‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన


తన స్థాయి ఏమిటో.. వ్యక్తిగతంగా తన బలిష్టత ఏమిటో గణపతిదేవ మహారాజుకు తెలుసు. తన రాజ్యం.. దాని సైనికశక్తి.. మహావీరులైన తన మండలేశ్వరులు.. కుశాగ్రబుద్దులయిన ప్రధానులు, తిమ్మినిబమ్మిని చేయగల సంధి విగ్రహులు, చెప్పింది చెప్పినట్లు నిర్వహించగల మంత్రులు, అద్భుతమైన గూఢచారి వ్యవస్థ.. ఇలా ఏ అంశం తీసుకున్నా అది అత్యంత పరిణితి చెందిన స్థాయిలోనే ఉంది గాని ఇలాంటి పిల్లచేష్టలకు భయపడిపోయేంత బేలగా లేదు.

అవన్నీ ఒకెత్తు. తన వారసులు..ముఖ్యంగా రుద్రమ ఒక్కటి చాలు ఈ పిచ్చి బాలకవ్వల ఆట కట్టించడానికి.

కాని.. తనే ఈమె పగను గుర్తించాడు.. గౌరవిం చాడు.. తలవొగ్గాడు. కాబట్టే ఆమె, ఆమె బృందం నడిపిస్తే నడిచాడు. మోస్తే పల్లకిలో కూర్చున్నాడు. ఆమె చంపుతాను అంటే శిరస్సు వాల్చి నిలబడ్డాడు. ఇక్కడ కాదు అక్కడ ఆ కోష్టాగారం వద్ద అంటే సరే వెళదాం పదండి.. మీ ఇష్టం అక్కడే చంపండి.. అంటూ మౌనంగా వాళ్లకు సహకరిస్తూ ఇక్కడికి వచ్చాడు. అన్నిటికి స్ధిం.

 ‘నా ప్రియసఖి.. నా కవ్వలా.. నీ మరణం నన్ను ఎంత దుఃఖపెడుతుందో.. నాకు తప్ప ఎవరికీ తెలియదు. తెలియడం కూడా నేను అంగీకరించను. అది కూడా మనిద్దరి మధ్యనే ఉండాలి. కానీ కాని.. నీ తోడబుట్టిన ఈ బాలకవ్వల పగ చూస్తుంటే ముచ్చటేస్తుంది. పాపం..అమెది నాకంటే పెద్ద దుఃఖంలా గుర్తించాను. అందుకే బలి కోసం వెళ్లే మేకలా ఆమె వెంటే నడిచాను. నా దుఃఖానికి ఉపశమనం లేకపోవచ్చు.. వద్దు కూడా. బాల దుఃఖానికి ఉపశమనం నా మరణమే అయితే.. కవ్వలా! నేను ఆనందంగా చనిపోవడానికి స్ధిం! నన్ను అర్థం అర్ధం చేసుకుంటావు కదూ..’

‘‘లోపలోకి పద..’’ కవ్వల గర్జన వినిపించి ఆలోచన ఆగింది.

కాని విచిత్రమైన ఆనందం పెదవులపై మాయం కావడం లేదు ఆ మహా ప్రేమికుడు గణపతిదేవునికి!

* * *

పగ.. పగ.. పగ.. దాని శక్తి బలీయం. ఊహాతీతమైన బలం ఏదో ఆ పగలో ఉంటుంది.

కాని దానిని ఛేదించాలన్న పట్టుదల కూడా అంతే బలమైనదేమో..

బాలకవ్వల బృందం వ•డు నెలల్లో దేవగిరి చేరితే ఆమె వెనకనే అంతే వేగంగా వచ్చి దేవగిరి చేరింది రుద్రమ బృందం. మహా మండ లేశ్వరుని రహస్యంగా తర లించడం కవ్వల బృందం చేస్తే, మహిళ అయిన తన గురించి, కాకతీయ గణపతిదేవుడు బందీ అయి అదృశ్యమైన సంగతి ఎవ్వరికీ తెలియకుండా ప్రయాణించడం కూడా రుద్రమ బృందానికి సవాలు వంటిదే.

దేవగిరి చేరిన కవ్వల బృందం మహారాజు పరోక్ష సహకారంతో గణపతి దేవుని శిథి•లకోష్టాగారం వద్దకు చేర్చగలిగింది. కాని రుద్రమదేవి లోపలికి వెళ్లడానికి పాలకుల సహకారం లభించదు.

రుద్రమ అడిగేది లేదు సింఘణదేవుడు సహకరించేదీ లేదు.

బెలగావి నుండి దేవగిరికి బయలుదేరు తున్నప్పుడే రుద్రమదేవి ముగ్గురికి లేఖలు పంపింది.

ఒకటి మహాప్రధాని శివదేవయ్యకు. అవతల యుద్ధం జరుగుతున్న తరుణంలో రాజ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా చూసుకోవాలని కోరింది.

మరొకటి ఆమె భర్త వీరభద్రునికి. ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా చూడవలసినది అని..

వ•డవ లేఖ ఆమె తల్లి సోమలదేవికి రాసింది.

‘‘తల్లీ.. మనం అనుకున్నట్లు బాలకవ్వల నేనూ ఎదురెదురయ్యాం. ఆ ఏకవీరా దేవి, ఆ కాకతమ్మ దీవెనల వల్ల నేను ఆమె సమస్యను పరిష్కరించ గలను. కానీ దీనికి ముగింపు పలకాల్సింది నువ్వే. ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు మరొకలేఖ పంపుతాను. తదనుగుణంగా నువ్వు నేను చెప్పినచోటుకి రావలసి ఉంటుంది.’’

కాకతీయ సైనిక వీరులు ఎవ్వరికి రుద్రమ ఏమీ చెప్పలేదు. అంతా త్రిముఖ యుద్ధాలలో ఉన్నారు.

ఆమె జరిగింది మొత్తం చెప్పింది ఒకే ఒక్కరికి.

పృద్వీశెట్టి అంకాలకు మాత్రమే. ఆయన సహకారంతో, ఆయన సూచించిన వణిజుల గృహాలలో బస చేస్తూ.. ముందుకు కదులుతూ.. దేవగిరి చేరింది.

కానీ ఇప్పుడు ఇక్కడ అసలు సిసలు సమస్య ఎదురయ్యింది.

కోటలోకి ఎలా ప్రవేశించాలి? ఆ కవ్వల ఇప్పటికే శిథి•ల కోష్టాగారం చేరింది.

సమయంలేదు. క్షణక్షణానికి తండ్రి భవితవ్యం ప్రశ్నార్థకం అవుతోంది. రుద్రమ, ఆమె అంగరక్షకులు, ఆమెకు సహాయంగా వచ్చిన కొందరు వణిజులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు కాని మార్గం తోచడం లేదు. దేవగిరి ప్రధాన సమయసెట్టి బాపయశెట్టి అంకాలకు మిత్రుడే కాని అతడు అప్పటికే బాల కవ్వలాబాయి అనుచరుడుగా గుర్తింపు పొందినవాడు.

రుద్రమ, ఆమె బృందం చేతులు పిసుక్కుంటూ కోట పరిసర ప్రాంతాలలో తిరుగాడుతున్నారు. తెలిసింది ఏమిటంటే సింఘణ దేవుడు కోటలో లేడు. కాశీ యాత్రకు కుటుంబ సమేతంగా వెళ్లాడట. ఆయన తమ్ముళ్లు వాళ్ల కుటుంబాలు కూడా ఎవ్వరూ రాజప్రాసాదంలో లేరు.

సమయానికి అంతా మాయమవడం రుద్రమకు ఆశ్చర్యం కలిగించలేదు. కవ్వలకు చేయాల్సిన సహాయం చేశారు. మేనకోడలుగా తను వచ్చి సహాయం కోరితే వచ్చే ఇబ్బంది గుర్తించి ముందే తప్పుకున్నారన్నమాట.

అసలు వాళ్లను అడిగే ఉద్దేశ్యమే లేని రుద్రమ.. భారం ఏకవీరాదేవి అమ్మ వారిపై వేసి కోట ముందు భాగంలో మండుటెండలో తిరుగాడుతోంది. ఆమెకు కవచంలా దూరదూరంగా లెంకలు..

అనూహ్యంగా ఆమెకు బాసటగా ఓ బృందం ముందుకు వచ్చింది.

అది బిచ్చగాళ్ల బృందం.

* * *

వ•డురోజులుగా బాలకవ్వల గణపతిదేవుని ఏమీ చెయ్యలేదు.

ఆమె ఏమి చేసినా ఆహ్వానిస్తూ.. అన్నిటికి గణపతిదేవుడు పూర్తిగా స్ధ్దిమై ఉన్నాడు.

భార్యలు, పిల్లలు, ప్రజలు, రాజప్రాసాదం, నియోగాలు, మిత్రులు, తెలుగు భాష, తిక్కనా మాత్యుడు, ఆంధ్రజాతి.. అన్ని.. ఇప్పుడాయనకు ఏమీ లేవు.

మనసంతా ఓ ఖాళీ.. నిరాసక్తత.. బహుశా తను లేకపోయినా కాకతీయ రాజ్యానికి వచ్చిన సమస్య ఏమీలేదన్న భరోసా ఏదో మనసు వ•లల్లో ఉన్నదేమో. అన్నింటిని వదిలేసి కేవలం మరణాన్ని ఆహ్వానిస్తూ ప్రశాంతంగా ఉన్నాడు.

కేవలం కవ్వల స్మరణ మాత్రమే.

మనసు! పెదవులు జపిస్తున్నది.. ‘‘కవ్వలా.. కవ్వలా..’’

కవ్వల ఆమె బృందం..దాదాపు యాభై మంది ఉంటారు. అంతా కిరాతకులు. ఏ దుర్మార్గానికయినా స్ధ్దిపడినవాళ్లను ఏరికోరి తన బృందంగా ఏర్పాటు చేసు కుంది. దేవగిరి వస్తున్నప్పుడు మధ్యలో అనేకమంది మారారు కాని అందరూ దుర్మార్గ మనస్తత్వం ఉన్నవాళ్లే. మరాఠీ వణిజుల సహాయం తోనే ఆమె కార్య కలాపాలు నిర్వహిస్తోంది. వణిజుల సైన్యం అంతా సాంప్రదాయ య్ధు యోధులే కానీ కిరాతకులు కాదు.

అందుకే వాళ్లను మార్చేసింది. ప్రస్తుతం ఉన్న వాళ్లంతా కిరాతక వ•క.

ఇక్కడికి వచ్చిన వ•డురోజులుగా కవ్వల కొంత విశ్రాంతిగా..అంటే ప్రధాన ఘట్టం పూర్తయినట్లుగా ఇక పతాక ఘట్టమే మిగిలింది కాబట్టి.. అందుకు తొట్రుపడకుండా స్థిత ప్రజ్ఞతతో కొంత సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. గణపతిదేవునికి, బాలకవ్వలకు, వెంట వచ్చినవాళ్లకు కూడా రాజప్రాసాదపు వంటశాల నుండే ఆహారం వస్తోంది. సాధారణ కోట రక్షణభటులు, గస్తీ భటులు కూడా ఎవ్వరూ అటువైపు రావడంలేదు. దగ్గరగా ఉన్నది కారాగారం మాత్రమే. దాని వెనుక వైపున్న శిథి•ల భవనమే ఈ కోష్టాగారం. అందువల్ల కూడా పూర్తిగా కోటలో ఓ నిర్మానుష్య ప్రదేశంగా దీనిని చెప్పుకోవాలి.

అది ఒకరకంగా బాలకవ్వలకు అనుకూలంగా ఉంది.

ఆమెకు సింఘణ సహకారం ఉండబట్టే ఎవ్వరూ ఇటు రావడం లేదని గణపతిదేవుడు గుర్తించినా ఆయనకు సింఘణపై తొలి నుండి ఉన్న సందేహం బలపడింది కానీ పెద్దగా స్పందించలేదు.

‘కాసేపటికి చచ్చేవాడికి ఆసక్తులు ఏముంటాయి.’

నాలుగవ రోజున ఊహించని సంఘటనలు జరిగాయి.

కవ్వల బృందం కవ్వల తల్లిదండ్రులను.. మానసికస్థితి సరిగా లేక దేవగిరి కోటలోని రాజనగరిలో వైద్యుల సంరక్షణలో ఉన్న వాళ్లిద్దరిని అక్కడికి తీసుకు వచ్చారు. వారు గణపతిదేవుని చూశారు కాని గుర్తుపట్టలేదు. బాల కవ్వల మాత్రం రెచ్చిపోయింది.

‘‘చూశావా దుర్మార్గుడా..! నీ వల్లనే నా తల్లిదండ్రులు ఇలా పిచ్చివాళ్లయ్యారు. ఇలా నలభె ఏళ్లుగా.. ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఏదో వాళ్ల లోకంలో వాళ్లున్నారు. మహారాజు సింఘణదేవులవారు అన్నీ భరించి వీరిద్దరిని ప్రేమతో రాజనగరిలోనే ఉంచి వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. నువ్వేమో నా అక్కను చంపి సోమలను పెళ్లిచేసుకుని.. ఆవిడ చాలక మళ్లీ ఇద్దరిని పెళ్లాడావ్‌. ఒకరిని చంపేశావ్‌. ఇద్దరు పెళ్లాలతో కులుకుతున్నావ్‌. ‌మా బాధలు ఎన్నడైనా తెలుసు కున్నావా? లేదే.. ద్రోహి నిన్ను ఏమి చేసినా పాపం లేదురా..’’ ఉద్రేకంతో ఊగిపోయింది.

గణపతిదేవుడు వారిద్దరిని చూశాక పశ్చాత్తాప ధోరణిలో వంగి వారి పాదాలను స్పృశించాడు. క్షమించమన్నట్లుగా వారి పాదాల వద్ద కూలబడ్డాడు. ఆయన చేసిన ఈ చర్యకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోగా కవ్వల తండ్రి కూడా అక్కడే గణపతి దేవుని ముందు కూర్చుండి ఆయన ముఖాన్ని స్పృశిస్తూ ఆయనకు దండాలు పెట్టసాగాడు. అందరూ విభ్రాంతిగా చూస్తుండగా ఆయన గణపతిదేవుని కాళ్లకు మొక్కసాగాడు. భర్తను చూసి కవ్వల తల్లి కూడా యాం త్రికంగా గణపతిదేవునికి కాళ్లకు మొక్కసాగింది.

కవ్వల అచేతనురాలైపోయింది. లిప్తల కాలంలో తేరుకుని తల్లిదండ్రులను పక్కకు లాగింది.

‘‘ఎంత నీచుడివిరా! నా తల్లిదండ్రులతోనే దండాలు పెట్టించుకున్నావంటే.. నిన్ను వదల కూడదు. నిన్నిప్పుడే పొడిచి పారేస్తా.. నరికేస్తా..’’

అరుస్తూ స్ధిం చేసుకున్న ఖడ్గాన్ని చేతపట్టింది. రెండు చేతులలో ఎత్తి పట్టింది.

అనుచరులు ఆమె తల్లిదండ్రులను ప్రక్కకు లాగి ఆమె మరింత దూకుడుగా ఆయన పైకి వెళ్లడానికి సహాయపడుతున్నారు.

అప్పుడొక ఊహాతీతమైన.. ఎవ్వరూ ఊహించని వ్యక్తి ప్రవేశించింది.

‘‘ఆగు కవ్వలా.. ఆగాగు..’’

పరుగుపరుగునా అక్కడికి వచ్చిపడింది ఆమె.

ఆమె సోమలదేవి. కాకతీయ రాజ్య పట్టమహిషి. దేవగిరిరాజ్య మహానేత జైత్రపాల మహారాజుగారి ఏకైక కుమార్తె. ప్రస్తుత పాలకుడు సింఘణదేవుని ఆత్మీయ చెల్లెలు.

‘‘నువ్వు చేస్తోంది తప్పు. పాపం, దారుణం. నా భర్త అమాయకుడు. ఆ మహామనిషికి సమస్త రాజ్యాలూ చేతులెత్తి నమస్కరిస్తుంటే నువ్వు తెలిసీ తెలియక అక్క కవ్వల మరణానికి ఆయనను బాధ్యుడిని చేస్తావా? తప్పు. క్షమించరాని నేరం.’’

ఆమె గొంతు వణికిపోతోంది. ఈ సంగతి ఇటీవలే తెలిసినట్లు భరించరాని బాధతో పరుగు పరుగున వచ్చిపడినట్లుంది సోమల శారీరక భాష.

అప్పుడు అక్కడ సోమలను చూడటం బాలకవ్వల కూడా ఊహించలేనట్లుంది.

‘‘నువ్వా సోమలా! ఎలా వచ్చావ్‌? ఎం‌దు కొచ్చావ్‌? ‌కాస్త ఆగి వస్తే నీ మొగుడి శరీరభాగాలు వ•టకట్టి ఇచ్చే దానిని. తీసుకుపోయి సహగమనం చేసుకునేదానివి. రేయ్‌.. ‌దీన్ని బంధించండిరా.. పెడరెక్కలు విరిచి కట్టేయండి. మరి వాగకుండా వ•తికి గుడ్డ చుట్టండి. మహాపతివ్రత.. నాకు నీతులు చెబు తోంది. ఈమె మొగుడొక వీరుడట. చూడు నీ మొగుడుని ఎక్కడో బెలగావిలో బంధించి వ•డు నెలలు ఎవ్వరికి తెలియకుండా ప్రయాణించి ఇక్కడకి తెచ్చి బంధించాను. ఎవ్వరూ.. ఒక్కరు కూడా రాలేదే. నీ సైన్యం..మీ కాకతీయ వీరులు ఏరి? పెద్ద ప్రగల్భాలు పలికింది నీ కూతురు. ఎక్కడ? హహ్హహ.. హహ్హహ్హహ..’’ వికటాట్టహాసాలు చేస్తోంది.

కిరాతకులు సోమలను గట్టిగా పట్టుకుని ఓ కుడ్యానికి కట్టారు. ఆమె నోటికి గుడ్డ చుట్టబోతుండగా విదిలించుకుంటూ…

‘‘నా కూతురు రుద్రమ నాకు లేఖ రాస్తేనే నేను పరుగున వచ్చాను.. మరి కొద్ది..’’ ఆపై ఆమె మాట్లాడలేకపోయింది. నోటిని గుడ్డతో వ•సేశారు.

‘‘వస్తోందా.. రమ్మను. దాన్ని అక్కడే బెలగావి లోనే చంపేద్దామనుకున్నాను. కానీ దాని తండ్రి చావు దాని కళ్లతో చూడాలని వదిలేశాను. అది ఇక్కడకు వస్తుందని తెలుసు. దాని కోసమే ఇంతసేపూ ఆగాను. కానీ నిన్ను పంపింది. దాని బదులు నిన్నూ, ఆ నీచుడ్ని.. ఇద్దరిని కలిపి చంపేస్తాను. రేయ్‌.. ‌మంచి ఖడ్గాన్ని ఇవ్వండి..’’

అప్పుడు కలగజేసుకున్నాడు గణపతిదేవుడు.

‘‘ఒక్క మాట బాలకవ్వలా! తప్పు నాది. నేను అందుకు అంగీకరిస్తున్నాను. సోమల ఏమి పాపం చేసింది?దయచేసి నన్ను చంపేయ్‌. ‌కానీ ఆమెను వదిలేయ్‌.. ‌నీకు పుణ్యముంటుంది..’’

‘‘నువ్వు నోర్ముయ్‌.’’ ‌భవనం మారుమోగేలా అరిచింది బాలకవ్వల.

‘‘వ•డునెలలుగా నోరెత్తని వాడివి.. పెళ్లాన్ని చూసుకున్నాక నోరు లేస్తోందే.. ఒరే. వాడి నోటికి కూడా గుడ్డ కట్టండిరా..’’

నోటికి గుడ్డకడుతుండగా ఆయన అక్కడున్న పల్యంకంలో కూలబడ్డాడు. ఇద్దరు ముగ్గురు అనుచరులు ఆయన నోటికి కూడా ఓ గుడ్డ కట్టబోయారు. అప్పుడు అనుకోకుండా ఆయన కూర్చున్న పల్యంకం ప్రక్కనున్న వస్త్రం తొలగిపోయి ఆయన చేతికి అందే దగ్గరలో ఓ పెద్ద ఖడ్గం ఉండటం అందరికి కనపడింది.

అది చూసి అందరూ నిర్ఘాంతపోయారు.

అది ఉన్న విధానం చూస్తే.. అంటే ఆ పల్యంకంలో కూర్చున్నవారు ఎవరైనా.. వారికి అందేటంత ప్రణాళికతో అక్కడ ఆ ఖడ్గం ఉంది.

అది చూసిన వారెవరికైనా వెంటనే అర్థ•ం అవుతుంది. అది కావాలని ముందు జాగ్రత్తగా అక్కడ ఉంచారని..

అర్థ•ం కాగానే పెద్దగా అరిచింది కవ్వల.

‘‘ఇక్కడేవరో ఉన్నారు. ఎవడ్రా.. ఈ కాకతీయం గాడికి సహకరిస్తోంది? ఎవడు వాడు.. ధైర్యముంటే నా ముందు కు రారా..’’ ఆగింది.

లిప్తకాలం ఆలోచించింది. అది రుద్రమ పనే కావచ్చుననిపించింది.

‘‘వసే రుద్రమా! వచ్చావా? వస్తే ఎదురుగా రావాలి. దొంగ యుద్ధాలు అర్థ•ం నేను సహించను. నిన్ను నీ అమ్మాబాబులతో కలిపి చంపేస్తాను. లేదా వాళ్లను చంపి ఆ శరీర భాగాలు నీ చేతిలో పెడతాను. రా రా.. నా ముందుకు రా..’’

రెండు చేతులతో ఖడ్గం పట్టుకుని తిప్పుతూ తీవ్రంగా అరుస్తోంది.

గణపతిదేవుడు పల్యంకంలో కూర్చుని ఉండగా సోమలదేవి ఓ కుడ్యానికి కట్టబడి ఉంది.

ఉన్నట్టుండి ఎక్కడినుండో ఓ బల్లెం దూసుకు వచ్చింది. అది వచ్చి వచ్చి ఆమె అనుచరుల్లో ఓ కిరాతకుడికి బలంగా గుచ్చుకుంది. వాడు హాహాకారాలు చేస్తూ గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు.

అంతా స్థాణువులై నిలబడిపోయారు. ముఖ్యంగా కిరాతకులు బెదిరిపోయారు. అప్రమత్తమై యుద్ధ భంగిమలతో అన్నివైపులా చూస్తూ చురుగ్గా కత్తులు తిప్పుతున్నారు.

అందరి చూపు ఇప్పుడా భవంతిలోని వస్తువులపై పడింది. అది ఎన్నో ఏళ్లుగా వాడుకలోలేని భవనం. అది ప్రధాన మందిరమైతే..లోలోపల మందిరాలు చాలా ఉన్నాయి. అన్నిటా నిండుగా దుస్తులు. కానీ అన్నీ వాడుకలో లేనివి కావడం వల్ల పట్టుకుంటే చిరిగిపోయే వస్త్రాలు, దుప్పట్లు, శాలువలు, మగవారి రాజోచిత దుస్తులు, రాజకుటుంబ మహిళల కోకలు, రవికెలు, కంచుకాలు, వలిపెములు, లోదుస్తులు, ద్వారాలంకరణ బట్టలు..అన్ని గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మధ్య మధ్య కొన్ని విరిగిన పల్యంకాలు, చెక్క బల్లలు లాంటివి కూడా ఉన్నాయి. అన్ని అడ్డదిడ్డంగా నడవడానికి వీలులేకుండా ఉన్నాయి. పై కప్పు చాలా ఎత్తులో ఉంది. పైకి చూస్తే అంతా బూజు పట్టి గబ్బిలాల్లాంటి జీవులు కదలాడుతున్నాయి.

అందరికి అర్థ్ధమైంది ఒక్కటే.

కవ్వల చ•నిపోయినప్పటి నుంచి ఇది వాడుకలో లేదు. అంటే నలభై ఏళ్లుగా పూర్తిగా పాడుపెట్టారు. ఎవ్వరూ దీనిలోకి రావడం లేదని అర్థ•ం అవుతోంది. ఏది ముట్టుకున్నా దుమ్ము రేగుతోంది. మురికి వాసన. దగ్గరిలోని కారాగారం నుండి దుర్గంధం..

అయితే ఆ బల్లెం ఎక్కడి నుండి ఎలా వచ్చింది??

అందరూ పైకి చూశారు. గోడలకు సహజంగా ఏర్పడ్డ పగుళ్లు. అక్కడక్కడా రంధ్రాలు.. ఓ పగులు నుండి ఆ బల్లెం వచ్చినట్లుగా అందరికి అర్థ•ం అయ్యింది.

కవ్వల గుర్తించింది ఏమిటంటే గణపతిదేవుని అనుకూల శక్తులు ఇక్కడ ఉన్నాయి. అవి క్షణక్షణానికి బలం పుంజుకుంటున్నాయి.

బహుశా రుద్రమ తన కంటే ముందే ఇక్కడికి వచ్చేసి తనపై ఆయుధాలను, సిద్ధం చేసింది. చివ్వున కదిలింది. ‘‘రేయ్‌ ‌ముందు నిన్ను చంపేస్తా..’’ అంటూ ఖడ్గం తిప్పసాగింది.

ఆమె వెంట కదలుతున్నారు కిరాతకులు.

అప్పుడు మళ్లీ మరో చురక వేగంగా వచ్చి ఓ కిరాతకుడ్ని తాకింది. వాడు కింద పడేలోగా కవ్వల అతనిపై నుండి ఎగిరి గణపతిదేవుని వైపు దూకింది. అప్పుడు మరో ఖడ్గం వచ్చి ఆమెను తాకింది కాని అప్పుడే ఆమె పక్కనున్న కిరా తకుడుని తాకడంతో ఇద్దరూ ప్రక్కకు పడిపోయారు. ఖడ్గం ఎవ్వరినీ తాకకుండా నేలపై పడిపోయింది. అప్పుడే మరో బాకు వచ్చి గణపతిదేవునికి దగ్గరగా నిల బడిన కిరాతకుడి చేతిని తాకింది.

చేయి సగం తెగిపోయింది. మరో వైపు నుండి మరో ఆయుధం.. ఇంకో వైపు నుండి ఇంకో ఆయుధం!

గణపతిదేవుని దగ్గరగా వెళితే చాలు ఏదో ఆయుధం దూసుకువస్తోంది. ఆయన దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్లలేనట్లు.. ఆయనను రక్షించడానికి.. ఆయుధాలను అమర్చినతీరు చూస్తుంటే అందరికీ• మతిపోతోంది.

అందరిలో భయకంపనాలు మొదలయ్యాయి. గణపతిదేవుడు నిమ్మకు నీరెత్తి నట్లు కళ్లు వ•స్తూ తెరుస్తూ మౌనంగా ఉండగా, సోమలదేవి అన్నీ చూస్తూ భర్తను చంపడానికి చేస్తున్న యత్నాలకు బెంబేలెత్తిపోతోంది.

ఆయనను ఇక్కడికి తీసుకువచ్చి చంపడం అనే తన పగ తీరబోతున్నందుకు.. తన ప్రయత్నాలు నూటికి నూరు శాతం విజయవంతం అయినందుకు.. ఆ సంతోష క్షణాలతో కాస్త ఆలస్యం చేసిన కవ్వల, ఆమె బృందం ఇప్పుడు పూర్తి అప్రమత్తమయ్యారు. గణపతిదేవుని అనుయాయులు, అతని రక్షణవర్గం ముఖ్యంగా కుమార్తె రుద్రమ, సింఘణదేవునికి, కోట దండనాయకుడికి, దేవగిరి రాజ్య గూఢచార నియోగానికి కూడా తెలియకుండా తనకంటే ముందుగా ఇక్కడికి వచ్చేసి.. పూర్తిగా రక్షణ వలయాన్ని నిర్మించుకున్నాదని కవ్వల భావించింది. ఆ భావన ఆమెను భయకంపితురాలిని చేస్తోంది.

ఎంత తెలివి.. ఎంత తెగువ!!..

కవ్వల, ఆమె కిరాతకముఠా పెద్దపెద్ద ఖడ్గాలను రెండు చేతులతో పట్టి తిప్పుతూ శత్రువు ఎక్కడున్నదో ఎక్కడి నుండి ఆయుధం వదలుతున్నదో తెలియక గుండ్రంగా తిరుగుతున్నారు. ఆ సమయంలో మరొక కత్తి వేగంగా వచ్చి గణపతి దేవుని దగ్గరగా ఉన్నవాడిని తాకింది. వాడు తెలివిగా తప్పుకున్నాడు.

అప్పుడు కవ్వల బయట నుండి లోపలికి ఆయుధాలు ఎలా వస్తున్నాయో చూడాలని.. ఒకడిని ఆయనకు దగ్గరగా ఉంచి అందరిని బయటకు తీసుకు వెళ్లింది.

లోపలివాడు ఆయనపై కత్తి ఎత్తగా మరో బల్లెం వేగంగా లోపలికి దూసుకు వెళ్లింది.

అది ఎక్కడి నుండి లోపలికి వెళ్లిందో చూసిన కవ్వల బృందం అవాక్కయింది.

అది ఈ భవంతికి ఎదురుగా ఉన్న కారాగారం గోడలకున్న పెద్ద పెద్ద కన్నాల నుండి వెళ్లింది.

వివరంగా చూస్తే కారాగారం ముందున్న ఎత్తైన ప్రహారీకి ఎన్నో రంధ్రాలు.. పగుళ్లు. పై కప్పుకు కూడా రంధ్రాలు..అంటే కోష్టాగారం భవంతి నుండే కాక పక్కనున్న చెరశాల ప్రహరీగోడ నుండి కూడా లోపల గణపతిదేవునికి పూర్తి రక్షణ ఏర్పాటై ఉంది.

ఇది నిన్నో మొన్నో కాదు కొంతకాలంగా ఆలోచించి నిర్మించిన పకడ్బందీ రక్షణ.

దీనికి కారాగార ఉద్యోగులు కూడా సహకరించినట్లు అర్థ•మౌతోంది.

అప్పటికి అర్ధరాత్రి అవుతోంది. దగ్గరలో కాగడాలు కూడా లేవు. ఏదో మసక వెలుతురు తప్ప అంతా చీకటి..

అప్పుడు గుర్తించింది కవ్వల.

దగ్గరగా మిలమిల మెరుస్తున్న కత్తులు ఏవో తన దగ్గరగా వస్తున్నాయని.

‘‘వచ్చేశా.. కవ్వలా.. నువ్వు కోరుకున్న నీ శత్రువును. నేనే రుద్రమదేవిని. మహానేత గణపతి దేవుని కుమార్తెను. ఆయన యుద్ధ వారసురాలిని. కాచుకో.. ముందు నన్ను తొలగించు. ఆపై నా తల్లిదండ్రుల మీద చెయ్యి వెయ్యి. వాళ్లకు నీ కత్తి మొన తాకినా నిన్ను నిలువునా చీరుస్తాను.. జాగ్రత్త!!’’

రావడం రావడమే రుద్రమ ప్రళయకాల కాళికలా మిన్నూమన్నూ ఏకం చేసి ఆ చీకటిలో అరుస్తోంది.

రుద్రమ అంగరక్షకులైన లెంకలు కవ్వల బృందాన్ని ఎరుర్కొంటున్నారు.

అయితే అంతా చీకటి..

ఆ ప్రాంతమంతా ఉన్నట్టుండి అప్పుడే దివిటీల వెలుగు ఏర్పడింది. చెరశాల పైకప్పు నుండి కోట ప్రహరీ పైనుండే రక్షణభటుల్లా కొందరు వ్యక్తులు.. వాళ్లుకారాగార ఉద్యోగులో, కారాగార నివాసులో కాదు.. చిరిగిపోయిన పంచే.. లేదా కౌపీనంతో గెడ్డాలు, మీసాలు పెరిగిపోయి ముష్టివాళ్లలా ఉన్నారు. అందరూ దివిటీలతో క్రిందికి ఉరికారు. ఆ వెలుగులో సంకుల సమరం మొదల య్యింది.

కవ్వలతో రుద్రమ తలపడగా ఆమె అంగరక్షకు లైన లెంకలు కిరాతకులను ఎదుర్కొంటున్నారు. దివిటీలతో వచ్చిన ముష్టివాళ్లు ఒకరిద్దరు లోపలికివెళ్లి గణపతిదేవుని, సోమలను విడిపించి బయటకు తీసుకువచ్చారు.

అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని చూస్తూ గణపతిదేవుడు, సోమల నిస్త్రాణంగా నేలపై కూర్చుండిపోయారు.

దివిటీ పట్టుకున్న వొకరు దివిటీ వెలుగులో గణపతిదేవుని చూస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు.

అతని దుఃఖం చూస్తున్న గణపతిదేవుడు అతన్ని ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తించలేకపోతున్నాడు. అతడు అలా ఏడుస్తూనే ఉన్నాడు.

సోమల లేచి కత్తులతో భీకరంగా యుద్ధం చేస్తున్న రుద్రమ, కవ్వల దగ్గరకు వెళ్లి వాళ్లను ఆపడానికి శతధా ప్రయత్నిస్తోంది.

‘‘రుద్రమా.. ఆపండి.. యుద్ధం వద్దు. నేను చెప్పేది విను.. కవ్వలా నేను చెప్పేది విను. అక్క కవ్వలను చంపింది ఎవరో నాకు తెలుసు. నేను చెప్పేది విను. దయచేసి విను. నీ పగ యుద్ధాలు అర్థ•ం పర్థ•ం లేనిది. అనవసరంగా జీవితాన్ని పగతో నాశనం చేసుకున్నావు. కవ్వలను చంపింది ఎవరైనా.. చంపించింది నా తల్లి.. నీ మేనత్త చిల్లాదేవి.’’

వినగానే వారిద్దరూ ఆగారు..

సోమల వైపు చివ్వున తిరిగింది బాలకవ్వల.

‘‘నిజం. నన్ను గణపతిదేవులవారికిచ్చి వివాహం చేయాలని ఆమె తలపోత. అందుకు అడ్డుగావున్న అక్క కవ్వలను ఆ రాత్రి ఇక్కడ చంపింది అమ్మ నియమించిన మనుష్యులు. అందుకు ఆ రోజు రాత్రి పరిస్థితులు ఆమెకు సహకరించాయి. ఆ వివాహం రోజునే పెద్ద కవ్వలను చంపవలసినదిగా ఆమె మను ష్యులను నియమించింది. అయితే మెరుపుదాడి కూడా ఆ రోజే జరగడంతో కవ్వలను చంపింది కాకతీయ సైనికులా? దేవగిరి సైనికులా?అనే అందరూ ఊహించారు కానీ వ•డో వ్యక్తి చంపారని ఎవరికీ అనుమానం రాలేదు. అమ్మే ఇంత దారుణానికి సిద్ధ్దపడిందని నాకూ తెలియదు. బందీగా ఉన్న ఆయనను రాజప్రాసాదంలోనికి మార్పించింది అమ్మే. హోయసాల బల్లాల మహా రాజుతో మంత్రాంగం నెరపి ఆయన ద్వారా వివాహం జరిపించింది ఆమె. నాన్నగారు మావారికి ఉరిశిక్ష విధిస్తే దానిని ఆపించింది అమ్మే. నిజం! నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ నిజాలే. అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది కానీ ఆమె చెప్పకుండా చనిపోతే ఆ నెపం నా భర్త పైనే ఉండేది. ఆయన ఈ విషయంలో అమాయకుడు. కవ్వలను ఆయన నిజంగానే ప్రేమిం చారు. ఇద్దరూ ఇక్కడికి రావడం.. ఇక్కడే ఆమె హత్య కావడం జరిగి పోయాయి. జరిగింది ఒకటైతే అందరూ భావించింది మరొకటి. ఇవన్నీ అర్థ•ంచేసుకోవచ్చు. కానీ నీ పగ.. అది మరీ బాధాకరం. అర్థ•ం పర్థ•ంలేని పగ. ఆయన్ను చంపుతాననడం చాలా అన్యాయం కవ్వలా.. ఇప్పటికైనా అర్థ•ం చేసుకో..’’


       మత్తి భానుమూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.