‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో
ప్రథమ బహుమతి పొందిన రచన


అలాంటి మహాపురుషుని నానప్పశెట్టి వెకిలిగా మాట్లాడటం ఆయనను రెప్పపాటు కాలంలోనే కన్నెర్రజేసేలా రెచ్చగొట్టిందని తిమ్మప్ప గుర్తించాడు.

అప్పుడన్నాడు గణపతిదేవుడు.అంతవరకు ఎప్పుడూ తిమ్మప్ప గుర్తించని అధికార కంఠంతో… ‘‘ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను? తిమ్మప్పా? తిమ్మప్ప! ఏమైంది?కవ్వల మహారాణిగారెక్కడ??’’

తిమ్మప్ప ఆయనకు దగ్గరగా పరుగున వచ్చి చెప్పబోతుండగా…

‘‘ఈడ ఆమె లేదు. మేవే.. పల్లకిలో అక్కడి నుంచి నిన్ను.. దానికి తెలవకుండా ఇక్కడికి మా శెట్టి దగ్గరికి తీసుకొచ్చాం..’’ గౌరయ అన్నాడు.

లిప్తల కాలంలో గణపతిదేవునికి అవగతమైంది. తనను వీళ్లిద్దరూ..కవ్వలకు తెలియకుండా శెట్టి వద్దకు తీసుకువచ్చారని..

యుద్ధతంత్రాలు ఆయనకు కరతలామలకం. అయినా శత్రువు కొత్త తంత్రం పన్నినప్పుడు అది గుర్తించినప్పుడు ఇలాగే ఉంటుంది. శత్రురాజులు చేసే అవ మానాలు అత్యంత హేయం. అంతకంటే చావే నయమనిపిస్తుంది. కానీ ఇది వేరు. పెద్ద కవ్వలపై ఉన్న అవ్యాజ్యానురాగం వల్ల బాలకవ్వల ఆగ్రహాన్ని, పగను గుర్తించి, గౌరవించి ఆమె వెంట గంగిగోవులా తలవంచుకుని బందీగా వెళుతున్నాడు.

అలాంటిది…ఇదేవి•? ఆమెను ఏమార్చి మధ్యలో వీళ్లిద్దరూ తనను మరో చోటికి తరలించడమా.. హతవిధీ! వీళ్లిద్దరూ ఈ రోత వణిజుని మనుష్యులా! వీళ్లిద్దరూ ఆమెను మోసగించి వీడికి సహాయపడటం ఏవిటి? అసలు ఈ శెట్టి కవ్వలకు చేసిన సహాయాలు ఏవిటి?ఏమి ఆశించి చేస్తున్నట్లు..

‘‘సరే.. సరే. శెట్టి నువ్వేవ్వరో నాకు తెలియదు. నేనెవ్వరో నీకు తెలుసా? ఒక మహారాజుతో..ఓటమి ఎరుగని కాకతీయవంశ మహారాజుతో మాట్లాడు తున్నావని గుర్తించడం నీకు అవసరం శెట్టి!!’’ తన అసలు సిసలు అధికార కంఠంతో హెచ్చరించాడు గణపతిదేవుడు.

‘‘నువ్వెవడివైతే నాకేంది. ఇక్కడ ఇప్పుడు ఈ చీమలు దూరని చిట్టడవిలో నేనే మహారాజుని. నువ్వు పిలిస్తే పలకడానికి నీ భటులు,పరిచారులు ఇక్కడెవ్వరూ లేరు. ఉన్న ఇద్దరూ నా మనుషులు. నేను ఊ..అంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తారు. ‘ఒక ఊరి రాజు మరో ఊరికి వెట్టివాడు’ అని ఊళ్లో సామెత వినే ఉంటావ్‌. ఇప్పుడు నువ్వు నాకు వెట్టివాడివి. నేనే నీకు మహారాజును.అది గుర్తెట్టుకో..’’ అన్నాడు వెకిలిగా.

పట్టరాని క్రోధం పెల్లుబికినా తమాయించుకున్నాడు గణపతి దేవుడు. అయన ముఖంలోని భావాలను చదువుతూ ఓ చెట్టు మొదట్లో విలాసంగా కూర్చున్నాడు నానప్ప.

ఎదురుగ నిలబడి ఉన్నాడు గణపతిదేవుడు.

ఆయన్ను మరింత అవమానిస్తున్నట్లు కాలుమీద కాలు వేసుకున్నాడు నానప్ప.

అలా ఓ మహారాజును అవమానిస్తూ మాట్లాడటం ఆ వణిజునికి గొప్ప ఆనందాన్నిస్తోందని గణపతిదేవుడు గుర్తించాడు. యుద్ధం గెలిచిన మహారాజులు ఓడిన రాజులను ఎలా అవమానిస్తూ మాట్లాడతారో ఆయనకు తెలుసు.

లిప్తకాలం కళ్లు వ•సుకున్నాడు. లోలోన ఆయనలోని మహావీరుడు యుద్ధ్ద సంసిద్ధ్దమౌతున్నాడు.

‘‘నిన్ను ఆ పొగరుపోతు కవ్వల ఎక్కడికి తీసుకుపోతందో!ఎందుకు తీసుకుపోతదో నాకు తెలవదు. అది దొంగచాటుగా తీసుకుపోతన్నది కాకతీయ మహారాజు గణపతిదేవుడుని అని ఈళ్లు నాకు వచ్చి చెప్పారు. మతిపోయింది. నాకు రాజ్యాలూ వద్దు.. యుద్ధ్దాలూ వద్దు. నాకావాల్సింది అది..అది కావాలి..’’

ఇప్పుడు‘‘శెట్టీ! ఆపు నీ వాచాలత్వం. ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేవిటో నీకు తెలియదు. ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడే నిన్ను ఖండఖండాలుగా నరికి కాకులకు గ్రద్దలకు వేస్తాను. జాగ్రత్త!!’’ గర్జించాడు గణపతిదేవుడు.

పగలబడి నవ్వాడు శెట్టి.

గౌరయ గట్టిగా ఆయనతో గొంతు కలపగా తిమ్మప్ప కూడా ముసిముసిగా నవ్వాడు.

‘‘నిన్ను ఓ ఆడది బంధించి తీసుకుపోతోంది. దానినే ఏమీ చెయ్యలేక పోతున్నావ్‌..అట్టాంటిది దానికి అన్ని సమకూర్చిపెడుతున్న నన్ను ఏమి చేస్తా వ్‌.. ‌నా శక్తియుక్తులు నువ్వే గుర్తించు. దాని కౌగిలి కోసం నిన్ను వదిలేస్తున్నా. లేకపోతే నావాళ్లతో నిన్ను ఇక్కడే పాతేయిస్తా..ఏవనుకున్నవో..!’’ తర్జనితో వెకిలిగా బెదిరించాడు నానప్ప.

అతని మాటలు, శారీరక భాష క్షణక్షణానికి గణపతిదేవునిలో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నాయి.

ముఖ్యంగా కవ్వలను ‘పొగరుబోతు’, ‘అది’ అని.. పేర్కొనడం.. బుల్‌ ‌బుల్‌ ‌పిట్టా అనడం.. అన్నింటిని మించి ‘ల’కార ప్రయోగం చేయడం.

గౌరయ పెద్దగా నవ్వాడు. ‘‘అదంటే మా శెట్టి గారికి మహా ఇది..’’ అన్నాడు.

శెట్టిని సంతోషపరచాలని గౌరయ పవిత్ర ఆశయం.మహారాజు కంటే ఇప్పుడు శెట్టే మహాబలవంతుడిగా వాడికి అర్థ్ధమైంది. కాని రానున్న ముప్పును వాడు గుర్తించలేదు. గుర్తించేలోపే వాడికి జరగరాని అనర్థం అనుభమైంది.

అసహ్యం, అసహనం, అవమానం..లాంటి ఎన్నో నీచపు ధోరణులతో వీళ్లు తనతో ప్రవర్తించడం..ముఖ్యంగా కవ్వలను నీచంగా,అవమానకరంగా మాట్లాడడాన్ని గణపతిదేవుడు వినలేని మాటలతో సంబోధించడం..

శరీరవ•,మనస్సు అవమానంతో నియంత్రణ తప్పాయి. భరించలేని క్రోధంతో దగ్గరున్న పెద్ద బండరాయి ఎత్తి గౌరయ వైపు విసరివేశాడు. అది సరాసరి వెళ్లి వాడి వక్షస్థలాన్ని బలంగా తాకింది. మరుక్షణం దబ్బున పడిపోయాడు.

లిప్తకాలంలో బండరాయిని విసిరిన ఆయన చురుకును, వేగాన్ని చూసి నానప్పశెట్టి, తిమ్మప్ప స్థాణవులైపోయారు.

‘ఆయనను అవమానించి మాట్లాడి తప్పు చేశామేమో’ అని గుర్తించే సరికే అనర్థం జరిగి పోయింది.

క్రోధంతో ఊగిపోతున్న గణపతిదేవుడు పక్కగా పడి ఉన్న ఎండుకర్రను అందుకున్నాడు. దానికి అటూ ఇటూ గల కొమ్మలను, రెమ్మలను విరిచి గొడ్డలి కర్రలా చేశాడు. దాన్ని ఒడుపుగా పట్టుకుని ఓ చెట్టు పైభాగాన్ని బలంగా కొట్టాడు. అది రెండుగా చీలిపోయింది. గట్టి రాయిని తీసుకుని ఆ కర్ర చీలికలో ఉంచి పక్కగా వేలాడుతున్న మర్రిఊడను తెంపి వేగంగా, నైపుణ్యంగా కర్రకు రాతిని గట్టిగా కట్టేశాడు. ఆదిమానవుడు ఉపయోగించుకున్న రాతి గొడ్డలిలా అది కనిపిస్తోంది.

మరుక్షణం దానితో నేలపై పడున్న గౌరయ తలపై ఒక్క వేటు వేశాడు.

అంతే.. ఆ రాతిగొడ్డలి తాపుకు అతని తల నిట్టనిలువునా చీలి పోయినట్లు రక్తం బుడబుడ పొంగింది. ఆతని శరీరం గిలగిలా తన్నుకులాడు తోంది.

నానప్పకు, తిమ్మప్పకు పై ప్రాణాలు పైనే పోయాయి.

మహావీరుడు అనేవాడు ఎలా ఉంటాడో వాళ్లకిప్పుడు అవగతమౌతోంది.

మహారాజులు, సైన్యాధికారులు, మంత్రులు తదితర రాజ్యపాలకులు ఇటీవల వణిజులకు ఇస్తోన్న గౌరవమర్యాదలతో రాజులపై నానప్పకు గౌరవం తగ్గిపోయింది. ఓస్‌ ఇం‌తేనా మహారాజులంటే..! ‘నాకు వంగి నమస్కరిస్తున్నారంటే నేనే వాళ్లకన్నా గొప్పవాడిని’ అనే ఓ అజ్ఞానపుటానందంలో అతడు బతుకుతున్నాడు. రాజవంశ అంతఃపుర కాంతలపై శృంగారమోజు పెంచుకున్నా డంటే ఆ చులకన భావనమే కారణం.

‘మహారాజులను, వారి అంతఃపుర స్త్రీలను ఎవ్వరూ కన్నెత్తి చూడరాదు’ అనేది అప్రకటిత శాసనం. చూస్తే క్షణాల కాలంలో ప్రాణాలు పోతాయని రాజభవన ఉద్యోగులు తదితర వర్గాల వారికి తెలిసిన వాస్తవం.

తన ముందు ఒంటరిగా నిలబడ్డ మహానేతను మరింత అవమానించడమే నానప్పకు ఆనందాన్నిచ్చే అంశం.

అయితే మహానేత ఎందుకు ఇలా తన ముందు నిలబడవలసివచ్చింది? అనే ఉదాత్త ఆలోచన అతనికి రాలేదు.

కానీ.. కానీ.. ఇప్పుడు ఒంటరిగా ఎలాంటి ఆయుధం లేని ఆ మహాయోధుడు నిరాయుధుడై ఒంటరివాడైనా కూడా, ఆమెను అసహ్యకరరీతిలో సంబోధించిన గౌరయను అనే క్రూరుడిని అప్పటికప్పుడు దొరికిన దానితో కేవలం రెండు వ•డు నిమిషాల్లో చంపివేయడాన్ని చూసిన నానప్ప కొయ్య బారిపోయాడు.

తను ఊహించిన దానికంటే గణపతిదేవుడు గొప్పయోధుడు అని తిమ్మప్పకు కూడా తెలిసి వచ్చింది. ముకుళితహస్తుడై మోకాళ్లపై జారిపోయి తలవాల్చి పెద్దపెట్టున ఏడుస్తూ కుమిలిపోతున్నట్లు కూర్చుండిపోయాడు.

ఊహించని పరిణామంతో బిత్తరపోయిన నానప్ప శరీరమంతా గజగజ వణకుతోంది.

గౌరయ శరీరంపై వంగి అతని చావు పరిపూర్తి అయినట్లు నానప్పకు అర్థ్ధమయ్యేలా చెప్పేలా అతని ముక్కు మూశాడు గణపతిదేవుడు. అప్పటివరకు ఊపిరికోసం విలవిలలాడుతున్న వాడి శరీరం అచేతనమయ్యింది.

అనంతరం రాతిగొడ్డలిని మళ్లీ అందుకుని, ఒడుపుగా తిప్పుతూ నానప్ప వంక చూస్తున్నాడు. ఆయన కళ్లు స్థిరంగా తీక్షణంగా చూస్తున్నాయి.

‘‘ఏమిరా..అన్నావ్‌ ‌నీచ వణిజా! ఓ రాచ మహిళను, ఓ అంతఃపుర కాంతను, ఓ దేవగిరిరాజ కుటుంబ స్త్రీని.. ‘అది’ ‘ఇది’ అంటున్నావ్‌. ఎం‌త అహంకారం? ఎంత పొగరు? ఎంత మూర్ఖత్వం? ఎంత నీచం?’’ అంటూనే గొడ్డలిని అతనిపైకి విసిరేశాడు.

అది గిరగిరా తిరుగుతూ వెళ్లి నానప్ప తలను తాకింది. అడవి అదిరి పోయేలా పెనుకేక పెట్టి పడిపోయాడు నానప్ప. తల ఎక్కడ చిట్లిందో తెలియడం లేదు కానీ రక్తం బయటపడి మెల్లమెల్లగా ముఖమంతా పాకుతోంది.

తీవ్రస్థాయికి చేరిన క్రోధంతో వేగంగా వెళ్లి నానప్ప గుండెలపై ఒక్క తన్ను తన్నాడు గణపతిదేవుడు.

‘‘ఏమన్నావ్‌ ‌నన్ను? ఒంటరినా?వెట్టివాడినా?నా గురించి ఇతరులు చెప్పడమే గాని నా గురించి నేనెప్పుడూ చెప్పుకోలేదు. నా గురించి ఏమి చెప్పుకోవాలో నాకు కూడా తెలియదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి తెచ్చావ్‌. ‌నేనేవిటో నేను చెప్పను. చెప్పలేను. కానీ చూపిస్తాను. నిన్ను ప్రాణాలతోనే ఖండఖండాలుగా నరికి కాకులకు, గ్రద్దలకు వేస్తాను. అదంతా నువ్వు చూశాక నీ ప్రశాంతమైన చావు కోసం ముక్కు మూస్తాను..’’ అంటూనే అటూ ఇటూ అంతా వెదకుతున్నట్లు చూశాడు.

ఆయన మాటల్లోని దృఢత్వం, స్థిరత్వం, ఆయన బలంపై ఆయనకున్న నమ్మకాన్ని చెబుతున్నాయి. ఆయనకు కలిగిన తీవ్రమైన స్పందనను ప్రతిఫలిస్తున్న ట్లుగా దీర్ఘశ్వాసతో ఆయన ఎదురొమ్ము ఎగసి ఎగసి పడుతోంది. శరీరమంతా కంపిస్తోంది.

ఈటె దెబ్బతిన్న అడవిపందిలా నానప్ప దొర్లిదొర్లి పెడబొబ్బలు పెడుతున్నాడు. మట్టిలో పొర్లుతూ ఏడుస్తున్నాడు.

ఇదంతా కలా? నిజమా? అన్నట్లు దిమ్మెరబోయిన తిమ్మప్ప ఏడవాలో.. వద్దో తెలియనట్లు వణికి పోతున్నాడు. తలతిప్పి గణపతిదేవుని కదలికలను గమనిస్తున్నాడు.

గొడ్డలి కింద పడేసి పంచెను మోకాలి వరకు పైకెత్తి గోచీ బిగించి కట్టాడు గణపతిదేవుడు. నడుముకున్న ఇనుప రక్షణవలను సరిచేసుకున్నాడు. సాధారణంగా నడబంధానికి కత్తి ఒర ఉంటుంది. రక్షణ వల ఉంది కాని కత్తి ఒర లేదు. తర్వాత ఛాతికున్న ఇనుప కవచాన్ని సరి చేసుకున్నాడు.

యుద్ధ స్కంధావారం నుండి తీసుకురావడంతో ఆయన శిరస్సుకు శిరస్త్రాణం, ఛాతీకి ఇనుప కవచం, నడుముకు నడబంధం,దానికి కత్తి ఒర ఉన్నాయి. శిరస్త్రాణం ఎక్కడ పడిపోయిందో తెలియదు కాని ఛాతీకి కవచం, నడుముకు నడబంధం అలాగే ఉన్నాయి. నిత్యమూ ఆయన కాలకృత్యాలు తీర్చుకునేవేళ వాటిని తీసి మళ్లీ ధరిస్తున్నాడు. ఆయుధం లేకున్నా ఆయన తన శరీరానికున్న రక్షణ వస్తువులను తగు జాగ్రత్తలతోనే కాపాడుకుంటున్నట్లు ఇప్పుడు తిమ్మప్ప గుర్తించాడు.

కవచం సరిచేసున్నాక జుట్టు మొత్తంగా రెండు చేతులతో పట్టి ముడి వేసు కున్నాడు. మళ్లీ గొడ్డలి పట్టుకుని వడివడిగా కదిలి తిమ్మప్ప దగ్గరకు వచ్చాడు.

‘‘ఒరే!! ఏంట్రా నీ పేరు? ఆ.. తిమ్మప్ప కదూ? కదలకుండా అలాగే ఉండాలి. కోతివేషాలు వేశావో, ఇవ్వాళ కొడితే మాసం రోజుల తర్వాత చస్తావ్‌. ‌జాగ్రత్త!! నువ్వు ఉండాలి. వీడు ఈ వెకిలి వణిజుడు నా చేతిలో ఎలా చస్తాడో నువ్వు చూడాలి. ప్రపంచానికి చెప్పాలి కదా..!’’ అంటూ చేతిలోని గొడ్డలితో తిమ్మప చుట్టూ గీత గీశాడు.

‘‘ఇది దాటి ఇవతలకు వచ్చావో..ఆ పంది కంటే దారుణమైన చావు చస్తావ్‌..’’ ‌చూపుడు వేలు కదుపుతూ హెచ్చరించాడు.వణికిపోతున్న తిమ్మప్ప తల ఎత్తకుండానే మరింత ముడుచుకుపోయాడు.

తర్వాత ఆయన ఏదో వెదకుతున్నట్లు చెట్లలోకి మాయమయ్యాడు.

ఇదంతా జరుగుతున్నంత సేపూ నానప్ప అడవి అదిరిపోయేలా పెడబొబ్బలు పెడుతూ నేలపై దొర్లిదొర్లి ఏడుస్తున్నాడు. గంట తర్వాత గణపతిదేవుడు తిరిగి వచ్చేవరకు కూడా నానప్ప అలా రొప్పుతూ రోస్తూ ఏడుస్తూనే ఉన్నాడు.ఆతని ఆక్రందనలను వింటూ గణపతిదేవుడు గీసిన వృత్తంలో ముడుచుకుని కూర్చునున్నాడు తిమ్మప్ప.

ఇప్పుడు గణపతిదేవుడి చేతిలో రెండు మూడు వింతవస్తువులను తిమ్మప్ప గుర్తించాడు. మారణాయుధాల్లాంటివి. సగం విరిగిన తుప్పు పట్టిన ఖడ్గమో, బరిసో..! దంతాల కోసం ఏనుగులను వేటాడే వేటగాళ్లు ఉపయోగించే ఆయుధాలు, పులులను పట్టి చంపి వాటి తోలువలిచే ఆయుధాలు. అడవిలో వేటగాళ్లు ఎప్పుడో వదిలేసి పోయిన ఆయుధాలుగా వాటిని గుర్తించాడు తిమ్మప్ప. సగం విరిగినవి అడవిలో వదలివేయంగా తుప్పెక్కి ఉన్నాయి. తాడిమట్టలకు రెండువైపులా ఉండే రంపం లాంటి నల్లని అంచులు నాలుగైదు కలిపి తయారు చేసినట్లు ఓ దిట్టమైన రంపం లాంటిది.సన్నగా పొడవై దృఢమైన రాతిముక్కలతో చేసిన మొండి చాకులు, వంకర టింకర కర్రలతో చేసిన ఓ ఖడ్గం లాంటిది.రాతిని ఒడుపుగా పగలగొట్టి చేసిన గదలాంటిది.

పదును లేని మొండి మారణాయుధాలతో ఆయన తిరిగి రావడం గుర్తించిన తిమ్మప్ప పై ప్రాణాలు పైనే పోయాయి.

కిరీటం, ఆభరణాలు అలంకరించుకుని బంగారు సింహాసనంపై కూర్చుని వికటాట్టహాసాలతో ఆజ్ఞలు జారీ చేయడమే మహారాజుల కార్యక్రమం అనుకున్నాడు తిమ్మప్ప. కాని అరణ్యమధ్యలోనైనా, సముద్ర గర్భంలోనైనా..ఎక్కడైనా.. యుద్ధతంత్రజ్ఞత, వీరత్వాలతో శత్రువును సవ•లంగా నాశనం చేయగల మహత్తర శక్తియుక్తులున్నవాడే మహారాజుగా రాజ్యమేల గలడని, అలాంటి మహాయోధులకే మహాయోధుడు ఈ గణపతిదేవుడని తిమ్మప్పకు అర్థమైంది.

‘‘ఏమిరా నానప్పా! బతికే ఉన్నావు కదా? ఉంటావని నమ్మి వదలి వెళాను. శత్రువును ఎన్ని రోజుల్లో, ఎలా చంపుతానని ప్రకటించానో..అలాగే చంపుతాను. చెప్పరా తిమ్మప్పా! మీ శెట్టిని ఎలా చంపుతానని ప్రకటించాను?’’ అడిగాడు గణపతిదేవుడు.

అడుగుతూనే తను తెచ్చిన ఆయుధాలను పరీక్షించుకుంటున్నాడు.

తిమ్మప్ప నోరు పెగలడం లేదు. నానప్ప పెడబొబ్బలు ఆగడంలేదు.

తక్షణమే జవాబివ్వని పరిచారకుని వైపు ఒక్క చూపు చూశాడు. తిమ్మప్ప తెప్పరిల్లి, ‘‘అదే మహారాజా! అదే.. ఏదో అన్నారు తమరు..’’ ఆయన మాట ఏదో చెప్పలేక గుర్తురాక సతమతమౌతున్నాడు.

‘‘ఖండఖండాలుగా నరికి కాకులకు, గ్రద్దలకు వేస్తాను అన్నాను. విన్నావు కదా..??’’

‘‘వి..వి..వి.. విన్నాను మహారాజా!అవును అన్నారు.. అన్నారన్నారు..’’

‘‘అదేదో ఇప్పుడు నీకు చూపిస్తాను.. చూడు..’’ అంటూనే నానప్ప దగ్గరగా వెళ్లి రాతిగద లాంటి ఆయుధాన్ని బాగా పైకెత్తి అతని తొడపై ఒక్క దెబ్బ వేశాడు.

అంతే…నానప్ప అరుపు కంటే తిమ్మప్ప పెట్టిన పిచ్చికేకకు అడవి కంపించింది. తిమ్మప్ప స్పందనను ఊహించినట్లు గణపతిదేవుని పెదవులు లిప్తలో వెయ్యో వంతుకాలం చిన్నగా నవ్వినట్లు కదలాడాయి.

ఆ తర్వాత తన కళ్లముందు జరిగిన మారణహోమం చూస్తూ తన ప్రాణాలు ఎందుకు పోలేదా? అని తిమ్మప్ప కుమిలి కుమిలిపోయాడు.

తిమ్మప్ప పరమ క్రూరుడైన గిరిజనుడు. అడవిలోని ఎన్నో జంతువులను చంపిన అనుభవజ్ఞుడు. మనుషుల ప్రాణాలు అలవోకగా తీసేస్తాడు. శరీర భాగాలను ఒక్కటొక్కటిగా విడదీయగలడు. కుక్షి బేధనం చేసి పేగులు తీయగలడు. గర్భిణిని చంపి పసిగుడ్డును అవతలకు విసిరేయగలడు.చనిపోతూ గిలగిల కొట్టుకున్న వాళ్లను ఎందరినో చూశాడు. ఏడుపులు, ఆర్తనాదాలు, వేడికోళ్లు, కన్నీళ్లు అతనిని ఎప్పుడూ కదిలించలేదు.

కాని మనిషి చావకుండానే శరీరాన్ని ఖండఖండాలుగా నరికి ఎముకలను, మాంసాన్ని వేరువేరుగా చేతిలో పట్టేటంత ముద్దలుగా చేసి కాకులకు,గ్రద్దలకు పైకి ఎగరేయడాన్ని అతడెప్పుడూ చూడలేదు.

నానప్ప ప్రాణాలు పోకుండా, ముఖాన్ని ఏ మాత్రం ఛిద్రం చేయకుండా రెండు గంటలు ఉంచి, ఆతని శరీరాన్ని ముక్కలుగా చేస్తుండగా చూడటం తాను చేసుకున్న పాపమని తిమ్మప్పే భావించాడు.

నానప్ప మధ్య మధ్య మూర్చపోయాడు. తిరిగి మేల్కొన్నాడు. తన శరీరం ఖండఖండాలు కావడం అతనికి తెలుస్తోందని తిమ్మప్పకు అనిపిస్తోంది.

నానప్ప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయాయి. ఎవరో పిలిచినట్లు కొన్ని వందల కాకులు, గ్రద్దలు,మరెన్నో చిన్న చిన్న జంతువులు, క్రిమికీటకాలు అక్కడికి వచ్చి వాలాయి. వాటికి తిన్నంత తిండి,తాగినంత రక్తం..

నానప్ప శరీరభాగాలను అవి తినడాన్ని తృప్తిగా చూసుకున్న గణపతిదేవుడు దగ్గరలోని కాలువలో ఒళ్లు కడుక్కుని వచ్చాడు.

ప్రశాంతంగా మారిన గణపతిదేవుడు, ‘‘‘తిమ్మప్పా!ఆకలవుతోంది. తినడానికి ఏవైనా పళ్లు దొరుకుతాయేమో తెచ్చి పెట్టు..’’ అడిగాడు.

ముడుచుకుపోయి కూర్చున్న తిమ్మప్ప కదిలాడు కానీ లేవలేదు.

తిమ్మప్ప తాను గీచిన వృత్తంలోనే ఇంకా ఉండటాన్ని గమనించాడు. గణపతిదేవుడు. .

అప్రయత్నంగా ఆయన ముఖంలో ప్రసన్నత పొటమరించింది.

‘‘భళి.. లే.. లేచి వెళ్లు..’’ అన్నాడు మృదువుగా, ఆజ్ఞాపిస్తున్నట్లుగా.

మరో అరగంట తర్వాత ఆయన పళ్లు తింటుండగా తిమ్మప్ప తలవంచుకుని నిలబడి ఉన్నాడు. దగ్గరగా కాకులు, గ్రద్దలు నానప్ప శరీరాన్ని తింటూ చేస్తోన్న గోల ఇంకా సద్దుమణగలేదు.

కడుపునిండా పళ్లు తిన్న గణపతిదేవుడు తృప్తిగా త్రేన్చి కదులుతూ, ‘‘ఊ.. తదుపరి కార్యక్రమం??’’ అడిగాడు.

తిమ్మప్ప వెంటనే ఏమీ అనలేదు. కాసేపటి తర్వాత ‘‘మన రాజ్యాలకు వెళ్లిపోదాం మహారాజా..’’ అన్నాడు.

విన్నాడు కాని వెంటనే జవాబివ్వలేదు గణపతిదేవుడు.

మరి కాసేపు ఆలోచిస్తున్నట్లు నిశ్శబ్దంగా ఉండి తర్వాత తన ఆలోచన చెప్పాడు.

* * *

పిచ్చెక్కినట్లు తిరుగుతోంది బాల కవ్వల.

ఐదు రోజులయ్యింది గణపతిదేవుడు మాయమై..

ఆ రోజు ప్రభాతాన్నే కవ్వల నిద్ర లేచి ఎప్పటిలాగే గణపతిదేవుడు నిద్రించే గుడారం వైపు చూసింది.

అక్కడ ఏమీ కనపడలేదు. గుడారం లేదు. గణపతిదేవుడు, తిమ్మప్ప, గౌరయ… ముగ్గురూ మాయం!! ఉలిక్కిపడి అక్కడికి పరిగెత్తింది.

వాళ్ల బట్టలున్న వ•టలు,వారి మరికొన్ని వస్తువులు, వంట సామాగ్రి ఉన్న పెరికలు పడి కన్పించాయి.

ఆమె పెనుకేకలు పెట్టింది.ఆమె రాక్షస బృందం లేచి పరుగు పరుగున వచ్చింది.

‘‘బందీ మహారాజు కనిపించడం లేదు. తిమ్మప్ప, గౌరయ కూడా కనిపించడం లేదు. ముగ్గురూ కూడబలుక్కుని మాయమయ్యరా? ఏమయ్యారు? ఏమి జరిగింది? మీకు తెలుసా?’’

అరణ్యమంతా వినిపించేలా అరుస్తోంది.. పిచ్చెక్కినట్లు అటూ ఇటూ పరుగులు పెడుతోంది.

వాళ్లంతా అయోమయంగా వెర్రి చూపులు చూస్తున్నారు కానీ ఏమీ మాట్లాబ డలేక•పోతున్నారు. ఆ ముగ్గురూ ఎలా మాయమయ్యారో వాళ్లకు కూడా అవగతమవడం లేదు.

కవ్వల కళ్లు నిప్పులు కక్కుతున్నాయి. ఇంత•టి తన ప్రయత్నానికి హఠాత్తుగా దెబ్బ తగిలిందే! ఎవరో కాకతీయ మహాయోధులు, మహాప్రధానులు, సర్వసైన్యా ధ్యక్షులు, ఆ రుద్రమదేవి వచ్చి రహస్యంగా వాడిని తరలించుకుపోయారా? అది సాధ్యమేనా? డఅయితే ఆ ఇద్దరూ ఏమైనట్లు? వాళ్లను చంపి ఆయనను తీసుకుపోవాలి. మరి వాళ్ల శవాలు ఏవి?వాళ్లూ ఆయనతో కుమ్మక్కయ్యారా? ముగ్గురూ కలిసే మాయమయ్యారా?…

ఆలోచనలు తెగడం లేదు.

కాసేపటికి ఉద్వేగం తగ్గింది. ఏది ఏమైనా ఆయన చిక్కినట్లే చిక్కి జారి పోయాడు. వదలకూడదు. తన బృహత్ప్రయత్నం నిష్ఫలం కాకూడదు.వాడిని తిరిగి చేజిక్కించుకోవాలి. వాడిని చంపి తన అక్క ఆత్మకు శాంతి కలిగించాలి.. అందుకే తన బతుకు.తన ఒకే ఒక్క ఆశయం, తన ఏకైక ధ్యేయం అదే.

కాకతీయ రాజ్య యుద్ధతంత్రజ్ఞులు ఎంత ప్రతిభావంతులైనా.. ఈ కీకార ణ్యంలో యుద్ధపటాలాలు, గూఢచారులు ఇక్కడిదాకా రావడం కష్టం. జరిగేపని కాదు.

అప్పుడు గుర్తొచ్చాడు నానప్పశెట్టి. చివ్వున లేచి నిలుచుంది. ‘‘నానప్పశెట్టి వచ్చాడా ఇక్కడికి?’’ గట్టిన ఉరిమినట్లు అరచి అడిగింది వాళ్లను.

వాళ్లు మళ్లీ అయోమయంగా చూశారు.వాళ్లకు ప్రపంచజ్ఞానం లేదు. రాజ్యాలు తెలుసు.. మహారాజులు తెలుసు. సైన్యం తెలుసు. యుద్ధాలు, పోరాటాలు, చంపుకోవడాలు తెలుసు కానీ కుట్రలు కుతంత్రాలు తెలియవు. యుద్ధాలలో పాల్గొనడం, ఎవరిని చంపాలో చెబితే వాళ్లను చంపడానికి శాయశక్తులా పోరా డటం మాత్రమే వాళ్లకు తెలుసు. వజ్రాలు, వైఢ్యూలు, రాజ్యాలు భూములు వాళ్లకు అక్కరలేదు. అవన్నీ వాళ్లకు దొరకవచ్చు. కానీ వేళకు అన్నం దొరకదు. ఒంటికి ఇంత బట్ట దొరకదు. అవి ఇస్తే చాలు. ఎవరినైనా చంపడా నికి ఆ పోరాటంలో చావడానికి సిద్ధ్దమైన జీవితాలు వాళ్లవి.

ఎవరో నానప్పశెట్టికి వాళ్లను అప్పగించాడు. ఆయన కవ్వలకు అప్పగించి ఆమెతో వెళ్లాలని,ఆమె చంసమన్న వాళ్లను చంపాలని చెప్పాడు. అంతే.. ఆమె చెప్పినట్లు చేస్తూ ఆమె వెంట పయనిస్తున్నారు.

తిమ్మప్ప, గౌరయ ఆ బృందంతో ఉన్నా వాళ్లిద్దరూ నానప్పశెట్టి మనుషులు.

ఆమె ఆలోచనలు తిరిగి తిరిగి నానప్పశెట్టి వద్దే ఆగిపోతున్నాయి.

ఏమైనా చేయడానికి అవకాశం ఉన్నవాడు నానప్పశెట్టి మాత్రమే అనే నిర్ధారణకు వచ్చింది కవ్వల. వాడు తనను చూసి చొంగ కార్చు కుంటున్నాడని గుర్తించింది కాని దేవగిరి రాజ్య సేనానులంటే వాడికి భయమని.అందుకే అడిగినవన్నీ సమకూర్చాడని సరిగానే గుర్తించింది కానీ వాడు కుటిల మనస్కుడు అని, తన బందీగా ఉన్నది కాకతీయరాజ్య ప్రభువు అని తెలిస్తే వాడు పరిస్థితిని తనకు లాభదాయకంగా మార్చుకోగలడు అని ఇప్పుడు గుర్తించింది. గణపతిదేవుని నానప్ప తన నియంత్రణలోకి తీసుకుంటే జరిగే అనర్థాలు ఎంత దారుణంగా ఉంటాయో ఆమెకు అవగతమైంది.జరిగే పరిణా మాలు ఊహిస్తే వణుకు పుడుతోంది.

కాకతీయ మహాసైన్యం, నానప్ప ఏమైపోతారో కానీ ఆమెకు తన పగ మాత్రమే ముఖ్యం..

About Author

By editor