హల్దీఘాటి యుద్ధానికి 450 ఏళ్లు
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బాబర్ వంశజుడైన అక్బర్ దేశంలోని అనేక హిందూ రాజులపై విజయాన్ని సాధించి, తన అధికారాన్ని ప్రతిష్టించిన తర్వాత, మేవాడ్ రాజ్యంపై అతడి కళ్లు పడ్డాయి. అందుకే, 18 జూన్, 1576న మానసింగ్ నేతృత్వంలో అక్బర్ తన సామ్రాజ్యవాద సేనలను రాణా ప్రతాప్‌పైకి పంపాడు. వారు హల్దీఘాటీపై దాడి చేసి, ఘోర పర్పుాయాన్ని పొందారు.
ఘోరంగా ఓడిన అక్బర్ సేనలు
యుద్ధానంతరం అక్బర్ సేనలు గోగుందా కోటలో ఆశ్రయం తీసుకోవలసి వచ్చింది. సామ్రాజ్య వాద సేనలు ఎంతగా భయపడిపోయాయంటే, ఆకలి తీర్చుకోవడానికి గుర్రాన్ని నడిపే సైనికుడు మరణించ డంతో, నడిపేవారు లేక ఉన్న గుర్రాలను తిన్నారుట. అక్బర్‌ను వెన్నంటి ఉండే ఈ సేనలకు, గోగుందా కోట నుంచి బయటకు వెళ్లి తమ అన్నపానాలకు ఏర్పాటు చేసుకునే సాహసం కూడా లేకపోయింది. తమపై ప్రతాపుడు గెరిల్లా దాడి చేస్తాడేమోనన్న అనుమానంతో కోటకు నాలుగు వైపులా కందకాలు తవ్వారు. భయం కారణంగానే యుద్ధమైన తర్వాత ఆ సేనలు నాలుగు మాసాల పాటు ఆ కోటలో బందీలుగా ఉన్నారు. హల్దీఘాటీ యుద్ధ పరాజయం అక్బర్‌ను తీవ్ర ఆగ్రహానికి లోనుచేసింది. అందుకే, తన ప్రధాన సేనాధ్యక్షుడైన మాన్‌సింగ్, అతడి సహచరుడు ఆసఫ్ ఖాన్‌లను బందీలను చేసి, ఆరు నెలల పాటు దర్బారుకు రావడానికి వీలులేకుండా ఖైదు చేశాడు.
తొలి నుంచి చివరి వరకూ భయంతో వణికిన మొగల్ సేనలు
హల్దీఘాటీ యుద్ధం మొదటి నుంచీ చివరి వరకూ మొగల్ సేనలు భయం నీడలో జీవించాయి. రాణాప్రతాప్ సేనల కంటే నాలుగు రెట్లు ఎక్కువున్నప్పటికీ, మొగల్ సేనలు వారి ముందు నిలవలేక భయపడి పారిపోయాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే ముందు వరుసలోని సేనలకు నాయకత్వం వహించిన సేనాపతి హకీం ఖాన్ సూరీ మొగల్ సేనలపై విరుచుకుపడి, వెంటాడటంతో వారు మొగల్‌రాజ్య శివార్లకు, టెరక్రోటకు ప్రసిద్ధమైన మోలేలా గ్రామం వరకూ పారిపోయారు.
అప్పుడు మొగల్ సైన్యం వెనుదిరగకుండా ఆపడానికి, సైన్యం చివరన ఉన్న సేనాపతి మహత్తర్ ఖాన్, మొఘల్ చక్రవర్తి అక్బర్ స్వయంగా ఒక భారీ సైన్యంతో యుద్ధభూమికి వచ్చాడనే పుకారును వ్యాపింపజేశాడు. అప్పుడు పారిపోతున్న మొగల్ సేనలకు కొంత ధైర్యం తిరిగి వచ్చి, పరుగులు ఆపారు. కేవలం మాన్‌సింగ్ మాత్రమే కాదు, ఆ సేనలలో అక్బర్‌కు చెందిన అనేక మంది సేనాపతులు ఉన్నారు. ఎందుకంటే, అక్బర్‌కు మాన్‌సింగ్ మీద పూర్తి విశ్వాసం కూడా లేదు.
అక్బర్ సేనాపతి మాన్‌సింగ్‌కు అవమానం
యుద్ధం మధ్యలో దృశ్యం ఎలా తయారైందంటే, అనేకమంది సేనా నాయకులు కలిగిన ఆ విశాలమైన మొగల్ సేనల మధ్యలోకి రాణాప్రతాప్ తన గుర్రమైన చేతక్‌పై ఒంటరిగా ప్రవేశించాడు. అప్పుడు చేతక్ ఆ సేనలకు నేతృత్వం వహిస్తున్న మాన్‌సింగ్ కూర్చున్న ఏనుగు కుంభస్థలంపై తన పాదాలను విసిరింది.
అదే సమయంలో రాణా ప్రతాప్ ఈటెలతో మాన్‌సింగ్‌పై తీవ్ర దాడి చేశాడు. ఆ ఈటెల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏనుగుపై కూర్చున్న మాన్‌సింగ్ మావటివాడి వెనుక దాక్కున్నాడు. తన దాడిలో మావటివాడితో పాటు మాన్‌సింగ్ కూడా మరణించాడనుకున్న రాణా ప్రతాపుడు తన లక్ష్యం పూర్తి అయిందనుకుని గాయపడిన చేతక్‌ను తీసుకుని యుద్ధభూమి నుంచి బయటకు వచ్చాడు. ఈ యుద్ధంలో ప్రతాపుడు అక్బర్ సేనాపతుల్లో ఒకడైన బహలోల్ ఖాన్‌ను అతడి గుర్రంతో సహా రెండుగా చీల్చేశాడు. యుద్ధమైన తర్వాత మాన్‌సింగ్ తిరిగి అక్బర్ వద్ద వెడుతుండగా, మార్గంలో ప్రజలు అతడిని ఓడిపోయిన ఒక సేనాపతిని చూసినట్టే చూశారు.
సేనల ఓటమి, దీవేర్‌లో అక్బర్ సంపూర్ణ పరాజయం
హల్దీఘాటీ యుద్ధంలో మొగలుల వైఫల్యం పట్ల అక్బర్ ఆందోళన చెంది, 1582వరకు సేనాపతులను మార్చి మార్చి మేవాడ్‌పై అనేక విఫల దాడులు చేశాడు. లక్షమంది సైన్యంతో వచ్చి, స్వయంగా అక్కడ ఉన్నాడు. హల్దీఘాటీ యుద్ధం తర్వాత ఉదయపూర్ పేరును ముహమ్మదాబాద్‌గా మార్చేందుకు అక్టోబర్ 1576లో విఫలయత్నాలలో భాగంగా ఆ పేరుతో వెండి, బంగారు నాణేలను ముద్రించి జారీచేశాడు. అంతిమంగా, 1583లో దీవేర్ యుద్ధానంతరం మొగల్ సేనలు ఘోరంగా ఓడి పారిపోయాయి. ఈ యుద్ధంలోనే మొగల్ సేనాపతి చుట్టూ ఈటెలు, బల్లేలు వేసి అమర్‌సింగ్ బంధించాడు. దీవేర్ యుద్ధానంతరం 36 మొగల్ థాణాల నుంచి మొగల్ సేనలను తరిమికొట్టారు. దివేర్‌లో పరాజయానంతరం ప్రతాపుడు జీవించి ఉండగా, మేవాడ్‌ను ఆక్రమించే సాహసం ఎప్పుడూ చేయలేదు.
ఖమ్‌ణోర్ యుద్ధం
జూన్ 18, 1576
అది జూన్ 18, 1576… ఆ రోజు సూర్యుడు భిన్నమైన తేజస్సుతో ఉదయించాడు. యుద్ధ భూమిలో శూరవీరులతోపాటు భీతిల్లిన మనోబలం లేదా స్వభావం కలిగిన సేనలను గురించి కవిరాజు సూర్యమల్ మీసణ్ తన కవితల్లో అద్భుతంగా వర్ణించారు. పిరికితనం కలిగిన వారి శరీరం భయంతో ఎలా కంపిస్తుందో, వీరుల పరాక్రమం, తేజస్సు నాలుగు దిక్కులా అలా వ్యాపిస్తుందని అభివర్ణించాడు. యుద్ధంలో వీరుల కవచం ఎలా మెరుస్తుందో అలా రణభూమిలో వారి శౌర్యపు తేజస్సు సూర్యుడు ప్రకాశాన్ని కూడా మసకబారేలా చేస్తుందంటాడు.
ఖమ్‌ణోర్ (హల్దీఘాటీ అని కూడా పిలిచే) మైదానంలో అటువంటిదే జరిగింది. భారతీయ వీరులు మొగలుల యుద్ధకౌశలాన్ని నిస్తేజం చేసి, వారిని వారి శిబిరం వరకూ తరిమికొట్టారు. కానీ అంతకుముందు రోజు మేవాడ్ వీరుడు మహారాణా ప్రతాప్ చూపిన నైతిక పరాక్రమం అద్భుతమైనది.
మోసంతో శత్రువును వధించలేదు
మహారాణా ప్రతాప్ కేవలం వీరుడైన ఒక సేనా నాయకుడే కాదు, యుద్ధంలో కూడా మానవీయ నైతిక విలువలకు కూడా అత్యున్నత స్థానాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు. యుద్ధం ప్రారంభమవడానికి ఒక రోజు ముందు మధ్యాహ్న సమయంలో మాన్‌సింగ్ కొందరు సైనికులతో పాటు వేటకు వెళ్లాడని, ఆ సమాచారం వేగుల ద్వారా మహారాణాకు అందిందనే ప్రస్తావనలు ఉన్నాయి. ‘ఇది చాలా మంచి అవకాశం చేయిజార్చు కోకుండా శత్రువును చంపివేయాలని’ హితులు చెప్పారు. కానీ, వీరుడైన మహారాణా తన క్షత్రి యోచితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి మోసం, వంచనతో శత్రువును చంపడం నిజమైన క్షత్రియులు చేసే పని కాదంటూ జవాబిచ్చాడు. రేపు యుద్ధంలో మాన్‌సింగ్‌ను ముఖాముఖి ఎదుర్కొందాం. మోసంతో శత్రువును చంపడం వీరోచిత కార్యమని ఆయన భావించలేదు.
యుద్ధ ప్రకటన
అక్బర్ ఫతేపూర్ సిక్రీ నుంచి అజ్మీర్‌లోని మొయినుద్దీన్ చిస్తీ దర్గాను దర్శించేం దుకు వచ్చాడు. అక్కడే, ఆయన మహారాణా ప్రతాప్‌కు వ్యతిరేకంగా 1 మార్చి 1576లో అతడు యుద్ధ ప్రకటన చేశాడు. ఈ యుద్ధానికి నేతృత్వం వహించేందుకు మాన్‌సింగ్‌ను నియమించాడు. హల్దీఘాటీ యుద్ధంలో మాన్‌సింగ్‌ను సేనాపతిని ఎందుకు చేశాడన్నది ఒక ముఖ్యమైన విషయం. అంతకు ముందు, ఏ హిందువునూ మొగల్ సేనలకు అధిపతిని చేయలేదు. మాన్‌సింగ్‌ను సేనాపతిని చేయడంపై ‘ఇక్బాల్‌నామా `ఎ` జహంగీరీ’ రచయిత ముతమిద్ ఖాన్, ‘ దర్బారు తయారు చేసిన వీరుడు, ప్రత్యేకమైన వ్యక్తి మాన్‌సింగ్. అంతేకాదు, ప్రియమైన కుమారుడు అనే బిరుదు అతడికి ఇచ్చారు. అజ్మీర్‌కు చెందిన ముస్లిం, హిందూ సర్దారులతో కలిసి మహారాణాను ఓడించేందుకు అతడిని పంపారు. అతడిని పంపడం వెనుక అక్బర్ ఉద్దేశ్యం ఏమిటంటే, అతడు కూడా మహారాణా ప్రతాప్‌కు చెందిన జాతివాడు కావడం. మహారాణా ప్రతాప్‌ను అధీనం చేసుకోవడం. పన్నులు వసూలు చేయడం. ఇతడిని పంపడం వెనుక ఉన్న ఉద్దేశం, మహారాణా అతడిని తన ముందు అల్పుడిగా, దాసుడిగా భావించడంతో, తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందనే దృష్టితో యుద్ధభూమిలో ముందుకు వచ్చి, హత్యకు గురికావాలన్నదే.’ అతడిని సేనాపతిని చేయడం వెనుక ద్వంద్వ నీతి పని చేస్తోందన్న మాట.
హల్దీఘాటీ ఎంపిక
తన సేనలతో కలిసి మాండల్‌గఢ్ వెళ్లి అక్కడ ఆగిపోయాడు. అక్కడ అతడు మహారాణా ప్రతాప్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వయోవృద్ధుడు, అనుభవజ్ఞుడైన రామ్ షా తావర్ వ్యూహాత్మక సలహాతో మహారాణా ప్రతాప్ మాండల్‌గఢ్ వెళ్లే ఆలోచనను విరమించుకున్నాడు. ఎందుకంటే, మొగల్ సేనలకు కొండ ప్రాంతంలో పోరాడే అనుభవం లేదు. అందువల్ల, శత్రువుల బలహీనత నుంచి లబ్ధి పొందేందుకు మహారాణా ప్రతాప్ మాండల్‌గఢ్ వంటి మైదాన భూభాగానికి వెళ్లకుండా, మొగల్ సేనలు కొండ ప్రాంతం వైపు వెళ్లే వరకూ నిరీక్షించాడు. దాదాపు రెండు నెలల పాటు వేచి ఉన్న తర్వాత మాన్‌సింగ్ మాండల్‌గఢ్ నుంచి బయలుదేరి మోహి గ్రామం గుండా ప్రయాణించి, ఖమణోర్ సమీపంలోని బనాస్ నది ఉత్తర ఒడ్డున ఉన్న బేస్ మోలేలా గ్రామంలో తన సైనిక శిబిరాన్ని స్థాపించాడు. మహారాణా ప్రతాపుడు కూడా తన సైన్యంతో గోగుందా గ్రామం నుంచి బయలుదేరి హల్దీఘాటీ నుంచి కొద్ది దూరంలో ఉన్న లోసింగ్ గ్రామంలోని చెరువు సమీపంలో తన సేనలను నిలిపివేశాడు.
ఖమణోర్ (హల్దీఘాటీ) యుద్ధం
“మాన్‌సింగ్, ఆసఫ్ ఖాన్ గోగుందా నుంచి 7 కోసుల దూరంలో ఉన్న లోయ వద్ద షాహీ సేనల సహితంగా వెళ్లడంతో, మహారాణా యుద్ధం చేసేందుకు వచ్చాడు. ఖ్వాజా ముహమ్మద్ రఫీ బక్షీ, షియాబుద్దీన్ గురోహ్, పాయన్దా కజ్జాక్, అలీ మురాద్ ఉజ్బెక్, రాజా లూణకరణ, బహలోల్ ఖాన్ సహా మాన్ సింగ్, అనేకమంది రాచరిక అశ్వసైనికులతో కలిసి, మధ్యలో ఏనుగుపై ఉన్నాడు. అంతేకాదు, ప్రసిద్ధమైన యువకులు సేనలకు ముందు వరుసలో ఉన్నారు. ఎంపిక చేసిన 80మందికి పైగా యోధులను సయ్యద్ హాషీమ్ బారహాతో కలిపి సేనలకు ముందుకు భాగానికి పంపగా, సయ్యద్ అహ్మద్ ఖాన్ పన్నెండు మంది ఇతర సయ్యదులతో కలిసి దక్షిణం వైపు ఉన్నాడు. షేఖ్ ఇబ్రహీం చిస్తీ బంధువు అంటే సిక్రీ రాజకుమారులతో కలిసి లోయకు ఎడమవైపు సేనలకు వెనుక భాగంలో ఉన్నాడు, అంటూ ఖమణోర్ యుద్ధ మైదానంలో ఉన్న కరడు గట్టిన సున్నీ మౌల్వీ అబ్దుల్ కాదిర్ బదయÖనీ తన పుస్తకంలో రాశాడు.
మొగల్ సేనల్లో తొక్కిసలాట
“మహారాణా కీకా (మహారాణా ప్రతాప్) హల్దీఘాటీ కనుమ ముఖద్వారం వరకు 3,000 మంది రాజపుత్రులతో ముందుకు సాగి, తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. హకీం ఖాన్ సూర్ నేతృత్వంలో ఒక భాగం కొండల నుంచి బయలుదేరి, ముందువరుస సేనలపై దాడి చేసింది. భూమి ఎగుడు దిగుడుగా, రహదారి వంకర టింకరగా, ముళ్ల పొదలతో నిండి ఉన్న కారణంగా మొగల్ ముందు వరుస సేనల్లో గందరగోళం నెలకొంది. దీనితో ముందువరుసలో ఉన్న సేనలు చెల్లాచెదురైపోయాయి. మొగల్ సేనలోని రాజపుత్రులకు నాయకుడు రాజా లుణకరణ్. వీరిలో అత్యధికులు, ముఖ్యంగా ఉత్తరం వైపు ఉన్న వారు గొర్రెల మందల్లా పరుగులు ప్రారంభించి, ముందువరసలను చీల్చుకొని తమ రక్షణ కోసం దక్షిణంవైపు పరుగెత్తారు. ఈ సమయంలో ముందు వరుసలో ప్రత్యేక సైన్యంతో ఉన్న నేను (అల్ బదాయÖనీ) ఇటువంటి అవస్థలో మనం మన, శత్రుసేనలకు చెందిన రాజపుత్రులను ఎలా గుర్తుపట్టగలం అని ఆసఫ్ ఖాన్‌ను అడిగాను. అందుకు అతడు, నువ్వైతే బాణాలు వేస్తూ ఉండు, ఏ పక్షానికి చెందిన వ్యక్తికి అవి తగిలి మరణించినా, అది ఇస్లామ్‌కే మంచిది అవుతుంది కదా? అన్నాడు. అందుకే, మేం బాణాలు వేస్తూనే ఉన్నాం. గుంపు ఎలాంటిది అంటే మేం వేసిన ఒక్క బాణం కూడా వృధాకాలేదు. అంతేకాదు, కాఫీర్లను (హిందువులు) ను చంపే సౌభాగ్యం నాకు కూడా లభించింది. యుద్ధ క్షేత్రం ఇరుపక్షాల వీరుల మృతదేహాలతో నిండి పోయింది” అంటూ బదాయÖనీ రాసుకొచ్చాడు.
“మహారాణా ప్రతాప్ స్వయంగా నాయకత్వం వహిస్తున్న సైన్యంలోని రెండవ విభాగం, కొండల నుంచి బయటపడి లోయ ముఖ ద్వారం నుంచి కాడీ ఖాన్ సైన్యంపై దాడి చేశారు. అతడి సేనలను సంహరిస్తూ మహారాణా కీకా మధ్యవరకూ వెళ్లి పోయాడు. దానితో సిక్రీ వారసులు అంతా పారి పోయారు. వారి నాయకుడు, షేక్ ఇబ్రహీం అల్లుడు అయిన షేఖ్ మన్సూర్ పరుగులు తీస్తున్నప్పుడు ఒక బాణం రివ్వున వచ్చిగుచ్చుకుంది. అది ఎంత లోతుగా తగిలిందంటే, చాలా రోజుల వరకూ అతడి గాయం మానలేదు. కాడీ ఖాన్ ముల్లా అయినప్పటికీ, కొంత సమయం దృఢంగా నిలబడ్డాడు, కానీ కత్తితో అతని కుడి చేతి బొటనవేలు నరికివేయడంతో, అతను కూడా తన సహచరులతో పారిపోయాడు” అని యుద్ధ ఘటనలను బదయÖనీ రాసుకొచ్చాడు.
5-6 కోసుల దూరం పారిపోయిన మొగల్ సేనలు
అక్బర్ ఆస్థాన రచయిత అబుల్ ఫజల్ అల్లామి తన అయిన్ `ఎ` అక్బరీలో “మొదటి దాడిలోనే పారిపోవడం ప్రారంభించిన మా సైనికులు, నదిని దాటి 5`6 కోసుల వరకూ పారిపోయారు. ఇంతటి విధ్వంసకర సమయంలో మిహతర్ ఖాన్ తన సహాయక సేనతో పాటుగా చందావల్ నుంచి బయలుదేరి వచ్చాడు. అతడు డప్పు వాయించి, బిగ్గరగా అరుస్తూ పారిపోతున్న సేనలను ఒకచోట చేరమని చెప్పాడు. అతడి చేసిన ఈ పని సేనల మనస్సుల్లో ఆశ పుట్టించి, వారు పారిపోకుండా చేసింది.” మిహతర్ ఖాన్ బిగ్గరగా అరచి ఏమ న్నాడు అనే విషయం గురించి బదయÖనీ ఏమీ రాయలేదు కానీ అబుల్ ఫజల్ తన అక్బర్‌నామాలో (ఇంగ్లీషు అనువాదం, జి. 3, పేజీ 246)ఏం రాశాడంటే, సాధారణంగా చూసేవారికి, రాణా విజయం ఖాయమైపోయినట్లుగా కనిపించింది. పైన వర్ణనలో రాణా ప్రతాప్ విజయం గురించి ఫజల్ స్పష్టంగా రాశాడు.
“మహారాణా ప్రతాప్ సేనల ముందు వరుసలో ఉండే గ్వాలియర్‌కు చెందిన రాజా మాన్ మనుమడు రామ్‌షా, వర్ణించడానికి అలివి కానంత వీరత్వాన్ని ప్రదర్శించాడు. కానీ, సైన్యం ముందు వరుసలో దక్షిణం వైపు ఉన్న మాన్‌సింగ్‌కు చెందిన సేనలోని రాజ్‌పుత్రులు పారిపోయారు. దీనితో ఆసఫ్ ఖాన్ కూడా పారిపోవడమే కాకుండా కుడివైపు ఉన్న సయ్యదుల ఆశ్రయం పొందాడు ” అని అబుల్ ఫజల్ రాశారు.
ఏనుగుల యుద్ధం
ఇరుపక్షాలకూ చెందిన ఏనుగులు తమ తమ సైన్యం నుంచి బయటకు వచ్చి పోరాటం ప్రారంభిం చాయి. మాన్‌సింగ్ వెనుక ఏనుగుపై ఉన్న ఏనుగుల సంరక్షకుడు హుస్సేన్ ఖాన్, ఈ ఏనుగుల యుద్ధంలో పాలుపంచుకున్నాడు. అక్బర్ ఏనుగుల మందలో ప్రత్యేకమైన ఏనుగు, మహారాణాకు చెందిన ‘రామ ప్రసాద’ అనే ఏనుగుతో గట్టి పోరాటం చేసింది. అది పరాజయం పాలు అయినప్పుడు మొగల్ సైనికుడు కమల్‌ఖాన్ ఆ ఏనుగును ఎదుర్కొన్నాడు. రాజ ఏనుగు గాయాలపాలైంది. రామప్రసాద్ ఏనుగు అనేకమంది మొగల్ సైనికులను చంపిపడేసింది. అప్పుడు, ‘రామప్రసాద’ను ఎదుర్కొని, పోరాడేం దుకు, మొగలు సైనికులు తమ గజరాజును ముందుకు తీసుకువచ్చారు. కానీ గజరాజు కూడా రామప్రసాద్‌తో పోటీపడలేక పోయింది. అప్పుడు రామ్ ప్రసాద్‌ను ఎదుర్కొనేందుకు మొగల్ మావటివాడు పంజూరామ్ మదావత్‌ను ఏనుగుతో తీసుకొని వచ్చారు. రెండు ఏనుగుల మధ్య భీషణ యుద్ధం జరిగింది. రామప్రసాద్ ఏనుగు కూడా వెనుకంజ వేయడం ప్రారంభించింది కానీ యుద్ధంలో శత్రువుల దంతాలను విరగొట్టే రామప్రసాద్ ఏనుగుకు చెందిన మావటివవాడు గాయపడడంతో పరిస్థితి పూర్తిగా తిరగబడింది. పరిస్థితిని గమనించిన రాచ ఏనుగుల నిర్వాహకుడు హుస్సేన్ ఖాన్, రామప్రసాద్ మావటివాడు మరణించగానే ఆ స్థానాన్ని తాను ఆక్రమించి, ఏనుగును తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బదాయునీ కొందరు సైనికులతో కలిసి రామప్రసాద్ ఏనుగును తీసుకుని అజ్మీర్ వైపు ప్రయాణమయ్యారు. ‘మొగల్ సైనికులు రామప్రసాద్‌ను తీసుకుని అజ్మీర్ వైపు ప్రయాణిస్తుండగా, మేవాడ్ నివాసులు దానిపై మట్టి విసిరి దానిని అవమానించడం ప్రారంభించారు’ అని ‘ముస్తాఖాబ్ఉ-త్త-వారీఖ’లో రాశారు.
బహలోల్ ఖాన్‌ను చంపడం
అదే సమయంలో మాన్‌సింగ్ సేనలకు ముందు వరుసకు నేతృత్వం వహించే వాడు, అతని తురుఫు ముక్క.. ఉజ్బెక్ బహలోల్ ఖాన్, మాధవ్‌సింగ్ కచ్ఛావాతో పాటు ఉన్నాడు. అతడు మానసింగ్ రక్షణ కోసం ముందుకు కదిలి, రాణాప్రతాప్ సమీపానికి వచ్చాడు. మహారాణా తన కత్తితో అతడి తలపై భీషణంగా దెబ్బకొట్టాడు. ఈ దెబ్బకు బహలోల్ ఖాన్ రక్షణ కవచం, గుర్రంతో సహా రెండు ముక్క లయ్యాడు. అక్బర్ సేనల్లో అత్యంత శక్తిశాలి అయిన ఉజ్బెక్ సైనికుడు బహలోల్ ఖాన్.
మొగల్ సేనా నాయకుడు మాన్‌సింగ్‌పై ప్రతాప్ దాడి
బహలోల్ ఖాన్‌ను వధించి, చేతక్‌పై సవారీ చేస్తున్న మహారాణా ప్రతాప్ యుద్ధంలో సేనలను వేగంగా సంహరిస్తూ, మాన్‌సింగ్ వైపు కదిలాడు. ఈ మధ్యలోనే దోడియా భీమ్‌సింగ్ తన బల్లెం తీసుకుని మాన్‌సింగ్ ఏనుగువైపు దూకి, గుర్రంపై నుంచి బల్లెంతో మాన్‌సింగ్‌ను తీవ్రంగా గాయపరుస్తూ, ‘నిన్ను నువ్వు కాపాడుకో మాన్‌సింగ్, దోడియా భీమ్‌ను వచ్చాను’ అన్నాడు. ఈ యుద్ధంలో మానసింగ్ ఏనుగు అంబారీలో కూర్చుని వచ్చాడు. అతడు కింద వంగి దోడియా భీమ్‌సింగ్ బల్లెపు దాడినుంచి తనను తాను కాపాడుకున్నాడు. భీమ్‌సింగ్ గుర్రం నుంచి కిందపడటంతో మొగల్ సైనికులు చుట్టుముట్టినా ప్రబలమైన పరాక్రమాన్ని చూపి వీరగతిని పొందాడు. మహారాణా ప్రతాప్ గుర్రమైన చేతక్ తన రెండు కాళ్లను మానసింగ్ ఏనుగు కుంభస్థలంపై ఉంచి, మాన్‌సింగ్‌పై తన యజమాని దాడి చేసే సౌకర్యాన్ని కల్పించింది. మహారాణా ప్రతాప్ గర్జిస్తూ, నీకెంత సాధ్యమైతే అంత సాహసాన్ని ప్రదర్శించు, ప్రతాప్‌సింగ్ వచ్చాడు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత మహారాణా ప్రతాపుడు మాన్‌సింగ్‌పై బల్లెంతో దాడి చేశాడు. కానీ ఆ దాడి నుంచి తనను తాను కాపాడు కునేందుకు మాన్‌సింగ్ తన అంబారీలో వంగి కూచున్నాడు. దీనితో మహారాణా బల్లెం అంబారీకి తగిలి, మాన్‌సింగ్ బతికిపోయాడు. దీనితో గాయపడి, భీతిల్లిన మావటివాడు ఏనుగును వెనక్కి తిప్పి యుద్ధక్షేత్రం నుంచి మాన్‌సింగ్‌ను బయటకు తీసుకువచ్చాడు. దీని తర్వాత, మాన్‌సింగ్ తన సేనలను కలవడానికి సాయంత్రం మోలేలా చేరుకున్నాడు. కానీ అక్కడ ఎవరూ కలవలేదు. ఆ మరురోజు సాయంత్రం గుగేందూలోనే అతడు సేనలను కలుసుకోగలిగాడు. మాన్‌సింగ్ మరణించా డని భావించిన రాణా ప్రతాప్ తన గుర్రాన్ని అక్కడ నుంచి వెనక్కి తిప్పాడు. ఈ యుద్ధంలో జయమల్ మోడతియా కుమారుడు రామదాస్, గ్వాలియర్ మహారాజు రామ్‌షా తమ పుత్రులు శాలివాహనుడు, ఇతర కుమారులతో కలిసి ధైర్యంగా పోరాడి తమ సేవలను అందించారు. మాధవ్ సింగ్ కచ్ఛావాతో పోరాటం చేస్తుండగా మహారాణాపై బాణాల వర్షం కురిసింది. సయ్యద్‌లతో పోరాడుతున్న హకీం ఖాన్ సూర్‌జీ పరుగున వచ్చి మహారాణాను కలిశాడు. ఈ రకంగా, మహారాణా సైన్యంలోని రెండు విభాగాలు కలిసిపోయాయి. యుద్ధం కూడా ముగింపుకు రావడం ప్రారంభమైంది. దీనితో మొగల్ సేనలలోని రాజపుత్రులు చెల్లాచెదురయ్యి, వెనక్కి తగ్గడం ప్రారంభించారు. అంతేకాదు, సుమారు అర కోసు వెనక్కి వెళ్ల, బనాస్ దక్షిణ కొనకు చేరుకున్నారు. అలా వెనక్కి తగ్గుతున్న మొగల్ సేనల కారణంగా మేవాడ్ యోధులలో ఉత్సాహం తగ్గడం లేదు.
యుద్ధ మైదానం నుంచి మహారాణా ప్రతాప్‌ను తప్పించడం
ఆ సమయానికి మహారాణా ప్రతాప్‌కు గాయాలు అయ్యాయి. అలాంటి స్థితిలో మాన్‌సింగ్ (ఝాలా బీదా) అంతకుముందే పన్నిన వ్యూహం ప్రకారం మహారాణాప్రతాప్ మొగలులతో భవిష్యత్ యుద్ధ పోరాటాలను కొనసాగించ డానికి యుద్ధ ప్రాంతం నుండి తరలించాలని కోరాడు. చేతక్ పగ్గాలు పట్టుకొని, దాని ముఖం పక్కకు తిప్పమని హకీమ్ ఖాన్ సూర్‌ను ఝాలా బీదా చెప్పాడు. అతడితో పాటు భామా షా, తారాచంద్‌తో మీరు మీ సైనిక దళాలతో మహారాణా ప్రతాప్‌కు వెనుక నుంచి రక్షణ కల్పిస్తూ, అతడిని యుద్ధక్షేత్రం నుంచి బయటకు తీసుకువెళ్లండి అన్నాడు. దీనికి ముందు, ఈ అవకాశం చూసి, మొగల్ సైన్యం దృష్టిని సులభంగా మళ్లించేందుకు ప్రతాప్ ఛత్రాన్ని, మేవాడ్ ఇతర రాజ చిహ్నాలను ఝాలా బీదా స్వీకరించాడు. మహారాణా ప్రతాప్‌ను భామాషా, తారాచంద్ కావడియా ద్వారా, అతడి సైనిక విభాగం సహయోగంతో సురక్షితంగా యుద్ధ క్షేత్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ‘ముంతఖాబ్`ఉత్`తవారీఖ’లో అబ్దుల్ ఖాదిర్ బదాయÖనీ ఈ ఘాటాన్ని వర్ణిస్తాడు.
స్వామిభక్త చేతక్ వీరోచిత కార్యం
మాన్‌సింగ్ పై దాడి చేస్తున్న సమయంలో చేతక్ కాలు మాన్‌సింగ్ ఏనుగు తొండానికి ఉన్న కత్తి కారణంగా గాయమైంది. అయినప్పటికీ, గాయపడిన చేతక్ విశ్వసనీయమైన భాగస్వామిలా మహారాణా ప్రతాప్‌ను సురక్షితమైన చోటుకు చేర్చేవరకూ ఆయనను వీడలేదు. హల్దీఘాటీ నుంచి దాదాపు రెండు మైళ్ల దూరంలో ఉన్న బలీచా గ్రామం సమీపంలో 20 నుంచి 25 అడుగుల మేర వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును గాయపడిన చేతక్ ఒక్క గంతులో దాటి, ఖోడి ఆమ్లి సమీపంలో ప్రాణాలు విడిచింది. అక్కడ నిర్మించిన సమాధి నేటికి కూడా స్వామిభక్త చేతక్ స్మృతులను సజీవంగా ఉంచుతోంది. చేతక్ ప్రాణాలు విడిచిన బలీచా గ్రామంలో, అక్కడి శివాలయానికి అత్యంత సమీపంలో స్వామి భక్త చేతక్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. చేతక్ స్మారక చిహ్నానికి, శివాలయం నిత్యపూజ, అర్చనలు లేదా నైవేద్యాదికాల కోసం మహారాణా ప్రతాప్ బలీచా గ్రామంలో శ్రీమాలీ బ్రాహ్మణుడు శ్రీధర్ జీ వ్యాస్‌కి భూమిని దానరూపంలో కాలక్రమంలో ఇచ్చివేశాడు. ప్రస్తుతం కమల నయన్‌జీ శ్రీమాలి కుటుంబం వద్ద దీనికి సంబంధించిన రాగి పలక అందుబాటులో ఉంది.
మొగల్ సేనలలో వ్యాపించిన భయం
‘మొగల్ సేనలు పూర్తి అలిసిపోయి ఉన్నాయ’ని తన అయీన్` ఎ` అక్బారీలో యుద్ధ వర్ణణ చేస్తూ అబుల్ ఫజల్ అల్లామీ పేర్కొన్నాడు. యుద్ధం ప్రాతఃకాలం నుంచి మధ్యాహ్నం వరకు సాగిందని బదయÖనీ రాశాడు. అప్పుడు ఎండ మండిపోతోంది, తమ సైనికుల్లో నడిచి తిరిగేందుకు కూడా శక్తి లేదు. అటువంటి సమయంలో, మహారాణా పర్వతం వెనుక ద్రోహపూరితంగా మాటువేసి ఉంటాడనే వార్త సైన్యమంతటా వ్యాపించింది. ఇది విని మొగల్ సైనికులు భయపడ్డారు. ఈ భయం కారణంగానే తమ సేనలు మహారాణా వెంటపడలేదని బదయూనీ రాశాడు. వారు తమ డేరాల్లోకి తిరిగి వెళ్లి గాయపడిన వారికి చికిత్సచేయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయడం అవసరం, విజయం సాధించిన సేనలలో భయం, ఓడిపోయామన్న భావన ఉండగా, ఓడిపోయిన సేనలలో ఉత్సాహం ఏమాత్రం తగ్గకపోవడం ఎలా సాధ్యం?
పోరాట స్వభావం
ఈ మొత్తం యుద్ధం గురించి ఈ రకంగా వివరించవచ్చు`యుద్ధం దాదాపు ఐదుగంటలపాటు మÖడు దశల్లో జరిగింది. మొదటి దశ ఉదయం 8 గంటల తర్వాత ప్రారంభమైంది. తొలి దశలో హల్దీఘాటీ ముఖద్వారం నుండి మేవాడ్ సేనలు ముందుకు సాగి దాడులు చేశాయి. తొలి దాడితో చెల్లా చెదురైన మొగల్ సేనలు దాదాపు 5 నుంచి 7 కోసల దూరంలో గల బనాస్ మీదుగా పరుగులు తీశాయి.
అటువంటి పరిస్థితుల్లో, రెండవ దశ యుద్ధం ప్రారంభమైంది.ఇది హల్దీఘాటీ ముఖద్వారం నుంచి మైలుంపావు దూరంలో జరిగింది. ఇక్కడ మొగలు సైనికుల స్థానంలో కచ్ఛ్వాహీ రాజపుత్ర సైనికులు, మేవాడ్ సైనికులతో తలపడ్డారు. ఇదే సమయంలో మేవాడ్ సేనల ఒత్తిడి కారణంగా మొగలులకు చెందిన రాజపుత్ర సైనికదళాలు దాదాపు ఒకటిన్నర కోసులు వెనక్కి తగ్గి, బనాస్ దక్షిణ తీరం చేరుకున్నాయి.
ఇక్కడ యుద్ధంలో మÖడవదశ ఆరంభం అవుతుంది. మొగల సేనల సహాయం కోసం మహతర్ ఖాన్ పారిపోయిన సేనలు, సురక్షిత సేనలను తీసుకుని వస్తాడు. దీనితో చివరి దశ యుద్ధం భీషణంగా ప్రారంభమవుతుంది. ఇందులో ఝాలా బీదా (మాన్‌సింగ్), హకీం ఖాన్ సూర్‌కు వీరగతి లభిస్తుంది. అంతిమ దశ మధ్యాహ్నానికి యుద్ధం ముగిసిపోయింది. యుద్ధ సమయంలో మÖడు దశల్లోనూ మొగల్ సేనలు వెనక్కి తగ్గుతూనే ఉన్నాయి. బనాస్ తీరంలో జరిగిన యుద్ధం సమయంలో తీవ్రమైన వాన కురవడంతో, యుద్ధ క్షేత్రమంతా నీరు నిండిపోయింది. ఆ నీటిలో సైనికుల రక్తం కలవడంతో ఆ జలాలు రక్తవర్ణంలోకి మారాయి. అప్పటి నుంచే ఈ ప్రదేశాన్ని ‘రక్తతలాsTÖ’ అని పిలవడం ప్రారంభించారు.
– డా॥ భట్నాగర్, ప్రతాప్ గౌరవ్ శోధన కేంద్రం, ఉదయ్‌పూర్
హల్దీఘాటి యుద్ధం – ఒక అంచనా
మొగలులకు వ్యతిరేకంగా జరిగిన విజయవంతమైన పోరాటం
ప్రాతఃస్మరణీయుడైన మహారాణా ప్రతాప్ భారతీయ స్వేచ్ఛకు ఒక దార్శనిక, తాత్విక ప్రతీక. స్వదేశం, స్వధర్మ రక్షణ కోసం పరిమిత వనరులున్నప్పటికీ, నాడు అత్యంత శక్తిశాలి అయిన మొగల్ సమ్రాట్‌తో అతడు తలపడ్డాడు. అతడు పరాధీనతకు బదులుగా స్వేచ్ఛను ఎంచుకున్నాడు. అతడు కావాలనుకుంటే పరాధీనతను స్వీకరించి, ఇతర రాజులలా వైభవోపేతంగా జీవితాన్ని జీవించవచ్చు. ఈ అవకాశం అతడికి ఉంది. నాలుగు సంధి ప్రతిపాదనలను తోసిపుచ్చి అతడు స్వాతంత్య్రాన్ని కాపాడుకునేందుకు సంఘర్షణ మార్గాన్ని ఎంచుకున్నాడు.
అక్బర్ సామ్రాజ్యవాద దురాశలో మేవాడ్ స్వాధీనత అన్నది అతి పెద్ద అడ్డంకి. దీనికి తోడు గుజరాత్ లేదా గుజరాత్ సముద్ర తీరం వరకు సజావుగా వాణిజ్య కార్యకలాపాలు జరగడానికి అతని సామ్రాజ్యంలో మేవాడ్ కలవడం అత్యవసరం. సామ,దాన, భేద దండోపాయాలను ఉపయోగించి ఎలాగైనా మేవాడ్‌ను స్వాధీనం చేసుకోవలన్నది అతడి కోరిక. అందుకే, 1572 నుంచి 1576 జూన్ వరకు, నాలుగు సంధి ప్రతిపాదనలను పంపాడు. కానీ, ప్రతాపుడు తనకు ప్రాణాలతో సమానమైన మేవాడ్‌ను అతడు అధీనం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. దాని ఫలితమే 18 జూన్, 1576లో హల్దీఘాటి యుద్ధం.
హల్దీఘాటి యుద్ధం మహారాణా ప్రతాప్ విజయవంతమైన, కీర్తిదాయకమైన సంఘర్షణకు ప్రారంభం. ఈ యుద్ధం 7 సంవత్సరాలు జరిగింది. ఈ సంఘర్షణలో నిర్ణాయకమైన పరిష్కారం దివేర్ యుద్ధంలో లభించింది. హల్దీఘాటీ యుద్ధంలో ప్రతాపుడు తన శత్రువులపై పోరాటంచేశాడు. ఈ సంఘర్షణను కూడా ప్రతాపుడే ప్రారంభించాడు. దారుణమైన వేడి ఉండే ఎండాకాలం కోసం ఎదురుచూశాడు. మొగలులను లోయవరకు పిలిచాడు. ప్రతాపుడి ప్రచండమైన దాడి ఎంత భీకరంగా ఉందంటే, మొగల్ సేనల కాళ్లు కంపించాయి. శత్రు సైన్యం గందర గోళపడి, పట్టుకోల్పోయి ఆరుకోసల దూరం పారిపోయింది. ఆ తర్వాత భీషణ సంఘర్షణ ఖమణోర్‌లోని రక్త తలాsTÖ మైదానంలో జరిగింది. ఈ భీషణ సంఘర్షణలో ప్రతాపుడి అద్భుత పరాక్రమం సాక్షాత్కారమైంది. మొగల్ సేనాపతి మాన్‌సింగ్ తన ఏనుగు అంబారీలో దాక్కొని, ప్రాణాలు కాపాడుకున్నాడు. అక్కడ రోజంతా జరిగిన సంఘర్షణలో మొగల్ సేనలకు భారీగా నష్టం వాటిల్లింది. రాజపుత్రులలోని ఒక తరం అంతా ఇక్కడ ఒకరకంగా తుడిచిపెట్టుకుపోయింది. గ్వాలియర్ రాజవంశానికి చెందిన మూడు తరాలు ఒకేసారి బలిదానం చేయగా, భిల్లులతో పాటు ప్రతివర్గం కూడా ప్రాణత్యాగం చేసింది. రోజంతా యుద్ధం సాగిన తర్వాత, ప్రతాపుడు సేనలు కోల్యారీ చేరుకున్నాయి. నేడు బాద్షాహీ బాగ్ అని పిలిచే ప్రాంతంలో మొగల్ సేనలు నిలిచాయి.
హల్దీఘాటీ వద్ద మొగల్ దండయాత్రను విశ్లేషిస్తే, అది వారి వైఫల్యాలకు ఒక స్మారక చిహ్నం. దీని మూల్యాంకనం చూద్దాం `
ప్రతాపుడి తల కోసం వచ్చి, ఒక ఏనుగును తీసుకువెళ్లారు
మొగలుల యుద్ధం దాని లక్ష్యంలో విఫలమైంది. సజీవంగా లేదా నిర్జీవంగా అయినా ప్రతాపుడిని బందీని చేయాలన్నది అక్బర్ కోరిక. కానీ, అతడు ప్రతాపుడిని అధీనంలోకి తెచ్చుకోవడంలో లేదా ఖైదు చేయడంలో విఫలమయ్యాడు. అయితే, రామప్రసాద్ అనే ఏనుగును బందీని చేయడంలో మాత్రం సఫలమయ్యారు. ఆ ఏనుగును ఫతేపూర్ సిక్రీకి తీసుకువెళ్లి అక్బర్‌కు సమర్పించగా, ఆయన దాని పేరును రామ్‌ప్రసాద్ నుండి పీర్ ప్రసాద్‌గా మార్చారు. అయితే, ఆ ఏనుగుకు ప్రతాపుడి పట్ల ఎంత స్వామి భక్తి ఉండేదంటే, అది అన్నపానాలను సైతం ముట్టకుండా ప్రాణత్యాగం చేసిందని చెప్తుంటారు.
స్వాతంత్య్ర సమరం వర్సెస్ మతయుద్ధం
ప్రతాపుడికి హల్దీఘాటీ యుద్ధం ఒక స్వాతంత్య్ర సమరం కానీ, మొగలులకు అది ఒక మత యుద్ధం. మొగలుల చరిత్రను రచించిన బదయÖనీ హల్దీఘాటీ యుద్ధ సమయంలో అక్కడ ఉన్నాడు. అతను తమ సేనాపతి ఆసఫ్ ఖాన్‌ను ఒకసారి ప్రశ్నించాడు, ఇరువైపులా ఉన్న రాజపుత్ర సైనికులు ఒకేరకమైన వేష భాషలను కలిగి ఉన్నారు, ఎవరిపై బాణం వేయాలో తెలియడం లేదు అన్నప్పుడు, నువ్వు బాణాలు వేస్తూ ఉండు, ఎవరు మరణించినా విజయం మతానిదే అవుతుందంటూ ఆసిఫ్ ఖాన్ ్పువాబిచ్చాడు.
హల్దీఘాటీ యుద్ధం తర్వాత మొగలు సేనల దుర్దశ
యుద్ధానంతరం మొగల్ సేనలు రహస్యంగా దాక్కొని దాక్కొని గోగుందా చేరుకున్నాయి. ప్రతాపుడికి ఎంత భయపడ్డారంటే, వారు తమ రక్షణ కోసం గోగుందా కోటకు నాలుగు దిక్కులా లోతైన కందకాలను తవ్వించి, తర్వాత ఎత్తైన గోడలు నిర్మింపచేశారు. సేనలు అందులో ఖైదీల్లాగా తమ జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంతంలో ఇబ్బడిముబ్బడిగా లభించే మామిడి కాయలు తిన్నారు. దానితో వారికి విరోచనాలు పట్టుకున్నాయి. వీటి కారణంగానే, చాలామంది సైనికులు మరణించారు. మామిడికాయలు అయి పోయిన తర్వాత గుర్రాలను చంపితిన్నారు. కుళ్లిన మాంసం కూడా తిన్నారు. దీనితో సైనికులు కýరా బారిన పడ్డారు. దీనివల్ల కూడా చాలామంది సైనికులు మరణించారు. హల్దీఘాటీలో జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో మరణించిన సైనికులకన్నా ఎక్కువమంది విరోచనాలు, కలరా కారణంగా మరణించారు.
వారు మొత్తానికి ప్రాణాలు కాపాడుకొని, సెప్టెంబర్ మాసానికి ఫతేపూర్ సిక్రీ వైపు ప్రయాణిస్తుండగా, బదయÖనీ ఏం రాశాడంటే, తాము ప్రతాప్‌ను ఓడించామని వీరు చెబుతుంటే, ఒక్క వ్యక్తి కూడా వారిని నమ్మలేదు!
మాన్‌సింగ్, ఆసిఫ్ ఖాన్‌ల బహిష్కరణ
సేనాపతి మాన్‌సింగ్, ఆసిఫ్ ఖాన్‌లు ఫతేపూర్ సిక్రీ చేరుకునే సమయానికి వారి వైఫల్యంపట్ల అక్బర్ ఎంత క్రోధుడై ఉన్నాడంటే, 6 నెలల పాటు దర్బార్‌లోకి వారి ప్రవేశాన్ని నిరోధించాడు.
మేవాడ్‌పై అక్బర్ స్వయంగా దండయాత్రకు రావడం
హల్దీఘాటీ యుద్ధ వైఫల్యానికి మరో ప్రమాణం ఏమిటంటే, స్వయంగా అక్బరే 1576 అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రతాపుడికి విరుద్ధంగా దండయాత్రకు రావలసి రావడం.
యుద్ధం తర్వాత కూడా ప్రతాపాడి పాలన
హల్దీఘాటీ యుద్ధం తర్వాత సంపూర్ణ మేవాడ్‌లో పాలన ప్రతాపుడిదే ఉం డేది. హల్దీఘాటీ యుద్ధం తర్వాత భూమి పట్టాలు, అనుమతులు, రాగి పలకలూ అన్నీ కూడా ప్రతాపుడి పేరుతోనే జారీ అవుతూ వచ్చాయి.
శాసనాలపై ప్రతాపుడి విజయ వర్ణన
ఖరసాన్ మందిరం, జగదీష్ మందిర్‌లలో ఉన్న శాసనాలలో హల్దీఘాటీ యుద్ధంలో ప్రతాపుడే విజేత అని పేర్కొన్నాయి.
హల్దీఘాటీ యుద్ధం మొగలులకు వ్యతిరేకంగా మహారాణా ప్రతాప్ చేసిన విజయవంతమైన సంఘర్షణ. ఆయన ఆ తర్వాత మొగలులపై చిన్న, పెద్ద కలిపి 40 యుద్ధాలలో పోరాడు. అందులో గోగుందా, మోహీ, కుంభల్‌గఢ్, డూంగర్‌పుర్ యుద్ధాలు ప్రస్తావించదగినవి. అంతిమంగా దివేరా యుద్ధంలో విజేతగా నిలిచాడు.
– నారాయణ ఉపాధ్యాయ, మహారాణా విజయ స్మారక సంస్థాన్, దివేర్ వ్యవస్థాపకులు