భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలోనే కాకుండా, నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను వారికి అందించే లక్ష్యంతో పార్టీ అధిష్టానం నాలుగు కీలక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ‘జనతా వారధి’, ‘చేరువ’, ‘మనవూరు – మనజెండా’, ‘మనసులోమాట’ (మన్ కీ బాత్) పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రారంభించింది. వీటిలో కీలకమైనది ‘జనతా వారది’ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా 2026 జనవరి నుంచి నిర్వహిస్తోంది.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలవాలన్నదే ‘జనతా వారధి’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయుల్లో ఏర్పాటయ్యే భారతీయ జనతా పార్టీ కమిటీలకు ప్రజలు తాము ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలు, స్థానిక ఇబ్బందులను ఫిర్యాదుచేస్తే వారు వాటిని స్థానిక అధికార యంత్రాంగానికి నివేదిస్తారు. తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొని బాధితుల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత యంత్రాంగానికి పంపగా ఎక్కువ శాతం పరిష్కార మయ్యాయి. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని స్థ్ధానికంగా నిర్వహిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో గత వెసీపీ ప్రభుత్వపు అవినీతి పాలన మీదే ఎక్కువగా విజ్ఞప్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా…నకిలీ ఇళ్ల పట్టాలు, నకిలీ మద్యం తయారీ – అమ్మకాలు, హిందూ విశ్వాసాల మీద పార్టీ కుట్ర వంటి అంశాలు ఉన్నాయి. వీటిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటిని ఆన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు అందచేశారు. అ విజ్ఞాపనులు ఇవే.
భూమి లేకుండానే పట్టాలిచ్చారు
గత వైసీపీ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పేరిట భూమి లేని పట్టాలు పంపిణీ చేసింది. కనీసం ఆయా లబ్ధిదారులకు ఎక్కడ తమ భూములు ఉన్నాయో కూడా చూపించలేదు. గత ప్రభుత్వ నిర్వాకంపై బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న బాధితులు కన్నీటి పర్యంతమవు తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడ. అనేక చోట్ల తమకు పట్టాలు ఇచ్చారే తప్ప భూములు చూపించలేదని, అవి ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదంటున్నారు. ఎంతో ఆశతో పూజా మందిరంలో దాచుకున్న పట్టాలు ఎందుకూ కొరగావని తెలిసి హృదయం ద్రవిస్తోదని బాధితులు బీజేపీ నేతలకు వివరించారు. 2024 ఎన్నికల్లో లబ్ధి కోసమే 30 లక్షలకు పైగా కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నట్లు ప్రకటించి అంతకంటే ఎక్కువే అందజేశారు. ఇవన్నీ చిత్తు కాగితాలుగా పేదల ఇళ్లకే పరిమితమైనాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో రాృష్టానికి లక్షల సంఖ్యలో వాటిని కేటాయించడంతో పాటు రూ.వేల కోట్ల నిధులు ఇచ్చారు. మోదీ లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ పేదల ఆశలతో చెలగాట మాడటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నది. గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం, పంపిణీలో అలసత్వంపై కూడా బీజేపీ అనేక పోరాటం చేసింది. 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేందప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించింది. టిడ్కో ఇళ్ల కోసం ఒక ఇంటికి రూ. 1.80 లక్షల చొప్పున రూ. 9 వేల కోట్లు కేంద్రం ఇస్తే వైసీపీ ప్రభుత్వం పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. పైగా భూముల కొనుగోళ్లల్లో గోల్ మాల్ చేశారని, రూ. ఆరు లక్షలు విలువచేసే ఎకరం భూమిని రూ.18 లక్షలకు, రూ. పది లక్షలు విలువ గల స్థలాలు రూ. 30 లక్షలకు కొన్నారని ఆరోపించింది. ఎనభై, తొంభై శాతం పూర్తి అయిన టిడ్కో ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని, వాటిని వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఛార్జిషీట్ కూడా ప్రకటించింది. రాష్ట్రంలొ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పనిచేస్తున్నప్పటికీ, గత ప్రభుత్వ అవినీతిపై అధికారులు ఉదాసీనంగా ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సింది నిజమైన గృహాలు తప్ప పట్టాలు కాదంటూ నకిలీ పట్టాలు తయారు చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భాజపా డిమాండ్ చేసింది.
హిందూ ధర్మాన్ని అణణివేసే కుట్ర
వైసీపీ ప్రభుత్వం హిందూ విశ్వాసాలను దెబ్బ తీసేందుకు కుట్ర చేసిందని బీజేపీ, జనతా వారధి కార్యక్రమంలో ఆరోపించింది. 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మూలాలను, విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర జరిగింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అన్యమతస్థులకు వర్తించే డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం బó„క్తుల్లో ఆందోళన కలిగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్థులు శ్రీ వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీ. అలాగే తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. శాసనమండలిలో శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అవమానించారు. ఇది హిందూ సమాజాన్ని అవమా నించిన ఘటన. 2019-24 మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాలపై దాడులు జరిగాయి. 2020లో అంతర్వేది రథం దగ్ధం, నెల్లూరులో రథం ధ్వంసం, పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, చిత్తూరులో నంది విగ్రహం ధ్వంసం, రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ధ్వంసం, విజయనగరం జిల్లా రామ తీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు ధ్వంసం వంటి ఘటనలు హిందూ సమా జాన్ని ఆందోళన పరిచాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ఘటనలు జరిగాయి. ఈ సంఘ టనలపై నామమాత్రపు విచారణలతో సరిపెట్టారు. వాస్తవాలను వెలికితీసేలా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలి. హిందూ సంస్కృతి, ఆలయాలపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగినట్లు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్‌డీడీబీ) నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని, తేడా తెలియనంతగా కల్తీకి పాల్పడ్డారని కూటమి అధికారంలోకి వచ్చాక టీటీడీ ఈవో ఆరోపించారు. లడ్డూల్లో విని యోగించే నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల్లోను కమిషన్ల రూపంలో కాసులు పిండేశారని ఆరోపణ వచ్చాయి. కమీషన్‌ల యావతోనే తిరుమలలో స్వామివారి లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని చౌకధరకు కొనుగోలు చేసినట్లు అన్ని పక్షాలు, ప్రజాసంఘాలు, హిందూభక్తులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ దీనిపై విచారణ చేసింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థ్ధానం విషయంలో క్రైస్తవ మతస్థులైన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, తనయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తన కపటంగానే ఉండేదని భక్తులు విమర్శిస్తు న్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో కూడా అన్యమత ప్రచారం, తిరుమలను క్రైస్తవ నిలయంగా మార్చడా నికి ప్రయత్నాలు, తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలే అని పేర్కొంటూ భక్తుల మనోభావా లను చిన్నబుచ్చడాన్ని హిందూ సంఘాలు ఖండిచాయి. వైసీపీ తిరుమలను మొదటి నుంచి పవిత్ర ప్రదేశంగా కాక వ్యాపార వ్యవస్థగా భావించినట్లు విమర్శలున్నాయి. టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌లుగా అన్యమతస్థుల నియామక వివాదాలు ఎదుర్కొం టున్నా, నాటి ముఖ్యమంత్రి బంధువులు సుబ్బారెడ్డి, కరుణాకర రెడ్డిలను నియమించిన విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నాసిరకం మద్యం తయారీ, అమ్మకాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం నాసిరకం మద్యం ఉత్పత్తి చేసి, వాటిని రెండింతల ధరలకు అమ్మిందని జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అయిదేళ్లపాటు తమ ఆదాయాన్ని దోచేసిన వైసీపీ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయాలని వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ కార్యాలయాల్లో అందచేసి నేపథ్యంలో బీజేపీ ఈ డిమాండ్ చేసింది. అధికారం లోకి వస్తే మద్య నిషేధం అమలుచేస్తామన్న హామీని వైసీపీ విస్మరించి మద్యాన్ని తమ పార్టీ నేతలే తయారు చేసేలా పావులు కదిపిందని ఆరోపణలు వచ్చాయి. తర్వాత వాటిని ప్రభుత్వమే అమ్మేలా పాలసీని మార్చింది. నాసిరకం మద్యం తయారుచేయడమే కాదు వాటిని రెట్టింపు ధరలకు అమ్మారు. ఈ రకమైన అవినీతిలో సుమారు 5 వేల కోట్ల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నాసిరకం మద్యం తాగిన వారు అతి కొద్ది రోజుల్లోనే అనారోగ్యా నికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకుల ధనదాహంవల్ల తమ కుటుంబాలు బజారున పడుతున్నట్లు నాసిరకం మద్యం తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వీటిపై బీజేపీ ఇప్పటికే ఆందోళనలు, పోరాటాలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీనిపై వేసిన సిట్ దర్కాప్తు నత్తనడకన సాగుతోంది. పెద్దచేపలు తప్పించుకు పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజల విజ్ఞప్తి, ఆందోళన వేరకు దీనిపై సత్వరం విచారణ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్