*    క్నాలజీ అభివృద్ధే ఆమె లక్ష్యం

*    టా దిగ్గజంగా ప్రత్యేక స్థానం

*    యకత్వంలో వైవిధ్య భరితం…

*    ఏ ఐ.. ని చేరువ చేయడమే సంధ్య దేవనాథన్ ధ్యేయం

ప్రస్తుత కాలంలో AI టెక్నాలజీ ప్రతి వారి జీవితంలో భాగం అయిపొయింది. అందులోను సోషల్ మీడియా వాడే ప్రతి వారికి AIతో అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. అటువంటి టెక్నాలజీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు సంధ్యా దేవనాథన్. పేస్‌బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ యాప్స్‌లో ప్రత్యక్ష మౌతున్న టెక్ దిగ్గజం ‘మెటా’ కు ఇప్పటి వరకు ఇండియా విభాగ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆమె.. ఇటీవల ఆగ్నేయాసియా బాధ్యతలను కూడా స్వీకరించి మహిళా సాధికారతను చాటారు. ముఖ్యంగా మెటా నాయకత్వంలో కీలకమైన మార్పులు, వినూత్నమైన కార్యక్రమాలతో దూసుకు పోతున్నారు. భారతీయ వినియోగదారులకూ AI చేరువ చేయడమే ధ్యేయంగా ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు జాతి కీర్తిని ప్రపంచ పటాన నిలిపారు సంధ్యా దేవనాథన్. 2026లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకురావడంలోనే కాక తన నాయకత్వ పరిధిని విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేవనాథన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించి, ఢిల్లీలోని ఎఫఎంఎస్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు.తర్వాత సిటీబ్యాంకులో పనిచేశారు. 2009 డిసెంబరులో స్టాండర్డ్ చార్టర్డ్‌లో ఉద్యోగానికి సింగపూర్ వెళ్లారు. అక్కడి నుంచి ఆమె అంచెలంచె లుగా ఎదుగుతూ వచ్చారు. జనవరి 2016లో ఈకామర్స్, ట్రావెల్, ఫిన్సర్వ్ ఆగ్నేయాసియా గ్రూప్ డైరెక్టర్‌గా “మెటా”కు మారారు. ఆదే సంవత్సరం ఆగస్టులో ఫేస్బుక్ సింగపూర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి చేరుకున్నారు. దీనితో పాటు 2018 లో సంధ్య వియత్నాం బిజినెస్ హెడ్ పాత్రను కూడా చేపట్టారు. 2020లో ఫేస్‌బుక్ సింగపూర్‌కు నాయకత్వం వహించడంతో పాటు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గేమింగ్ ఉపాధ్యక్షురాలయ్యారు.

సంధ్య టెక్ పరిశ్రమలో వైవిధ్యం కోసం ప్రత్యేక కృషి చేస్తున్నారు. మెటా ‘గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ కౌన్సిల’లో సభ్యురాలిగా ఉంటూ, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమా లను నిర్వహిస్తున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో ఫార్చ్యూన్ ఇండియా ‘అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో స్థానంకూడా సంపాదించారు. అంతేకాక 2024లో ఫార్చ్యూన్ ఆసియా జాబితాలో దేవనాథన్ ఆసియాలో 95వ అత్యంత శక్తిమంతమైన మహిళగా కూడా స్థానం సంపాదించుకున్నారు . 2024లో విశాఖపట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీసీసీఐ దేవనాథన్‌ను ఘనంగా సత్కరించింది. జనవరి 2018 నుండి ఫేస్‌బుక్ మెటాలో మహిళల కోసం లీప్ లీడర్షిప్ కార్యక్ర మానికి కోచ్‌గా చేశారు. మెటాలోని గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ కౌన్సిల్‌లో కూడా ఆమె ప్రత్యేక స్థానంలో ఉన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజక వర్గ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.

గతంలో సంధ్యా దేవనాథన్ మెటా ఇండియా హెడ్‌గా మాత్రమే ఉండేవారు. తాజాగా 2026లో ఆమె… ఇండియా మరియు ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆమె మెటా కంపెనీకి చెందిన అతిపెద్ద వ్యూహాత్మక విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. మన దేశంAI వాడకంలోనూ, దానిని ప్రోత్సహించడంలోను ముందంజ లో ఉందని చెప్తారామె. ముఖ్యంగా భారతీయ స్టార్టప్ కంపెనీల్లో అవసరాలకు అనుగుణంగా AI పరిష్కారాలను రూపొందించేం దుకు ఆమె తన వంతు మద్దతు అందిస్తున్నారు.

ఈ యేడాది ఏప్రిల్ 28న మెటా మన దేశంలో వినూత్న అధ్యాయానికి తెర తీసింది. విరాట్ కోహ్లీ ప్రచారకర్తగా ‘ఓక్లే మెటా పెర్ఫార్మెన్స్ AI’ గ్లాసెస్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఇది కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, వ్యాయామం లేదా శిక్షణ సమయంలో అథ్లెట్లకు అవసరమైన సూచనలను “అథ్లెటిక్ ఇంటెలిజెన్స” ద్వారా అందిస్తాయి. అలాగే చిన్న వ్యాపారస్తులు తమ కస్టమర్లతో నేరుగా సంభాషించి, ఆర్డర్లు తీసుకునేలా AI బిజినెస్ ఏజెంట్స్‌ను వాట్సాప్‌లో ప్రవేశపెట్టారు. ఇది వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అంతే కాదు భారత్‌లోని డెవలపర్లు మెటా ల్యామా AIమోడల్స్‌ను ఉపయోగించి స్థానిక సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా దేవనాథన్ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం మే 29-30 తేదీల్లో జరగనున్న ముంబై టెక్ వీక్‌లో సంధ్య కీలక ప్రసంగం చేయనున్నారు. కేవలం ప్రయోగాల దశ నుండి వ్యాపార ఉత్పత్తి స్థాయికిAIని తీసుకువెళ్లడం ధ్యేయంగా ఈ సదస్సు దృష్టి సారించనుంది.

మెటా ఇండియా హెడ్‌గా ఉన్న సంధ్యా దేవనాథన్ బాధ్యతలు ఇప్పుడు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఆమె భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా మార్కెట్‌లకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇండోనేషియా, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లో మెటా వ్యాపార వ్యూహాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో ఆమె అత్యంత శక్తిమంతమైన టెక్ లీడర్‌గా ఎదిగారు.

విశాఖపట్నంలో చదువుకున్న ఆమె, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

– జయశ్రీ అచంట

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE