శ్రీ‌ఝాన్సీని తన బైక్‌మీద ఎక్కించుకొని ఒకడూ, తన బండిమీద రెండోవాడూ-ఆ ఇద్దరు పెద్దలూ నాంపల్లి షి-టీమ్‌ ‌పోలీసుస్టేషన్‌కొచ్చారు.

శ్రీఝాన్సీ గబగబా లోపలికొచ్చి, ‘‘యస్‌ఐగారూ వాడు నన్ను చంపాలని ప్రయత్నించి, చిన్న కత్తితో నా చెయ్యికోసి, ఈ పెద్దవాళ్లు రాగానే పారిపోయాడు – వాణ్ణి మీరు అరెస్టు చెయ్యాలి’’ అంది.

ఆ ఇద్దరు పెద్దవాళ్లూ యస్‌ఐతో ‘‘యస్‌ ఐ ‌మేడమ్‌, ‌మేం సెక్రటేరియట్‌లో ఉద్యోగులం. ఆదివారం గదా అని వాకింగ్‌కు ఈ పబ్లిక్‌గార్డెన్స్ ‌కొచ్చాం. ఈ అమ్మాయి ‘‘రక్షించండి, రక్షించండి, వీడు నన్ను చంపుతున్నాడు…. పారి పోతున్నాడు… ప్లీజ్‌ ‌పోలీస్‌స్టేషన్‌ను నన్ను తీసుకెళ్లండి!’’ అని అరుస్తూంటే చూసి తీసుకొచ్చాం. ఈమె విషయం మాకు ఏమీ తెలీదు- ఇవ్విగో మా నెంబర్లు. మీరు పిలిస్తే వస్తాం, మాకు పన్లున్నాయి’’ అని వెళ్లిపోయారు.

ఆ షి-టీమ్‌ ఎస్‌, శ్రీ ‌ఝాన్సీని విషయం వివరంగా చెప్పమంది. ప్రశ్నలడిగింది. శ్రీఝాన్సీ ఇల్లా చెప్పింది :

‘‘నా పేరు శ్రీఝాన్సీ. నేను నాంపల్లిలో కాలేజీలో ఇంటర్‌ ‌చదువుతున్నాను. నాకున్న కొద్దిమంది స్నేహితులూ గొప్పగా చదువుకోవాలని తాపత్రయం పడేవారే. వీడెవడో నాకు తెలీదు. నేను ఈ ఏడాది ఫస్టియర్‌లో చేరాక అప్పుడప్పుడు కాలేజీ బయట తచ్చాడుతుండటం చూసాను. నేను పట్టించుకోలేదు. కానీ ఒక పది రోజుల బట్టే నేను కాలేజీ బయటకొచ్చి నా సైకిలు ఎక్కగానే వీడు వచ్చి ‘హాయ్‌’ అం‌టున్నాడు. అట్లా నాలుగైదుసార్లయింది. నేను పట్టించుకోలేదు.

ఇవ్వాళ ఆదివారం కదాని బషీర్‌బాగ్‌లో ఉన్న మా క్లాస్‌మేట్‌ ‌ఫ్రెండ్‌ ‌దుర్గ ఇంటికి వచ్చాను. భోజనాలయ్యాక మేమిద్దరం ఆటోలో పబ్లిక్‌ ‌గార్డెన్స్‌కు వచ్చి కూర్చుని మా సిలబస్‌ల గురించి, ఇంటర్‌ ‌తర్వాత ఏం చదివి యు.పి.ఎస్‌.‌సి. ఎల్లా రాయాలి అన్న విషయం మాట్లాడుకున్నాం. దుర్గ వెళ్లిపోయింది. నేను కూడా వెళ్లబోతున్నాను. హఠాత్తుగా తన బండిమీద వీడు నా పక్కకొచ్చాడు. ‘‘లోపలికి రండి, మాట్లాడుకుందాం’’ అన్నాడు.

 ‘‘మీరెవరు? మీతో నాకు మాటలేంటి?… మా అమ్మతో మాట్లాడండి, నెంబరిస్తాను’’ అన్నాను.

‘‘అబ్బెబ్బే, అంత విషయం ఏం లేదండి. ఊరికే, హాబీస్‌ ‌గురించి మాట్లాడుకుందాం…మీ హాబీ ఏమిటి?’’ అన్నాడు. ఇంకా, ‘‘నేను పూలదండలు గుచ్చగలను. వినాయక చవితికి గజమాలలు నా హైలైట్‌’’ అన్నాడు.

వాడిని ‘‘మీరు ఏం చదివారు?’’ అనడిగాను.

‘‘బిటెక్‌. ‌మా నాన్న లెక్చరర్‌ ‌తెలుసా!’’ అన్నాడు. అయిష్టంగా నేను వాడితో నడిచాను. వెదురు గుబురు వెనకాల కెళ్లాం. అతను, నీ హాబీ ఏమిటి?’’ అన్నాడు. నాకు చిరాకనిపించింది నేను మాట్లాడలేదు. అతను నాకు దగ్గరగా వచ్చాడు. నా చెంప మీద చెయ్యి వేస్తూ అన్నాడు, ‘‘నీ మొహం చాలా బ్రైట్‌గా ఉంటుంది. అసలు నువ్వు చాలా అందగత్తెవి తెలుసా?… జస్ట్ ‌చిన్న కిస్‌!’’- ఇలా అంటూ నా మొహం పట్టుకుని నన్ను ముద్దుపెట్టుకోబోయాడు- నేను విదుల్చుకున్నాను. దూరంగా జరిగాను.

‘‘డోంట్‌ ‌టచ్‌ ‌మి, యూ ఫూల్‌!’’  అని కోపంగా అన్నాను. అతని మొహంలో మార్పు వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. అటూ ఇటూ చూసాడు.

 ‘‘అందగత్తెవని చెబితే ఇంత పొగరే నీకు!’’ అంటూ నా రెండు భుజాలు పట్టుకుని పక్కకు తిప్పి కింద పడెయ్యబోయాడు. నేను తమాయించు కున్నాను. అతని చెయ్యి పట్టుకుని బలంగా మెలి తిప్పాను. అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు. నేను నా మోకాలితో అతని వీపుమీద గట్టిపోటు పొడిచాను. అతను కింద పడిపోయాడు. తక్షణం నేను అతని మోకాళ్లమీద బలంగా తొక్కాను. వెంటనే అతని మోచేతుల మీద తొక్కాను. మళ్లీ కాళ్లమీదా, కడుపుమీదా, పొత్తి కడుపుమీదా కసాకసా తొక్కాను. ఇప్పటికి  అతని సత్తువ సన్నగిల్లింది. మొహం మాత్రం చురుగ్గా ఉంది. నా రెండు కాళ్లతోటి మట్టిని తొక్కినట్టు అతని మొహం మీద ఎడాపెడా తొక్కాను.

అతను అతి కష్టంమీద పక్కకు తిరిగి కుడిచేత్తో పాంటు బాక్‌ ‌పాకెట్‌లో పోచ్‌, అం‌టే మళ్లీ చిన్న పాకెట్‌, ‌లోంచి ఆరంగుళాల కత్తి తీసాడు.

ఇది నాకు తెలుసు. ఫేస్‌బుక్‌లో వాట్సప్ప్‌ల్లో చూస్తున్నవే. కనక నేను కూడా నా బాక్‌ ‌పోచ్‌లోంచి నాలుగంగుళాల స్విస్‌ ఆర్మీ ఫోల్డబుల్‌ ‌కత్తి తీసాను. వాడు పైకి లేవాలని అటూ ఇటూ తీవ్రంగా కదుల్తుండగా వాడి డొక్కలో కస్‌కస్‌మని  కత్తితో రెండు పోట్లు పొడిచాను. వాడి చొక్కా చిరిగింది. లోపలి విషయం తెలీదు.

అలా పొడుస్తూనే నేను ‘‘రక్షించండి, రక్షించండి, నన్ను పొడుస్తున్నాడు, చంపేస్తున్నాడు, బాబోయ్‌, ‌బాబోయ్‌!’’ అని గట్టిగా అరిచాను. వెదురు పొదల అవతల వాకింగ్‌ ‌చేస్తున్న ఇద్దరు – ఇప్పుడు నన్ను తీసుకొచ్చినవాళ్లే- చటుక్కున మావైపు దూకారు.

నేను ఆగాను. వాడు చేతిలో కత్తితో పైకి లేచాడు. నేను నా స్విస్‌ ‌నైఫ్‌ను నా పోచ్‌లో పెట్టుకుని ఈ ఇద్దరి పక్కకే పరుగెత్తాను.

ఆ లేచినవాడు ఈ ఇద్దర్నీ చూసాడు. గబగబా నా మీదికొచ్చేసి వాడి కత్తితో నన్ను పొడిచాడు. ఇదిగో ఈ ఎడమచేతి మీది ఈ అంగుళం గాటు చూడండి.

ఇంకా రక్తం కారుతోంది మేడమ్‌!….

‌వాడు తన కత్తిని దాచేసుకుని కుంటుకుంటూ దూరంగా ఉన్నవాడి స్కూటర్‌ ‌వైపు వెళ్లాడు. నేను చూసాను. అదొక డొక్కు స్కూటరు.

నేను ‘‘వీడు టెర్రరిస్టు. పట్టుకోండి సార్‌, ‌పట్టుకోండి’’ అంటూ వాళ్లని లాక్కుంటూ వెళ్లాను. కానీ వాడు పారిపోయాడు.

వీళ్లు నన్ను తీసుకొచ్చి, మీ దగ్గర దింపారు. అదండీ మేడమ్‌’’

ఆ ‌షీ టీమ్‌ ఎస్‌ఐ అం‌ది ‘‘నీ వయస్సెంత?’’

‘‘పదిహేను మేడమ్‌.’’

‘‘‌నువ్వు ఏ క్లాసు?’’

‘‘నాంపల్లి కాలేజిలో ఇంటర్‌ ‌ఫస్టియర్‌. ‌సబ్జెక్ట్ ‌కామర్స్’’.

‘‘‌నీకు, వాడి మోకాళ్లమీదా మోచేతుల మీదా తొక్కి – ఇనాక్టివ్‌, అదే, చలనం లేకుండా చెయ్యాలని, నీకెల్లా తెలుసు?’’

‘‘హైస్కూల్లో మా టెన్త్ ‌టీచర్‌ ‌మా క్లాసులో అందరు ఆడపిల్లలికీ నేర్పారు మాడమ్‌…. అసలావిడ సేవికా సమితిలో ‘ఛురిక’ అంటే, చిన్నకత్తి, ‘నియుద్ధ’ అంటే బ్లాక్‌బెల్ట్, ‌వగరాలు నేర్చుకున్నారట. కనుక మాకు కూడా నేర్పారు. ప్రతి ఆదివారమూ నేనూ సేవికాసమితికి వెళ్లి అవ్వి నేర్చుకునేదాన్ని.

‘‘గుడ్‌. ‌బాగుంది. సేవికా సమితి చాలా మంచి సంస్కారాలు నేర్పే సంస్థ. సరే… మరి వాడి పేరు, ఊరూ, వివరాలు మాకు తెలియకపోతే మేమేం చెయ్యగలం!’’

శ్రీఝాన్సీ చటుక్కున తన పాంటు జేబులోంచి తన ఫోను తీసి, ‘ నేను వాడి డొక్కు స్కూటర్‌ ‌నెంబరు ఫోటో తీసాను మేడమ్‌. ‌చూడండి! వాడి పేరు మాత్రం రవి అని మొదటే చెప్పాడు.’అంది,

ఎస్‌ఐ ఆ ‌ఫోనులో ఆ స్కూటరు నెంబరు చూసింది. ఆమె కళ్లు మెరిసాయి. కానిస్టేబుల్‌తో అంది, ‘‘రోజా, ఆర్‌టీ•వోకు కలిపి ఈ నెంబర్‌ ‌చెప్పి వివరాలు నోట్‌ ‌చెయ్యి!’’

అయిదు నిమిషాల తర్వాత ఆ ఆర్‌టివో ఆఫ్‌ను చెప్పిన వివరాలు చూసి యస్‌ఐ అది ‘‘సరే నమ్మాయ్‌, ‌రేపు నీకు ఫోను చేస్తాను, రా’’.

* * *

మర్నాడు ఉదయం పదికి ఎస్‌ఐ ‌ఫోను అందుకొని శ్రీ ఝాన్సీ పోలీస్టేషను కెళ్లింది.

ఎస్‌ఐకి ఎదురుగా ఇద్దరు మహిళా కానిస్టేబిళ్ల మధ్య రవి నుంచొని ఉన్నాడు.

యస్‌ఐ, శ్రీ ‌ఝాన్సీని కూర్చోమంది. రవితో, ‘‘ఈ అమ్మాయి నీకు తెలుసా?’’

రవి చూసారు. అన్నాడు, ‘‘తెలీదు, మాలూమ్‌నై’’.

‘‘నిన్న ఈ అమ్మాయిని పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో బలవంతంగా ముద్దుపెట్టుకున్నావుట. నిజమేనా?’’

‘‘నై, నై’’

‘‘ఈ అమ్మాయి ముద్దు వద్దంటే చంపుతానని నీ కత్తి తీసావట. ఆ కత్తితో పొడిచావట… అమ్మాయ్‌, ‌చూపించమ్మా’’.

శ్రీఝాన్సీ తన చెయ్యి చాపి రక్తం గడ్డకట్టిన కత్తిగాటు చూపించింది.

రవి, ‘‘నై, నై, నా దగ్గర కత్తే లేదు’’ అన్నాడు.

ఎస్‌, ‌లోపల కూర్చునున్న కిందటి రోజు ఇద్దరు పెద్దల్ని పిలిచింది. వాళ్లని అడిగింది, ‘‘సార్‌, ‌నిన్న ఇతని చేతిలో మీరు ఏం చూసారు?’’

 ‘‘ఆరంగుళాల కత్తి, అదే మేం మీకు రాసి కూడా ఇచ్చాం కదా!’’.వాళ్లన్నారు,

ఎస్‌ఐ ‌రవితో అంది, ‘‘చెప్పు, నీ దగ్గర కత్తే లేదా?’’

రవి అన్నాడు, ‘‘ఉంది. కానీ ఆ గాటు నా కత్తిది కాదు’’.

‘‘కత్తి లేదన్నావ్‌! ఉం‌దన్నమాట. పుండాకోర్‌!…. అం‌టే, ఈమెను చంపాలనుకోవటం ఖాయమే కదా!’’

రవి మాట్లాడలేదు.

‘‘అమ్మాయి నీకు ఒప్పుకొని ఉంటే ఈమెని పెళ్లిలోకి దింపేవాడివి. అక్కడి నుంచీ, ఆమెని టెర్రరిస్టుగా మార్చటమో, బాంబుల తయారీకి పంపటమో లేదా దుబాయ్‌కి అమ్మేయటమో చేసేవాడివి. ఒప్పుకోలేదు కనక, చంపటానికి ప్రయత్నించావు….. అవునా?’’యస్‌ఐ అడిగింది,

కోపంగా రవి అన్నాడు, ‘‘అబద్ధం, అబద్ధం. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.’’

కోపంగా యస్‌ అం‌ది, ‘‘పెళ్లికి కత్తెందుకు రా బాడ్‌ఖవ్‌! ‌వెళ్లి వాళ్ల అమ్మనీ నాన్ననీ అడక్క పోయావా!…. ఇదుగో నువ్వుండే ఇల్లీగల్‌ ‌రేకుల షెడ్‌ ‌దగ్గరకొచ్చి పోలీసులు నీ కుటుంబం వివరాలు తెలుసుకున్నారు.

మీ నాన్న బాంగ్లాదేశియుడు. ఆ పక్కనే సైకిళ్ల రిపేరు షాపు నడుపుతున్నాడు. మీ అమ్మ తురకగా మారిన గౌడ్‌ ‌హిందువు. పాచిపనులు చేసుకుని ఇక్కడే బతుకుతోంది. నువ్వు తురకోడివి. నీ పేరు మహమ్మద్‌ ‌రఫి.యస్‌ఐ అం‌ది, ఆటో నడుపుకుంటు న్నావు. ఈ అమ్మాయికి రవి అని అబద్ధం చెప్పావుట! తియ్‌, ‌నీ ఆధార్‌కార్డ్ ‌తియ్‌!’’

‘‘‌తేలేదు మేడమ్‌!’’

ఎస్‌, ‘‘‌రోజా, చూడమ్మా!’’

రెండో కానిస్టేబుల్‌ ‌రఫీని గట్టిగా పట్టుకోగా, రోజా, అతని చొక్కా, పాంటు జేబులు తడిమింది. చటుక్కున అతని ముందరి మొలభాగంలో పాంటును నొక్కింది. చటుక్కున అతని పాంటులో చెయ్యిదోసి, డ్రాయర్‌ ‌లోపోచ్‌లోంచి ఆధార్‌ ‌కార్డును, సెల్‌ఫోనును పైకి లాగింది. యస్‌ఐకిచ్చింది.

యస్‌ అం‌ది, ‘‘ఇదీ మేం తెలుసుకుంటున్నవన్నీ చెబుతున్న కార్డు, ఫోనూను. కనుక కత్తిపోటుకు ప్రయత్నించినందుకు నిన్ను, ఇల్లీగల్‌ ఆక్సుపేషన్‌తో ఇండియన్‌ ‌లాగా దొంగాటకం ఆడుతున్న మీ అమ్మా నాన్నలని ఈడ్చికొచ్చి, చువ్వల వెనకాల పడెయ్యాలి… కనుక, నీ ఈ కార్డు, ఈ ఫోనూ మా దగ్గరే ఉంటుంది. నీకు రశీదిస్తాము. నువ్వెళ్లి వాళ్లిద్దర్నీ ఒక గంటలో తీసుకొస్తావా సరే, లేకపోతే ఆర్‌ అం‌డ్‌ ‌బీ వాళ్లొచ్చి రేపు నీ రేకుల గూడు పడగొడతారు… ఏమంటావో చెప్పు!’’

ఇంచుమించు ఏడుపుతో రఫీ  అన్నాడు, ‘‘సారీ మాడమే!…. మాఫ్‌ ‌కరో. నేను ఈ అమ్మాయిని మళ్లీ ఎప్పుడూ ఏమీ అనను. క్షమించండి… నన్ను వది లెయ్యండి… ప్లీజ్‌!’’

‘‘ఈ అమ్మాయిని ఏమీ అనవుకాని, ఇంకో అమ్మాయిని, అదే, హిందూ అమ్మాయిని చూసి, అంటావా? హిందూ అమ్మాయిలను చంపేద్దామనే ఇండియా వచ్చార్రా మీరు బాడ్‌ఖోవ్స్!’’ ఇల్లా అంటూ యస్‌ఐ ‌రఫీని ఈడ్చిపెట్టి చెంప దెబ్బకొట్టింది.

రఫీ నోటి వెంట రక్తం కారింది.

రఫీ, యస్‌.ఐ. ‌కాళ్లమీద పడిపోయాడు. ‘‘మాఫ్‌ ‌కరో మా! మామా, మాఫ్‌కరో!’’ అని ఘొల్లున ఏడవటం మొదలుపెట్టాడు.

రెండు మూడు నిమిషాలు వాడిని ఏడవనిచ్చి, ‘‘సరే, ఇప్పుడు వదిలేస్తున్నాను. కానీ రేపు మీ అమ్మా నాన్నలను తీసుకొస్తేనే నీ ఆధార్‌ ‌కార్డు, నీ ఫోను ఇస్తాను…. పో’’ యస్‌ అం‌ది:

రఫీ గబగబా వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు పెద్దలు కూడా వెళ్లిపోయారు.

* * *

యస్‌, శ్రీ‌ఝాన్సీతో అంది. ‘‘లోపలికి దిగనట్టి నీ స్విస్‌నైఫ్‌తో నీ చేతిని నువ్వే కోసుకున్నావని తెలుస్తూనే ఉంది అమ్మాయ్‌….‘‌ప్రతి హిందూ అమ్మాయీ ఇల్లా ఒక స్విస్‌ ‌నైఫ్‌ను దగ్గరపెట్టుకోవాలి’ అని చెప్పి, నేర్పి, హిందూ అమ్మాయిల్ని కాపాడుతూన్న మీ టీచర్‌కు నా ధన్యవాదాలు చెప్పమ్మా!’’

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు

About Author

By editor

Twitter
YOUTUBE