కుటుంబ ప్రబోధన్‌ 2008‌లో ప్రారంభమై, క్రమంగా వికసించింది. గత సంవత్సరం ఓంకారేశ్వర్‌లో జరిగిన బైఠక్‌లో పరమ పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సమక్షంలో కుటుంబ ప్రబోధన్‌ ‌ధ్యేయం వెల్లడైంది. మంగళ సంవాద్‌ ‌మాధ్యమంగా ప్రతి కుటుంబంలో వ్యక్తిగత, పారివారిక,సామాజిక జీవనంలో లోకహితం కోసం కావలసిన పరివర్తనను సాధించాలి. ఇది రోజు మనం స్మరించుకోవాలి.

అదృష్టం కొద్దీ మనం కుటుంబ ప్రబోధన్‌ ‌పనిలో ఉన్నాం. కుటుంబ మిత్రులను మనం తయారు చేసుకోవాలి. సంఘ శతాబ్ది సంవత్సరంలో మనకు సంఘంలోని 50 లక్షలమంది కార్యకర్తలు మినహా మిగిలిన వారిని కుటుంబ మిత్రులుగా చేసుకోవాలి. తులసీదాసు చెప్పినట్లు ప్రియంగా మాట్లాడుతూ మనం కుటుంబ మిత్రులం కావాలి. కుటుంబ వ్యవస్థలో 14 సమస్యలు ఉన్నాయని వైజ్ఞానికులు చెప్పారు. చెన్నై రామకృష్ణ మఠం ప్రచురించే వేదాంత కేసరి డిసెంబరు 25 సంచిక •ష్ట్రవ వఅశ్రీఱస్త్రష్ట్ర•అఱఅస్త్ర జూ•తీవఅ•ఱఅస్త్ర పేరుతో వెలువడింది. సమస్యలు చాలా ఉన్నాయి కానీ మనకు పరిష్కారం కావాలి. ఆదర్శ కుటుంబ వ్యవస్థ కోసం మనం కొన్ని గుణాలు అలవర్చుకోవాలి. భగవద్గీత 16వ అధ్యాయంలో అనేక దైవీగుణాలు సద్గుణాల ప్రస్తావన ఉంది. వాటిని మనం సంక్షిప్తంగా ఎనిమిది గుణాలుగా వర్గీకరించాం. అవి బలం, శీలం, ఓజస్సు, ధైర్యం, యుక్తి, బుద్ధి,దక్షత, దృష్టి. ఈ గుణాలను మనం కొనలేం. గుణాలను నిర్మించాలి. వికసింప చేయాలి.
1. బలం : శారీరక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక బలం. మాఘమాసంలో రథసప్తమి వస్తుంది. మన పూర్వ సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయశ్రీ గురూజీ యుక్త వయసులో 250 సూర్య నమస్కారాలు చేసేవారు. ఈ విషయం చివరిరోజులలో వారే చెప్పారు. ‘నేను 33 సంవత్సరాల పాటు సంవత్స రానికి రెండుసార్లు భారత భ్రమణం చేయగలగడానికి కారణం ఆ విధంగా సూర్య నమస్కారాలు చేయడమే’ అని చెప్పారు. దీన్నే బలోపాసన అంటారు. ఇలాంటి ఉదాహరణ మన కుటుంబంలో, పరిసర కుటుంబా లలో కూడా చూడవచ్చు. నేను మహారాష్ట్ర పర్యటనలో బారామతి వెళ్లాను. ఉదయం 5 గంటలకు చేరాను. స్నానం చేసి వచ్చాను. కుటుంబ సభ్యులందరూ లేచి వచ్చారు. వారు చెప్పారు, ‘మేమంతా ఐదు గంటలకు లేస్తాం, అందరం కషాయం తాగుతాం, మేమెప్పుడు రోగగ్రస్తులు కాలేదు, కాము, మాది సరి అయిన దినచర్య, రోజంతా మేము ఉత్సాహంగా ఉంటాం’ అని చెప్పారు.మొన్న భాగ్యనగర్‌లో జరిగిన విశ్వ సంఘ శిబిరంలో ఏడాది శిశువు దగ్గర నుంచి 92  ఏళ్ల వయసు వరకు శిబిరంలో పాల్గొన్నారు. నా పర్యటనలో నేను 123 ఏళ్ల వృద్ధుల్ని చూస్తుంటాను. ఏ రోగము లేకుండా ఆరోగ్యంగా ఉంటారు, కారణం వారి దినచర్య. మంగళప్రభాత్‌ ‌మంగళ భోజన్‌, ‌మంగళ భజన్‌, ‌మంగళశయన్‌-ఇది మన దినచర్యలో భాగం కావాలి.విశ్వసంఘ శిబిరంలో నేను తీసుకున్న భైఠక్‌లో వారికి ఒక ఫార్ములా చెప్పాను. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు.  జీవన మూల్యాలు ఏమిటి? నేను చేస్తున్న పనివల్ల పరిణామం ఏమిటి? పర్యవసానం ఏమిటి? పిల్లలు ఉన్నారు -స్కూల్లో ఎవరిదైనా పెన్ను దొంగిలించడం, లేదా వేరే వాళ్ల హోమ్‌వర్క్ ‌మీద ఏదైనా రాయడం ఇలా.. యువకులున్నారు యువతీ యువకులు సహజీవనం చేయడం, మద్యం, ధూమపానం వంటి వ్యసనాల బారిన పడటం, ఇలా చేయడం వల్ల వచ్చే పరిణామాలు తెలుసుకొని ఈ పనులు చేస్తున్నారా? ఈ విషయంలో మనం ఇరుగుపొరుగును, మన ఇంటిని జాగృతిని చేయడం, మనం ఈ 8 గుణాల వెలుగులో ఏ పని చేయాలో ఆ పని చేయగలుగు తామా? స్వామి వివేకానంద చెప్పినట్లు మనకు ష్ట్రవ••, ష్ట్రవ•తీ•, ష్ట్ర•అ• అని ఉంటాయి . ఏదైనా ఈ మూడింటి ద్వారానే అవుతాయి. ఇవి ఈ ఎనిమిది గుణాలు తీసుకుని వర్తిస్తే మనకు మంచి జరుగుతుంది.
2. శీలం- ఇది సర్వశ్రేష్ట గుణం. ప్రహ్లాదుడి కథ మనకు తెలుసు. ఎంత కష్టమైనా నారాయణుని స్మరించాడు. నరసింహ అవతారంగా వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించాడు. తర్వాత ప్రహ్లాదుడు రాజు అయ్యాడు. అప్పుడు ఇంద్రుడు తానెప్పుడు రాజు కాగలనా అనుకుని బ్రాహ్మణవేషంలో వెళ్లి శీలాన్ని దానంగా అడిగాడు. శీలంతో పాటు లక్ష్మి, రాజ్యం, బలం, బుద్ధి అన్ని వెళ్లిపోయాయి.   శీలం అంటే స్వయంగా మోహానికి దూరంగా ఉండడం. స్వామి రామతీర్థ అన్నారు •• అశీ •శీ •శ్రీశ్రీ •వఎజూ•••ఱశీఅ అని. జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని, స్త్రీ కోసం, ధనం కోసం జరిగే వీటికి దూరంగా ఉండి ఆత్మ సంయనం పాటించాలి. ఇది మన ఇంట్లో మనం ప్రస్తావించాలి. తల్లిదండ్రులు పిల్లలను డాక్టరు, ఇంజనీరు,వకీలు చేయాలనుకుంటారు. కానీ శీలం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు?ఈ విషయాలు మనం ఇంట్లో, ఇరుగుపొరుగు కుటుంబాలలో ప్రస్తావించాలి. ఈ గుణముల కోసం ఉపాసన చేయాలి ఆరాధన చేయాలి.
3. ఓజస్సు: అంటే సాధువులు సన్యాసులు బ్రహ్మచర్యం పాటించి తపస్సు వల్ల సాధించింది. మన ప్రధాని మాననీయ శ్రీ నరేంద్ర మోదీ రోజూ 16 నుంచి 18 గంటలు ఎలా పని చేస్తారు? ఆయన ముఖంలో ఎక్కడ దైన్యం ఉండదు, చిరునవ్వు ఉంటుంది. ఈ మధ్య జరిగిన విశ్వ సంఘశిబిరంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్‌ ‌జయశంకర్‌ ఒక సెషన్‌ ‌లో 90 నిమిషాలు ఉన్నారు. అరగంట పాటు భారత ప్రగతికి ‘సురక్ష, సమృద్ధి,సంస్కృతి’ అనే విషయమై ప్రసంగించారు. ఒక గంట ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఒక శిబిరార్ధి ‘మోదీ యోగా దినోత్సవం ప్రపంచానికి పరిచయం చేసినట్లే భగవద్గీతను ఎప్పుడు ప్రపంచానికి చేరుస్తారు?’ అని అడిగారు. ‘మనం ఈ కురుక్షేత్రంలో ఈ విషయం తీసుకున్నాం త్వరలోనే ఇది నిజమవుతుందని’ డాక్టర్‌ ‌జయశంకర్‌ ‌చెప్పారు
4. ధైర్యం- ఆంగ్లంలో అశీ•ష్ట్రఱఅస్త్ర •వ•మీష్ట్రవతీ శ్రీఱ•వ మీ•తీవ•బశ్రీ శీవతీఙ••ఱశీఅ అన్నట్లుగా మన కుటుంబంలో ప్రతి బాలుడు, బాలికల అవలోకనా గుణం పెంచాలి. ఏ మంచి నేర్చుకోవడానికి మనకు ఏ విషయం దొరుకుతుంది అని ఆలోచించాలి. మంచి జీవన చరిత్రలు చదవాలి. ఏదైనా కష్టం వస్తే ధైర్యంగా ఎలా ఎదుర్కొన్నారు తెలుస్తుంది. రామాయణంలో రాముడి వివాహం తరువాత పరశురాముడు వచ్చాడు. వాళ్లు ఆనందంలో ఉన్న వేళ పరుశురాముడు వచ్చి కలవరపెట్టాడు. రాముడు పరశురాముని చాలా వినమ్రతతో, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కరోనా సమయంలో చాలామంది భయపడ్డవాళ్లు చనిపోయారు. మానసికంగా ధైర్యం తెచ్చుకున్న వారు నిలబడ్డారు.
5. యుక్తి- మహాభారతంలో యుద్ధం మొదలైంది. కొన్ని రోజులు గడిచాయి. కానీ పాండ వులు ఎవరు చనిపోవడం లేదు. ఇది దుర్యోధనుడికి చింత కలిగించింది. ఏదో మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌లాంటిది జరుగుతోందని అనుమానపడ్డాడు. భీష్ముడి దగ్గరికి వెళ్లాడు.ఆయన సైన్యాధిపతి. ఆయనను ‘పాండవులు ఎవరూ చనిపోవడం లేదు ఏంటి ‘అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఐదు స్వర్ణబాణాలు తన తపో బలంతో నిర్మాణం చేశాడు. దుర్యోధనుడు ‘ఇదేమిటి ‘అని అడిగాడు. ‘రేపు వీటితో పాండవులను వధిస్తాను’ అన్నాడు భీష్ముడు. కానీ దుర్యోధనుడికి అనుమానం. ‘ఈ ఐదు బాణాలు నేను తీసుకు వెళ్తాను. రేపు యుద్దంలో ఇస్తాను’ అన్నాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణుడికి విషయం తెలిసింది. కృష్ణుడు అర్జునుడికి ఒక పాత సంఘటన గుర్తు చేశాడు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో చూడడానికి దుర్యోధనుడు వెళ్లి, గంధర్వులతో గొడవపడ్డాడు. చివరికి గంధర్వులు దుర్యోధనుడిని ఒక చెట్టుకు కట్టివేశారు. ఈ విషయం తెలిసి ధర్మరాజు ‘దుర్యోధనుడు మన సోదరుడని, అతన్ని రక్షించాలని గంధర్వులపై యుద్ధం చేయమని’ ఆదేశించాడు. అర్జునుడు వెళ్లి యుద్ధం చేసి దుర్యోధనుడ్ని విడిపించాడు. దుర్యోధనుడు రాజహంకారంతో ‘నీకేం కావాలో చెప్పు.నేను ఇస్తాను’ అని అర్జునుడితో అన్నాడు. అర్జునుడు ‘అవసరం వచ్చినప్పుడు అడుగుతాను’ అన్నాడు. కృష్ణుడు ఈ విషయం గుర్తు చేసి ‘దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి ఆ ఐదు బాణాలు తీసుకో’ అన్నాడు. అర్జునుడు వెళ్లి ఆ బాణాలు అడిగాడు. దుర్యోధనుడు ఇచ్చివేశాడు. అలా సంకట  కాలంలో యుక్తితో పనులు చక్కబెట్టుకోవాలి. యుక్తి ఉంటే శక్తి, శక్తి ఉంటే యుక్తి- దానితో విజయం సిద్ధిస్తుంది.
6. బుద్ధి – వాల్మీకి రామాయణంలో 8 విషయాలు ఉన్నాయి. వినాలని, అర్థం చేసుకోవాలి, సమీక్షించాలి, నిర్ణయం తీసుకోవాలి, అర్థజ్ఞానం, తత్వజ్ఞానం తెలిసి క్రియాన్వితం చేయాలి. ఇవి బుద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు- ఈ తరహా బుద్ధి మనకు కావాలి.
7. దృష్టి – కళ్లతో చూసేది సామాన్యమే భారతీయ జీవన దృష్టి, జీవన మూల్యాలు జీవన వ్యవహారం ఇవి ముఖ్యం. ప్రపంచంలో భారత దేశంలో మాత్రమే మాతృవత్‌ ‌పరదారేషు, పరద్రవ్యై షు లోష్టవత్‌, ఆత్మవత్‌ ‌సర్వభూతేషు, యః పస్యతి సపండితః// అన్నారు. పర స్త్రీ తల్లితో సమానం అన్నారు. పరుల ధనం మట్టితో సమానం, అందరిని ఆత్మీయులుగా భావించడం ఇది మన సంస్కృతి. కేరళలో కాలడి నుండి బయలుదేరి శంకరాచార్యుల వారు వారణాసి వచ్చారు. అన్నపూర్ణ దర్శనం చేసుకుని అన్నపూర్ణాష్టకం రాశారు. ‘అన్నపూర్ణే సదాపూర్ణే, శంకర ప్రాణ వల్లభే! జ్ఞాన వైరాగ్య సిధ్య ర్ధం భిక్షాందేహీ చ పార్వతి, మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివ భక్తాశ్చ, స్వదేశో భువన త్రయం!మూడు భువనాల్లో ఉన్న శివభక్తులంతా నా సోదరులే అన్నారు. వివేకానందుడు sisters and brothers of America అన్నారు. ఈ మాట 1200 సంవత్సరాల క్రితమే శంకరులు చెప్పారు. రామతీర్థ జీవితంలోనూ ఇది ఉంది. అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ విమానాశ్రయంలో దిగేదాకా ఆయనకు తెలియదు. ‘మీకు మిత్రులు ఎవరు ఉన్నారు’ అని ఒక అమెరికన్‌ అడిగాడు. ‘నాతో మాట్లాడిన నువ్వే నా మిత్రుడివి’ అన్నాడు రామతీర్థ.‘అలాగా అయితే నాతో మా ఇంటికి వస్తారా’ అని అడిగాడు అమెరికన్‌. ‘‌తప్పకుండా’ అంటూ అతని వెంట నడిచి వెళ్లారు రామతీర్థ. ఇలా అందరూ నా వాళ్లే అనుకోవడం, ఈ ఆత్మీయత వ్యవహారం ఇది భారతీయ దృష్టి.
8. దక్షత – విశ్వసంఘ శిబిరంలో రామజన్మ భూమి మందిరం ట్రస్టు కోశాధ్యక్షులు శ్రీ గోవిందదేవ గురూజీ ఉద్ఘాటనలో మాట్లాడారు. ఆయన యుధిష్ఠిర యక్ష సంవాదం ప్రస్తావించారు. యక్షుడు ధర్మరాజును ధర్మాన్ని ఒక శబ్దంతో ఎలా నిర్వచిస్తారు చెప్పమన్నాడు. అప్పుడు ధర్మరాజు 5000 సంవత్సరాల క్రితమే ‘దక్షత (alerness) అని జవాబు ఇచ్చారు. అన్ని రకాల సావధానత కావాలి. సావధానంగా ఉంటే దుర్ఘటనలు జరగవు. ఇది మన కుటుంబంలోని ప్రతి వ్యవహారంలో ప్రతిబిం బించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరోజు రైలులో ప్రయాణిస్తుండగా చైన్‌ ‌లాగి రైలు ఆపారు. కిలోమీటర్‌ ‌దూరంలో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. చాలా మంది ప్రాణాలు కాపాడారు. ఇలా ఈ 8 గుణాలు మనం సమాజంలో కుటుంబాలలో వికసింప చేయాలి. అలాగే ఆరు దుర్గుణాలను మనం మన కుటుంబాల నుంచి దూరం చేయాలి.
1. భయం- చిన్న చిన్న విషయాల పట్ల ఎందుకు భయం కలుగుతుంది?
2. స్వార్థం- నేను నిస్వార్ధంగా జీవిస్తున్నానా? నిస్వార్ధంగ జీవించలేమా?
3. ఇంట్లో బయట చిన్న చిన్న విషయాల పట్ల అహంకారం ఎందుకు? దాన్ని నమ్రతగా మార్చగలమా?
4. బద్దకం- ఇంట్లో అందరం పని చేయాలి. కొందరు బద్ధకస్తులైతే ఎలా? పనులు పంచుకోవాలి.
5 తప్పుడు సామాజిక గుర్తింపు-దీనివల్ల భేదభావం, పెద్ద, చిన్న, ఉచ్ఛ నీచ, భావాలు వస్తాయి. మన గ్రామంలో బస్తీలో అలాంటి సమస్యలు ఏమి ఉన్నాయి అని ఆలోచించాలి? ఉదా: దక్షిణ కర్ణాటకలో =దీ×లో మేనేజరు, ఆయన మన ప్రాంతం టోలిలో ఉన్నారు. ఆయన కోడలు గర్భవతి. కొడుకు పుడితే కనకాభిషేకం చేస్తామన్నారు,మరి కూతురు పుడితే అని అడిగాం. ఏమీ చేయమన్నారు. అదెలా? మరి మనం కుటుంబ ప్రబోధన్‌ ‌వాళ్లం కదా! భ్రూణహత్యలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. చర్చల తర్వాత వారు కొంత సమాధాన పడ్డారు. అదే సమయంలో సిందూర్‌ ఆపరేషన్‌ ‌రోజున ఆమెకు ఆడపిల్ల పుట్టింది. పాపకు సింధూర అని పేరు పెట్టారు. ఐదు నెలల తరువాత కనకాభిషేకం చేస్తాము అన్నారు. దీన్నే వ్యక్తిగత పారివారిక సామాజిక జీవనం లోకహితం కావడం అంటారు. విశ్వసంఘ శిబిరంలో ఒక బౌద్ధిక్‌లో రాముడి వనవాసం గురించి చెబుతూ రాముడు తనలోని మలినాన్ని తొలగించుకునేందుకు 14 ఏళ్ల వనవాసం చేశారు. అని చెప్పారు.
6. బౌద్ధిక జడత్వం – కొత్త విషయాలు నేర్చుకుంటుండాలి. పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు నాటి మన ప్రధాని లాల్‌బహుదూర్‌శాస్త్రి జై జవాన్‌ ‌జై కిసాన్‌ ‌నినాదం ఇచ్చారు. అటల్‌ ‌బిహారీ వాజపేయి జై విజ్ఞాన్‌ ‌నినాదం ఇచ్చారు. నేడు మన మోదీ జై అనుసంధాన్‌ అన్నారు. ఇది కేవలం సైన్స్ ‌విషయం లోనే కాదు ఏ కారణం చేత మన యువతీ యువకులు పెళ్లి చేసుకోరు? 30, 32 ఏళ్ళు వచ్చినా ఎందుకు పెళ్లి చేసుకోరు, దీని కారణం కనుక్కోవాలి. మానసిక నిపుణులు దీని గురించి ఆలోచించాలి. నేనేం చేయలేను అనకూడదు. అదొక జీవనచక్రం. సరైన సమయంలో పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, దీని గురించి ఆలోచించాలి.
కనుక 8 గుణాల వికాసం గురించి 6 అవగుణాలు దూరం చేయించడం గురించి మనం ఆలోచించాలి.
డాక్టర్‌ ‌రవీంద్రశంకర జోషి 
కుటుంబ ప్రబోధన్‌ అఖిలభారత సంయోజక్‌ ‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE