‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


ఎం‌తో తీవ్ర ప్రయత్నం వల్ల గణపతిదేవుని చేజిక్కించుకుంది.మరుక్షణమే ఆమె తన బృందంతో తిరుగు ప్రయాణమైంది.

కానీ తిమ్మప్ప లేకుండా ఆ అడవిలో వెనక్కు వెళ్లడం చాలా కష్టమని ఆమెకు మరో గంటకే అర్థ్ధమైంది. దారి తప్పి కవ్వల బృందం ఎటేటో పోతోంది. అడవిలో నానప్పను ముక్కలుగా నరికిన చోటుకు కాస్త ఆవలగా వెళ్లారు. దగ్గరగా భరించలేని దుర్గంధం. అడవిలో ఎక్కడో ఏదో జంతువు చనిపోవడవ•, ఆ కళేబరం మట్టిలో కలిసేవరకు దుర్గంధం వ్యాపించడం సహజం. దగ్గరలో అలాంటి జంతు కళేబరం వల్లే ఆ దుర్గంధం అనుకుంటూ కళ్లూ,ముక్కూ వ•సుకుని దాటిపోయారు.

తిరిగి తిరిగి నాలుగు రోజులకు బెలగావి చేరింది.

నానప్ప కోష్టాగారానికి చేరింది కవ్వల.

బృందాన్ని దూరంగా ఉంచి తను ఒంటరిగా లోపలికి వెళ్లింది.కాని అక్కడ నానప్పశెట్టి లేడు.

ఆయన సమాచారం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. కోష్టాగార ఉద్యోగులంతా ఆయన కోసమే వెదకులాట మొదలెట్టినట్లు చెప్పారు.

నానప్పశెట్టి, తిమ్మప్ప, గౌరయ, గణపతిదేవుడు అదృశ్యం కావడంలో ఏమైనా సంబంధం ఉందా.. ప్చ్.. అం‌తా ఊహాతీతం.

కిం కర్తవ్యమ్‌??

‌కవ్వలకు ఆందోళన రెట్టింపయ్యింది. చేసేది లేక తిరిగి అడవి పయనమైంది.

ఎంత వెదికినా.. నరమానవుడు కనిపించని దారిలో వెళ్లడం చేత ఇప్పుడు కూడా ఎవ్వరూ కనిపించడంలేదు.

ఆ దారిలో గణపతిదేవుని ఆచూకీ చెప్పగల వారేవ్వరూ కనిపించే అవకాశం లేదు కూడా. ఈసారికూడా నానప్పను గణపతిదేవుడు ఖండ ఖండాలుగా నరికి చంపిన ప్రదేశం మీదుగానే వెళ్లారు. అక్కడేదో జంతు కళేబరం బదులు మానవ శరీరభాగాల ఆనవాళ్లు కనిపించాయి. వాటిని చూసిన ఆమె భృకుటి ముడివడింది.

ఇక్కడకు మనుష్యులెవరు వచ్చారు? వారిని ఎవరు చంపారు??..బ అనుకుంటూ, అటూ ఇటూ వివరంగా చూస్తే గౌరయ మృతదేహం. కాస్త ఇవతలగా శిథిలస్థితిలో మానవ శిరస్సు.కళ్లు చికిలించి చూస్తే అది నానప్పశెట్టి శిరస్సుగా గుర్తించి భళ్లున వాంతి చేసుకుంది కవ్వల.

ఆ దృశ్యం మొత్తం వివరంగా చూసిన ఆమె గజగజా వణికిపోయింది.

నానప్పను, గౌరయను ఎవరో చంపేశారు. అదీ అతి క్రూరం.గౌరయ శిరస్సు పగిలిపోయి ఉంది. శరీరం తెలుస్తోంది.నానప్ప శరీరం లేదు. ఎముకలు న్నాయి. ఆతని శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు శరీర భాగాలు.. పక్షులు, జంతువులూ పొడుచుకు తిన్నట్లు కనిపిస్తోంది.

దుస్తులు, అక్కడ పడి ఉన్న బంగారు ఆభరణాల వల్ల నానప్ప మరణాన్ని నిర్ధారించుకుంది. కూలబడిపోయింది.

నానప్ప గౌరయ మరణించారంటే అంటే గణపతిదేవుడు, తిమ్మప్ప కూడా అక్కడికి వచ్చే ఉండాలి. అంటే గణపతిదేవుడే నానప్పను, గౌరయను చంపి ఉండాలి. ఇంత దారుణంగా.. ముక్కలు ముక్కలు చేయడం తిమ్మప్ప వల్ల కాని పని. కానీ, గణపతిదేవుడు చేయగలడేమో! మహావీరుడుగా అతని యుద్ధ ప్రతిభను ఆయన దేవగిరి కారాగారవాసిగా ఉన్నప్పుడే గుర్తించింది. అనంతర కాలంలో అనేకానేక రాజ్యాలలో మహా వీరుడుగా గుర్తింపు పొందాడు. వాడే..వాడే చేసి తప్పించుకుపోయాడు.

నవనాడులు కుంగిపోయాయి.

గణపతిదేవుడే తిమ్మప్పను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. వాడు నానప్పను ఇక్కడికి రప్పించాడు. ఎదిరించిన గౌరయను కూడా చంపేసి తిమ్మప్పతో పారిపోయాడు ఆ దుష్టుడు.

ఇవి కవ్వలకు వచ్చిన ఆలోచనలు.. అనుమానాలు..

గణపతిదేవుని తిరిగి తన నియంత్రణలోకి తీసుకోవడం దాదాపు అసాధ్యం.

నిస్పృహతో కూలబడగా ఆమె బృందసభ్యులు ఒకరిద్దరు ఆమెతో ఏదో చెప్పడానికి సంశయిస్తూ నిలబడ్డారు.

‘‘ఏవిటో చెప్పండి..’’ అన్నది.

‘‘మా బట్టలు, గుడారాలు, మీ వస్తువులు కూడా ఆన్ని అక్కడే వదలి వచ్చాం. అవి తీసుకుందాం మహారాణీ..’’

సరే అన్నట్లుగా తల ఊపింది ఆమె.

ఆమె పల్లకి అధిరోహించగా అంతా కదిలారు. గణపతిదేవుడు అదృశ్యమైన ప్రదేశం వైపు ఉత్తర దిక్కుగా వెళుతున్నారు కాని అసలు ఆ ప్రదేశాన్ని ఎలా గుర్తించాలో కవ్వలకు గానీ ఆ నరరూప రాక్షసులకు గానీ తెలియడంలేదు. సాగిపోతున్నారు కానీ ఆ ప్రదేశం ఏదో కనిపించడం లేదు. బండగుర్తులేవీ అప్పుడు గుర్తుపెట్టుకోలేదు.

‘‘ఇదిగో ఇక్కడే కవ్వల మహారాణీ వారి గుడారం వేశాము. ఇదిగో.. ఇక్కడే వంట చేశాము..’’

అది వాళ్లు బస చేసిన ఓ ప్రదేశం కావచ్చు. కానీ అక్కడ వదలి వెళ్లిన సామాగ్రి లేదు. ముందుకు సాగుతూ, ఎన్నో ప్రదేశాలను పరిశీలిస్తున్నారు.అవన్నీ వాళ్లు బస చేసిన ప్రదేశాలే. కాని సామాగ్రి వదలిన ప్రదేశాన్ని గుర్తించలేక •పోతున్నారు..

ఇదొక కొత్త సమస్యగా పరిణమించింది కవ్వలకు.

తిమ్మప్ప, గౌరయ ఉన్నప్పుడు దారి తెన్నూ తెలియకపోవడం అనే సమస్య లేదు. మిగిలినవాళ్లు కీకారణ్యాలవాసులే కాని ఈ గతంలో బస చేసిన ప్రదేశాన్ని గుర్చించలేకపొతున్నారు.

గణపతిదేవుడు, తిమ్మప్ప, గౌరయ మాయమవడం ఒక సమస్యకగా, దారి తెన్నూ తెలియకపోవడం కొత్త సమస్య.

ఆ రాత్రి మరో కొత్త సమస్య వచ్చి పడింది. అది కొన్ని పులులు కవ్వల గుడారాన్ని చుట్టుముట్టడం.

అర్ధరాత్రి తరువాత గుర్రం సకిలింపుతో కవ్వలకు చటుక్కున మెలకువ వచ్చింది. దగ్గరగా పులి గాండ్రింపు తక్కువ శబ్దంతో వినిపిస్తోంది. చటుక్కున లేచి కూర్చుంది.

పులి దగ్గరగా కదలుతోంది. చటుక్కున నడబంధంలోని చురక మీదికి చేయి పోయింది. చురక చేతికి తగిలింది. చెయ్యి కదుపుతూ దగ్గరగా చుట్టూ కరవాలం కోసం తచ్చాడింది. అది కూడా కుడివైపు చేతికందేటంత దగ్గరగానే ఉంది. వేగంగా దానికి దొరకబుచ్చుకుని చురుగ్గా లేచింది. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ గుడారం గుడ్డ తొలగించి చూసింది.

అంతా గాడాంధకారం. రెండు చేతులతో కరవాలాన్ని సిద్ధ్దంగా పట్టుకుని, కళ్లు చికిలించి, చెవులు రిక్కించి మెల్లగా బయటకు వచ్చింది.

ఆమె గుడారం చుట్టూ కాస్త కాస్త దూరంలో ఆమె బృందం అంతా పడుకుని ఉన్నారు.

పులి గాండ్రింపు ఎటు నుండి వినవచ్చింది అన్నట్లు కవ్వల పరకాయించి చూస్తోంది.

అంతే.. పులి ఒక్కసారిగా ఆమె ముందుకు దబ్బున ద•కింది. నిద్రిస్తున్న కవ్వల అనుచరుడిపైకి ఉరకబోయింది. కవ్వల చురుకుగా తన కరవాలంతో పులిపై ఒక్క వేటు వేసింది.

పులి గిర్రున తలతిప్పి ఆమెను చూసింది. కవ్వల అదే వేగంతో భీకరంగా అరుస్తూ దానిపై మరో వేటు వేసింది. ఈసారి కరవాలం వేగంగా వెళ్లి దాని శరీరాన్ని గాయపరచింది. ఇదంతా లిప్తల కాలంలోనే జరిగింది. అప్పటికి ఆ అనుచరులంతా అరుస్తూ లేచి పులిని గుర్తించి తమ తమ ఆయుధాలను దొరకబుచ్చుకుని పులి వెంట పడ్డారు.

అప్పటికే కవ్వల చేసిన గాయంతో దెబ్బతిన్న పులి భీకరంగా అరుస్తూ పారిపోయింది.

కవ్వల బృందమంతా కత్తులతో చురుగ్గా చూస్తూ తిరుగాడుతున్నారు. దెబ్బతిన్న పులి దూరంగా పోలేదు. దానితోపాటు మరికొన్ని పులుల అరుపులు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

కవ్వల, తన పాతికమంది సభ్యుల బృందం.. పులుల అరుపులతో స్థిమితంగా ఉండలేక పోతున్నారు.

తెల్లవార వస్తోంది.రానూరానూ వెలుగు పెరుగుతోంది. అలా కత్తులు పట్టుకుని ఎంతసేపు పులుల దెబ్బను కాచుకోవడం..!??

‘‘మహారాణీ! మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు. పులులు మనలను వదలి పెట్టవు. ఇక్కడి నుండి వెళ్లిపోదాం. దయచేసి ముందుకు కదలండి..’’ అని బృందంలో ఒకడు.. బంటయదొర అన్నాడు.

మౌనంగా తల ఊపి కరవాలం అలా పట్టుకునే ఉత్తరంగా పరుగులాంటి నడకతో ముందుకు అడుగు వేసింది.

ఆమె వెంట చుట్టూ చూస్తూ.. అనుచరగణం.. కదలుతోంది.

పులులు కూడా గాండ్రిస్తూ, కనిపించనంత ఆవలగా వాళ్ల వెంటే వస్తున్నాయి.

కొంతసేపటి తర్వాత పులుల గాండ్రింపు ఆగడంత కాస్త మెల్లగా నడవ సాగారు. అంతలోనే గాండ్రింపులు మళ్లీ వినిపించాయి. తిరిగి ఆయుధాలు గట్టిగా పట్టుకుని నలువైపులా చూస్తూ నడవసాగారు.

అలా పులి గాండ్రింపు వినిపించనప్పుడు మెల్లగా.. వినిపించినప్పుడు చురుగ్గా ప్రయాణం సాగుతోంది.

రానురానూ సూర్యుడు బలపడుతున్నాడు. ఎండ చురుగ్గా తాకుతోంది.

చేసేది లేక ముందుకు సాగుతున్నారు.

అప్పుడు జరిగిందిది..

కవ్వల ముందు ఓ దృశ్యం!!

అదిరిపోయింది.. నిజమా అన్నట్లు కన్నులు చికిలించి చూసింది.

నిజమే!! ఎదురుగా ఓ చెట్టు క్రింద పద్మాసనంలో కన్నులు వ•సుకుని యోగముద్రలో గణపతిదేవుడు!!

ఆయన మాయమైన చోటే హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఐదు రోజులుగా ఆయన కోసం కింద మీదయిపోతోంది కవ్వల. మోసం చేసి అర్ధరాత్రి పారిపోయినవాడు తిరిగి వచ్చి అక్కడే కూర్చుని ఉండటంతో ఆమె దిగ్భ్రాంతితో, స్థాణువై నిలబడిపోయింది. పులిని ఎదుర్కోవడానికి రెండు చేతులతో పుచ్చుకున్న కరవాలం అలాగే ఉంది.

పరుగున వచ్చిన అనుచరులు కూడా ఆయనను చూసి వెర్రిచూపులు చూస్తున్నారు. అంతా చిత్తరువుల్లా కొయ్యబారిపోయినవేళ మెల్లగా కళ్లు తెరిచాడు గణపతిదేవుడు.

ఎప్పటిలా ప్రశాంతంగా చూపులు కలిపాడు కాని ఏమీ మాట్లాడలేదు. కేవలం మౌనమే ఆయన భాష!!

లిప్తకాలంలో కవ్వల మనస్సంతా ఆనందంతో పులకించిపోయింది.

గుప్పిట జారిన శత్రువు తిరిగి తనంతట తానే వచ్చి చేయిపట్టి తన గుప్పిటలో ఒదిగి కూర్చున్నట్లు..

మరో లిప్తకాలంలో మరో ఆలోచన.ఎందుకు నానప్పను కలసినట్లు! ఇద్దరి మధ్య ఏమి జరిగినట్లు! ఆయన గణపతిదేవుడిని ఎందుకు వదలిపెట్టినట్లు!

నానప్ప వదలలేదు.ఈయనే ఆయన్ను చంపేశాడు.అదీ అతి దారుణాతి దారుణంగా. ఖండఖండాలుగా నరికి కాకులకు గ్రద్దలకు విసిరివేసినట్లుగా అక్కడ ఆనవాల్లు చెబుతున్నాయి. ఇద్దరు మధ్య అంత శత్రుత్వం ఏముంది? తనకు తెలిసినంత వరకు ఇద్దరికీ• అసలు పరిచయమే లేదు.

ఇప్పుడు ఈ కారడవిలో ఇద్దరూ ఎదురుపడ్డారు అంటే…ది తనే కేంద్రంగా జరిగి ఉండాలి..

అసలు ఏమి జరిగిందో చెప్పగలవాడు తిమ్మప్ప మాత్రమే.

అసలు వాడు ఏడి??

చివ్వున తల తిప్పి అడవి కనిపించినంత మేర చూసింది..

కనిపించలేదు… వాడిని కూడా చంపేశాడా??

ఆమె ఒళ్లు జలదరించింది.

తనను మాత్రమే గౌరవిస్తూ మౌనంగా తన వెంట మాట మాట్లాడకుండా తను ఎన్ని మాటలన్నా, ఎంత అవమానపరచినా,పన్నెత్తు మాట ఎదురు మాటలాడని ఈ మహావీరుడు…నానప్పను, వాడి ఇద్దరి మనుషులను చంపేసి తన వద్ద మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? తనకు సహకరిస్తునట్లు.. తను విధిస్తున్న శిక్షలను భరిస్తున్నట్లు, తాను విధించబోయే మరణశిక్షకు సిద్ధ్దమన్నట్లు..

ఆమెకు ఓ నీతికథ జ్ఞప్తికి వచ్చింది. పులికి చిక్కిన ఓ ఆవు తన బిడ్డకు పాలిచ్చి వస్తానని చెప్పి వెళ్లి మాట ఇచ్చినట్లుగానే తిరిగి పులి వద్దకు వచ్చిందట.

చటుక్కున మనస్సులోని వచ్చిన ఆ కథను మర్చిపోవడానికన్నట్లు.. వేగంగా ఓసారి గాలిలో కరవాల ప్రహారం చేసింది.

అప్పుడే అనుకోని సంఘటన జరిగింది.

అడవి లోపలినుండి ఏవేవో పండ్లు, దుంపలు రెండు చేతులనిండా పట్టుకుని వచ్చాడు తిమ్మప్ప.

బాల కవ్వలను చూడగానే… ‘‘మహారాణీ! వచ్చారా? మీ కోసమే మహారాజు గారు తిరిగి వచ్చారు. ఆయన నిజంగా దేవుడమ్మా. దేవుళ్లకే దేవుడు. మీ బందీగా ఉన్న ఆయనను నేనూ, గౌరయ తీసుకువెళ్లి నానప్పశెట్టికి చూపాము. కానీ నానప్పశెట్టి మిమ్మల్ని ఉద్దేశించి అనరాని,వినరాని మాటలు అన్నాడు. అందుకు కోపించిన మహారాజుగారు నానప్పను, గౌరయను అక్కడికక్కడే చంపేశారు. నా చుట్టూ ఓ వృత్తం గీచి అందుండి బయటకు వస్తే నన్నూ చంపేస్తానన్నారు. నానప్పను చంపడానికి కారణం ఏవిటో తెలుసా మహారాణీ!. మిమ్మల్ని ఆయన పరమ అసహ్యంగా మాట్లాడటం. అందుకే గౌరయను కూడా ఒక్క రాతిదెబ్బతో చంపేశారు. నానప్ప శరీరాన్ని ఖండఖండాలుగా నరికి కాకులకు గ్రద్దలకు విసిరేశారు. అదంతా నేను నా కళ్లారా చూశాను.

ఆయన మహావీరుడమ్మా.. కేవలం మీకు మాత్రమే ఆయన చేతులు కట్టుకుని ఎందుకు బందీగా ఉన్నారో నాకు తెలియదు. ఆయన వీరత్వాన్ని నేను స్వయంగా చూశాను మహారాణీ•. ఆయన తలచుకుంటే వీళ్లందరినీ…మిమ్మల్ని కూడా సునాయాసంగా చంపేసి వెళ్లిపోగలరు. ఇది నిజం. ఆయనను బందీగా, శత్రువుగా చూడటంవల్ల మీకొచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మీ పాదాలకు మొక్కుతాను. ఆయనను వదిలి మీ ప్రాణాలను కాపాడుకోండి.’’

ఇదంతా తిమ్మప్ప చెప్పాలనుకున్నాడు. కాని చెప్పలేకపోయాడు.

అతన్ని చూడగానే కవ్వల పట్టరాని క్రోధంతో ఊగిపోయింది. గాలిలో కత్తి ప్రహారాలు చేసింది.

‘‘ఈ ద్రోహి నాకు తెలియకుండా వీడిని ఎక్కడికి తీసుకుపోయారు? నన్నే మోసం చేస్తావా..’’ అంటూనే రెండు చేతులతో పట్టుకున్న కరవాలంతో అతని శిరస్సును ఒక్క వేటుతో ఖండించింది.

తిమ్మప్ప తల తెగి గణపతిదేవుని ముందు పడింది.

చటుక్కున కదిలి తిమ్మప్ప తలను అందుకున్నా డాయన..

‘అయ్యో తిమ్మప్పా’.. అన్నట్లు గణపతిదేవుడు చూస్తుండగా ఆతని ప్రాణాలు కళ్ల నుండి అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

భారంగా నిట్టూర్చాడు గణపతిదేవుడు. తిమ్మప్ప మరణంతో మనసు వ•లల్లో ఎక్కడో ఉన్న కాస్త ఆశాదీపం కొండెక్కింది.

‘‘ఈ ద్రోహిని బంధించి, పల్లకిలోకేక్కించండి..’’ అనుచరులను ఆజ్ఞాపించింది కవ్వల..

మౌనంగా చూస్తూ.. తననే చూస్తోన్న తిమ్మప్ప కళ్లు వ•శాడు గణపతిదేవుడు.

తర్వాత గణపతిదేవుడు బందీగా తీసుకుని కవ్వల బృందం తిరిగి దేవగిరి వైపు కదిలింది.

* * *

దేవగిరి కోటలో రాజప్రాసాదం..

సంధ్యవేళ ఆరుగంటలు మోగాయి ఘటికలో. దీపాలు, దివిటీలు, కాగడాలు ప్రాసాదం నిండా వెలిగిస్తున్నారు సంబంధిత ఉద్యోగులు.

మహారాజు సింఘణదేవుని విశాలమైన ఆంతరంగిక మందిరంలో సింఘణ దేవుడు, దేవగిరి ప్రత్యేక సంధివిగ్రహి బాలకవ్వలబాయి ఉన్నారు.

ఇద్దరూ తీవ్రమైన ఆలోచనలతో, చాలా ఉద్వేగంగానూ.. అంతకు మించిన ఉద్రేకంగానూ ఉన్నారు. దీపరక్షకులు ఊపిరి పీల్చడం లేదన్నంత నిశ్శబ్దంగా మౌనంగా దీపాలు వెలిగిస్తున్నారు. రానురానూ చీకట్లు పారిపోగా మందిరమంతా వెలుగులు నిండాయి.

దిగువ నైరుతిలోని బెలగావి నగరంలో కాకతీయ మహానేత గణపతిదేవుని బంధించిన బాలకవ్వలా బాయి ఎవ్వరికి తెలియకుండా,ఎవ్వరూ అడ్డగిం చకుండా.. అతి రహస్యంగా ఆయనను కాపాడు కుంటూ వ•డు నెలలు ప్రయాణించి దేవగిరి రాజ్యానికి చేరింది.

రాజ్యపు పొలిమేరల్లో ఉన్న ఓ మిత్రురాలి ఉద్యానవనంలో ఆయన్ను ఉంచి అశ్వాన్ని అధిరోహించి ఎప్పటిలా దేవగిరి కోటకు వచ్చి మహారాజును కలిసింది. ఆమెను చూడటంతోనే సింఘణదేవుడు కంగారుపడిపోయాడు. వెనువెంటనే ఆంతరంగిక మందిరానికి ఆమెను తీసుకుపోయాడు.

అక్కడ ఆమె చెప్పిన మాటతో వణికిపోతున్నాడు.

‘‘ప్రతిజ్ఞ చేసినట్లు ఆ ద్రోహి గణపతిదేవుని పట్టి బంధించి ఇక్కడికి తీసుకొచ్చాను బావగారూ! నా పగ తీర్చుకోవడానికి సహకరిస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు వాడిని కోటలోని ఆ శిథిలకోష్టాగారం వద్దకు తీసుకువెళ్లేందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతున్నా.’’ చేతులు జోడించి చెప్పి నిలుచుంది.

ఆమె మాటలు వినగానే నవనాడులు క్రుంగిపోయాయి సింఘణకు.

మహావీరుడు, ఓ మహాసామ్రాజ్యానికి పాలకుడైన గొప్ప వ్యక్తిని..అందునా స్వయంగా తన బావ అయిన గణపతిదేవుడిని.. దాదాపు అరవైఏళ్ల ఆ మనీషిని.. ఈ ఆడది తన పగలో భాగంగా పట్టి బంధించి ఎవరికి తెలియకుండా, అనుమానం రాకుండా రహస్యంగా ఇన్ని వేల యోజనాలు ప్రయాణించి తీసుకువచ్చిందంటే….గుండె దడదడలాడింది.

ఆమెకు వాగ్దానం చేసిన మాట నిజం. ముఖ్యంగా తను, తల్లి చిల్లాదేవి కవ్వల విషయంలో నిర్వహించిన గత అంశాలు సామాన్యమైనవి కావు. అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఆమెకు గతంలో మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆమె చెప్పినట్లుగానే ఇన్నేళ్లు పోరాడి, తంత్రాలు నడిపి చివరికి ఆయనను బంధించి ఇక్కడికి తెచ్చింది. ఇప్పుడు కోష్టాగారం వద్దకు తీసుకువెళ్లి ఆమె అక్కను చంపినట్లే ఆయనను ఖండఖండాలుగా నరుకుతాను అంటోంది.

ఆయనెవరో అనామకుడు, సాధారణవ్యక్తి కాదు. ఆయనను బంధించినట్లు తెలిస్తే….అశేష కాకతీయ సైన్యం విరుచుకు పడుతుంది. కాకతీయ వీరయోధులు ఈమెను చూర్ణం చూర్ణం చేస్తారు. దేవగిరి రాజ్యాన్ని, దేవగిరి నగరాన్ని అగ్నిప్రీతం చేస్తారు. లక్షలాది ప్రజల మరణాన్ని చూడవలసి వస్తుంది. అంతేకాదు తనను కూడా వదలరు. దొరకబుచ్చుకుని ఖండఖండాలుగా నరికేస్తారు. చరిత్ర కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. భాషా రాజ్యాలను రూపొందించాలన్న ఆయన దీక్ష, పోరాటం అంతిమదశకు వచ్చాయి. దక్షిణాది రాజ్యాలపై జరుగుతున్న యుద్ధ్దాలలో కూడా విజయం కాకతీయ సైన్యం పక్షాన్నే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన దేవగిరి సైన్యం కూడా వెనుకంజ వేసినట్లు సైన్యాధ్యక్షుడు లేఖ ద్వారా తెలియపరచాడు. అలాంటి వీర విక్రమ పరాక్రముడిని బంధించి తెచ్చి తన ముందు ఉంచి, చంపేస్తాను.. సహకరించమని అడుగుతోంది బాల కవ్వల. ఏమి చెయ్యాలి?

తలెత్తి చూశాడు. ఆమె రెప్ప వెయ్యకుండా అతని జవాబుకోసం చూస్తోంది. ఓ ఉద్వేగపు మంకుతనంతో, నమ్మిన పగతో ఊహాతీతమైన దూరాభారంతో వచ్చి తన ముందు నిలుచున్న భయంకరమైన పిశాచిలాగా కనిపించింది బాల కవ్వల.ఆమెకు ఏమి చెప్పాలో తోచక, చేతులు పిసుక్కుంటూ మరో వైపు నడిచాడు. అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు.

ఏకైక ధ్యేయంతో నిలుచున్న బాలకవ్వల అతన్నే చూస్తోంది.

సింఘణదేవుని ఆలోచన మారింది.

తను ఒకప్రక్కే ఆలోచిస్తున్నాడేమో.

మరో కోణంలో ఆలోచిస్తే గణపతిదేవుడు చిట్టెలుకలాగా బోనులో చిక్కాడు. అతనికి కవ్వలకు పాత పగలున్నాయి. వాళ్లూవాళ్లూ తేల్చుకుంటారు. మధ్యలో తనెందుకు తల దూర్చాలి. అతన్ని తొలగిస్తే తనకే కదా ప్రయోజనం! మొత్తం కాకతీయ రాజ్యం తన హస్తగతం అవుతుంది. ఇప్పటికే కన్నడ రాజ్యమంతా తన అధీనంలో ఉంది. గణపతిదేవుడు లేని కాకతీయరాజ్యం మొత్తంగా తన హస్తగతం అవడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. దక్షిణాపథం అంతా తన రాజ్యం అవుతుంది. దేవగిరిరాజ్యం అంటే ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య ఉన్న విశాల రాజ్యం. యాదవ మహాసామ్రాజ్యం తనదే..తనదే!!

ఈ ఆలోచన మహదానందాన్ని ఇచ్చింది. ఈ కోణమే సింఘణదేవుడు స్థిరపరచుకున్నాడు. మరోవైపు చూడటం ఇష్టం లేనట్లు కవ్వలతో చటుక్కున అనేశాడు.

‘‘అభినందనలు బాలకవ్వలా..అభినందనలు. ఇక్కడివరకు నీ పోరాటం అద్భుతం,అభినందనీయం. నేను, అమ్మ చిల్లాదేవిగారు నీకు వాగ్దానం చేయడం, నిన్ను ప్రోత్సహించిన మాట నిజం. ఇప్పుడు అమ్మలేదు కాని నీకు అండగా నేనుంటాను. కాని అదే సమయంలో నాకు నష్టం, కష్టం రాకూడదు కనుక నేను ఇప్పుడే నా భార్యాపిల్లలతో ఉత్తరాపథం లోని కాశీ ప్రయాణం పెట్టు కుంటాను. నేను కోటలో లేని సమయంలో కోట దండ నాయకుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు క్షేమంగా కోటలో శిథిల కోష్టాగారం చేరడానికి సహకరిస్తాడు. అక్కడికి మరెవ్వరూ రాకుండా ఆపుతాడు. ఆపై నీ ఇష్టం..’’

బాలకవ్వల ఆనందంతో అతని కాళ్లపై పడిపోయింది.

* * *

తల ఎత్తి కళ్లు కదిపి చూశాడు గణపతిదేవుడు.

ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా ఉంది. లిప్తకాలంలో గుర్తుపట్టాడు. అది దేవగిరికోటలోని శిథి•ల కోష్టాగారం.

స్పందనతో విచలితుడయ్యాడు. శరీరమంతా వణికింది. లిప్తల కాలంలోనే మనసులో ఏవేవో పాత దృశ్యాలు కలగాపులగంగా కదలాడగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి. వ•డు మాసాలుగా బాలకవ్వల చెరపట్టిన నాటి నుండి ఏనాడూ చమర్చని కళ్లు, ఇప్పుడు ఇక్కడ పాత స్మృతులు మనసు ముందుకు రాగా హఠాత్తుగా చెమ్మతో తడిసిపోయాయి.

ఇది తను, తన ప్రేయసి కవ్వల కలుసుకున్న ఆఖరి ప్రేమమందిరం. తమ అనురాగం పరిమళించి తనువులు మరింత దగ్గరైన యవ్వనోల్బణ స్వర్గం.

భారంగా కళ్లు వ•సుకున్నాడు. అదిగో అక్కడే..అక్కడక్కడ ఆమె సుకుమార శరీర భాగాలు రక్తపు మరకలతో కనిపించిన ప్రాంతం..

దాదాపు నలభై ఏళ్లు దాటినా ఇంకా అలాగే తన మనసులో, కళ్లలో కదలాడుతున్నాయి.

భారంగా నిట్టూర్చాడు.. ప్చ్..

‌కళ్లు తుడుచుకోవడానికి ఉత్తరీయం కోసం చేయి కదిలింది కానీ అది కింద పడింది. దానిని అందు కునేందుకు నేలను తాకాడు. శరీరం జల్లుమంది. ఉత్తరీయం అందుకుని కళ్లు తుడుచుకున్నాడు.

చప్పట్ల శబ్దం వినరావడంతో తలెత్తి చూశాడు. చప్పట్లు చరిచింది బాల కవ్వల.

‘‘ఇక్కడైనా తమరికి కన్నీళ్లు వస్తాయా?రావా? అనుకున్నాను మహాప్రభూ! వచ్చాయంటే నమ్మశక్యం కావడం లేదు. అసలు అవి కన్నీళ్లా?ఆనంద బాష్పాలా??’’

మనసు చివ్వుక్కుమంది. ఏదో జవాబివ్వాలని నోరు కదలాడింది. కానీ మనసు నియంత్రించింది.

గత వ•డు మాసాలుగా ఇదే పరిస్థితి. ఆమె తనను రెప్ప వేయకుండా చూస్తూనే ఉంది. తన ప్రతి కదలిక ప్రతి నిట్టూర్పు, ప్రతి భావప్రకటన ఆమె క్రీగంట పరిశీలిస్తూనే మనసు కష్టపెట్టేలా వంకరగా ఏదో అంటూనే ఉంది. కాని తన కష్టసహిష్ణత శక్తి ఎంత బలమైనదో.. శారీరకంగానే కాదు మానసికంగా కూడా తనెంత బలవంతుడో ఆమెకు తెలియదు కదా! ఏది ఏమైనా ఆమె ఏమి అన్నా, ఎన్ని అన్నా.. అన్నింటికీ మౌనమే తన సమాధానం. కారణం బాలకవ్వల పగకు, ఆమె అక్క కవ్వల మరణానికి తనే కారణం!

బెలగావిలో బంధించినప్పటి నుండి ఇప్పుడు ఈ దేవగిరి కోటలోకి వచ్చేవరకూ..ప్రయాణ కాలం దాదాపు వ•డుమాసాలపైనే పట్టింది ఈ కాలమంతా ఆమె, ఆమె బృందం తనను కొంతవరకు గౌరవంగానే చూసుకున్నారని భావించవచ్చు అనుకున్నాడిప్పుడు గణపతిదేవుడు.

మెరుపుదాడి జరిగినరోజు, కవ్వల దుర్మరణం చెందినరోజు నుండి.. తిరిగి ఇప్పుడు ఇక్కడికి తనను బంధించి తెచ్చిన ఈరోజువరకు పరిశీలిస్తే బాలకవ్వల తన అక్క మరణంపట్ల ఎంతగా వ్యథ• చెందిందో ఆయన ఊహించాడు. ఇంతకాలం తనదే వ్యథ• అనుకున్నాడు కాని తన భగ్నప్రేమ కంటే వాళ్ల క•టుంబం పొందిన నరకయాతన ఎక్కువే కదా? అనే భావనే బాలకవ్వల ఎన్ని బాధలు పెట్టినా ఆయన మౌనంగా భరించడానికి కారణం.

(సశేషం)

మత్తి భానుమూర్తి

About Author

By editor