‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


‘‘‌ధరణి ఇక్కడికి దగ్గరో సవర కొండల్లోని ఓ పల్లెలో ఉంది. వనజని తీసుకొచ్చి చూపించమంటూ నెల క్రితం మా ఊళ్లోని ఒక వ్యక్తి ద్వారా కబురు పెట్టింది. ఆ పిల్ల నా దగ్గర లేదని, మీ దగ్గర పెరుగుతున్నాది’’ అని చెప్పి అతనితో ఆమెకు మీ అడ్రస్‌ ‌పంపించాను. అందుకే అది మీకు ఉత్తరం రాసి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం బాబూ! ఆ కొండలవి•ద నక్సలైట్ల స్థావరం ఉందన్న అనుమానంతో పొలీసులు మాటువేసి గాలిస్తున్నారు.

ధరణి రెండేళ్ల నుంచీ క్షయ వ్యాధితో బాధపడుతూ, నక్సల్‌ ‌కార్యకలాపాలకు దూరంగా ఆ ఊళ్లో ఒంటరిగా ఉంటోంది. పోనీ ఇక్కడికి వస్తే మంచి వైద్యం చేయిద్దామనుకుంటే అది సాధ్యం కాదు. దాని మొగుడు సోమన్న ఎక్కడ ఉన్నాడో, ఏమయ్యాడో తెలియదు. అది వాడిని వెతుక్కుంటూ వెళ్లి కష్టాలపాలైంది బాబూ! నక్సల్‌ అనే ముద్రపడితే వాళ్లు బయటకు రావడం కష్టం. పోలీసులు వాళ్లని నమ్మరు సరికదా వేటాడతారు. దొరికితే హింసలు పెట్టి వాళ్ల ద్వారా మిగతా వాళ్ల ఆచూకీ కనుక్కొం టారు. అయితే ఉద్యమంలో ఉన్నవారు చనిపోవ డానికైనా సిద్ధపడతారు కానీ ఇతరుల వివరాలు సాధారణంగా చెప్పరు. ఏదైనా మీరింత దూరం వచ్చారు కాబట్టి ధరణి ఉంటున్న గ్రామానికి చేరే దారి చెబుతాను. మా మామ కొడుకు రామన్న అప్పుడప్పుడు అక్కడికి వెళుతుంటాడు. వాడిని మీకు తోడుగా పంపిస్తాను. రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్లండి. కాకపోతే మీ భార్య కౌసల్యని ఇక్కడ వది లేయండి. ఆమె కొండలు ఎక్కలేరు’ చెప్పింది గౌరి.

 ………………

                ఆ మర్నాడు తెల్లవారుజామున 5 గంటలకు శ్రీధర్‌, ‌ప్రియ… రామన్నతో కలసి ధరణి ఉంటున్న రెబ్బ తండాకి బయలుదేరారు.అది కెంగువకు పాతిక కిలోవి•టర్ల దూరంలో ఉంది. పూర్తిగా కొండలలో ఎగుడు దిగుడుల మధ్య నడవాలి. రామన్నకి ఆ ప్రాంతమంతా కొట్టిన పిండి కావటంతో అతను వడివడిగా కొండ లెక్కుతునాడు.

ప్రియ కూడా అతని వెంట ఉత్సాహంగా నడుస్తోంది.శ్రీధర్‌ ‌మాత్రం ప్రతి పది నిమిషాలకు కాసేపు విశ్రాంతి తీసుకుంటూ నడవసాగేడు. 8 గంటలయ్యే సరికి వాళ్లు బీరుపాడు అనే గిరిజన గ్రామం చేరుకున్నారు.

ఆ ఊరి పొలిమేరలో ఉన్న పెద్ద మర్రిచెట్టు దగ్గర ముగ్గురూ కూర్చున్నారు. ఆ ఊరు చూడటానికి చాలా చిన్నది. కొండవాలులో అక్కడక్కడ విసిరేసినట్లు న్నాయి ఇళ్లు.

‘‘రామన్నా! ఈ ఊళ్లకి ఇంకా రోడ్లు రాలేదా?’’ అడిగాడు శ్రీధర్‌.

‘‘‌కట్టం బాబూ! ఈ ఊళ్లో చాలా ఎత్తైన కొండల్లో ఉండటం వల్ల రోడ్లు వెయ్యటం కట్టం.అయినా అన్నలకు భయపడి ఏ ఉద్యోగి ఇటువైపు రాడు. నాలుగేళ్ల క్రితం రోడ్డు వెయ్యడానికి ఓ కంట్రాక్టర్‌ ‌వస్తే అతని రోలర్ని, ట్రాక్టర్లను అన్నలు కాల్చేసినారు. దాంతో ఆ కంట్రాక్టర్‌ ‌పనులు ఆపి చేసి వెళ్లిపోయాడు. అప్పట్నుంచీ ఏ కాంట్రాక్టరు పనులు సెయ్యడానికి ముందుకు రాలేదు’’ చెప్పాడు రామన్న.

‘‘ఇలా అయితే ఈ ప్రాంతాలు అభివృద్ధి ఎలా చెందుతాయి?మీ గిరిజనులకు వైద్యం, ఆరోగ్యం, చదువు ఎలా వస్తాయి?’’అడిగాడు శ్రీధర్‌.

‘‘‌పోలీసోళ్లు, నక్సలైట్లు ఒకళ్లనొకళ్లు సంపుకుంతున్నారు.ఈళ్లు కింద కొస్తే ఆళ్లు, ఆళ్లు వి•ద కొస్తే ఈళ్లు సంపుకోవడమే. అందుకే ఇక్కడ మా బతుకులు కట్టాలపాలవుతున్నాయి.’’ చెప్పాడు రామన్న.

‘‘ఇంతకీ ధరణి భర్త సోమన్న ఎక్కడున్నాడు? ఎప్పుడైనా మీ ఊరు వచ్చాడా? ’’ శ్రీధర్‌ ‌రామన్నని ప్రశ్నిస్తుంటే ప్రియ ఆసక్తిగా వినసాగింది.

సోమన్న తనకు తండ్రని ఈ మధ్యనే ప్రియకు తెలిసింది. అందుకే రామన్న ఏం చెబుతాడోననీ ఆసక్తిగా వినసాగింది.

‘‘బాబూ తమరికి అన్నీ తెలుసు. పోలీసుల బస్సుని అన్నలు పేల్చేశారు. ఆళ్లకి సోమన్న సాయం చేసాడనీ పోలీసుల అనుమానం. అందుకే ఆడిని పిలిపించారు. కానీ ఎళితే పోలీసులు సంపేత్తారనీ సోమన్న బయం. అందుకే పారిపోనాడు. ఆ తరువాత ఒకసారి కామోసు ఆడు మా ఊరొచ్చినాడు. ఓ రాత్రి ఉండి మళ్లీ ఎల్లిపోనాడు.అప్పుడు ఈ పిల్ల సిన్నది. పెద్దమ్మ గౌరి ఇంటికాడ ఉన్నాది.

అప్పట్నుంచీ మరి రానేదు. ఆడు ఏటె•పోనడో ఎవరికీ తెల్వదు. అన్నల్లో కలిసిపోనాడనీ కొంతరు అంతారు. మరికొందరేమో సచ్చిపోనాడనీ సెబుతారు. ఏటి జరిగిందో తెనీదు.ఆడిని ఎతకడానికే ధరణి ఎల్లి అది కూడా అన్నల్లో కలిసి పోనాది’’ చెప్పాడు రామన్న.

‘‘రెబ్బ తండా చేరడానికి ఇంకా ఎంత దూరం వెళ్లాలి? ఎంతసేపు పడుతుంది?’’ అడిగాడు శ్రీధర్‌.

 ‘‘‌బాబూ! ఇంకా పది మైళ్లు నడవాల. ఈడ నుంచి మరీ కట్టం. కొండల్లో ఇరుకుల్లో నిటారుగా నడవాలి. ఏగంగా నడిస్తే నాలుగైదు గంటలు పడతాది. ఇంకో మూడు మైళ్లు వెళితే అక్కడ పోలీసులు సెకింగ్‌ ఉం‌టాది. అక్కడకి ఒరిస్సా బోర్డర్‌ ‌దగ్గర. మనం పోలీసుల కంట పడకుండా ఎల్లడం మంచిది. ఆళ్లు గానీ సూత్తే పెమాదం.మనల్ని కూడా అన్నలనుకొనో, ఆళ్లకు వత్తాసుదారుల మనుకొనో పట్టుకునే అవకాశం ఉండాది’’ అన్నాడు రామన్న.

వాళ్లు తమతో ఫ్లాస్కులో తెచ్చుకున్న టీ తాగి మళ్లీ కొండ ఎక్కడం మొదలు పెట్టారు. చుట్టూరా ఆకాశన్నంటుతున్నట్లున్న పచ్చటి కొండలు. వాటిపై దోబూచులాడుతున్న మేఘాలు. ఆ కొండల్ని చూస్తుంటే శ్రీధర్‌కి భయం వెయ్యసాగింది. అసలు ఆ ఊరు వెళ్లగలమా?అన్న అనుమానం కలగ సాగింది.

కొద్ది దూరంలో ఓ గిరిజనుడు కొండ దిగుతూ కనిపించాడు.అతనితో రామన్న సవర భాషలో ఏదో మాట్లాడాడు. ఆ తరువాత రామన్న ముఖంలో ఆందోళనని గమనించాడు శ్రీధర్‌.

‘‘ఏం ‌జరిగింది? ఎవరతను?’’అడిగాడు శ్రీధర్‌.

‘‘ఈడిది మా ఊరే బాబూ! అన్నల కోసం పోలీసులు ఎతుకుతున్నారంట.

కొండ మీద శానా మంది పోలీసులున్నారంట. ఇంకో దారిన జాగ్రత్తగా ఎళ్లమనీ సెబుతున్నాడు’’ అన్నాడు రామన్న.

ఆ మాటలు విన్న శ్రీధర్‌ ‌ముఖంలో ఆందోళన మొదలైంది. ప్రియ తండ్రి వైపు భయంతో చూడసాగింది.

‘‘మరిప్పుడెలా?’’

‘‘ఏం పరవాలేదు బాబూ! మనం ఇంకో దారంట ఎళదాము. ఇది మాకు మామూలే’’ చెప్పాడు రామన్న.

కొద్దిదూరం వెళ్లిన తరువాత రామన్న పక్కనే ఉన్న దారిలోకి మళ్లాడు. శ్రీధర్‌ ఆలోచిస్తూ అతని వెనకి నడుస్తుంటే ప్రియ శ్రీధర్‌ ‌చెయ్యి పట్టుకొని చుట్టూ చూస్తూ నడవసాగింది.

రాను రాను కొండ ఎక్కడం కష్టంగా మారింది. కొండదారి నిట్ట నిలువుగా ఉంది. కొద్ది దూరం నడిచేసరికి శ్రీధర్‌కి ఆయాసం మొదలైంది. రామన్న కర్రని భూవ్మిద నొక్కి పెడుతూ త్వరత్వరగా నడవసాగాడు.

ఇంతలో దూరం నుంచి ‘‘ఢాం’’ మన్న శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి శ్రీధర్‌ ఉలిక్కిపడి అక్కడే నిలబడిపోయాడు.

ఆ శబ్దం కొండల్లో అలలు అలలుగా ప్రతిధ్వనించ సాగింది. అక్కడ ఏం జరిగిందో అదేమిటో శ్రీధర్‌కు అర్థం కాక రామన్న వైపు చూసాడు. పోలీసోళ్లు అన్నల కోసం ఎతుకుతున్నారనీ మావోడు సెప్పాడు కదా బాబు! ఆ తుపాకీ సప్పుడు పోలీసోళ్లదే. అన్నలు పోలీసులకు దొరికి పోయినట్టున్నారు’’ అన్నాడు రామన్న ఒకింత భయంతో.

మళ్లీ….‘‘ఢాం! ఢాం! ఢాం!’’ అని వరుస పేలుళ్లు వినిపించాయి. దూరంగా పచ్చటి కొండ మధ్యలో ఎగురుతున్న ధూళి, పొగ.అక్కడ నుంచే శబ్దాల ప్రకంపనలు కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

ఈసారి మరిన్ని శబ్దాలతో శ్రీధర్‌లో ఆందోళన పెరిగిపోసాగింది. అనవసరంగా వచ్చామన్న భావన కలగసాగింది. ముందు కెళితే పోలీసులు. అలా అనీ వెనక్కి వెళ్లలేరు. ముందుకెళ్లినా రెబ్బ తండాకు చేరుకోగలమా?అనే సంశయం అతనికి కలిగింది.

కొంతసేపటికి ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది. పేలుళ్ల శబ్దం వినిపించటం లేదు కానీ దూరంగా ధూళి ఎగురుతూ కనిపిస్తోంది.

‘‘రామన్నా!ఇందాకటి పేలుళ్లు ఎక్కడి నుంచి?’’ అడిగాడు శ్రీధర్‌.

‘‘‌చెప్పాను కదా బాబూ! ఈ రెబ్బ కొండల్లో నక్సలైట్ల వి•టింగులున్నాయనీ పోలీసోల్లకు తెలిసి ఆళ్లు వచ్చారు. తాము మీటింగులెట్టుకుంటే, పోలీసులకు తెలిసి వత్తారని ఆ అన్నలకు కూడా తెలుసు. అందుకనీ వాళ్లు దారంట మందుపాతర్లు పెడుతుంటారు. బహుశా అవే పేలుంటాయి. ఇక మధ్యలో వినిపించేవి తుపాకీ పేలుళ్లు. పోలీసులకు, అన్నలకు కాల్పులు మొదలై మ ఉంటాయి’’ చెప్పాడు రామన్న.

‘‘అంటే పోలీసుల వ్యాన్‌ను న•క్సల్స్ ‌పేల్చేశా రంటావా? అలా అయితే చాలా మంది పోలీసుల చనిపోయి ఉండాలే! అదే నిజమైతే పోలీసులు ఊరుకోరు. ఈ పరిస్థితుల్లో మనం వి•దకు వెళ్లడం ప్రమాదం కాదా?’’అడిగాడు శ్రీధర్‌.

‘‘ఏం ‌జరిగిందో పూర్తి విసయం తెలియదు బాబూ? కానీ, పోలీసోళ్లు,అన్నలూ ఒకళ్లనొకళ్లు సంపుకుంటూనే ఉంటారు. ఆళ్ల పని ఆళ్లదే. మన పని మనదే. పదండి ఎళదాం’’ బేగీ నడండి పోదాం’’ అన్నాడు రామన్న.

రామన్నను శ్రీధర్‌, ‌ప్రియ అనుసరించారు. .

కొద్ది దూరం తరువాత మళ్లీ పెద్ద కొండ మొదలైంది. అది నిలువుగా ఆకాశాన్ని తాకుతుందా? అన్నట్లు ఉంది.

రామన్న ఆ కొండని చూపిస్తూ ‘‘బాబూ! ఈ కొండ పక్క నుంచి ఆరు మైళ్లునడిస్తే రెబ్బ తండా వత్తాది. కానీ దారి బాగా ఇరుకు.జాగర్తగా నడవాల’’చెప్పాడు.

కొద్దిసేపటికి వాళ్లు కొండ దారి పట్టారు. వాలుగా, నిటారుగా ఉన్న కొండ పక్కనే చిన్నదారి. ప్రియ ఉత్సాహంగా రామన్న వెంట నడుస్తున్నాది.

శ్రీధర్‌కి ఆ కొండని చూడగానే భయమని పించింది. దీని పక్క నుంచి నడక అంత సులభం కాదు. అయినా తప్పదు. అతను భయపడుతున్నది కొండదారిని చూసి కాదు. పోలీసులు ఎక్కడ తమను అడ్డుకుంటారోనని.

ఒక గంట తరువాత వాళ్లు ఒక చిన్న తండాకి చేరుకున్నారు. అక్కడ కేవలం రెండు కుటుంబాలే ఉన్నాయి. అవి కూడా దూరంగా విసిరేసి నట్లున్నాయి. అక్కడకి చాలా దూరంగా కొండ వి•ద ఒక గ్రామం కనిపిస్తోంది.

రామన్న ఆ ఊరిని శ్రీధర్‌కి చూపిస్తూ ‘‘బాబూ! అదే మనం వెళ్లబోయే రెబ్బ తండా. ఇంకా రెండు గంటలు ఓపిక పట్టి నడిస్తే చాలు వెళ్లిపోతాము‘‘ చెప్పాడు.

‘‘రామన్నా! మొదట సులభంగా నడిచెయ్యగలను అనుకున్నాను కానీ నడుస్తుంటే ఎంత ఇబ్బందో తెలుస్తోంది. నిజంగా ఇక్కడ గిరిజనులను చూస్తుంటే వాళ్లు ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వేస్తోంది‘‘ అన్నాడు శ్రీధర్‌.

‌వాళ్లు అలా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి వాళ్ల దగ్గరికి రాసాగాడు. అతనికి నలభై సంవత్సరాల వయస్సు ఉంటుంది. అతని భుజానికి ఒక సంచి వేలాడుతూ కనిపిస్తోంది.

వస్తున్న ఆ వ్యక్తిని చూసి శ్రీధర్‌ ఆశ్చర్య పోసాగాడు. ‘‘రామన్నా! ఎవరతను? అతను నీకు తెలుసా?’’అడిగాడు.

‘‘అతను రమేష్‌ అని పత్రికా ఇలేకరి బాబూ! మా గిరిజనుల వార్తలని పేపర్లక••, టీవీలకూ పంపుతాంటాడు’’ అని చెప్పాడు.

‘రమేష్‌’ అన్న మాట వినగానే తాను పదేళ్ల క్రితం కెంగువ గ్రామంలో పనిచేస్తున్నప్పుడు తనని కలిసి పెన్‌ ‌డ్రైవ్‌ ఇచ్చిన విలేకరి గుర్తు కొచ్చాడు.బహుశా అతనే ఇతనేమో అనిపించింది శ్రీధర్‌కి.

ఇలా ఆలోచిస్తున్న సమయంలో ఆ వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడే ఆతడు శ్రీధర్‌కి స్పష్టంగా కనిపించసాగేడు. పదేళ్ల క్రితం తాను కలిసిన రమేష్‌ ‌ముఖం అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది.

అతను శ్రీధర్‌ ‌దగ్గరికి వచ్చి ‘‘సార్‌! ‌నన్ను గుర్తు పట్టారా? పదేళ్ల క్రితం మిమ్మల్ని కలిసి పెన్‌ ‌డ్రైవ్‌ ఇచ్చిన రమేష్‌ని’’ అని చెప్పాడు.

 ‘‘గుర్తు పట్టాను రమేష్‌. ‌మీరిచ్చిన పెన్‌ ‌డ్రైవ్‌ను నేను వారం తరువాత ఎస్పీ గారికి, కలెక్టర్‌ ‌గారికి అందజేశాను. ఆ తరువాత నాకు మా ఊరు బదిలీ కావడంతో మిమ్నల్ని కలవడం కుదరలేదు. అది సరే..! మీరేంటి… ఇప్పుడు ఇక్కడకు ఎందు కొచ్చారు?’’ అడిగాడు శ్రీధర్‌.

‘‘‌సార్‌! అప్పుడు వి•రు ఆ పెన్‌ ‌డ్రైవ్‌ను ఎస్పీగారికి ఇవ్వడం వల్ల నేను అప్పటి కేసుల నుంచి బయట పడగలిగాను. అమాయకులైన గిరిజనులను అరెస్ట్ ‌చేసి•, హింసించినట్లు ఆరోపణలు ఉన్న పోలీసులను ఎస్పీగారు సస్పెండ్‌ ‌చేశారు. అమాయక గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తి వేసారు.

ఆ తరువాత నా వి•ద గల కేసులను క••డా రద్దు చేసారు. అప్పట్నుంచీ ఈ గిరిజన ప్రాంతంలో విలేకరిగా పనిచేస్తూ, బతుకుతున్నాను. వారానికి రెండు మూడు రోజులు ఈ కొండల్లోని తండాలు, పల్లెల్లోకి వెళుతుంటాను. అదిసరే…వి•రేంటి ఇక్కడి కొచ్చారు?ఎక్కడి కెళుతున్నారు? దూరం నుంచి మిమ్మల్ని చేసి వివరాలు కనుక్కుందామని వచ్చాను’’ వివరించాడు రమేష్‌.

గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor