విమర్శకులు దురుద్దేశపూర్వకంగా, కావాలనే వక్రీకరించిన తన ఆలోచనలు సరైనవేనని గురూజీ నిరూపించుకున్న తర్వాత చరిత్ర మరింత విస్తరించింది. వారు మరణించి దశాబ్దాల కాలం గడిచిపోయింది. అయినప్పటికీ గురూజీకి వ్యతిరేకంగా దీర్ఘకాలం పాటు, నిరంతరాయంగా, పక్షపాతపూరితమైన విమర్శ కొనసాగుతున్నది. ఆ కారణంగా, ప్రధాన జన జీవన స్రవంతిలో జరిగే బహిరంగ చర్చలో అసలు గురూజీ ఆలోచనలు ఏమిటనేది ఎవరికీ తెలియకుండా పోయింది.
గురూజీకి సంబంధించిన ‘వివాదాస్పద’ మాటలను మరింత మెరుగ్గా, స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కొన్ని భేదాలను గుర్తించాల్సి ఉంది. గురూజీ రచనలు అవి రాసినప్పటి పూర్వోత్తర సందర్భానికి(కంటెక్స్‌ట్) కట్టుబడి ఉండవు, ఆ కాలానికి మాత్రమే పరిమితం కావు. అలాగే పూర్వోత్తర సందర్భానికి తగ్గట్గుగా గురూజీ రచనలు ఆ ఒక్క సందర్భానికి మాత్రమే పరిమితమైన ఉంటాయి. రచనలకు, పూర్వోత్తర సందర్భాలకు మధ్య ఉన్న సంబంధం లేదా సంబంధరాహిత్యం పట్ల కనీస అవవగాహన, విషయాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక రచనకు సందర్భాన్ని సృష్టించడానికి స్థల,కాలాదులు ఏకమవుతాయి. ఒక సమయంలో, ఒక ప్రాంతం నుంచి ఉద్భవించే రచన దాని సందర్భంతో మమేక మవుతుంది.
సాధారణంగా స్థల, కాలాదుల నుంచి ఉద్భవించే రచన వాటికి తగ్గట్టుగా ఉంటుంది. అదే సమయంలో రచనలకు, పూర్వోత్తర సందర్భాలకు మధ్య అవినాభావ సంబంధం ఉండవచ్చు, ఉండక పోనూవచ్చు. దీన్ని నాలుగు వర్గాలుగా చూడవచ్చు. మొదటి దాంట్లో ఒక పూర్వోత్తర సందర్భానికి మాత్రమే రచనలు ముడిపడి ఉంటాయి. రెండవ దాంట్లో సందర్భంతో ముడిపడిన రచన దానికే పరిమితమై ఉండదు. మూడవదిగా రచనలకు ఒక సందర్భం అంటూ ఏదీ ఉండదు. చివరిదైన నాల్గవ వర్గంలో సందర్భానికి అతీతంగా రచనలు ఉంటాయి.
మొదటి వర్గంలో రచనలు ఆ సందర్భానికి కట్టుబడి ఉంటాయి. రెండవ, నాల్గవ వర్గాల్లో రచనలు సందర్భాన్ని మించిపోతుంటాయి. వాటికి సందర్భం ఉండదు. ఏదైనా ఉంటే దాన్ని అతిక్ర మిస్తుంటాయి. సందర్భానుసారంగా ఏర్పడే పరిమితులను తోసిరాజంటాయి. ఇంత చేసినప్పటికీ వాటికి ఉండే విలువ సందర్భం ముగిసిపోయిన తర్వాతనే వెలుగులోకి వస్తుంటుంది.అవి రాతపూర్వక మైన వ్యక్తీకరణలు. వాటి ఔచిత్యం వాటి సందర్భానికి మాత్రమే పరిమితమై ఉండదు. మూడవ వర్గం విషయానికి వస్తే ఇది రచనను దాని పూర్వోత్తర సందర్భం నుంచి ఉద్దేశ్యపూర్వకంగా వేరు చేయడం తప్ప మరొకటి కాదు. ఈ వర్గం కింద రచన, దాని ఉద్దేశ్యాన్ని వక్రీకరించడానికి, సందర్భాన్ని ప్రస్తావించ కుండా రచనను మాత్రమే ప్రధానంగా ముందుకు తీసుకొని వస్తారు.
సందర్భానికి అనుసంధానమైన, పరిమితమైన రచన
ఏ రచన కూడా శూన్యం నుండి పుట్టదు లేదా ఉనికిలో ఉండదు అనేది సాధారణ సూత్రం. ఏ రచనకూడా ‘స్వయంభూ’ (తనంతట తానుగా పుట్టినది) కాదు. సందర్భం లేకుండా అది ఉద్భవించ లేదు. ఒక రచన దాని సందర్భంతో ముడిపడి ఉంటుంది. ఆ సందర్భమే ఆ రచనను వివరిస్తుంది. ఒక రచనను మరింత బాగా అర్థం చేసుకోవాలంటే, దానిని ఒక నిర్దిష్ట సందర్భంలో ఉంచి చూడాలి. దీనికి భిన్నంగా, సందర్భం నుండి వేరు చేసిన రచన తప్పనిసరిగా తప్పుదోవ పట్టిస్తుంది.
రచయితపై ప్రభావం చూపే చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు ఆ రచనకు సంబంధించిన సందర్భంలోని స్థల కాలాదులను ఏర్పరుస్తాయి. చాలా వరకు రచనలు సందర్భోచితమైనవే. ఉదాహరణకు, భారతదేశ విభజన వంటి తీవ్రమైన పరిస్థితులలో వెలువడిన రచనలు ఎక్కువగా సందర్భోచితమైనవే అయి ఉంటాయి. అటువంటి రచనల ప్రాముఖ్యత కేవలం ఆ సందర్భానికే పరిమితమై ఉంటుంది లేదా ఆ సందర్భం ముగియగానే అవి తమ ప్రాముఖ్యతను కోల్పోతాయి. చరిత్ర వాటిని నమోదు చేస్తుంది వాస్తవమే, కానీ ఆ సందర్భం గడిచిపోయాక వాటిని పక్కన పెట్టేస్తుంది. కాలక్రమేణా భవిష్యత్తు వాటి సందర్భోచిత విలువను క్షీణింపజేస్తుంది.
సందర్భానికి అనుసంధానం కాని, పరిమితం కాని రచన
సందర్భానికి కట్టుబడి ఉండే కొన్ని రచనల ప్రాసంగికత సందర్భానికి మించి కూడా విస్తరించ వచ్చు. ఉదాహరణకు, భగవద్గీత అలాంటిదే. సాధారణంగా మహాభారతం, ప్రత్యేకంగా కురుక్షేత్ర యుద్ధం దాని సందర్భాన్ని ఏర్పరుస్తాయి. గీత, అది రచించబడిన మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం సందర్భంలో మరింత సుబోధకంగా ఉంటుంది. మహాభారత-కురుక్షేత్ర సందర్భం గీత గ్రంథాన్ని మరింత సుబోధకంగా చేస్తుంది. కానీ గీత ప్రాసంగికతను కేవలం సందర్భానికే పరిమితం చేయదు. గీత ప్రాసంగికత కురుక్షేత్ర యుద్ధానికి లేదా దాని కాలానికి అతీతమైనది. గీత ఒక సందర్భానికి కట్టుబడి ఉండి, ప్రాసంగికతలో దానికి పరిమితం కాని గ్రంథానికి గొప్ప ఉదాహరణ. దాని ప్రాసంగికత సందర్భాన్ని అధిగమించినందున, గీత గ్రంథపరమైనది, సందర్భపరమైనది కాదు.
సందర్భం లేని లేదా సందర్భానికి బాహ్యమైన రచన
పోటీతత్వపూరిత వాక్చాతుర్యం, వాదనలో పై చేయి సాధించడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా గ్రంథాలను సందర్భం లేకుండా లేదా సందర్భానికి వెలుపల ఉటంకించే నిందాపూర్వక చర్చలను సృష్టించింది. ఇది, తమ అధికారం పలుకుబడిని ఉపయోగించి, సమకాలీనంగా పలుకుబడి ఉన్న సంస్థలకు, ఒక రచనను సందర్భం లేకుండా లేదా సందర్భంతో సహా ఉటంకించడం ద్వారా అసత్యాన్ని నిజంగా ప్రచారం చేయడానికి సహాయపడుతుంది. ఇది, అటువంటి పలుకుబడి లేని నిందకు గురైన బాధితుడిని ఆత్మరక్షణలో పడేస్తుంది. ఒక రచనను సందర్భం లేకుండా ఉటంకించడం ఆ రచనను అనాథగా చేస్తుంది. దాని అర్థాన్ని దోచుకుంటుంది. దానిని వక్రీకరిస్తుంది లేదా చెడగొడుతుంది. డిజిటల్ మీడియా దీనిని మరింత సులభతరం చేస్తుంది. ఇది పాఠకులను కేవలం ముఖ్యాంశాలు మాత్రమే చదివేలా అలవాటు చేస్తుంది తప్ప అంతకు మించి కాదు. సందర్భం లేకుండా జనబాహుళ్యంలో వెళ్లే డిజిటల్ సమాచారం చూపించే ప్రభావం కన్నా కూడా సందర్భోచితమైన రచన మరింత అర్థవంతంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. న్యూయార్క్ టైమ్స్‌లోని (మార్చి 17, 2010) ‘‘టెక్సట్ వితౌట్ కాంటెక్సట్’’ అనే వ్యాసం, సందర్భం లేకుండా చదివిన (డిజిటల్) రచనలు తప్పుదోవ పట్టిస్తాయని చెబుతుంది. ‘‘ఒక పూర్తి వార్తా కథనాన్ని చదవడానికి, ఒక పూర్తి టెలివిజన్ కార్యక్రమాన్ని చూడటానికి లేదా ఒక పూర్తి ప్రసంగాన్ని వినడానికి బదులుగా, పెద్ద సంఖ్యలో ప్రజలు సారాంశం, వీడియో క్లిప్, సౌండ్ బైట్‌కు మొగ్గు చూపుతున్నారు. ఆ క్రమంలో వారు చూసేవాటికి, వినేవాటికి సందర్భం లేకపోయిన వారు పట్టించుకోవడం లేదు’’ అని ఆ వ్యాసం పేర్కొంది. సందర్భం లేకుండా లేదా సందర్భానికి సంబంధం లేకుండా ఉటంకించడం ఆధారంగా చేసే నిందా పూర్వక ప్రచారాన్ని డిజిటల్ మీడియా సులభతరం చేస్తుంది. ఒక రచనకు సందర్భం ముగిసిన తర్వాత దానిని ఒక కొనసాగుతున్న ఆలోచనగా ఉటంకించడం కూడా, దానిని సందర్భం లేకుండా లేదా సందర్భానికి సంబంధం లేకుండా ఉటంకించడమే అవుతుంది.
సందర్భానికి అతీతమైన రచన
సందర్భాలకు అతీతమైన రచనలు స్థల, కాలాదులకు అతీతంగా ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తుల వంటి కాలాతీత గ్రంథాలు సందర్భ రహిత గ్రంథాలుగా పరిగణనలోకి వస్తాయి. ‘సనాతన ధర్మాన్ని’ (కాలాతీత విలువలను) ప్రబోధించే గ్రంథాలు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి గ్రంథాలు శాశ్వత సత్యాలను కలిగి ఉంటాయి. కాలాతీత గ్రంథాలలో అంతర్లీనంగా ఉన్న ఆలోచనలు, సందర్భాలకు అతీతంగా ఉండటం వల్ల, అన్ని సమకాలీన భేదాలను అధిగమించి, మారుతున్న, విభిన్నమైన సందర్భాలతో సంబంధం లేకుండా చెల్లుబాటులో ఉంటాయి. అటువంటి కాలాతీత విలువలను ప్రబోధించే ఏవైనా గ్రంథాలు లేదా ఆలోచనలు కూడా సందర్భరహిత గ్రంథాలే.
వీ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్‌డ్ (మనం లేదా మన జాతీయత నిర్వచనం) అనేది ఒక సందర్భోచిత గ్రంథం, దీనిని సందర్భం లేకుండా లేకుండా కూడా ఉటంకించారు. గురూజీని సందర్భం లేకుండా ఉటంకించడం ద్వారా దశాబ్దాలుగా ఆయనపై ఒక నిందాపూర్వక ప్రచారం నడుస్తోంది. దీని అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక గ్రంథాన్ని సందర్భం లేకుండా ఉటంకించడం ఆ గ్రంథాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, వక్రీకరిస్తుందనే ప్రాథమిక నియమాన్ని విస్మరిస్తూ, 1939లో గురూజీకి ఆపాదించిన ‘‘వీ ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్‌డ్’’ అనే పేరుతో పుస్తకం వెలువడింది. దాని ద్వారా గురూజీని సందర్భం లేకుండా ఉటంకిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా దురుద్దేశ్యపూర్వక సాహిత్యం పుట్టుకొచ్చింది. 1940లో గురూజీ ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ కావడానికి ముందే అది వెలుగులోకి వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఫండమెంటలిజం ప్రాజెక్ట్ పండితుడైన ఐన్స్‌లీ టి ఎంబ్రీ (సంపుటి 1, పేజీ 566) గమనించినట్లుగా, ‘‘నాజీల హింస పూర్తి భయానకత వెలుగులోకి రాకముందే రాసిన’’ ఆ పుస్తకంలో, గురూజీ అడాల్ఫ్ హిట్లర్ చేత ‘‘ప్రభావితం’’ అయ్యారు అని ఉంది. అందులో గురూజీ హిందూ జాతి ఆధిక్యతను నొక్కిచెబుతూ, హిందూయేతరులు హిందూ విలువలను అంగీకరించడమో లేదా అణచివేతకు గురైన జీవితాన్ని గడపడమో చేయాలని చాలా దూకుడుగా సూచించారు. నిజంగానే ఇది అత్యంత దుందుడుకు వైఖరి! కానీ ఇప్పుడు, ఈ రచన ప్రపంచ, జాతీయ సందర్భాన్ని చూడండి.
హిట్లర్ పట్ల మహనీయుల మైమరపు
గొప్ప మేధావులు, కళాకారులు, వృత్తి నిపుణులు, రాజనీతిజ్ఞులతో కూడిన హిట్లర్ అభిమానుల జాబితా ఈనాటికీ ఎవరినైనా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అహింసకు ప్రతీక అయిన మహాత్మా గాంధీ, గురూజీ హిట్లర్‌ను సానుకూలంగా చూసిన రెండు సంవత్సరాల తర్వాత, 1941లో హిట్లర్‌కు రాసిన లేఖలో ‘‘మీ ప్రత్యర్థులు వర్ణించినట్లుగా మీరు ఒక రాక్షసుడని నేను సైతం నమ్మను’’ అని అన్నారు. ఆ తర్వాతి కాలంలో ‘‘హిట్లర్ 50 లక్షల మంది •••దులను చంపాడు… కానీ •••దులు ఆ కసాయి కత్తికి తమను తాము అప్పగించుకుని ఉండాల్సింది… లేదా కొండల పైనుంచి సముద్రంలోకి దూకి ఉండాల్సింది’’ అని పేర్కొన్నారు(జీబీ సింగ్, డాక్టర్ టిమ్ వాట్సన్ రాసిన ‘+•అ•ష్ట్రఱ •అ•వతీ తీశీ-జుఞ•ఎఱఅ••ఱశీఅ’ (పేపర్‌బ్యాక్) పుస్తకం నుండి; వ•లం: ష్ట్ర••జూ://•••.•అ•.మీశీఎ/2008/05/63906/).
గొప్ప జాతీయవాది సుభాష్ చంద్ర బోస్ హిట్లర్ నుండి స్ఫూర్తి పొందారు (జార్జెస్ వాన్ వ్రెఖెమ్ రచించిన ‘హిట్లర్ అండ్ హిజ్ గాడ్’, రూపా కో ళి2006రి పేజీలు 656/57). జోసెఫ్ స్టాలిన్ హిట్లర్‌ను ఆరాధించారు. బెర్నార్డ్ షా కూడా. హిట్లర్‌ను ఆరాధించే హెన్రీ ఫోర్డ్, ప్రతి సంవత్సరం అతనికి పుట్టినరోజు బహుమతిగా 50,000 ణవీ పంపేవారు – ఇది ఇప్పుడు 3.5 మిలియన్ డాలర్లు లేదా 19.6 కోట్ల రూపాయలకు సమానం! ‘‘ఒకరు హిట్లర్ వ్యవస్థను ఇష్టపడకపోవచ్చు, కానీ అతని దేశభక్తి సాధనను మెచ్చుకోవచ్చు. ఒకవేళ మన దేశం ఓడిపోతే, మన ధైర్యాన్ని పునరుద్ధరించి, దేశాల మధ్య మన స్థానానికి మనల్ని తిరిగి నడిపించడానికి అంతటి అజేయమైన నాయకుడు మనకు దొరుకుతాడని నేను ఆశిస్తున్నాను’’ అనే ఈ మాటను తర్వాతి కాలంలో హిట్లర్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి నాయకత్వం వహించిన విన్‌స్టన్ చర్చిల్ అన్నారు. ‘‘గొప్ప జర్మన్ జాతికి గౌరవాన్ని, మనశ్శాంతిని పునరుద్ధరించిన వ్యక్తిగా హిట్లర్ చరిత్రలో నిలిచిపోతాడో లేదో మనం చెప్పలేము’’ అని కూడా ఆయన అన్నారు. హిట్లర్‌ను సానుకూల దృక్పథంతో చూసిన గురూజీ సహా చాలా మందికి, అతను ఒక నరహంతకుడని తెలియదు. అలాంటప్పుడు, ఒక సందర్భంలో ఇతరుల తరహాలో హిట్లర్ పట్ల సానుకూలంగా ఉన్నందుకు గురూజీని మాత్రమే ఎందుకు అన్యాయంగా, ప్రత్యేకంగా పేర్కొంటున్నారు?
(ఎస్.గురుమూర్తి రచించిన
‘‘గోల్వాల్కర్ ది మోడరన్ రిషి విత్ మిల్లేనియల్ విజన్’’ పుస్తకం నుంచి)