కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ బంగారుగనిగా చారిత్రాత్మక మైలురాయిని లిఖించింది. ఈ ప్రాజెక్టును జియో మైసూరు, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు రూ. 405 కోట్ల పెట్టుబడితో సంయుక్తంగా చేపట్టాయి. ఈ ప్రాంతపు పురాతన స్వర్ణ వైభవాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తూ దీనికి ‘‘జేజీఎఫ్’’ (జియో మైసూరు గోల్డ్ ఫీల్డస్) అనే పేరును సార్థకం చేశాయి. ఈ గని ద్వారా ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల మన దేశం విదేశీ దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా, రాష్ట్రానికి భారీగా రాయల్టీని సమకూరుస్తూ, వేలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఈ అద్భుతమైన ఆర్థిక వృద్ధికి బాటలు వేస్తుంది.
జొన్నగిరి ఒకప్పుడు సువర్ణగిరిగా ప్రసిద్ధమైన ప్రాంతం. శతాబ్దాల నాటి బంగారు నిక్షేపాలు ఈ నేలలో ఉన్నాయని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అశోక చక్రవర్తి పాలన నాటి నుంచే ఇక్కడ బంగారు తవ్వకాలు నిర్వహించారని పరిశోధకులు నిర్ధారించారు. బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతంలో ఖనిజ అన్వేషణ జరిగింది. దశాబ్దాల మౌనం తర్వాత, ఇప్పుడు ఈ నేల మళ్లీ బంగారు వైభవాన్ని నలుదిశలా చాటనున్నది.
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 24, 2026న జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో మరపురాని ఘడియగా పేర్కొనవచ్చు. ‘ఒకప్పుడు కేజీఎఫ్, ఇప్పుడు జేజీఎఫ్’ అని ముఖ్యమంత్రి అన్న మాటలు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను చాటి చెప్తున్నాయి. రాయలసీమను రత్నాలసీమగా మార్చేందుకు ఇదే నాందిగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
ప్రాజెక్టు విస్తీర్ణం
జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లె, ఎర్రగుడి గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది.1,200 ఎకరాల భూమిని లీజుగా, 300 ఎకరాలను పూర్తిగా కొనుగోలు చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్ కోసం సిద్ధం చేశారు. 2000 సంవత్సరం నుంచి పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇక్కడ అన్వేషణ జరిపాయి. 2012లో జియో మైసూరు కంపెనీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసుకుంటూ జియో మైసూరు సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు కలిసి రూ.405 కోట్ల పెట్టుబడి పెట్టాయి.
దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని
దేశంలోనే తొలి ప్రైవేటు రంగ బంగారు గని కావడం ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత. ఇప్పటి వరకు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలోనే బంగారు తవ్వకాలు జరిగాయి. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డస్ ఒకప్పుడు దేశంలో ప్రసిద్ధి పొందిన బంగారు గని. ఆ సంస్థ 2001లో వ•తపడిన తర్వాత దేశీయ బంగారు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు జొన్నగిరిలో జేజీఎఫ్ ప్రారంభంతో మరో అవకాశం లభించినట్లయింది.
ఉత్పత్తి వివరాలు, భవిష్యత్తు లక్ష్యాలు
ప్రయోగాత్మక దశలో ఇప్పటికే 40 నుంచి 60 కిలోల బంగారాన్ని వెలికితీశారు.1.5 టన్నుల మట్టిని శుద్ధి చేస్తే ఒక గ్రాము బంగారం లభిస్తుంది. రోజువారీ ఉత్పత్తి సుమారు ఒక కిలో వ•డు గ్రాముల స్థాయిలో ఉన్నది. తొలి దశలో ఏడాదికి 400 కిలోల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారు. రెండో దశలో దీనిని టన్నుకు పెంచుతారు. పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించిన తర్వాత ఏడాదికి రెండు టన్నులు ఉత్పత్తి చేయాలనేది ఆ సంస్థ లక్ష్యం. రెండో •••నిట్ నిర్మాణం పూర్తయిన తర్వాత 50 టన్నుల ఉత్పత్తి సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గని కనీసం 15 ఏళ్ల పాటు నిరంతరంగా ఉత్పత్తి కొనసాగించగలదని అంచనా. బంగారాన్ని శుద్ధి చేసేందుకు హంద్రీనీవా కాలువ నుంచి 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేశారు.
ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు
ప్రస్తుతం సుమారు 800 మంది ఈ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. వారిలో 80 శాతం మంది స్థానికులే కావడం విశేషం. త్వరలో మరో 1,500 మందికి ఉపాధి కల్పించనున్నారు. భవిష్యత్తులో 5 వేల మందికి జేజీఎఫ్‌లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భూములు అందించిన రైతు కుటుంబాలకు నేరుగా ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. మైనింగ్ ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేందుకు సిమ్యులేటర్ యంత్రాలపై స్థానిక మహిళలకు, యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్వయంగా సందర్శించి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ద్వారా బంగారు విలువపై 4 శాతం రాయల్టీ లభిస్తుంది. తొలి ఏడాదిలోనే సుమారు రూ.57 కోట్ల రాయల్టీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
మార్కెట్‌లో జొన్నగిరి బంగారానికి ఆదరణ
జియో మైసూరు కంపెనీ ఉత్పత్తి చేసిన జేఎఫ్ సింబల్‌తో కూడిన బంగారు బిస్కట్‌కు మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ నమోదవుతున్నది. 50,100, 500 గ్రాముల ప్యాకెట్లలో అందుబాటులో ఉన్న ఈ బంగారంలో తొలి 500 గ్రాముల 24 క్యారెట్ ముక్కను కర్నూలుకు చెందిన జ్యువెలరీ వ్యాపారి జగదీష్ కొనుగోలు చేశారు.
ముఖ్యమంత్రి స్వయంగా ఆ బంగారు ముక్కను ఆయనకు అందజేశారు. ఆంధప్రదేశ్ మ్యాప్‌తో అలంకరించిన ఈ బంగారు బిస్కట్ వ్యాపారుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నది. విదేశాల నుంచి బంగారం దిగుమతికి అయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారం చూపుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. దేశం ఏటా 800 నుంచి 1,000 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, జొన్నగిరి ఉత్పత్తి ఆ భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించగలదని భావించవచ్చు.
కుప్పం పరిధిలో కొత్త అడుగులు
జొన్నగిరి స్ఫూర్తితో రాష్ట్రంలో ఇతర ప్రాంతా ల్లోనూ ఖనిజ అన్వేషణ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి మండలంలో చిగురుగుంట, బిసానతం గ్రామాల వద్ద దశాబ్దాల నాటి బంగారు నిక్షేపాలు ఉన్నాయని 1970 దశకంలోనే నిర్ధారణ అయింది. మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్వేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1982లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ఈ గనులను కొనుగోలు చేసి 2001 వరకు నిర్వహించింది. ఆర్థిక నష్టాల కారణంగా ఆ గనులకు లాక్‌అవుట్ ప్రకటించే నాటికి వెయ్యి మందికి పైగా కార్మికులు పని చేస్తుండేవారు.
వ•డేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో ఎన్‌ఎండీసీ• రూ.500 కోట్లకు ఈ గనులను సొంతం చేసుకున్నది. జొన్నగిరిలోని జియో మైసూరు సంస్థ 260 హెక్టార్ల భూమిలో నిర్వహించిన సర్వేలో టన్నుకు 5.5 గ్రాముల బంగారు సాంద్రత ఉన్నట్లు నిర్ధారించింది. అయితే సాంకేతిక సమస్యలు, టెండర్ల పక్రియలో ఎదురైన ఆటంకాల కారణంగా రెండుసార్లు పని వాయిదా పడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త ఉత్సాహంతో వ•డోసారి టెండర్ పక్రియ చేపట్టింది. జులై 9వ తేదీని తుది గడువుగా పేర్కొంటూ టెండర్లు జారీ చేశారు. స్థానిక భూవివాదాలను కూడా అధికారులు పరిష్కరించారు. దీంతో 2వేలమంది కార్మికులు, మరో వెయ్యి మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రాష్ట్ర ఆదాయ పెంపు, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి…ఇవన్నీ ఒకే ప్రాజెక్టు ద్వారా సాధించడం రాయలసీమ చరిత్రలో నిజంగా సువర్ణాధ్యాయమే. అంతర్జాతీయ స్థాయిలో కూడా జొన్నగిరి పేరు వినిపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఆంధప్రదేశ్‌కు ఖనిజ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని విదేశీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు కూడా పెరుగుతాయి. ‘రాయలు ఏలిన సీమ రత్నాల సీమ’ అనే పాట మాటల్లోని కవి స్వప్నం ఇప్పుడు నిజమవుతోంది.