పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి తుపాన్ ముందు ప్రశాంతతలా ఉంది. తమతో అణు నియంత్రణ ఒప్పందానికి రాని ఇరాన్ విషయంలో అమెరికా మరింత తీవ్రంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం చైనా పర్యటన ముగించుకొని స్వదేశానికి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ ఒకవేళ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్మూజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలని అన్నారు. ఇరాన్ పంపిన తాజా శాంతి ప్రతిపాదనలను తాను తిరస్కరించినట్లు చెప్పారు. తనకు ఆ ప్రతి పాదనలోని మొదటి పంక్తే నచ్చలేదని అందుకే దాన్ని పక్కన పెట్టేశానని తెలిపారు ట్రంప్. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ నడుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం ఆగినా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
షరతుల మీద షరతులు
తాజాగా ఇరాన్ ముందు అమెరికా ఐదు అత్యంత కఠినమైన షరతులను పెట్టింది. అవి. 1.ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంను తక్షణమే అమెరికాకు అప్పగించాలి. 2. ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో కేవలం ఒక్క కేంద్రం మాత్రమే పనిచేసేలా పరిమితం చేయాలి. 3. గతంలో అమెరికా విధించిన ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల ఇరాన్‌కు జరిగిన నష్టానికి ఎలాంటి ఆర్థిక పరిహారం చెల్లించేది లేదు. 4 విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25% నిధులను కూడా విడుదల చేసేది లేదు.
5. దాడుల ముగింపు అనేది పూర్తిగా ఈ చర్చల కొనసాగింపు, ముగింపు పైనే ఆధార•పడి ఉంటుంది. ఈ షరతులన్నీ అంగీకరించినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుందని అమెరికా పరోక్షంగా ఇరాన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా ఇరాన్ కూడా శాంతి చర్చలు ముందుకు సాగాలంటే అమెరికా కూడా తమ ఐదు డిమాండ్లను అంగీకరించాలని స్పష్టం చేసింది.
దీనికి ప్రతిగా శాంతి చర్చల కోసం అమెరికాకు ఇరాన్ ఐదు ప్రధాన షరతులను విధించింది:యుద్ధ విరమణ: 1. లెబనాన్ సహా అన్ని ప్రాంతాలలో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలి. 2. ఇరాన్‌పై విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను, దిగ్బంధనాన్ని తొలగించాలి. 3. విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులు, నిధులను పూర్తిగా విడుదల చేయాలి. 4.యుద్ధం కారణంగా ఇరాన్‌కు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలి. 5. హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కున్న సార్వభౌమాధికారాన్ని అమెరికా అధికారికంగా గుర్తించాలి.
‘ఎపిక్ ఫ్యూరీ 2.0’ సిద్ధం
ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో నిలిపేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఇప్పుడు ఎపిక్ ఫ్యూరీ 2.0 పేరుతో మళ్లీ చేపట్టాలని చూస్తోంది అమెరికా. ఈసారి కేవలం గగనతల దాడులకే పరిమితం కాకుండా, నేరుగా ఇరాన్ గడ్డ పైకి తమ ప్రత్యేక సైనిక బలగాలను మోహరించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జర్మనీలోని స్థావరాలనుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో ఇజ్రాయెల్‌లోకి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది.
తాజాగా డొనాల్డ్ తన ట్రూత్ సోషల్ యాప్‌లో విచిత్రమైన ఫొటో షేర్ చేశారు. ఇరాన్, దాని పొరుగు దేశాలపై అమెరికా జాతీయ జెండాను విస్తరించి ఉన్నట్లు చూపారు. అందులో ఇరాన్ మీద బాణం గుర్తులు పెట్టారు. అయితే దీనికి ఎలాంటి వ్యాఖ్య లేదు. ఈ పోస్ట్ చూస్తుంటే ఇరాన్ పై అమెరికా దాడులు పక్కా అని తెలిసిపోతోంది. అయితే అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పంది స్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. అమెరికా దౌత్య విశ్వసనీయతపై ఆయన విమర్శలు గుప్పిస్తూ. పశ్చిమాసియాలో శాంతికి డొనాల్డ్ ప్రధాన అడ్డంకిగా ఉందని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారాయన. ఇలాంటి పరిస్థితిలో మరోసారి యుద్ధమే మొదలైతే తీవ్ర వినాశనం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అణు దాడికి మేవ• సిద్ధం
అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రంగా ఎదురు తిరగాలని, గట్టిగానే స్పందించాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా అణుదాడి తప్పదని హెచ్చరించింది. తమ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను ఆయుధ తయారీకి అవసరమైన స్థాయిలో 90 శాతం స్వచ్ఛతతో శుద్ధి చేస్తామని ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయ్ చెప్పారు. ఇలా శుద్ధి చేయటం ద్వారా అణుబాంబు తయారీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చేశారాయన. 6 రోజుల్లో యురేనియాన్ని 90 శాతానికి శుద్ధి చేయవచ్చు. కానీ పూర్తి స్థాయి అణుబాంబు తయారు చేయడానికి 6 నుంచి 12 నెలలు పట్టవచ్చు అంటున్నారు. ఇరాన్ దగ్గర ఉన్న 440.9 కిలోగ్రాముల యురేనియం నిల్వను 60 శాతం శుద్ధి చేశారని అంతర్జాతీయ అణుసంస్థ భావిస్తోంది. దీనిని 90 శాతానికి పెంచడం అంటే అది అణ్వాయుధ తయారీకి కేవలం అడుగు దూరంలో ఉన్నట్లే. ఈ హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. యురేనియం సాంద్రత పెరిగేకొద్దీ, దానిని శుద్ధి మరింత సులభం అవుతుంది.
2006లో యురేనియం శుద్ధి పక్రియను ప్రారంభించిన ఇరాన్.. తమ లక్ష్యం శాంతియుత మైనదని నొక్కి చెప్పింది. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (×జు) నివేదికల ప్రకారం.. సంవత్సరాలు గడిచేకొద్దీ ఈ నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. 2010లో టెహ్రాన్ ఒక పరిశోధన రియాక్టర్‌కు ఇంధనాన్ని తయారు చేసే నెపంతో, 20 శాతం వరకు యురేనియం శుద్ధి చేయడం ప్రారంభిస్తామని ప్రకటించింది. ట్రంప్ మొదటి పదవీ కాలంలో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన తర్వాత గత ఎనిమిదేళ్లలో ఇరాన్ 22 వేల పౌండ్లు లేదా 11 టన్నుల యురేనియంను శుద్ధి చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఇరాన్ ఈ యురేనియాన్ని ఇస్ఫహాన్ టన్నెల్ కాంప్లెక్స్‌లో దాచి ఉంచొచ్చు అనే అనుమానాలున్నాయి.ఇరాన్ అణుబాంబు తయారుచేస్తే, దాన్ని తమపై వెయ్యగలదు అని ఇజ్రాయెల్ భయపడుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా మీద ఇరాన్ అణుబాంబుతో దాడి చేసే అవకాశం లేదు. ఇరాన్ వద్ద పూర్తిస్థాయి అణ్వాయుధం, అమెరికాను నేరుగా తాకగల ఖండాంతర క్షిపణులు కూడా వాటి వద్ద అందుబాటులో లేవు. ఇరాన్ నుంచి అమెరికా దాదాపు 10,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం పయనించి తాకే అవకాశం లేదంటున్నారు. కాగా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదు. అమెరికా దీనిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. వారి ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కానివ్వబోం అంటూ డొనాల్డ్ ట్రంప్ హుంకరిస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధానికి, శుద్ధి చేసిన యురేనియం ముఖ్య కారణమని ట్రంప్ పదేపదే చెబుతోన్న సంగతి తెలిసిందే. వారిని అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ప్రతిపాదనలో తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేసి, మిగిలిన దానిని వ•డో దేశానికి బదిలీ చేసే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ترمب والمفاوضات مع إيران: بحث عن مخرج من الحرب أم خداع جديد؟