సంస్కృతి అనేది ఒక సమాజపు జీవన విధానం అయితే, ఆ సంస్కృతిని భవిష్యత్‌ ‌తరాలకు అందించే జీవనవాహిని మహిళ. నాలుగు గోడల ఆంక్షలను దాటి, కార్పొరేట్‌ ‌రంగాల నుంచి అంతరిక్షం  వరకు జైత్రయాత్ర సాగించిన ఆధునిక మహిళ… నేడు యాంత్రిక జీవన ఒత్తిడిని జయించడానికి మళ్లీ అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య సూత్రాలను, మన ప్రాచీన సంస్కృతీ విలువలను ఆయుధంగా మార్చుకుంటోంది. ఆధునికతను అనుభవిస్తూనే, సంప్రదాయాన్ని ఆత్మగౌరవంగా భావిస్తూ సమతుల్య ప్రయాణాన్ని సాగిస్తోంది.

నేటి ప్రపంచంలో ఆధునికత, సంప్రదాయం ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని నిరూపిస్తున్నారు మహిళలు. సాంకేతిక విప్లవంతో ఆర్థిక స్వాతంత్య్రం సాధించి, యాంత్రిక జీవన లోపాలను అధిగమించ డానికి ప్రయత్నిస్తున్నారు. మళ్లీ ఆయుర్వేదం, సిరిధాన్యాలు, ప్రాచీన కళలు, నైతిక విలువలవైపు మొగ్గుచూపుతున్నారు.

ఒకప్పుడు మహిళల జీవితం నాలుగు గోడలకే పరిమితమై ఉండేది. సంప్రదాయాల సంకెళ్ల నుంచి బయటపడి, ఆధునిక విద్యను అభ్యసించి, ఐటీ, అంతరిక్షం, వ్యాపారం వంటి సాంకేతిక రంగాలలో మహిళలు నేడు పురుషులతో సమానంగా రాణిస్తు న్నారు. అయితే, సాంకేతికత అందించిన ఆర్థిక స్వాతంత్య్రం, ఆధునికతను అనుభవించిన తర్వాత, నేటి తరం మహిళలు మళ్లీ మన ప్రాచీన సంప్రదా యాలు, వ•లాలవైపు సాగుతున్నారు. ఒకప్పుడు ఆధునికత అంటే పాశ్చాత్య సంస్కృతిని అనుకరిం చడం, సాంప్రదాయాలను పక్కన పెట్టడం అనే భావన ఉండేది. కానీ నేటి మహిళలు ఆ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. వారు ఆధునికతను, సాంప్రదాయాన్ని ఎదురెదురు ధ్రువాలుగా కాకుండా, ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలుగా చూస్తున్నారు.

మహిళలను సంస్కృతి సంరక్షకులుగా అనేక సందర్భాలలో పరిగణిస్తారు. భాష, ఆచారాలు, పండుగలు, వంటకాలు, నైతిక విలువలను కుటుంబం ద్వారా పిల్లలకు అందించడంలో మహిళలే ప్రధాన భూమిక పోషిస్తారు. సంస్కృతి ఉనికిలో ఉండటానికి మహిళల భాగస్వామ్యం అత్యంత ప్రధానమైనది. కొన్నిసార్లు సంస్కృతి, సంప్ర దాయం పేరుతో మహిళలపై కొన్ని ఆంక్షలు విధిస్తుం టారు. ఒక నిర్దిష్ట శైలిలో మాత్రమే దుస్తులు ధరించా లని, కుటుంబ లేదా సామాజిక విషయాల్లో మహిళల అభిప్రాయాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, కొన్ని సంప్రదాయ కుటుంబాలలో మహిళలు ఇంటికే పరిమితం కావాలని ఆశించడం వంటివి ఆధునిక సమాజంలోనూ మనకు కనిపిస్తుంటాయి.

సాంకేతిక విప్లవం వల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఇంటి నుంచి పని చెయ్య గలిగే సదుపాయాలు వచ్చాయి. కానీ, దీనితో పాటే విపరీతమైన పని ఒత్తిడి, యాంత్రిక జీవనం, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం, మానసిక ప్రశాంతత కరవవ్వడం వంటి సవాళ్లు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే మహిళలు తమ ఆరోగ్యకరమైన జీవనం, మనశ్శాంతి కోసం సంప్ర దాయ మార్గాల వైపు చూడటం ప్రారంభించారు.

క్రమంగా తమ జీవన శైలిలో మార్పులు చేసుకొనేందుకు మార్గాలను వెతుకుతున్నారు. అమ్మమ్మలు, నానమ్మలు పాటించిన విధానాలను తిరిగి అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాచీన సంప్రదాయాలు, సంస్కృతిలో ఉండే ఆరోగ్య పద్ధతులను అలవరచుకొంటున్నారు. ఇందులో భాగంగా యోగా, ఆయుర్వేదంవైపు అడుగులు వేస్తు న్నారు. కార్పొరేట్‌ ‌జీవితంలో ఎదురయ్యే హార్మోనల్‌ ‌సమస్యలను,ఒత్తిడిని జయించడానికి జిమ్‌లు,అలోపతి చికిత్సల కంటే మన సంప్రదాయ యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. గర్భధారణ సమ యంలో కూడా ప్రాచీన గర్భ సంస్కార్‌ ‌పద్ధతులను పాటిస్తు న్నారు.

పరుగుల జీవితంలో చిక్కుకున్న పడతులు క్రమంగా ప్రాచీన పద్ధతులను అనుసరించేందుకు పయనం ప్రారంభిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌ ‌పరికరాల్లో తయారయిన ఆహారాన్ని, వసతులను పక్కన పెట్టి, సాంప్రదాయ భోజనం, ఆరోగ్య పరిరక్షణ వైపు ఆలోచన చేస్తున్నారు. సాంకేతిక వసతులకు స్వస్తి చెప్పి మళ్లీ మట్టి పాత్రలలో వండటం, రోటి పచ్చళ్లు, గానుగ నూనెలు, సిరిధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. కుటుంబ ఆరోగ్యమే దేశ ప్రగతికి సోపానంగా భావించి..సాంప్రదాయ జీవనశైలిని అలవరచు కొంటున్నారు.

ఆధునిక సాంకేతిక యుగంలోనూ మహిళలు ప్రాచీన సంప్రదాయాలకు సాధ్యమయినంత చేరువయ్యేందుకు ఇష్ట పడుతున్నారు. గతంలో మన సంప్రదాయాలు, కళలు, భాషలు మౌఖికంగా లేదా తాళపత్ర గ్రంథాల ద్వారా మాత్రమే నిక్షిప్తమై ఉండేవి. కానీ నేడు అంతరించిపోతున్న పురాతన గ్రంథాలను, కళారూపాలను డిజిటల్‌ ‌రూపంలో భద్రపరుస్తు న్నారు. దీంతో సోషల్‌ ‌మీడియా, •••ట్యూబ్‌ ‌ద్వారా కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు జానపద గీతాలు నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల మందికి చేరువవుతున్నాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను లేదా చారిత్రక కట్టడాలను ఇంటి నుండే చూసే వీలు కలుగుతోంది. ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించు కుంటున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రాచీన పద్ధతుల్లో ధ్యాన సాధన వంటివి అలవర్చు కుంటున్నారు.

నేటి ప్రపంచంలో మహిళలు సంస్కృతిని గౌరవిస్తూనే, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు. ఉన్నత చదువుల ద్వారా సంస్కృతిని మరింత హేతుబద్ధంగా అర్థం చేసుకుంటు న్నారు. వృత్తిపరంగా రాణిస్తూ, సమాజంలో తమ గొంతును బలంగా వినిపిస్తున్నారు. వ•ఢాచారాలను తిరస్కరించి, సంస్కృతిని సంస్కరించడంలో ముందు న్నారు. కార్పొరేట్‌ ‌రంగంలో, రాజకీయాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురుషులతో సమానంగా రాణిస్తు న్నారు. అయితే, ఎంత ఎదిగినా తన వ•లాలను, సంస్కృతిని మర్చిపోవడం లేదు.

ఆఫీసులో ల్యాప్‌టాప్‌ ‌ముందు కూర్చునే ఐటీ ఉద్యోగిని, పండగ వస్తే ఇంటి ముందు ముగ్గు పెట్టి, సాంప్రదాయబద్ధంగా పూజలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. విద్య, విజ్ఞానంతో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే విదేశాల్లోనూ మన సంప్రదాయాలకు ప్రాధాన్యతను పెంచుతున్నారు. మన పండుగలు వేడుకల్లో సాధ్యమైనంత వరకు దేశ సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తున్నారు. చేనేత, పట్టు వస్త్రాలను ధరించడం, శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడం, మన వంటకాలు, రుచులతో ఆకట్టుకోవడం పరిపాటిగా మార్చు కున్నారు. దేశం కాని దేశంలో ఉన్నా, సంక్రాంతి, దీపావళి వంటి వేడుకల్లో కుటుంబ సభ్యులతో అనుభూతిని వీడియో కాల్స్ ‌ద్వారా పంచుకుంటు న్నారు. ఆన్లైన్‌ ‌ద్వారా అన్నీ అందుబాటులోకి వస్తుండటంతో, ప్రతి సంప్రదాయ పండుగనూ శాస్త్రోక్తంగా జరుపుకొని భారత సంస్కృతిని ఇనుమడింప చేస్తున్నారు. సంప్రదాయ జ్ఞానాన్ని నేర్చుకోవడం సులభతరం కావడంతో కంప్యూటర్‌ ‌లోనే శ్లోకాలు, యోగా వంటి వాటిని గురువుల నుండి నేర్చుకోగలుగుతున్నారు.

చదువుకున్న మహిళలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, సాంప్రదాయ జీవనశైలిని అలవర్చుకొంటున్నారు. కళలపై ఆసక్తి చూపు తున్నారు. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం వంటి కళా రంగాలలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కళాత్మక రంగవల్లులు నేర్చుకోవడానికి, తమ పిల్లలకు నేర్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం ఉపాధి కోసం సోషల్‌ ‌మీడియా సాంకేతిక తను వాడుకుంటూనే మన చేనేత వస్త్రాలను, సంప్రదాయ దుస్తులను ప్రోత్సహిస్తున్నారు.

ఆధునిక తెలుగు మహిళల వస్త్రధారణలో సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. జీన్స్, ‌టాప్స్ ‌వేసుకునే అమ్మాయిలు కూడా పండగలు, పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కాంచీపురం పట్టుచీరలు, లంగా-ఓణీలు ధరించడానికి మక్కువ చూపుతు న్నారు. ప్రపంచవ్యాప్త పోకడలను మార్చేందుకు సైతం పూనుకుం టున్నారు. మన కళలు సంస్కృతి పరిరక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ, తమ పిల్లలకు తెలుగు భాషను, పండగల విశిష్టతను, నైతిక విలువలను నేర్పించడంలో మహిళలే ముందుంటున్నారు. విదేశాల్లో స్థిరపడిన ఆధునిక తెలుగు మహిళలు సైతం అక్కడ తెలుగు సంఘాలు ఏర్పాటు చేసి, బతుకమ్మ, సంక్రాంతి వంటి పండగలను ఘనంగా నిర్వహిస్తూ మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు.

పిల్లల పెంపకంలోను ఆధునిక మహిళల ఆలోచన విధానంలో ప్రత్యేక మార్పు కనిపిస్తోంది. చిన్న కుటుంబాలు, మొబైల్‌ ‌ఫోన్ల సంస్కృతి వల్ల పిల్లలు ఒంటరి వారవుతున్నారని గమనించిన తల్లులు, మళ్లీ ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. పిల్లలకు పంచతంత్ర కథలు, రామాయణ, మహా భారతాలలోని నైతిక విలువలను నేర్పుతూ, సాంకేతికతకు దూరంగా, సంస్కృతికి దగ్గరగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదా యాలు, సంస్కృతికి సంబంధించిన విలువలను బోధిస్తున్నారు.

మహిళ కుటుంబానికి కేంద్రబిందువు. ఆమె మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. సాంకేతికత అందించిన ప్రగతిని అందుకుంటూనే, సంప్రదాయం అందించిన సంస్కృతీ విలువలను కాపాడుకుంటూ నేటి మహిళ సాగిస్తున్న ప్రయాణం సమతుల్య సమాజ స్థాపనకు మైలురాయి.

సాంకేతికత నుంచి సంప్రదాయానికి మహిళలు సాగిస్తున్న ఈ పయనాన్ని కొందరు వెనకడుగుగా భావించవచ్చు. కానీ, ఇది వెనకడుగు కాదు. ఆధునికతలోని లోపాలను సరిదిద్దుకుంటూ సంప్రదాయంలోని గొప్పదనాన్ని స్వీకరించే వివేక వంతమైన ముందడుగుగా భావించాలి. ఆధునిక విజ్ఞానం ఇచ్చిన ఆలోచనా శక్తితో, సంప్రదాయంలోని వ•ఢనమ్మకాలను పక్కనబెట్టి, కేవలం అందమైన, ఆరోగ్యకరమైన విలువలను మాత్రమే మహిళలు స్వీకరిస్తున్నారు. కాలానికి అనుగుణంగా సంస్కృతిలో మార్పులు రావడం సహజం. అయితే మహిళల స్వేచ్ఛను, ఎదుగుదలను గౌరవించే మన సంస్కృతి భవిష్యత్‌లోనూ బలంగా నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE