అమెరికా-చైనా సంబంధాలు ఎప్పుడూ ‘సహకారం-పోటీ’ల మధ్య దోబూచులాడుతుం టాయి. చైనాను తీవ్రంగా విమర్శించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌, ‌ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ, జాయింట్‌ ‌బేస్‌ ఆం‌డ్రూస్‌ ‌విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు అరుదైన, ఘన స్వాగతం పలికారు. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటించడం, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో ఈ భేటీ జరగడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో లభించిన అతిపెద్ద తక్షణ ఉపశమనం వాణిజ్య రంగానికి సంబంధించింది. నవంబర్‌లో ముగియాల్సిన వాణిజ్య సంధిని మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల ఇరు దేశాల వ్యాపారులకు, ముఖ్యంగా అమెరికా రైతులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

తీవ్రమైన టారిఫ్‌ (‌సుంకాలు) యుద్ధం ప్రస్తుతానికైతే నిలిచిపోయింది. మధ్యప్రాచ్యంలో కొన సాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్‌ ‌యుద్ధ వాతావరణంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్‌ ‌విషయంలో చైనా వైఖరిపై అమెరికాలో అంతర్గతంగా విమర్శలు ఉన్నప్పటికీ, ఇరాన్‌ ‌జూన్‌ ‌నాటి తాత్కాలిక ఒప్పందానికి కట్టుబడి ఉండేలా చూడటం, హార్ముజ్‌ ‌జలసంధి గుండా అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా చూడటంపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు అగ్రరాజ్యాల మధ్య అపార్థాల వల్ల అకస్మాత్తుగా యుద్ధ వాతావరణం రాకుండా చూసేందుకు, ఇరు దేశాల సైన్యాల మధ్య క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించారు. తైవాన్‌, ‌దక్షిణ చైనా సముద్రం వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఇది నివారిస్తుంది.ప్రస్తుత ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతను సైనిక ప్రయోజనాలకు వాడటంపై ఇరు దేశాల మధ్య ఉన్న భయాలపై చర్చలు జరిగాయి. సాంకేతిక రంగంలో పోటీ ఉన్నప్పటికీ, నియంత్రణల విషయంలో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ పర్యటన ద్వారా రాత్రికి రాత్రే ఇరు దేశాల మధ్య విభేదాలన్నీ తొలగిపోలేదు. కానీ, బద్ధశత్రువులుగా మారి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టడం కంటే, ఒకరితో ఒకరు చర్చలు జరుపుతూ లాభపడటమే ఉత్తమమనే వాస్తవిక దృక్పథాన్ని ఇద్దరు నేతలూ ప్రదర్శించారు. ఈ ఏడాదిలోనే మరో రెండు సార్లు ముఖాముఖి భేటీలు కావడానికి ఇరు దేశాధినేతలు అంగీకరిం చడం ఈ పర్యటన సాధించిన అతిపెద్ద సానుకూల పర్యవసానంగా చెప్పవచ్చు.

ట్రంప్‌ ‌వైఖరిలో మార్పు

చైనా పట్ల, ముఖ్యంగా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ‌పట్ల ట్రంప్‌ ‌తన కటువైన వైఖరిని పక్కనబెట్టి, ఇంతటి సానుకూల ధోరణిని ప్రదర్శించడం వెనుక బలమైన అంతర్జాతీయ వ్యూహాలు, ఆర్థిక సమీకరణాలు ఉన్నాయి. ట్రంప్‌ ‌తన రెండో విడత పదవీకాలం ఆరంభంలో చైనా వస్తువులపై ఏకంగా 145-150 శాతం వరకు భారీ సుంకాలను విధించారు. అయితే చైనా దీనికి దీటుగా స్పందించింది. స్మార్ట్‌ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్స్ ‌తయారీకి అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీనివల్ల అమెరికా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగల ఆయుధాలు తన వద్ద కూడా ఉన్నాయని చైనా నిరూపించడంతో ట్రంప్‌ ‌దిగిరాక తప్పలేదు.ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. వచ్చే మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మార్కెట్లను మరింత గందరగోళంలోకి నెట్టడం ట్రంప్‌కి ఇష్టం లేదు. చైనాతో మరింతగా వాణిజ్య యుద్ధాన్ని పెంచితే అమెరికా మార్కెట్లు కూలిపోయే ప్రమాదం ఉండటంతో, ప్రస్తుతానికి పరిస్థితిని ప్రశాంతంగా ఉంచేందుకే ఆయన మొగ్గు చూపారు. మధ్య ప్రాచ్యంలో ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, చైనా సహాయం అమెరికాకు అత్యవసరం. ఇరాన్‌ ‌నుండి చైనా పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది. హార్ముజ్‌ ‌జలసంధి గుండా అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలగకుండా ఉండాలన్నా, ఇరాన్‌ ‌మరింత రెచ్చిపోకుండా ఆ దేశాన్ని ఆర్థికంగా ఒంటరిని చేయాలన్నా , చైనా సహకారం లేకుండా అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.ట్రంప్‌ ‌చైనాపై విధించిన అత్యవసర నియామక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసింది. దీనితో కేవలం ఏకపక్ష ఆంక్షల ద్వారా చైనాను లొంగదీసు కోవడం సాధ్యం కాదని ట్రంప్‌ ‌యంత్రాంగానికి స్పష్టమైంది. చైనాను ప్రపంచ దేశాల నుండి ఒంటరిని చేయాలనే అమెరికా వ్యూహానికి ఆశించిన మద్దతు లభించడం లేదు. ఐరోపా, కెనడా వంటి అమెరికా పాత మిత్రదేశాలు సైతం వాషింగ్టన్‌, ‌బీజింగ్‌ల మధ్య సమతూకం పాటిస్తూ తమ సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నాయి. ఒంటరిగా చైనాను ఎదుర్కోవడం కంటే చర్చల ద్వారా అదుపులో ఉంచడమే మేలని ట్రంప్‌ ‌భావించారు. ఆయన చైనాతో సై•ద్ధాంతిక వైరాన్ని షి జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సంబంధంగా మార్చుకున్నారు. జిన్‌పింగ్‌ను ఒక ‘‘గ్రేట్‌ ‌జెంటిల్‌మన్‌’’ అని పొగుడుతూ, వ్యక్తిగతంగా చర్చలు జరపడం ద్వారా అమెరికాకు అనుకూలమైన ఒప్పందాలు (ఉదాహరణకు సోయాబీన్‌ ‌కొనుగోళ్లు, ఫెంటానిల్‌ ‌డ్రగ్‌ ‌నియంత్రణ) సాధించవచ్చనేది ట్రంప్‌ ‌వ్యూహం.ట్రంప్‌ ‌వైఖరి మారడానికి చైనాపై ప్రేమ కారణం కాదు. అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవడం, అంతర్జాతీయ సంక్షో భాలను ఎదుర్కోవడానికి చైనాతో సత్సంబంధాలు కలిగి ఉండటం ఒక అనివార్యమైన వ్యూహాత్మక అవసరం అని ఆయన గ్రహించడమే ప్రధాన కారణ్రప్‌ ‌స్వాగతం వెనుక వ్యూహం

చైనా అధ్యక్షుడికి విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడు స్వయంగా స్వాగతం పలకడం వెనుక అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల న్యూఢిల్లీలో బ్రిక్స్ ‌సదస్సులో భారత్‌, ‌రష్యా, చైనాలతో పాటు బ్రిక్స్ ‌కూటమి దేశాల మధ్య వెల్లివిరిసిన సాన్నిహిత్యం వాషింగ్టన్‌ను ఆలోచనలో పడేసింది.భారత్‌, ‌రష్యా, చైనాల ఐక్యతను గమనించిన ట్రంప్‌, ‌చైనాను రాజ కీయంగా తన వైపు తిప్పుకోవడానికి (దువ్వడానికి) ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో విశ్లేషించడానికి కూడా బలమైన కారణాలున్నాయి. సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌, ‌చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీల మధ్య వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఈ కూటమి కేవలం ఒక ఆర్థిక వేదికగా కాకుండా, పాశ్చాత్య దేశాల (ముఖ్యంగా అమెరికా) ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఈ వ•డు దేశాలు ఒక బలమైన కూటమిగా మారితే అంతర్జాతీయంగా అమెరికా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదాన్ని ట్రంప్‌ ‌గ్రహిం చారు. రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా, చైనాలు అత్యంత సన్నిహిత మిత్రదేశాలుగా మారాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఈ రెండు అగ్రరాజ్యాలు జతకట్టడం వాషింగ్టన్‌కు అతిపెద్ద ముప్పు. కాబట్టి, జిన్‌పింగ్‌కు అత్యున్నత ప్రోటోకాల్‌ ‌మర్యాదలు ఇవ్వడం ద్వారా, చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకొని, రష్యాతో దానికున్న వ్యూహాత్మక బంధాన్ని కాస్త బలహీన పరచాలనేది ట్రంప్‌ ‌వ్యూహం కావచ్చు.బ్రిక్స్ ‌వేదికగా చైనా తను ‘‘గ్లోబల్‌ ‌సౌత్‌’’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) నాయకుడిగా చెలామణి అవ్వాలని చూస్తోంది. అయితే, అమెరికా చైనాతో తీవ్రమైన ఘర్షణ వైఖరిని అవలంబిస్తే, గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాలన్నీ చైనా వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ట్రంప్‌ ‌వ్యూహాత్మకంగా వ్యవహరించి, జిన్‌పింగ్‌తో సత్సంబంధాలు ఉన్నాయనే సంకేతాలు ప్రపంచానికి పంపారు. డొనాల్డ్ ‌ట్రంప్‌ ఎప్పుడూ తనను తాను ఒక ‘‘గ్రేట్‌ ‌డీల్‌ ‌మేకర్‌’’ (‌గొప్ప ఒప్పందాలు చేయగల వ్యక్తి)గా భావిస్తారు. గతంలో చైనా వేదికగా జరిగిన సదస్సులో తనకు ఆశించిన స్థాయిలో విమానాశ్రయ స్వాగతం లభించకపోయినప్పటికీ, తను మాత్రం పెద్ద మనసుతో జిన్‌పింగ్‌కు అమెరికా చరిత్రలోనే అరుదైన (1962లో నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. ‌కెన్నెడీ, అల్జీరియా ప్రెసిడెంట్‌ అహ్మద్‌ ‌బెన్‌ ‌బెల్లాకు ఇటువంటి అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. ఆ తర్వాత అటువంటి గౌరవం ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ ‌వ్యూహాన్ని జిన్‌పింగ్‌ ‌చాలా తెలివిగా స్వీకరించారు. అమెరికా ఇచ్చిన గౌరవ మర్యాదలను ఉపయోగించుకుని, రష్యా-చైనా కూటమిని అమెరికా నేరుగా ఢీకొట్టకుండా జాగ్రత్తపడుతూనే, అంతర్జాతీయ దౌత్య వేదికపై చైనాను అమెరికాతో సమానమైన పీఠంపై కూర్చోబెట్టడంలో ఈ పర్యటన ద్వారా జిన్‌పింగ్‌ ‌విజయం సాధించారు.

