‌ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంలో 80 ఏళ్ల స్వాతంత్య్రం, లౌకికవాదం, ఉదారవాదం వచ్చినా, భారతదేశంలోని ముస్లిం యువత తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతూ, ‘గజ్వా-ఎ-హింద్‌’ (‌కొంతమంది మతగురువులు ప్రకటించే భారతదేశ ఇస్లామీకరణ) అనే మాయాజాలం వెంట పడుతున్నారని ఇటీవల జరిగిన రెండు ఆందోళనకర సంఘటనలు సూచిస్తున్నాయి. అంతే దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, దేశ జనాభాలో 80 శాతం, అంటే 100 కోట్లకు పైగా హిందువులు ఉన్నప్పటికీ, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారు వారిని బలవంతం, హింస ద్వారా ఇస్లాంలోకి ‘‘మతమార్పిడి’’ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతుంటే, భారతదేశంలో మైనారిటీలు ముస్లింలా లేక హిందువులా అని ఆశ్చర్యపోవాల్సివస్తుంది! అంతే కాకుండా, ఇలాంటి సంఘటనలు మనం భారతదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అని కూడా సందేహాన్ని కలిగిస్తాయి! వీటిలో మొదటిది, ఒక ప్రఖ్యాత అంతర్జాతీయ ఐటీ దిగ్గజం నడుపుతున్న బీపీఓ (BPO)లోని ముస్లిం ఉద్యోగులు సహోద్యోగులపై తమ మతాన్ని బలవంతంగా రుద్దుతూ, మతమార్పిడికి ప్రయత్నించిన దిగ్భ్రాంతికరమైన ఘటన.
మతోన్మాద సంఘటన
ఏప్రిల్‌ 2026‌లో దాఖలైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ప్రకారం, టీమ్‌ ‌లీడర్లు, సీనియర్‌ ‌సహోద్యోగులు లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌, ‌బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. బాధితులను ఆఫీసు వేళల్లో కల్మా పఠించ మని, నమాజ్‌ ‌చేయమని, బీఫ్‌ ‌తినమని బలవంతం చేశారని, వారి మతంపై అవమానకర మైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీసులు ఒక వినూత్నమైన ఆలోచనను అవలంబించారు. లైంగిక వేధింపులు, మత మార్పిడుల ఆరోపణలపై విచారణ జరిపేందుకు, వారు ఒక హౌస్‌కీపింగ్‌ ఏజెన్సీ ఉద్యోగులుగా నటిస్తూ, మారువేషంలో ఉన్న మహిళా పోలీసు అధికారుల బృందాన్ని కంపెనీలోకి పంపారు. ఆఫీసులో ఒక మహిళను కల్మా పఠించమని, హిజాబ్‌ ‌ధరించమని, నమాజ్‌ ‌చేయమని అడిగి ఇస్లామిక్‌ ‌పద్ధతులను పాటించేలా ప్రభావితం చేస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు ఈ రహస్య ఆపరేషన్‌ను ప్రారంభించారు. నెల రోజులకు పైగా సాగిన దర్యాప్తు అనంతరం, లైంగిక వేధింపులు, లైంగిక దాడి, వెంటపడటం వంటి ఫిర్యాదులు అందిన తర్వాత కంపెనీలో పనిచేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఆరుగురు పురుషులు, ఒక మహిళా హ్యూమన్‌ ‌రిసోర్స్ ‌మేనేజర్‌ ఉన్నారు. హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌ ‌బాధితులను తనతో ఒకే మతానికి చెందిన పురుష సహోద్యోగులకు పరిచయం చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దందా చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఒక వ్యక్తిపై అత్యాచారం చేశాడని ఒక మహిళ చేసిన ఆరోపణతో పోలీసులు మొదటి కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో, 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల డజనుకు పైగా మహిళలు ఇలాంటి ఫిర్యాదులతో ముందుకు రావడంతో, లైంగిక వేధింపులు, మత విశ్వాసాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో కూడిన అదనపు ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదులు ఉన్నప్పటికీ, మత మార్పిడులను ప్రేరేపించే ఈ దుష్ట దందాలో భాగమైన హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌ ఎటువంటి చర్యలు తీసుకోకుండా చూసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన తొమ్మిది కేసులపై దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)  ఏర్పాటైంది. కార్యాలయంలో మహిళలను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పోస్కో వంటి కఠినమైన చట్టాలను కంపెనీ యాజమాన్యం పాటించిందా లేదా అని చూడటం పోలీసు దర్యాప్తులో ఒక కీలక అంశం. ప్రాథమికంగా చూస్తే, నాసిక్‌ ‌బీపీఓలో ఏమి జరుగుతుందో కంపెనీ ఉన్నత యాజమాన్యానికి ఏమాత్రం తెలియదని అనిపిస్తోంది. అరెస్టు అయిన వారిలో ఏడుగురు ఉద్యోగులు ముస్లింలు. ఒక మహిళా హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌ను ఈ కుట్ర వెనుక సూత్రధారులలో ఒకరిగా గుర్తించారు. ఆమె బాధితులను తన పురుష సహోద్యోగులకు పరిచయం చేసేది. వారు బాధితు లను వేధించేవారు. అరెస్టు అయిన వారు భారత్‌ను ‘‘గజ్వా-ఎ-హింద్‌’’(‌భారతదేశ ఇస్లామీకరణ)గా మార్చాలనే కలను సాకారం చేసుకునే క్రమంలో, భారతదేశంలో తీవ్రవాద ఇస్లాంను ప్రోత్సహిస్తున్న జాతీయ లేదా అంతర్జాతీయ సంస్థలో భాగమా కాదా అనే విషయాన్ని విచారించాల్సి ఉంది.
మహిళా హెచ్‌ఆర్‌ ‌మేనేజర్‌తో పాటు పోలీసులు గుర్తించిన మరో ప్రధాన సూత్రధారి ఆ కంపెనీలో ఒక ఉన్నత పదవిలో ఉన్న ముస్లిం ఉద్యోగి. అతను రెండు సంవత్సరాల క్రితం మక్కా సందర్శన తర్వాత తీవ్రవాద భావజాలానికి ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను ఆ ప్రైవేట్‌ ‌కంపెనీలో మత ప్రచార, మత మార్పిడి కార్యక్రమాలను చేపట్టమని ఇతర ముస్లిం సహోద్యోగులను ప్రోత్సహించాడు.
మీడియా నివేదికల ప్రకారం, ఈ అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ ‌కంపెనీకి 55కు పైగా దేశాలలో 500కు పైగా కార్యాలయాలు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారందరినీ సస్పెండ్‌ ‌చేసి, అంతర్గత విచారణ ప్రారంభించడం కంపెనీ మొదటి స్పందన. ఈలోగా, నాసిక్‌ ‌కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై వచ్చిన ఆరోపణలు ‘‘తీవ్ర ఆందోళనకరమైనవి, బాధాకరమైనవి’’ అని, కంపెనీ ఈ సంఘటనను ‘‘అత్యంత తీవ్రంగా’’ పరిగణిస్తోందని కంపెనీ ఛైర్మన్‌ ‌బహిరంగంగా ప్రకటించారు. ఈ వాదనకు కంపెనీ ఎంతవరకు కట్టుబడి ఉంటుందో చూడాలి.
భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక జీవన విధానానికి తీవ్రవాద భావజాలం గల ముస్లింల వల్ల కలిగే ప్రమాదాన్ని చూపే రెండవ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ముంబైలో ‘‘కల్మా’’ పఠించలేదనే కారణంతో ఒక ముస్లిం యువకుడు ఇద్దరు వాచ్‌మెన్‌లపై కత్తితో దాడి చేసినట్లు వచ్చిన వార్త ఇది. ‘‘కల్మా’’ అనేది ఒక అరబిక్‌ ‌పదం. దీని అర్థం ఒక ప్రకటన లేదా మరింత ప్రత్యేకంగా ఒక నిశ్చయాత్మక వాక్యం. ఇస్లాంలో ఇది ఒక ముఖ్యమైన విశ్వాస ప్రకటన. అది ‘‘లా ఇలాహా ఇల్లల్లాహ్‌, ‌ముహమ్మదుర్‌ ‌రసూలల్లాహ్‌’’ అని ఉంటుంది. అంటే ‘‘అల్లా తప్ప వేరే దేవుడు లేడు. అల్లా ప్రవక్త ముహమ్మద్‌’’ అని అర్థం. ముస్లింలు దీనిని విశ్వాస ప్రకటనగా పఠిస్తారు. ఇస్లాంలోకి మారే వ్యక్తి, ఇస్లాంను తాను అంగీకరిస్తున్నట్లు ధృవీకరించడానికి ఈ ప్రకటనను పఠించాలి. దీనిని ముస్లింలు తమ రోజువారీ ప్రార్థనలలో కూడా పఠిస్తారు. మరో మాటలో చెప్పాలంటే, ఇస్లాం మతాన్ని అంగీకరించ డానికి, ఇస్లాంలోకి మారడానికి ‘‘కల్మా’’ పఠనం చాలా కీలకం.
ఇద్దరు వాచ్‌మన్‌లపై దాడి చేసిన వ్యక్తి, వారిద్దరూ హిందువులు లేదా వారి పేర్లను బట్టి ముస్లిమేతరులు అని నిర్ధారించుకోవడానికి వారిని ‘కల్మా’ పఠించమని డిమాండ్‌ ‌చేశాడు. వారు తమకు తెలియదని లేదా ఇష్టం లేదని చెప్పడంతో, అతను వారిని కత్తితో పొడిచాడు. ఇద్దరూ గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు అమెరికాలో కెమికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చదివాడని ఇప్పుడు వెల్లడైంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతను కొన్ని చిన్నాచితకా పనులు చేసుకుంటూ, ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాడు. అతను ఐసిస్‌ ‌ద్వారా తీవ్రవాద భావజాలానికి ప్రభావితు డయ్యాడని మహారాష్ట్ర ఏటీఎస్‌ ‌దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. నిందితుడు ఐసిస్‌ ‌ప్రచారంతో ప్రభావితుడయ్యాడని సూచించే సామాగ్రిని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. అంతేకాకుండా, ఆ ఉగ్రవాద సంస్థలో చేరాలనే తన కోరికను వ్యక్తం చేసిన పత్రాలను కూడా వారు కనుగొన్నారు.
ఏప్రిల్‌, 2025‌లో కశ్మీర్‌లోని పెహల్గావ్‌లో పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్తానీ ఉగ్రవాదుల నుంచే కొంతమంది భారతీయ ముస్లింలు ఇప్పుడు స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. ఆ ఉగ్రవాదులు 25 మంది ముస్లిమేతర పురుషులను (24 మంది హిందువులు, ఒక క్రైస్తవుడు) లక్ష్యంగా చేసుకుని చంపారు. ముగ్గురు ఉగ్రవాదులు బాధితులను ‘కల్మా’ పఠించమని అడిగారు. వారు అలా చేయడంలో విఫలమవడంతో వారిని కాల్చి చంపారు. అంతే కాకుండా, బాధితులకు సున్తి జరగలేదని నిర్ధారించు కోవడానికి వారి ప్యాంటును కిందకు లాగమని కూడా ఉగ్రవాదులు ఆదేశించారు. ఈ రెండు ‘రుజువులు’ చేతిలో ఉండటంతో, వారు బాధితులను కాల్చి చంపారు. ముంబైలో దాడి చేసిన వ్యక్తి, నాసిక్‌ ‌బీపీఓ అధికారులు చేసింది కూడా సరిగ్గా ఇదే – ముస్లిమేతరులను ‘కల్మా’ పఠించమని డిమాండ్‌ ‌చేసి, ఆ తర్వాత వారిని వేధింపులకు, హింసకు గురిచేయడం.
బీపీఓ సీనియర్‌ ‌మేనేజర్లు, ముంబై దాడి చేసిన వ్యక్తి, హరియణాలోని అల్‌ ‌ఫలా విశ్వవిద్యాలయంలో ఉగ్రవాద చర్యలకు సూత్రధారులుగా ఉన్నవారితో సహా వారిలాంటి అనేకమంది నేపథ్యాలు పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థల ప్రభావాల నుండి ఉన్నత విద్య కూడా ముస్లిం యువతను కాపాడలేదని, ఈ దురుద్దేశం ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. నవంబర్‌ 10, 2025‌న ఎర్రకోటసమీపంలో జరిగిన శక్తిమంతమైన పేలుడు అనంతరం, పాకిస్థాన్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న జైష్‌-ఎ-‌మొహమ్మద్‌ (JEM) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఒక టెర్రర్‌ ‌మాడ్యూల్‌ను విశ్వవిద్యా లయంలో కనుగొని దర్యాప్తు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఉగ్రవాద కుట్రలో ప్రమేయం ఉన్నందుకు డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌ ‌నబీ (అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌), ‌డాక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌షకీల్‌, ‌డాక్టర్‌ ‌షాహీన్‌ ‌షహీద్‌ (‌జీవవీ మహిళా విభాగం భారత కమాండర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి), డాక్టర్‌ అదీల్‌ అహ్మద్‌ ‌రథర్‌లను అరెస్టు చేశారు. దిగ్భ్రాంతికరంగా, ఆ వైద్యులు అద్దెకు ఉంటున్న ఒక ఇంట్లో తుపాకులతో పాటు, అమ్మోనియం నైట్రేట్‌తో సహా 2900 కిలోల ఐఈడీ తయారీ సామగ్రిని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఆ తర్వాత, ఆర్థిక అవకతవకలకు సంబంధించి విచారణ నిమిత్తం విశ్వవిద్యాలయ వ్యవస్థాపక చైర్మన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సరైన తనిఖీలు, ఎన్‌ఓసీలు లేకుండా అధ్యాపకులను నియమించారు. జాతీయ వైద్య కమిషన్‌ ‌నిందితులైన వైద్యులను వైద్య రిజిస్టర్‌ ‌నుండి తొలగించింది. భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (అసోసి యేషన్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ •••నివర్సి టీస్‌) ‌విశ్వ విద్యాలయ సభ్యత్వాన్ని నిలిపివేసింది. విశ్వ విద్యాలయ వైస్‌-‌ఛాన్సలర్‌ ‌తమకు సంస్థాగత సంబంధం ఏమీ లేదని ఖండించారు. కానీ ఇంత మంది అధ్యాపక సభ్యులు ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలలో ఎలా పాలుపంచుకున్నారు? క్యాంపస్‌లో, దాని చుట్టుపక్కల ఇంత భారీ పరిమా ణంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయనే విషయం విశ్వవిద్యాలయానికి ఎలా తెలియ కుండాపోయింది? అనేదానికి ఎటువంటి వివరణ లేదు.
ఉన్నత విద్యారంగంలో, ఐటీ రంగంలోని అగశ్రేణి కార్పొరేట్‌ ‌సంస్థలలో ఇటువంటి భయానక పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు, ఇస్లామిక్‌ ఉ‌గ్రవాద సంస్థలకు నియామక కేంద్రాలు కేవలం మదర్సాలే అని చెప్పడం తప్పు. సోషల్‌ ‌మీడియా రాకతో, విషపూరిత ప్రచారం రెక్కలు విప్పింది. అనేక తీవ్రవాద బృందాలు యువతీయువకులను ముఖ్యంగా బాధితులుగా నటించడానికి ఇష్టపడే వారిని, తమ సొంత లోపాలకు హిందూ మెజారిటీని నిందించేవారిని ఆకర్షించడానికి సోషల్‌ ‌మీడియా వేదికలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్నా, రాజ్యాంగం స్వేచ్ఛాయుత ఎంపికకు, లౌకిక సమాజానికి హామీ ఇస్తున్నా, భారతదేశం హిందూ మెజారిటీ దేశంగా ఉన్నంత కాలం తమకు మోక్షం లేదని ముల్లాలు యువతలో నమ్మేలా చేస్తున్నారు. అందువల్ల, వారు ప్రలోభాల ద్వారా హిందువులను బలవంతంగా మతం మార్చి, భారతదేశాన్ని ‘గజ్వా-ఎ-హింద్‌’‌గా మార్చాలని నమ్మడం ప్రారంభిస్తారు.
మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, హిందూ మెజారిటీ ప్రజలు, అలాగే పార్లమెంటు, ఉన్నత న్యాయవ్యవస్థ, ఇతర జాతీయ సంస్థలు మేల్కొని గమనించాలి. దేశ విభజనకు, భయంకరమైన రక్తపాతానికి దారితీసిన 1940ల నాటి రాజకీయాలు పునరావృతం కావడాన్ని మనం ఎప్పటికీ అనుమతించకూడదు.

ఎ. ‌సూర్యప్రకాశ్‌
మాజీ చైర్మన్‌, ‌ప్రసారభారతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE