‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

ఆ ‌పిల్లల్లో కొందరు స్కూలుని తుడిస్తే మరో ఇద్దరు పిల్లలు నీళ్లు తెచ్చారు.ఆ సాయంత్రం కొండ దిగి అక్కడికి దగ్గర్లోని బీసుపురం వెళ్లి కొన్ని సామాన్లు కొనుక్కొన్నాను. ఆ ఊరు కొద్దిగా పెద్దది. అక్కడ కూరలు, కిరాణా సామాన్లు దొరుకుతాయి.
ఆ మర్నాటి నుంచి స్కూలుకి పిల్లలు రావడం మొదలు పెట్టారు. ఆ పిల్లల తల్లితండ్రులు ప్రతిరోజూ కూలిపనులకు, పొలం పనులకు వెళ్లిపోతుండటంతో సాయంత్రం వరకూ వాళ్లంతా స్కూల్లో ఉండాలి.
 చాలా గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తుంటారు. విప్పసారాకు, మద్యానికి బానిసలు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోరు.
వాళ్లు పండించే పంటలను దళారులే చాలా తక్కువ ధరకి కొని మోసం చేస్తుంటారు.
 దళారుల, భూస్వాముల దోపిడీని అరికట్టి గిరిజనుల హక్కుల పరిరక్షణ పేరుతో పశ్చిమ బెంగాల్లోని నక్సల్‌బరీ ప్రాంతంలో నక్సల్‌ ఉద్యమం మొదలైంది. అనంతరం అది రెడ్‌ ‌కారిడార్‌గా తమిళనాడు వరకు వ్యాప్తి చెందింది. తెలుగు నేలపై తూర్పు కనుమల ప్రాంతంలోని ఏజన్సీ గ్రామాల్లో నక్సల్స్ ‌కదలికలు ఎక్కువ. అమాయకులైన గిరిజనులను దళారుల, వ్యాపారస్థుల, ధనవంతుల బారి నుంచి కాపాడేందుకు అక్కడ స్థావరాలు ఏర్పరచుకున్నారు.
గిరిజనులు నక్సలైట్లకు మద్దతు ఇస్తున్నారన్న అనుమానంతో పోలీసులు, తమ కదలికలను పోలీసులకు చేరవేస్తున్నారనీ నక్సలైట్లు.. ఇరుపక్షాలు గిరిజనులను హింస్తుంటాయి. మరోవంక పోలీసులు గిరిజనులను ఇన్ఫార్మర్లుగా చేసుకొనీ నక్సల్స్ ‌స్థావరాలసై దాడులు చేసిన సంఘటనలు ఎన్నో… అలా ఆ ఏజన్సీ ప్రాంతమంతా రావణ కాష్టంలా మండిపోయేది.
ఆ సమయంలో నేను ఉపాధ్యాయుడిగా ఆ గ్రామం వెళ్లాను. నేను పనిచేస్తున్న కెంగువ తండాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(తొండంగి)లో గౌరి అమ్మాయి నర్సుగా, ఆమె చెల్లెలు ధరణి అంగన్‌వాడీ టీచరుగా పనిచేసేవారు.
గౌరి మొగుడు భీమన్న తాగుబోతు. ఏ పనీ చేసేవాడు కాదు. రెండేళ్ల క్రితం పోలీసులతో జరిగిన గొడవ, కాల్పుల్లో చనిపోయాడు. ధరణి భర్త సోమన్న ఇంటర్‌ ‌చదివి ఒక కాంట్రాక్టర్‌ ‌దగ్గర మేస్త్రీగా పనిచేసేవాడు. అతనికి పార్వతి అనే చెల్లెలుండేది.
పార్వతి ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్లి వస్తోంది. ఆ ప్రాంతంలో నక్సల్స్ ఏరివేత కోసం ఏర్పాటైన పోలీసు అవుట్‌ ‌పోస్ట్‌లో పనిచేస్తున్న మురళి అనే కానిస్టేబుల్‌ ఆమెను బలవంతంగా పోలీసు పోస్టులోకి లాక్కుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పార్వతి తన అన్న సోమన్నకి ఈ ఘోరం గురించి చెప్పి అర్ధరాత్రి చెట్టుకి ఉరివేసుకొని చనిపోయింది.
దాంతో సోమన్న పోలీసుల వి•ద రగిలి పోయాడు. ఆ దారుణం గురించి ఊళ్లో తన చుట్టాలకు, స్నేహితులకు చెప్పాడు. పాతికమంది యువకులతో పోలీస్‌ అవుట్‌ ‌పోస్ట్ ‌వి•ద దాడిచేసి కానిస్టేబుల్‌ ‌మురళిని కర్రలతో కొట్టి చంపేసాడు. అక్కడ డ్యూటీ•లో ఉన్న ముగ్గురు పోలీసులు వాళ్లని అడ్డు కున్నారు. అయితే సోమన్న మనుషులు ఎక్కువ మంది ఉండటంతో ముగ్గురు పోలీసులు ఆ దాడిలో చనిపోయారు. సోమన్న బృందం పోలీసు అవుట్‌ ‌పోస్ట్‌ను తగులపెట్టింది. పార్వతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం, ఆమె ఆత్మహత్య వార్తలు మన్యం అంతా దావానంలా వ్యాపించాయి. మన్యం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గిరిజనుల్లో పోలీసుల వి•ద కసి పెరిగింది. ఆ సమాచారంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. కలెక్టర్‌, ఎస్పీ సంఘటనా స్థలికి బయల్దేరారు. పోలీసు ప్రధాన కార్యాలయం రెండు వందల మంది సాయుధ పోలీసులను అక్కడికి పంపింది.
 పోలీసులు మన్యం వి•ద విరుచుకుపడ్డారు. సోమన్న సహా చాలామంది గిరిజన యువకులను పోలీసు స్టేషన్‌కి తీసికెళ్లి హింసించడం మొదలు పెట్టారు.
సోమన్నను పోలీసు స్టేషన్లో అరెస్ట్ ‌చూపించ కుండా హింసించి, నాలుగు రోజుల తరువాత వదిలిపెట్టారు. అతని ఒంటినిండా గాయాలు. అప్పటికి ధరణి బాలింతరాలు.మూడు నెలల క్రితం ఒక ఆడపిల్ల(వనజ)కి జన్మనిచ్చింది. ఆమె విధులకు వెళ్లక పోవడంతో జీతం రావటంలేదు. దానికి తోడు పోలీసుల ఫిర్యాదుతో సోమన్నని కాంట్రాక్టరు ఉద్యోగం నుంచి తీసివేసాడు.
దాంతో ఇల్లు గడవని పరిస్థితి. పోలీసుల భయంతో గిరిజన గ్రామాల్లో యువకులు కనిపిం చటం లేదు. వాళ్లు ఎక్కడెక్కడికో పారిపోయారు. వస్తే పోలీసులు హింసిస్తారనీ భయం.
ళి       ళి       ళి
 వారం రోజుల తరువాత ఒకరోజు చింతపల్లి వెళుతున్న పోలీసుల వాహనాన్ని నక్సలైట్లు పేల్చి వేసారు. ఆ దుర్ఘటనలో పాతికమంది పోలీసులు మృత్యువాత పడ్డారు.‘గిరిజనుల వి•ద అత్యాచారాలకు, హింసాకాండలకు ప్రతీకారంగా పోలీసుల బస్సుని మేమే పేల్చేశాం’ అని నల్లకొండ దళం ఒక ప్రకటనలో తెలిపింది.
 మళ్లీ మన్యం అంటుకుంది. ఈసారి చాలా ఘోరంగా.
దాంతో గ్రేహౌండ్స్ ‌పోలీసు దళం నక్సల్స్ ‌వేట మొదలు పెట్టింది. ప్రతి గిరిజన గ్రామానికి వచ్చి వెతకడం ప్రారంభించారు. అనుమానంతో చాలామంది యువకులను అరెస్ట్ ‌చేసారు. కెంగువలో ప•ది మంది యువకులను అరెస్ట్ ‌చేసారు.కానీ వారిలో సోమన్న లేడు. ఎందుకంటే వారం రోజుల క్రితం అతను హఠాత్తుగా అదృశ్యం అయ్యాడు. పోలీసులే అతన్ని తీసికెళ్లారని కొందరు అంటే… అతను నక్సలైట్లలో చేరిపోయాడనీ మరికొందరు అన్నారు.
సోమన్నే తమ గురించి నక్సలైట్లకు సమాచారాన్ని చేరవేశాడని పోలీసుల అనుమానం.అందుకే మరింత పట్టుదలతో అతని ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాలను జల్లెడ పట్టసాగారు. కెంగువలో మకాం వేశారు.
ఈ హడావిడి, ఉద్రిక్త పరిస్థితుల్లో జనం బయటకు రావడం లేదు.పిల్లలు బడికి రావడం లేదు. నాకెందుకో అక్కడ ఉద్యోగం నచ్చలేదు. ఉద్యోగం వచ్చి నప్పుడు, ఏజన్సీ ప్రాంతం అని భయపడ్డా… గిరిజనుల పిల్లలకు విద్యాదానం గొప్ప విషయంగా భావించి ఆనందంగా వెళ్లాను. కానీ ఈ పోలీసులు, నక్సలైట్ల పరస్పర ఘర్షణ వల్ల పరిస్థితులు చదువు చెప్పేటందుకు అనువుగా లేవు. కొన్నాళ్లు అక్కడే ఉంటే నన్ను కూడా పోలీసులు అనుమానించే ప్రమాదం ఉంది.
అలా అని ఉద్యోగం మానేసే పరిస్థితి లేదు. చాలా కష్టపడితే కానీ ఉద్యోగం దొరకలేదు. దానికి తోడు నాకు ఇంకో రెండు నెలల్లో కౌసల్యతో పెళ్లి. ఉద్యోగం రాగానే మా నాన్న పెళ్లి కోసం తొందర పెట్టాడు. ఉద్యోగం వస్తే గాని పెళ్లి చేసుకోననీ అప్పటి వరకూ చెబుతుండేవాడిని. ఇప్పుడు పెళ్లి వద్దన డానికి నాకు కారణం దొరకలేదు. ఇక తప్పక పెళ్లి చూపులకు మా పక్క ఊరు వెళ్లి కౌసల్యను చూసాను. ఆమె నచ్చడంతో ఆమెతో నా పెళ్లి నిశ్చయమైంది.
ఆ తరువాతి వారం నేను ఊరు వెళ్లినపుడు, పెళ్లికి ముహూర్తాలు పెట్టించానని మా నాన్న చె•ప్పారు.పెళ్లైతే ఈ ఏజన్సీ ప్రాంతంలో కొండల వి•ద గ్రామంలో కాపురం పెట్టడం కష్టమనీ, కౌసల్య అక్కడ ఉండలేదనీ నా భావన. అందుకే పెళ్లి అనగానే నాకు భయం వేయసాగింది. ఈ లోపల ఈ గొడవలు మొదలయ్యాయి.
వారం రోజులైంది. సోమన్న జాడలేదు. రోజూ రాత్రి పూట పోలీసులు అతని ఇంటికి వచ్చి, అతని ఆచూకీ చెప్పాలంటూ భార్య ధరణిని ఒత్తిడి చేయ సాగారు. నిత్యకృత్యమైన ఈ గొడవకు భయపడి పోయింది. భర్త నక్సలైట్లలో చేరిపోయాడని ఊళ్లో వాళ్లంతా అనుకోవడం ఆమె చెవిన పడింది. ఈ విషయం తెలిస్తే పోలీసులు అసలు ఊరుకోరు. తనని విపరీతంగా హింసిస్తారు.నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చాడని తన బావ (గౌరి మొగుడు) భీమన్నను పోలీస్టేషన్‌కి తీసికెళ్లి విపరీతంగా కొట్టడంతో అతను అక్కడే చనిపోవడం, అయినప్పటికీ పోలీసులు గౌరిని ఎన్నో సార్లు స్టేషన్‌కి తీసికెళ్లి విచారణ పేరిట వేధించడం ధరణికి గుర్తుకొచ్చాయి.
అందుకే ఆమె గౌరి ఇంటికి వెళ్లిపోయింది. సోమన్న లేక పోవడంతో ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.చేతిలో డబ్బులు లేవు. హాస్పిటల్లో రోజువారీ వేతనపై పనిచేస్తున్న గౌరి జీతం కూడా తక్కువే. నెలకి 5000 రూపాయలకు మించి జీతం రాదు.దీనికి తోడు ధరణికి చంటిపిల్ల వనజ. దానికి పాలడబ్బాలు కొనవలసిన పరిస్థితి.
* * *
 సోమన్న ఎక్కడ ఉన్నాడో అతని భార్య ధరణికి తెలుసని ఒక ఇన్ఫార్మర్‌ ‌చెప్పడంతో..•రెండు రోజుల తరువాత పోలీసులు ఆమెను పోలీసు అవుట్‌ ‌పోస్టుకి తీసికెళ్లి ప్రశ్నించడం మొదలు పెట్టారు. ధరణి తన కూతురు వనజని అక్కకు అప్పగించి పోలీసుల వెంట వెళ్లింది.
ఆ రోజు ఆమెను ప్రశ్నించడానికి కొండగిరి పోలీసు స్టేషన్‌ ‌నుంచి ఎస్సై రంగారావు వచ్చాడు. అతను చాలా క్రూరమైన వ్యక్తి, ఎందర్నో ఎన్‌కౌంటర్‌ ‌చేసి చంపాడన్న పేరున్నవాడు.
అతని ఆధ్వర్యంలో ధరణిని ప్రశ్నించడం మొదలు పెట్టారు పోలీసులు. అతని చేతిలో లాఠీ, జేబులో పిస్టల్‌ ‌కూడా ఉంది.
‘‘ఏమే! ఎక్కడ నీ మొగుడు సోమన్న?’’గద్దించి అడిగాడు రంగారావు. అతను బాగా తాగి ఉండటంతో కళ్లు ఎర్రగా ఉన్నాయి.
‘‘నాకు తెలీదు బాబు. పది రోజుల క్రితం ఆడిని మీ పోలీసులు తీసికెళ్లారు. ఆ తరువాత ఏటయ్యేడో నాకు తెలవదు. ఆ రోజు నుంచి ఆడు ఇంటికి రానేదు’’ చెప్పింది ధరణి.
‘‘నువ్వు ఏం చెబితే అది నమ్మడానికి నేనేవి• ఎదవని కాను. ఆడు మొన్న రాత్రి ఇంటికి వచ్చి నీ పక్కన తొంగున్నాడని మాకు తెలిసింది. నువ్వేమో నాకేటీ తెలియదని నంగనాచి కబుర్లు సెబుతున్నావు. వాటిని మేము నమ్మాలా? మర్యాదగా ఆడెక్కడున్నాడో సెప్పు? లేకపోతే ఎముకలు యిరగ్గొడతాను’’ అంటూ లాఠీ తీసి ఆమె కాళ్ల వి•ద నాలుగుసార్లు గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బల• ఆమె కాళ్ల ఎముకకు తగిలాయి. దాంతో ఆమె గట్టిగా అరుస్తూ కింద పడి పోయింది.
‘‘బాబూ! నాకు ఆడెక్కడున్నాడో తెలవదు, నా మాట నమ్మండి. నన్నొది లేయండి.’’ అంది ఏడుస్తూ.
‘‘ఆడు ఎక్కడున్నాడో సెప్పేస్తే, నేనే మీ ఇంటికి దగ్గరుండి దిగబెడతా. అప్పుడు ఈ దెబ్బలూ ఉండవు… ఈ ఏడుపూ ఉండదు’ అన్నాడు మళ్లీ లాఠీతో కాళ్ల వి•ద కొడుతూ.
 కొట్టిన దగ్గరే మళ్లీ కొట్టడంతో ఈ సారి ఆమెకు విపరీతంగా నొప్పి కలిగింది. దాంతో ఆమె గట్టిగా అరుస్తూ …
‘‘బాబూ! నాకేటీ తెలవదు. నన్ను కొట్టొద్దు. నేను సచ్చిపోతే నా పిల్లను సూసేవాడెవ్వడూ నేడు. మీకు దండం ఎడతాను..నన్నొగ్గేయండి•’’ అంది రంగారావు కాళ్లు పట్టుకుంటూ.
‘‘నిన్నొగ్గేస్తే ఆడి గురించి ఎవరు చెబుతారే? నువ్వు నాటకాలాడకుండా నిజం చెప్పు? నువ్వు చెప్పకపోయినా ఆడి•నెలా పట్టుకోవాలో మాకు తెలుసు. నా గురించి, నా లాఠీ దెబ్బల గురించి నీకు తెలిసినట్లు లేదు. ఈ లాఠీ దెబ్బలు తిన్న తరువాత బతికి బట్ట కట్టినోడెవ్వడూ ఈ భూవ్మిద లేడు. మర్యాదగా చెప్పు’’ అంటూ ఈసారి చేతుల వి•ద, నడుం మీద గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు.
ఆ దెబ్బలకు ఆమె గట్టిగా అరుస్తూ నేల వి•ద పడిపోయింది. రంగారావు కొట్టడం ఆపి ఆమెను చూసాడు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. అతను కానిస్టేబుళ్లను పిలిచి ముఖం మీద నీళ్లు జల్లించాడు.అయినా ఆమెకు తెలివి రాలేదు. అప్పటికి సమయం సాయంత్రం ఐదు గంటలైంది. ఏజన్సీ ప్రాంతం కాబట్టి చీకటి పడుతోంది.
ఆమెతో పాటు వచ్చి బయట ఉన్న కెంగువ గ్రామ యువకులు ఆమె అరుపులు విని పోలీస్‌ అవుట్‌ ‌పోస్ట్ ‌లోపలికి రాబోతుండగా, పోలీసులు వాళ్లని లాఠీలతో కొట్టారు. అక్కడ చాలా సేపు గొడవ జరిగింది. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాల వాళ్లకి తెలిసి వందమంది గిరిజనులు కర్రలు, గునపాలతో అవుట్‌ ‌పోస్టుని చుట్టు ముట్టారు.
ఈ విషయాన్ని రంగారావు సర్కిల్‌ ఇనస్పెక్టర్‌కి చేరవేయడంతో,మరి కొంతమంది పోలీసులు వ్యాన్లలో బయలుదేరారు.వాళ్ల రాక విషయం తెలుసుకున్న కొందరు యువకులు వాళ్లొచ్చే దారిలో చెట్లు కొట్టేసి రోడ్డుకు అడ్డంగా పడేశారు దాంతో పోలీసు వాహనం అక్కడే ఆగిపోయింది.
ఈ లోపు యువకులు అవుట్‌ ‌పోస్ట్ ‌వి•ద దాడి చేసి అడ్డొచ్చిన నలుగురు పోలీసులపై దాడి చేశారు. పోలీసులు చనిపోయారు.
ఎదురు పడ్డ పోలీసులందర్ని కర్రలతో బాది రక్తం వచ్చేలా కొట్టారు. ఇంతలో వాళ్లకి రంగారావు ఒక గదిలో కనిపించాడు. అంతే! వాళ్లలో ఆవేశం పొంగింది. ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. పదిమంది కర్రలతో దాడి చేసి బయటకు తీసుకు వచ్చి కొట్టడంతో రంగారావు రక్తం కక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు.
గ్రామస్తులు ధరణిని తీసుకొని వెళ్లిపోయారు.
పోలీసు స్టేషన్‌ ‌దగ్గర శ్మశాన వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసు శవాలే. ఆరుగురు పోలీసులు, ఎస్సై రంగారావు ఆ దాడిలో చని పోయారు.
 ‘‘గిరిజనులకు, పోలీసులకూ మధ్య తీవ్రమవుతున్న రణం. చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం’’ అంటూ టీవీ ఛానళ్లలో బ్రేకింగ్‌ ‌న్యూస్‌ ‌మొదల య్యాయి.
 పోలీసులు, దారికి అడ్డంగా ఉన్న చెట్లను తొలగించుకొని అవుట్‌ ‌పోస్ట్‌కి చేరుకున్నారు.
ఆ రాత్రి ఇంటికి వచ్చిన మొగుడు సోమన్నను చూసి ఆశ్చర్యపోయింది ధరణి.
‘‘ఇన్నాళ్లూ ఎక్కడున్నావు మావా? నీ గురించి పోలీసులు వెతుకుతున్నారు. నువ్వు కనిపిస్తే కాల్చేస్తారు. ఎందుకీ పని చేసావు?’’అడిగింది ఏడుస్తూ.
‘‘ఆరోజే వాళ్లు నన్ను కాల్చేయ్యాలనీ చూసారు. ఇప్పుడు వాళ్లకి దొరికితే నన్ను బతకనివ్వరు. ఎన్‌కౌంటర్‌ ‌పేరుతో కాల్చేస్తారు.ఈ రోజు ఉదయాన్నే నిన్ను పోలీస్‌ ‌స్టేషన్‌కి తీసికెళ్లి నా గురించి చెప్పాలని కొడుతున్నారని మన ఊరు మారీచుగాడు చెప్పాడు. అందుకే నిన్ను, పిల్లనీ చూద్దామనీ వచ్చా’’ అన్నాడు సోమన్న.
‘‘పిల్ల అక్క గౌరి దగ్గరుంది మావా! నువ్వు లేకుండా బతకడం కష్టమైతోంది. ఏటె•తే అది అవుతాది. పోలీసులకు లొంగిపోతేనే మంచిదేమో. నేకపోతే నిన్ను ఏటాడేటట్టున్నారు.ఒకవేళ నువ్వు తప్పించుకున్నా నన్ను సంపుకు తింటారు. నువ్వెక్కడున్నావో నాకు తెలుసనీ వాళ్లు నన్ను నానా బాధలూ పెడు తున్నారు. పోలీసులు మనింటికాడే కాపలా ఉంతన్నారు. ఇయాళ ఉదయం పోలీసులు సనిపోవడంతో ఆళ్లు ఇక్కడికి రానేదు. పోలీసులు మన ఊరోళ్లని యేటాడి మరీ సంపుతునారు. ఏటి సెయ్యాలో అర్థం కావటం నేదు. ఎలా బతకాలోననీ భయం ఏత్తాంది’’ అంది ధరణి ఏడుస్తూ.
(సశేషం)

– ‌గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.