మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లోని పాత్రలు ఎదుర్కొన్న సవాళ్లు, వారు పాటించిన ధర్మం నేటి ఆధునిక కాలంలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడికి అద్భుతమైన పరిష్కారాలను చూపిస్తాయి. మనం చేసే పని కంటే, దాని వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందోనని ఊహించుకుని ఎక్కువ భయపడతాం (కురుక్షేత్ర యుద్ధం – అర్జునుడు). రేపటి గురించి చింతించకుండా, నేటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే సగం ఒత్తిడి మాయమవుతుంది.

శ్రీ‌రాముడు తన పట్టాభిషేక వార్త విన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, అడవికి వెళ్లాలన్నప్పుడు కూడా అంతే ప్రశాంతంగా ఉన్నాడు. జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చినప్పుడు కుంగి పోకూడదు. పరిస్థితిని అంగీకరించి, ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడమే ‘స్థితప్రజ్ఞత’. పని భారం పెరిగినప్పుడు మనం చేయలేమేమో అని భయపడతాం. మనలోని అంతర్గత శక్తిని తెలుసుకుని ఏ పనైనా పూర్తి చేయాలనే సంకల్పం ఉంటే విజయం తథ్యం. హనుమంతుని విషయంలోనూ ఇది కనిపిస్తుంది.

రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయి 13 ఏళ్ల పాటు అడవుల్లో ఉండటం పాండవులకు ఎంతో ఒత్తిడి కలిగించే విషయం. కానీ వారు ఆ కాలాన్ని వృథా చేయలేదు. అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించాడు. మిగతా నలుగురూ వారి వారి నైపుణ్యాలను మెరుగు పర్చుకున్నారు. కష్టకాలం వచ్చినప్పుడు ఆవేశపడ కుండా సహనం వహించాలి. కష్టాలు శాశ్వతం కావు. క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని మనం మరింత మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించాలి. పురాణాల్లోని పాత్రలు మనలాగే రక్త మాంసం ఉన్న మనుషులుగా కాకుండా, భావోద్వేగాలను జయించిన మహోన్నత వ్యక్తులుగా కనిపిస్తాయి. వారు ఎదుర్కొన్న ఒత్తిడి సామాన్యమైనది కాదు, కానీ వారు దానిని అధిగమించిన తీరు అద్భుతం.

ఇతిహాసాల్లోని మహర్షులు, మహారాజులు ఒత్తిడిని ఎలా జయించారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజ్యపాలనలో రాజులకు బాధ్యతల ఒత్తిడి ఉంటే, తపస్సు చేసే రుషులకు ఇంద్రియాలను జయించాలనే అంతర్మథనం ఉంటుంది. సంసారంలో ఉంటూనే నిర్లిప్తత. మిథిలా నగర చక్రవర్తి జనక మహారాజు ‘రాజర్షి’గా పేరుపొందాడు. అంటే రాజుగా ఉంటూనే రుషి జ్ఞానం కలిగి ఉండటం. ఒకసారి జనకుడు తన గురువు అష్టావక్రుడితో మాట్లాడుతున్నప్పుడు, భవనం తగలబడుతోందని వార్త వస్తుంది. మిగతా వారంతా కంగారు పడితే, జనకుడు మాత్రం నిశ్చలంగా ఉంటాడు. ‘నేను కేవలం ఒక నిమిత్త మాత్రుడిననే భావన ఆయనకు ఉండేది. అధికారం, ఆస్తులు, హోదా..ఇవన్నీ శాశ్వతం కాదని గ్రహిస్తే, వాటిని కోల్పోతామనే భయం ఉండదు. పనులు చేస్తున్నా, మానసికంగా వాటికి అంటుకోకుండా ఉండటమే (ణవ••మీష్ట్రఎవఅ•) ఆయన విజయ రహస్యం.

విశ్వామిత్రుడు సృష్టించిన అనేక అడ్డంకులు, తన కుమారుల మరణం వంటి ఘోరమైన విపత్తులు ఎదురైనా వశిష్ఠుడు  తన ప్రశాంతతను,అపారమైన సహనం కోల్పోలేదు. కోపం, అసూయ ఒత్తిడిని పెంచుతాయి. విశ్వామిత్రుడు అహంకారంతో పోరాడితే, వశిష్ఠుడు శాంతంతో గెలిచాడు. ఎదుటి వారు మనపై ఒత్తిడి తెచ్చినా, విమర్శించినా మనలోని క్షమాగుణం మనల్ని ప్రశాంతంగా  ఉంచుతుంది.

శ్రీరాముడు అడవికి వెళ్లినప్పుడు, భరతుడు అయోధ్య రాజ్యబాధ్యతను భారంగా కాక ఆరాధనగా పాలించాడు. ఆయన రాజుగా కాక, రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఒక సేవకుడిగా పాలన చేశాడు. ‘నేను యజమానిని’ అనుకున్నప్పుడు పని భారం (దీబతీ•వఅ) అనిపిస్తుంది. కానీ ‘నేను సేవ చేస్తున్నాను’ అని భావించినప్పుడు అదే పని ఒక ఆరాధన అవుతుంది. మన ఉద్యోగాన్ని లేదా పనిని ‘భారం’గా కాకుండా, సమాజానికి లేదా భగవంతునికి చేసే ‘సేవ’గా భావిస్తే ఒత్తిడి దరిచేరదు. రాజులకు యుద్ధాలు, రాజ్యరక్షణ వంటి తీవ్ర  ఒత్తిళ్లు ఉండేవి. కానీ వారు ‘ధర్మం’ వైపు నిలబడటం వల్ల వారి మనసు ఎప్పుడూ దృఢంగా ఉండేది. మనం కూడా మన పనిలో ధర్మబద్ధంగా ఉంటే, అనవసరమైన ఆందోళనలు మనల్ని ఏమీ చేయలేవు.

భర్త మరణం, ఐదుగురు కొడుకులతో అడవుల పాలు కావడం, ఇలా ఎన్నో. నిరంతర అభద్రతా భావం, జీవితాంతం కష్టాలను అనుభవించిన కుంతి సానుకూల దృక్పథం (జూ•ఱఎఱఎ) అందరికీ ఆదర్శం. కష్టాన్ని ఒక పరీక్షగా, ఎదుగుదలకు ఒక మెట్టుగా భావిస్తే ఒత్తిడి అనేది ఉండదు.

నీలకంధరుడు

సముద్ర మథనంలో పుట్టిన భయంకరమైన విషాన్ని శివుడు స్వీకరించి, దానిని  మింగకుండా లేదా బయటకు విసిరెయ్యకుండా  కంఠంలోనే నిలిపివేసి ‘నీలకంఠుడు’ అయ్యాడు. మన జీవితంలో ఎదురయ్యే విమర్శలు, అవమానాలు., ప్రతికూలతలు ‘విషం’ వంటివి. వాటిని లోపలికి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. బయటకు.. అంటే ఇతరుల మీద కోపం చూపిస్తే సంబంధాలు దెబ్బ తింటాయి. శివుడిలా వాటిని నియంత్రించి (గొంతులోనే నిలిపి), ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. తపస్సులో ఉన్న శివుడిని ఇబ్బంది పెట్టాలని చూసిన మన్మథుడిని, శివుడు తన వ•డవ కంటిని తెరిచి భస్మం చేశాడు. మనసును పక్కదారి పట్టించే కోరికలు, వ్యామోహాలు, పరధ్యానాలపై విజయం సాధించడమే నిజమైన నిగ్రహం. మనలోని అనవసరమైన ఆలోచనలను జ్ఞానమనే వ•డవ కంటితో భస్మం చేయాలి. శివుడు శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చి అర్థనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు. ఇది పురుష ప్రకృతి శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. ఒత్తిడిని అధిగమించాలంటే కఠినత్వం, మృదుత్వం మధ్య సమతుల్యత ఉండాలి. అతిగా ఆలోచించడం లేదా అతిగా స్పందించడం కాకుండా, మధ్యేమార్గంలో ఉండటమే నిగ్రహం.

శివుని రూపంలో దాగి ఉన్న నిగ్రహ సూత్రాలు

నెత్తిన గంగ ప్రవాహంలాంటి ఆలోచనలు ఉన్నా, తల (మనసు) ఎప్పుడూ చల్లగా ఉండాలి. భౌతికంగా కళ చూసేదాని కంటే, వివేకంతో (వ•డవ కన్ను)లోతుగా ఆలోచించడం., కలిగించే పరిస్థితులు చుట్టూ ఉన్నా, వాటిని అలంకారం(మెడలో పాము)గా మార్చుకుని నిర్భయంగా ఉండటం, జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే శ్మశాన (వాసం) వైరాగ్య భావం శివుడు మనకు నేర్పే అతిపెద్ద పాఠ్యాంశాలు. చుట్టూ ఎంత కో(హా)లాహలం ఉన్నా, మదిలో హిమాలయ మంత నిశ్శబ్దం ఉండాలి. అదే నిజమైన నిగ్రహం.

భీష్ముడు

మనసు గందరగోళంగా ఉన్నప్పుడు, ఆందోళన మనల్ని చుట్టుముట్టినప్పుడు.. మనల్ని మళ్లీ నిలబెట్టి, సరైన మార్గంలో నడిపించే ‘నిశ్చలమైన సంకల్పమే’ ధృతి.లేదా అంపశయ్యపై ఉన్నా, తన ప్రతిజ్ఞకు కట్టుబడి మరణాన్ని కూడా తన నియంత్రణలో ఉంచుకున్న నిశ్చలమైన సంకల్పం భీష్ముని ‘ధృతి’.

ప్రహ్లాదుడు

చిన్న వయసులోనే తండ్రి హిరణ్యకశిపుడు పెట్టిన అనేక కష్టాలను (పాములతో కరిపించడం, కొండపై నుండి తోయడం, విషం ఇవ్వడం) ప్రహ్లాదుడు అనుభవించాడు. తన దృష్టిని తనపై జరుగుతున్న హింస మీద కాకుండా, తాను నమ్మిన నారాయణుడి మీద నిలిపాడు. మనసు ఒకే లక్ష్యం మీద (ఏకాగ్రత) కేంద్రీకృతమైతే బయటి భయాలు ఒత్తిడిని కలిగించలేవని ప్రహ్లాదుడి కథ నిరూపిస్తుంది.

సావిత్రి

కాలంతో పోరాటం తన భర్త ప్రాణాలు ఏడాదిలో పోతాయని తెలిసినా సావిత్రి కుంగిపోలేదు. యముడితో వాదించి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు సాధారణంగా మనుషులు తెలివితేటలు కోల్పోతారు. కానీ సావిత్రి అత్యంత ప్రశాంతంగా, యుక్తితో యముడిని మెప్పించింది. చిక్కుముడులను ప్రశాంతంగా ఆలోచిస్తేనే విప్పగలమని సావిత్రి చెబుతుంది.

నల మహారాజు

శని ప్రభావంతో రాజ్యాన్ని, సంపదను, చివరకు వస్త్రాన్ని కూడా కోల్పోయి అడవులపాలైన నలుడు, భార్యకు దూరమై, వికృతరూపాన్ని పొందాల్సి వచ్చింది. ‘పాకశాస్త్రం’ (వంట) ‘అశ్వహృదయం’ (కర్కోటకుడు అనే సర్పం ఇచ్చిన విద్యలలో గుర్రాలను నడపడం ఒకటి.) అనే నైపుణ్యాలను నమ్ముకుని జీవించాడు. కాలం కలిసి రానప్పుడు నైపుణ్యాలే (••ఱశ్రీశ్రీ) మనల్ని ఒత్తిడి నుండి కాపాడి మళ్లీ నిలబెడతా యని నలుని జీవిత సందేశంగా భావించాలి. పురాణ పాత్రలన్నీ ఒత్తిడిని అధిగమించ డానికి ప్రధానంగా ‘మౌనం’, ‘ప్రార్థన’, ‘స్థితప్రజ్ఞత’ (సుఖదుఃఖాలను సమానంగా చూడటం) అనే సాధనాలను వాడాయి. ఆధునిక కాలంలో ఎదుర్కొనే ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలకు ఈ పురాణ పాత్రల మనోధైర్యం ఒక గొప్ప మార్గదర్శి.

సాధారణంగా రాక్షసులు అంటే కేవలం కోపం, ఆవేశం అనుకుంటాం. కానీ పురాణాల్లోని కొందరు రాక్షసులు, దేవతలు అత్యంత క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొని తమ లక్ష్యాలను సాధించారు. రాక్షసులు తమకు ఎదురయ్యే అవమానాలను, అడ్డంకులను ఘోర తపస్సు ద్వారా అధిగమించేవారు. ఇది నేటి కాలంలో ‘తీవ్రమైన ఏకాగ్రత’ (ణవవజూ ఖీశీమీబ)కు ప్రతీక.

బలి చక్రవర్తి

వామనావతారంలో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు దానం అడిగినప్పుడు, తన గురువు శుక్రాచార్యుడు వారించినా బలి చలించలేదు. మాట తప్పడం వల్ల వచ్చే ఒత్తిడి కంటే, ధర్మానికి కట్టుబడి ఉండటమే మిన్న అని భావించాడు. తన రాజ్యాన్ని కోల్పోతున్నా సరే, చిరునవ్వుతో తన తలనే దానంగా ఇచ్చాడు. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు,మన విలువలకు కట్టుబడి ఉంటే మనశ్శాంతి లభిస్తుంది.

విభీషణుడు

రావణుడి సభలో అందరూ రాముడిని ఎదిరించాలని ఒత్తిడి తెస్తున్నా, విభీషణుడు ఒక్కడే ధర్మం వైపు నిలబడ్డాడు. సొంత అన్నను, ఇంటిని వదిలి పెట్టడం అనేది సామాన్యమైన మానసిక ఒత్తిడి కాదు. సవ•హం తప్పు దారిలో వెళ్తున్నప్పుడు, ఒంటరిగానైనా సరే సరైన మార్గంలో వెళ్లే ధైర్యం ఒత్తిడిని తగ్గిస్తుంది.

దేవతలు

దేవతలు తరచూ రాక్షసుల చేతిలో ఓడిపోయి, రాజ్యాలను కోల్పోయి తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారు.వారు దానిని అధిగమించిన తీరు విభిన్నంగా ఉంటుంది. దేవేంద్రుడు అనేకసార్లు తన సింహాసనాన్ని కోల్పోయాడు. కానీ ఆయన ఎప్పుడూ నిరాశతో ఆగిపోలేదు. బృహస్పతి వంటి గురువుల సలహాతో, ఇతర దేవతల సహకారంతో మళ్లీ  రాజ్యాన్ని సాధించేవాడు. ఓటమి ఎదురైనప్పుడు ఒత్తిడికి లోనవ్వకుండా, నిపుణుల సలహాలు తీసుకోవడం., జట్టుగా పని చేయడం(•వ•ఎ•శీతీ•) ముఖ్యం. రాక్షసుల వద్ద ఉన్న పట్టుదల, దేవతల వద్ద ఉన్న విజ్ఞత ఈ రెండింటినీ సమపాళ్లలో ఉపయోగిస్తే ఎలాంటి ఒత్తిడినైనా చిత్తు చేయవచ్చు.

ఇతిహాసాలు ఇచ్చే సందేశం

ఒత్తిడి అనేది బయట ఉండే పరిస్థితుల వల్ల రాదు, ఆ పరిస్థితులను మనం ఎలా స్వీకరిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. చేతుల్లో లేని దాని గురించి ఆందోళన చెందడం మానేయాలి. బాధ్యతను నీతిగా నిర్వహించాలి. రోజులో కొంత సమయం ధ్యానం లేదా మౌనం పాటించాలి.

మన ఇతిహాసాల్లోని ఇప్పటికీ మనం గుర్తుంచు కున్న పాత్రలు ఏవీ కష్టాలను చూసి భయపడలేదు, వాటిని ఎదుర్కొని చరిత్ర సృష్టించాయి. ఆ స్ఫూర్తే మన ఒత్తిడిని చిత్తు చేసే ఆయుధం!

తరిగొప్పుల విఎల్లెన్‌ ‌మూర్తి
8008577834

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE