ్రాయెల్‌కు వచ్చే అన్ని విమానాల పైలట్లు, సిబ్బంది గత చరిత్రను అత్యంత కఠినంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఫ్లై దుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 ‌ఘటన అంతర్జాతీయ విమానయాన రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతి పరచింది. 2001 సెప్టెంబర్‌ 11 (9/11) ‌దాడుల తర్వాత, బయటి వ్యక్తులు లేదా ఉగ్రవాదులు కాక్‌పిట్‌ ‌లోకి చొరబడకుండా ఉండటానికి ‘‘కాక్‌పిట్‌ ‌డోర్లను లోపలి నుండి గట్టిగా లాక్‌ ‌చేసే’’ నిబంధనను తెచ్చారు. అయితే, తాజా ఘటనతో ‘ముప్పు బయటి నుంచికాదు.. లోపల ఉన్న పైలట్‌ ‌నుంచే వస్తే ఎలా?’’ అనే సరికొత్త సవాలు విమానయాన భద్రతా సంస్థల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా కాక్‌పిట్‌ ‌భద్రతా నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి.

నిందితుడు ఓమాన్‌ ‌కో-పైలట్‌ను గతంలోనే ఒమన్‌ ఎయిర్‌ ‌నిషేధించినా, ఫ్లై దుబాయ్‌ అతడిని చేర్చుకోవడంపై భద్రతా లోపాలను ఎత్తిచూపింది. ఇకపై పైలట్లను ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడు, ప్రతి ఏటా వారి రాడికలైజేషన్‌ (‌తీవ్రవాద ధోరణులు), సోషల్‌ ‌మీడియా ప్రవర్తన, ఇంటెలిజెన్స్ ‌నేపథ్యాన్ని మరింత కఠినంగా తనిఖీ చేయనున్నారు. ఇజ్రాయెల్‌ ‌ప్రధాని కార్యాలయం ఇప్పటికే తమ దేశానికి వచ్చే అన్ని అంతర్జాతీయ విమానాల పైలట్లపై అదనపు భద్రతా తనిఖీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాక్‌పిట్‌ ‌డోర్‌ ‌లోపలి నుండి లాక్‌ ‌చేస్తే బయట ఉన్న సిబ్బందికి అత్యవసర కోడ్‌ ‌తెలిసినా లోపలికి రాలేరు (పైలట్‌ ‌నిరాకరిస్తే). కాక్‌పిట్‌ ‌లోపల అపశ్రుతి, లేదా దాడి జరుగుతున్నప్పుడు, బయట ఉన్న సీనియర్‌ ‌క్యాబిన్‌ ‌సిబ్బంది ప్రత్యేక బయోమెట్రిక్‌ ‌లేదా అత్యవసర వ్యవస్థ ద్వారా బలవంతంగా తలుపు తెరిచే ఓవర్‌రైడ్‌ ‌టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై అంతర్జాతీయ నిపుణులు గట్టిగా డిమాండ్‌ ‌చేస్తున్నారు.పైలట్లకు సాధారణంగా జరిగే వైద్య పరీక్షలతో పాటు, వారి మానసిక స్థితి, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, ఆత్మహత్య సదృశ్య ఆలోచనలను గుర్తించే అంతర్జాతీయ ప్రమాణాల స్క్రీనింగ్‌ ‌పద్ధతులను తప్పనిసరి చేపట్టనున్నారు. కాక్‌పిట్‌లో ఉండే ఇలాంటి రక్షణ పరికరాలను పైలట్లకు సులభంగా అందుబాటులో లేకుండా, ప్రత్యేక లాకర్లలో భద్రపరిచే విధానాన్ని పరిశీలిస్తున్నారు. విమానంలో ఇద్దరు పైలట్లలో ఒకరు వాష్‌ ‌రూమ్‌కు వెళ్లినా.. కాక్‌పిట్‌లో తప్పనిసరిగా మరొక క్యాబిన్‌ ‌క్రూ మెంబర్‌ ఉం‌డాలనే నిబంధన కొన్ని దేశాల్లో ఉంది. దీనిని అంతర్జాతీయంగా మరింత కఠినతరం చేయనున్నారు.

రాజకీయ రగడ

ఈ ఘోర ఉగ్రవాద యత్నాన్ని లేదా ఇజ్రాయెల్‌ ‌ప్రయాణికులపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు ఖండించకుండా వ్యూహాత్మక మౌనం పాటించడం వెనుక వారి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని బీజేపీ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన భారతీయ పైలట్‌ ‌సమయస్ఫూర్తిని రాహుల్‌ ‌గాంధీ వంటి అగ్రనేతలు తగిన రీతిలో గుర్తించలేదన్నది వీరి ఆరోపణ.అయితే ఆ ఆరోపణలను కాంగ్రెస్‌ ‌నేతలు తోసిపుచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే తమ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే మన పైలట్‌ ‌స్మిత్‌ ‌మచ్ఛర్‌ ‌సాహసాన్ని, ప్రాణాలు కాపాడిన తీరును అభినందించారని, ఒక కీలక ప్రతినిధి ద్వారా పార్టీ స్పందనను తెలియజేశారని వారు స్పష్టం చేశారు. తీవ్రవాద ముప్పు, విమాన రక్షణ వంటి అంతర్జాతీయ సున్నితమైన అంశాలను, ఒక వ్యక్తి సాహసాన్ని దేశీయ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని ప్రతిపక్ష మద్దతుదారులు భావిస్తున్నారు.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.