తిరుపతి జిల్లా ముక్కావారిపల్లి గ్రామం నుంచి ‘‘వికసిత్ భారత్-జీ రామ్ జీ యోజన’ జూలై 1న జాతీయ స్థాయిలో ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాశ్వాన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వేలాది సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా గల పేద కూలీలు, రైతులకు..ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి కోసం నరేంద్రమోదీ నేతృత్వంలోని కూట•మి ప్రభుత్వం భారీ ఆర్థిక కేటాయింపులు చేస్తూ,పారదర్శకమైన వ్యవస్థతో కూడిన ఒక కొత్త నవ•నాను ఆవిష్కరించారు.
గత •••పీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభ మైన ఎంఎన్ఆర్ఈజీఏకు ప్రత్యామ్నాయంగా మరింత మెరుగైన రీతిలో ‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’గా అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.అప్పట్లో ఏడాదికి 100 రోజుల ఉపాధికి మాత్రమే హామీ ఇచ్చారని, ప్రస్తుత పథకం మరో 25 రోజుల (మొత్తం 125 రోజులు) పనికి హామీ ఇస్తుందని చెప్పారు. ఇది కేవలం పనిదినాల పెంపు మాత్రమే కాదని, ఎవరూ పనిలేకుండా మిగిలి పోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.‘ఈ కొత్త పథకం అమలులోకి వచ్చిన మొదటి రోజే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు పని పొందారు. ఈ పథ•కానికి మొదటి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.95,000 కోట్లకు పైగా ఉంటుంది. రాష్ట్రాల 40% వాటాతో కలిపి వార్షిక వ్యయం సుమారు రూ.1.51 లక్షల కోట్లకు చేరుకుంటుంది.వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కింద మొత్తం రూ.7.5 లక్షల కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 2.86 లక్షల పంచాయతీలకు ఈ నిధులు చేరతాయి. ఒక్కో పంచాయతీకి ఏడాదికి సగటున రూ.2 కోట్లకు పైగా లభిస్తాయి. ఇది గ్రామాలలో ఉపాధిని పెంచడంతో పాటు శాశ్వత ఆస్తులను సృష్టిస్తుంది.ఈ పథకం కూలీల హక్కులకు చట్టబద్ధతను కల్పిస్తుంది’అని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిం చారు.పని కోరిన ఏ కార్మికుడికైనా 15 రోజుల్లోగా ఉపాధి కల్పించడం తప్పనిసరని, నిర్దేశిత సమయంలోగా పని కల్పించని పక్షంలో, ఆ కార్మికుడికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కార్మికుల కష్టాన్ని ఇకపై ఎవరూ దోపిడీ చేయలేరని, వేతనాల చెల్లింపులో జాప్యాన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఆలస్యమైన వేతనాలను వడ్డీ సహా చెల్లిస్తారని వెల్లడించారు.
ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పరిపాలనా వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు, దీని కింద, గ్రామ ఉపాధి సహాయకులు, మేట్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జీతభత్యాల కోసం రూ.13,000 కోట్లకు పైగా కేటాయించినట్లు మంత్రి తెలిపారు.పనులను నిర్ణయించే అధికారం గ్రామ పంచాయతీ, గ్రామ సభకే ఉంటుందన్నారు. అంగన్వాడీ నిర్మించాలా? పాఠశాల, ఆసుపత్రి, రోడ్డు, వ్యవసాయ రహదారి, రైతు ఉత్పత్తిదారుల కార్యాలయం కోసం నిర్మాణం, చెరువు, జాక్ డ్యామ్, ఆనకట్ట లేదా ప్రకృతి వైప రీత్యాల నుంచి రక్షించే గోడ వంటివి నిర్మించు కోవాలా? వద్దా? అనేది గ్రామస్థులే స్వయంగా నిర్ణ యించుకుంటారని అన్నారు. ఈ నిర్ణయాలన్నీ గ్రామంలోనే కొలువుదీరిన గ్రామసభ ద్వారా తీసు కుంటారని, గ్రామ నిర్ణయం గ్రామంలోనే తీసు కుంటారని, ఇదే ‘జీ-రామ్ జీ యోజన’ ఆత్మ అని అన్నారు.
వెనుకబడిన పంచాయతీలకు అదనపు సాయం
ప్రగతిని వేగవంతం చేసేందుకు, రాష్ట్రాలు తమ పంచాయతీలను ఏబీసీ కేటగిరీలుగా విభజించి, వెనుకబడిన వాటికి మరిన్ని నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ సూచించారు. ఆంధప్రదేశ్ విషయానికి వస్తే, ఈ పథకం కింద కేవలం తొమ్మిది నెలల్లోనే కేంద్రం రూ.7,707 కోట్ల ప్రత్యేక గ్రాంటును అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఈ ప్యాకేజీ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతుందని, గ్రామాల్లో ఉపాధి, అభివృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశంలో రాష్ట్రంలోనూ ఇకపై వేతనాలు రూ.300 కంటే తక్కువ ఉండవని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆంధప్రదేశ్లో ఈ రేటును రూ.312-రూ.315 మధ్య నిర్ణయించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన-కింద రాష్ట్రంలోని పేద కుటుం బాలు, గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కొత్తగా 74,212 పక్కా ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. దీంతో అర్హులైన ప్రతిపేద కుటుంబం గృహవసతి పొందుతుందని అన్నారు. పక్కా రోడ్ల సౌకర్యం లేని గ్రామాల ఆందోళనలను ఆయన ప్రస్తావిస్తూ, అలాంటి ప్రాంతాలలో 146 కొత్త రోడ్లు, 19 వంతెనల నిర్మాణానికి మొత్తం రూ.422 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు తెలిపారు. వేదికపై నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఈ ఆమోద పత్రాలను అందజేశారు.
‘తోతాపురి’ రైతులకు ఉపశమనం
రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ చౌహాన్, మామిడి ధరలు పడిపోవడం వల్ల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని, వారికి సరసమైన ధర లభించేలా, కూలీలకు మంచి వేతనాలు అందేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ మామిడిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.మామిడి ఉత్పాదకతను పెంచడానికి, మార్కెట్లో మెరుగైన రకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, ఐసీఏఆర్ శాస్త్రవేత్తల బృందం రాష్ట్ర ప్రభుత్వ బృందంతో కలిసి డ్రాఫ్టింగ్, రకాల మార్పిడి పద్ధతులపై పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. పర్యా వరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను స్వయంగా ప్రతిరోజూ మొక్కలు నాటుతానని, ప్రజలు కూడా తమ పుట్టినరోజున కనీసం ఒక మొక్కనైనా నాటాలని కోరారు. అభివృద్ధి చెందిన గ్రామం, అభివృద్ధి చెందిన ఆంధప్రదేశ్, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం వేదికపై నుంచి ప్రజల చేత సావ•హిక ప్రతిజ్ఞ చేయించారు.
‘జీ రామ్ జీ’తో విప్లవాత్మక మార్పు
వికసిత్ భారత్-జీ రామ్ జీ యోజన గ్రామాలలో, గ్రామీణ జీవన ప్రమాణాలలో పరివర్తన తీసుకువచ్చే కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.
గతంలో రాయలసీమ నుంచి ప్రారంభమైన ఎంఎన్ఆర్ఈజీఏ దేశానికి ఒక నవ•నాగా నిలిచిందని, ఇప్పుడు అదే ప్రాతి పదికన, మరింత శక్తి•మంతమైన రూపంలో వీబీ-జీ రామ్ జీ యోజనను ప్రారంభించామని, ఇది స్వర్ణాంధప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ దిశగా పెద్ద ముందడుగని అన్నారు. 125 రోజుల ఉపాధి హామీతో పాటు, రోడ్లు, చెరువులు, డ్రైనేజీ వంటి పనులు, భూమిలేని కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ద్వారా గ్రామీణ జీవన ప్రమాణాలు నేరుగా మెరుగు పడతాయని అన్నారు. ఈ పథకంలో పనులను డిజిటల్ మాస్టర్ రోల్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, రియల్ టైమ్ పర్యవేక్షణ, జియో-ట్యాగింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తారని అన్నారు. దీనివల్ల, పని చేయకుండా కాగితాల మీద లెక్కలు చూపించే పాత పద్ధతికి స్వస్తి పలికినట్లవుతుందని, నిధులు సరైన చోట ఖర్చు అవుతాయని అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామసభల నిర్వహణ, వాటిలో తీసుకొన్న నిర్ణయాల మేరు సీసీ రోడ్లు, గోశాలలు, నీటి ట్యాంకులు, పంపుపాండ్లు, గిరిజన ప్రాంతాల్లో నిర్మితమైన రహదారులను చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తన దార్శనికతను పంచుకున్నారు. నీటి పారుదల ప్రాజె క్టులు, రహదారుల అనుసంధానం, గిడ్డంగులు, మౌలిక సదుపాయాల ద్వారా ఉద్యా నవన పంటలకు రాయలసీమను దేశానికి ఒక ప్రధాన కేంద్రంగా మార్చాలని సంకల్పిం నట్లు, పూర్వోదయ కార్యక్రమం కింద సుమారు రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు, సుమారు రూ.60 వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు ఈ దార్శనికతను స్వర్ణాంధప్రదేశ్కు సంబంధించి ఒక నిర్ణయాత్మక అడుగుగా అభివర్ణిస్తూ, గ్రామీణ ఉపాధి, ఉద్యానవనం, పారిశ్రామిక పెట్టు బడులు, మౌలిక సదుపాయాలు ఆంధప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధాని ప్రాజెక్ట్, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్, ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఆంధప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మళ్లీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. సరైన నాయకుడు, సరైన ప్రదేశం, సరైన సమయం- ఇదే నరేంద్ర మోదీ దక్షత అని, 2047 నాటికి భారతదేశాన్ని నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో స్వర్ణాంధప్రదేశ్ దిశగా పనులు వేగంగా పురోగమిస్తున్నాయని అన్నారు.
కేంద్రం మద్దతుతో రాష్ట్రం బలోపేతం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి రూ.12,845 కోట్ల మంజూరయ్యాయని,ఆర్జీఎస్ఏ జాతీయ ర్యాంకింగ్స్లో ఆంధప్రదేశ్ 24వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తంచేశారు.వీబీ-జీ రామ్ జీ జాతీయ ప్రారంభోత్సవానికి ఆంధప్రదేశ్ను ఎంచుకోవడం ద్వారా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవాన్ని పెంచారని అన్నారు. ‘శివరాజ్ జీ! మీ 49 ఏళ్ల ప్రజా జీవితంలో గ్రామీణ భారతదేశం పట్ల, రైతుల పట్ల, మీకున్న అంకితభావం అభినంద నీయం. మా అందరికీ స్ఫూర్తిదాయకం’ అన్నారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ, వీబీ జీ-రామ్ జీ యోజన కింద పనిదినాలను పెంచడమే కాకుండా, పని లభించని పక్షంలో నిరుద్యోగ భృతికి కూడా నిబంధన ఉందని అన్నారు. దీనివల్ల ప్రతి కార్మికుడికి పని లభిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్ జీ యోజన కింద 300కు పైగా రకాల పనులు ఉంటాయని, ఇవి గ్రామీణ భారతదేశాన్ని సాధికారత కల్పించి, సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి కార్యక్రమం ప్రారంభంలో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫామ్ పాండ్ కార్యాచరణ స్థలంలో పూజ, శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు. ‘మ్యాజిక్ డ్రెయిన్’ ప్రదర్శనను వీక్షించి, ఆంధప్రదేశ్ సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాల ప్రదర్శనను సందర్శించారు.