భారత్‌పై ప్రభావం

అమెరికా-చైనాలమధ్య మారుతున్న ఈ వ్యూహాత్మక సమీకరణాలు, ముఖ్యంగా డొనాల్డ్ ‌ట్రంప్‌-‌షి జిన్‌పింగ్‌ల తాజా భేటీ నేపథ్యంలో మనదేశం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికా, చైనాలు ఒకరితో ఒకరు తాత్కాలికంగా రాజీ పడుతున్న వేళ, భారత్‌ ఏ ఒక్క కూటమి వైపు మొగ్గకుండా ‘‘బహుముఖ అలీన విధానం’’ లేదా ‘‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’’ ని అనుసరిస్తోంది. ఇటీవల న్యూఢిల్లీ బ్రిక్స్ ‌సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన చర్చల ఫలితంగా సరిహద్దు ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టాయి. అమెరికాను నమ్ముకో కుండా, చైనాతో నేరుగా చర్చలు జరపడం ద్వారా సరిహద్దుల్లో వ్యూహాత్మక స్థిరత్వాన్ని సాధించాలని మన దేశం భావిస్తోంది. చైనా పూర్తిగా రష్యాను కైవసం చేసుకోకుండా అడ్డుకోవడానికి భారత్‌, ‌రష్యాతో తన రక్షణ, ఇంధన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.క్వాడ్‌ ‌వంటి కూటములపై అమెరికా ఆసక్తి తగ్గినా, మనదేశం మాత్రం ఫ్రాన్స్, ‌స్వీడన్‌ ‌వంటి ఇతర స్వతంత్ర సాంకేతిక, రక్షణ భాగస్వాములతో తన రక్షణ పరిధిని విస్తరించుకుంటోంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు చైనా నుండి బయటకు వచ్చి భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని చూశాయి. ఇప్పుడు వారిద్దరి మధ్య వాణిజ్య సంధి కుదిరితే, సరఫరా గొలుసులు చైనాలోనే ఉండిపోయి, భారత్‌ ఆశించిన స్థాయిలో తయారీ రంగ వృద్ధి మందగించే ప్రమాదం ఉంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ‌గతంలో హెచ్చరిం చారు. చైనాతో ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌, ఈ ‌కఠినమైన ఆంక్షల అస్త్రాన్ని భారత్‌పై ఉపయో గించే అవకాశం ఉందనే ఆందోళన దౌత్య వర్గాల్లో ఉంది. సానుకూల కోణంలో చూస్తే, అమెరికా-చైనా వైరం తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు, ముడి చమురు ధరలు నిలకడగా ఉంటా యి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిస్తుంది.

గ్లోబల్‌ ‌సౌత్‌ ‌నాయకత్వ పోటీ

గ్లోబల్‌ ‌సౌత్‌ (అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు) నాయకత్వం కోసం భారత్‌, ‌చైనాల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. అయితే మనదేశం వెనుకబడిందని చెప్పలేం. చైనా భారీగా రుణాలు ఇవ్వడం ద్వారా చాలా దేశాలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. చైనా తనను తాను నాయకుడిగా నిలబెట్టుకోవడానికి చూస్తుంది (ఇటీవలి చైనా గ్లోబల్‌ ‌గవర్నెన్స్ ‌వైట్‌ ‌పేపర్‌ ‌దీనికి ఉదాహరణ). భారత్‌ ఇం‌దుకు భిన్నంగా డిజిటల్‌ ‌పబ్లిక్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ (•••పీఐ), వ్యాక్సిన్‌ ‌డిప్లొమసీ, విపత్తు సహాయం వంటి ఉచిత సార్వత్రిక సేవలందించే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అమెరికా-చైనాలు తమ అవసరాల కోసం ఎంత దగ్గరైనా, వారి మధ్య ఉన్న అంతర్గత వైరం పూర్తిగా తొలగిపోదు. దీనిని ఒక అవకాశంగా మలచుకొని, అటు అమెరికాతోనూ ఇటు చైనాతోనూ తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా బేరమాడగల వ్యూహాత్మక స్థానంలో ప్రస్తుతం మనదేశం ఉంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor