మైనారిటీల కోసం మరొకసారి దేశాన్ని విభజించాలని చూస్తున్న వేర్పాటువాదులు, జిన్నా వారసులు, ముస్లిం మతోన్మాదులు వాళ్ల ప్రయత్నాలను వేగవంతం చేయాలని ఆరాటపడుతున్నారు. సీఏఏ మొదలు వందేమాతర గీతం, అంటే జాతీయగీతం ఆరుచరణాలు ఇకపై పాడితీరాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశం వరకు తమ ప్రయత్నాలకు ఉపయోగపడతాయనే దింపుడు కళ్లం ఆశలతో చూస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిరోధించడం, లోక్‌సభలో బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే ఇటీవలనే రాహుల్ గాంధీ మీద ప్రవేశపెట్టిన సబ్‌స్టాంటివ్ తీర్మానంతో రాబోతున్న ముప్పుకు భయపడి, అంతిమంగా ఆరు చరణాల వందేమాతరం గీతం పాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయబోమన్న సంకేతాలు పంపడానికి ముస్లిం మతోన్మాదులు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ యథాశక్తిన సహకరిస్తున్నది. ఒక వారం క్రితం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో తలెత్తిన హిందూ – ముస్లిం మత ఘర్షణలు ఇందులో భాగమే. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస’ అంటూ ప్రకటించి మతోన్మాదుల వీరంగానికి వాద్య సహకారం అందించారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో మతోన్మాదులు స్వైరవిహారం చేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఫిబ్రవరి 20 నుంచి జరుగుతున్న పరిణామాలు, కొన్ని రోజులు పాటు నెలకొన్న ఉద్రిక్తతలు ముమ్మాటికీ ఈ విషయాలని రుజువు చేస్తున్నాయి.
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు అత్యవసరంగా ఒక వివరణ ఇవ్వాలి. ఇక్కడ హిందువులకు తమ ఆచారాలను పాటించే అవకాశం లేదా? భక్తిగీతాలు పెట్టుకుని వినే స్వేచ్ఛ కూడా లేదా? శివాజీ ఊరేగింపునకు రక్షణ ఉండదా? ఇవన్నీ ఎందుకు? అసలు తాము నివశిస్తున్నది భారత భూభాగంలోనా? లేకపోతే పాకిస్తాన్/ బాంగ్లాదేశ్‌ల లోనా? కొద్దికాలం క్రితం భైంసాలో జరిగిన హిందూ ముస్లిం ఘర్షణలపట్ల నోరు మెదపలేదు. ఇప్పుడు బాన్సువాడ ఘర్షణల విషయంలోను అదే చేస్తున్నది. పైగా బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నది. తమ స్వేచ్ఛ గురించి మాట్లాడిన, రోడ్డెక్కిన హిందువులపైననే కేసులు నమోదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
బాన్సువాడలో ఏం జరిగింది?
బ్రిటిష్ ఇండియాలో కౌమ్యూజిక్ అనే ఒక పదబంధాన్ని ఆంగ్లేయులు ఉపయోగిస్తూ ఉండేవారు. అంటే ఆవు`సంగీతం. విస్తతార్థంలో వాద్యాల మోత. గోవధ చేస్తే హిందువులు ముస్లింల మీద దాడి చేసేవారు. మసీదుల పక్కన హిందువులు భజంత్రీలతో వెళితే ముస్లింలు దాడికి దిగేవారు. అయితే ఇప్పుడు మన ఇళ్లలో, మన వ్యాపార సంస్థలలో, మన ఆలయాలలో భక్తిపాటల వంటి సంగీత కార్యక్రమం పెట్టుకున్నా ముస్లింలు అభ్యంతరం చెప్పే రోజులు మళ్లీ వచ్చాయి. ఆ మతోన్మాదులలో దాగి ఉన్న మధ్యయుగపు ఉన్మాదం మళ్లీ బుసలు కొడుతున్నది. బాన్సువాడ పట్టణంలో రిలియన్స్ మార్టు ఉంది. ఇందులో నిత్యం సంగీతం, హిందూ దేవీదేవతల స్తోత్రాలు, పాటలు పెట్టు కుంటారు. ఇది ఇప్పుడే మొదలయినది కూడా కాదు. ఫిబ్రవరి 20వ తేదీన ముజామిల్ అనే ఒక ముస్లిం ఉన్మాది మార్ట్‌లోకి వచ్చాడు. ఏదో కొనడం అతడి ఉద్దేశం కావచ్చు. ఆ సంగతి వదిలేసి ఆ భక్తిపాటల గురించి గొడవకు దిగాడు. ‘ఇలాంటి చెత్త పాటలు’ పెడతారా అని కయ్యానికి కాలు దువ్వాడు. మార్టు లోకి వచ్చి, లోపల పెట్టుకున్న హిందూ భక్తిగీతాల మీద అభ్యంతరం చెప్పి, రగడకు దిగడం, ఆ ఉన్మాదికి దీటుగా సమాధానం ఇచ్చిన సేల్స్‌గర్ల్‌కు తెలియకుండా ఇదంతా వీడియో తీయడం జరిగిపోయాయి. కానీ ఇదంతా గమనించిన ఇతర హిందూ వనితలు దీని మీద నిలదీశారు. వీడియో ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. మళ్లీ అలాంటి సమాధానం, అదే నిర్లక్ష్యం, ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!’ అని.
దీనికి హిందూ వనితలకు మద్దతుగా వచ్చిన యువకులు ఆ ఉన్మాదికి దేహశుద్ధి చేసి, వారే పోలీసులను పిలిచి అప్పగించారు. ఇంతకీ ఆ ఉన్మాది ఇలాంటి తుంటరి. అనాగరిక ప్రవర్తనను వీడియోలో ఎక్కించి ముస్లిం సోషల్ మీడియా గ్రూప్‌లో పెట్టి, ఒక హిందూ మహిళ పట్ల తాను ఎంత వికృతంగా ప్రవర్తించాడో మార్గదర్శనం చేస్తాడట. ఇదేం పైశాచికానందం! అందుకే మార్టు నుంచే ఆ యువకులు, వనితలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. తరువాత ఇంకొంతమంది హిందు వులు గుమికూడి కఠిన శిక్షలతో కేసు పెట్టాల్సిందేనని ఆందోళన చేశారు. తాను చేసినది తప్పేనని స్టేషన్‌లో ఈ ఉన్మాది అంగీకరించాడు. అయినా ఎందుకో మరి, పోలీసులు అతడి మీద ఎఫఐఆర్ దాఖలు చేయలేదు. కొంత సమయం తరువాత అతడిని విడిచి పెట్టాలని కోరుతూ స్టేషన్ దగ్గరకు చేరుకున్న ముస్లింలు ఆందోళన మొదలు పెట్టారు.

పోలీసులలోను మత వివక్షా?
ఒకవైపు హిందూ సంఘాలు, మరొక వైపు ముస్లింలు చేరారు. వాతావరణం చినికి చినికి గాలివానలా మారింది. అదే ఉద్రిక్త వాతావరణం దాదాపు నాలుగు గంటల పాటు ఉంది. బాన్సువాడ డీఎస్‌పీ విఠల్‌రెడ్డి, సీఐ శ్రీధర్, రూరల్ సీఐ తిరుప తయ్య బలగాలతో వచ్చి రెండు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేసినా, కుదురలేదు. శాంతిని మాత్రమే కోరుతుందని చెప్పే ఆ మతం వారు పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దుశ్చర్యకు ఎలా దిగారో అర్ధం కాదు.
ఇదే సమయంలో ఒక ముస్లిం వర్గ కానిస్టేబుల్ హిందువులపై లాఠీచార్జ్ చేయడంతో వారిలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఇక్కడ కూడా మళ్లీ ఒక ముస్లిం కానిస్టేబుల్‌ను పోలీసులే భద్రంగా దాచిపెట్టారు. ఎల్లారెడ్డి డీఎస్‌పీ శ్రీనివాసులు అదనపు బలగాలతో బాన్సువాడకు చేరుకుని రెండు వర్గాలను శాంతింప చేశారు. ముస్లింల వైపు ఉన్న కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఖాలీక్, మహమ్మద్ ఎజాస్‌లతో ఎల్లారెడ్డి డీఎస్‌పీ ముస్లింలను కూడా వెనక్కి పంపించారు.
దొంగదెబ్బ
అయితే ముస్లింలు అధికారులు, నాయకుల కన్నుకప్పి మళ్లీ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ మీద, రిలయెన్స్ మీద, హిందువుల మీద రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలు తగిలాయి. దీనితో పోలీసులు రాళ్లు రువ్వుతున్న వాళ్లని చెదరగొట్టారు. మళ్లీ మైనారిటీ వర్గానికి చెందిన ఒక సీఐ పక్షపాతం చూపారని చెప్పే ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ దాడిలో పిల్లలు కూడా పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్‌పీ రాజేశ్‌చంద్ర బాన్సువాడ చేరుకుని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు.
ఒక స్మార్ట్ షాపులో పాటలు పెట్టవద్దని చెప్పడానికి ఆ ఉన్మాదికి ఏం హక్కు ఉంది? అయినా చెత్త పాటలు అంటూ వ్యాఖ్యానించి తెగింపు ఎక్కడిది? ఈ ఘటనలో మొత్తం 42 మంది మీద కేసులు పెట్టారు. ఇందులో బాధిత వర్గం వారే ఎక్కువ. అసలు రగడకు కారణమైన వారిని వదిలేసి, రెచ్చగొట్టారంటూ బాధితుల మీద అంటే హిందువుల మీద కేసులు పెట్టారు.
హిందువులకు న్యాయం చేయాలని అడగడానికి కూడా దేశంలో అవకాశం ఉండదని కాంగ్రెస్` ముస్లిం వేర్పాటువాద శక్తులు కలసి ఈ చర్యలతో హెచ్చరించినట్టయింది. హిందువుల బాధల”, హక్కుల రాహిత్యం, నిస్సహాయత గురించి చెప్పుకునే వినే నాథుడు ఈ దేశంలో ఉండడని వారు చెబుతున్నారు. కాంగ్రెస్, దాని మద్దతుతో ఎంఐఎం వంటి పార్టీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే కదా! ఒక చిన్న మునిసిపాలిటిలో ఏడు వార్డులు గెలిస్తేనే పరిస్థితి ఇలా ఉంటే, ఒక రాష్ట్రం వారి చేతిలో ఉంటే హిందువుల పరిస్థితి ఏమిటి? దీనిని హిందువులు తమకు తాము వెంటనే ప్రశ్నించుకోవాలి. నేరాలు వేర్పాటువాదులు చేస్తారు. ముస్లిం మతోన్మాదులు మత ఘర్షణలు సష్టిస్తారు. ఇందుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుంది. కేసులు మాత్రం ఈ ధోరణిని ప్రశ్నించిన హిందువుల మీద, జాతీయవాదులు మీద పెడుతున్నారు. అయితే ఈ పరిస్థితి నుంచి హిందూ సమాజం చాలా ఆలస్యంగానే అయినా మేలుకుంటూ ఉండడం శుభపరిణామం.
బాన్సువాడ బంద్
ఈ ఘటనకు నిరసనగా, పోలీసుల అత్యుత్సా హాన్ని ఖండిస్తూ ఫిబ్రవరి 21న హిందూ సంఘాలు బాన్సువాడ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది కూడా. ఈ బంద్ విషయంలోను పోలీసులు పక్షపాతంగానే వ్యవహరించారు. కొందరు హిందువులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పరిస్థితుల కోణం నుంచి చూస్తే, బాన్సువాడ మీద తమ ఆధిపత్యం కోసం కొద్దికాలంగా ముస్లింలు తపన పడుతున్నారు. మునిసిపల్ చైర్మన్ ఏ పార్టీ నుంచి ఎన్నికైనా, అతడు ముస్లిం మాత్రమే అయి ఉండాలన్న తీరులో రాజకీయాలు నడిపిస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలోను ఇదే తీరులో పని చేశారని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ 19 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడింటిని వివిధ పార్టీల ముస్లింలు కౌన్సిలర్లుగా గెలిచారు. కానీ ఇప్పటికీ పాత బాన్సువాడ హిందూ ఆధిపత్యంలోనే ఉంది. కొత్త బాన్సువాడలో శాసనసభ్యుడి అండతో ముస్లింలు అడ్డదారులలో చాలా ప్రయోజనాలు పొందుతున్నారని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అందులో ఒకటి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అధిక భాగం ముస్లింలకే దక్కడం. హిందువుల మీద దాడులు, అత్యాచారాలు చేసిన వారిని, పోలీసు కేసులలో ఇరుక్కుని జైలు నుంచి వచ్చిన వారిని స్థానిక ముస్లింలు సత్కరించడం హిందువులు అవమానకరంగా భావిస్తున్నారు. ఒక వృద్ధ ముస్లిం ఒక మైనర్ బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టి జైలుకు వెళ్లాడు. ఇటీవల బెయిల్ మీద వచ్చినప్పుడు కొందరు ముస్లింలు అతడికి శాలువ కప్పి సత్కరించారు.

ఒక పక్క బాన్సువాడ హిందూ-ముస్లిం ఘర్షణ, మరొక పక్క కామారెడ్డిలో శాసనసభ్యుడు వెంకట రమణారెడ్డి, షబ్బీర్ అలీ సవాళ్లు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంకటరమణారెడ్డికి సంఘీభావంగా కామారెడ్డి చేరుకోవాలనుకున్న ప్రతి బీజేపీ ప్రముఖుడిని గృహనిర్బంధంలో ఉంచారు పోలీసులు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు కూడా ఇది తప్పలేదు. అంటే ఈ రెండు సందర్భాలలోను బీజేపీ, లేదా హిందూత్వ శక్తుల మీదే అణచివేత కనిపిస్తుంది. ఘోషామహల్ శాసన సభ్యుడు టి. రాజాసింగ్ బాన్సువాడలో హిందువులకు సంఘీభావం తెలియచేయడానికి వెళుతుంటే అరెస్టు చేశారు. ఫిబ్రవరి 22న బాన్సువాడ బయలుదేరిన ఆయనను మెదక్ జిల్లా శంకరంపేట వద్ద పోలీసులు ఆపివేశారు. ఆయనను ప్రివెంటివ్ కస్టడీకి తీసుకు న్నారు. తాను నిర్మల్ వెళ్లవలసి ఉందని రాజాసింగ్ చెప్పినా, పోలీసులు ఆయనను వెళ్లడానికి అనుమ తించలేదు. బాన్సువాడ నియోజక వర్గ ఇన్‌చార్జ్ ఎండల లక్ష్మీనారాయణను కూడా బీజేపీ కార్యకర్తలను కలుసుకోవడానికి వెళుతుండగా పోలీసులు ఆపి వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మెజారిటీ మతస్థులను మైనారిటీలు లక్ష్యంగా చేసుకోవడం ఎక్కువయిందని లక్ష్మీ నారాయణ ఆరోపించారు. బాన్సువాడ ఘటనలో రాళ్లు విసిరిన వారిని వదిలిపెట్టి, మెజారిటీ మతం వారిని మాత్రం అదుపులోకి తీసుకుని, వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయారని, ఈ ఉదంతంలో అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని లక్ష్మీనారాయణ కోరారు.
హైదరాబాద్ నగరంలోనే ఉప్పల్ ప్రాంతంలో కూడా శివాలయం వివాదం ముస్లింల మతోన్మాదం కేంద్రంగానే మొదలయింది. ఒక్క కుటుంబం ఉన్నా, ఒక ప్రాంతంలో శివాలయంలో పూజలు చేసుకోవ డానికి ఆటంకాలు కల్పిస్తున్నదని మహిళలు ఆరోపిం చారు. వారు వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నారు. కానీ స్థానికులు ముస్లిం కుటుంబం పెడుతున్న హింసను పట్టించు కోవడం లేదన్న ఆరోపణ ఉంది. పాకిస్తాన్ పౌరులు, రొహింగ్యాలకు ఆటపట్టుగా ఉన్న హైదరాబాద్ వంటి నగరంలో ఇప్పటికీ బుజ్జగింపు ధోరణితో ప్రభుత్వాలు ఉంటే జరిగే ప్రమాదం సాధారణంగా ఉండదు. అంతర్జాతీయంగా ఏ దాడి జరిగినా హైదరాబాద్ వైపు వేలు చూపించవలసిన దుస్థితి. అలాంటి ప్రమా దకర నగరంలో మతోన్మాద శక్తులను ప్రోత్సహించ రాదన్న ఇంగిత జ్ఞానం నాయకులకు ఉండాలి. పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని కాంగ్రెస్ నాయకులు కాస్త భారతీయతను మనసులో దాచుకోవడం అత్యవసరం. ఐదేళ్లో, మూడేళ్లో ఉండే ఆ పదవి కోసం ముస్లింలే మా పార్టీ, మా పార్టీయే ముస్లింలు వంటి అత్యంత ప్రమాదకర నినాదాలు ఇవ్వడం జాతికి ద్రోహం చేయడమే.
అమ్మవార్ల ఆలయాలలో మల విసర్జన, విగ్రహాల ధ్వంసం వరకు ఇటీవల కాలంలో చాలా దుర్ఘటనలే జరిగాయి. మేధావులు, హేతువాదులు, ప్రజాస్వామిక వాదులు ఎలాగూ స్పందించరు. స్పందించే దమ్ము ధైర్యం వాళ్లకి లేవు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎన్ని జరుగుతున్నా వాటిని అరికట్టే ప్రయత్నం చేయకపోవడమే విచిత్రం. బాంగ్లాదేశ్‌లో ఇటీవలి వరకు కొనసాగిన వాతావరణానికి, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాలలోని పరిస్థితులకు పెద్ద తేడా లేదన్న విమర్శ ఉంది. హిందువుల మనోభావా లను గాయపరిచేవే అయినా, చెదురు మదురు ఘటనలుగా వాటిని గాలికి వదిలేస్తున్నారు. మీడియా గాని, ప్రభుత్వం కాని పట్టించుకోవడం లేదు. అదే హిందువులు చేసినట్టు ఏదైనా వార్త వస్తే వెంటనే యంత్రాంగం కదులుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ బాన్సువాడ ఘర్షణే. అల్లరి మొదలు పెట్టినవాడు ఒక ముస్లిం మతోన్మాది. తప్పు చేసిన వాడిని పోలీసులు విడిచిపెట్టాలంటే రాళ్లు రువ్వి శాంతిభద్రతల సమస్యను సృష్టించినది కొందరు ముస్లింలు. కానీ అరెస్టయిన వారిలో ఎక్కువ మంది హిందువులు. ఇది కదా అసలు వైచిత్రి! కొన్నేళ్లుగా తెలంగాణ దేవాలయాల మీద జరిగిన దాడులకు సంబంధించి ఒక్క కేసులోను న్యాయం జరిగిన దాUలాలు లేవు. ముఖ్యమంత్రిని మార్చడానికి కూడా మత కల్లోలాలు లేపే సంస్కృతి, చరిత్ర కలిగిన పార్టీ పాలనలో ప్రస్తుతం తెలంగాణ ఉన్నది. ఇంతకు మించిన న్యాయం ఆశించగలమా?
ఆంధ్రప్రదేశ్‌లోను క్రైస్తవం వీరవిహారం చేస్తున్నది. అక్కడ వందేమాతరం ఆరు చరణాలు పాడడానికి ముస్లింలు, క్రైస్తవులు కలసి ఆందోళనకు దిగాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీడియోలలో పాస్టర్లు వినిపిస్తున్న నినాదాలు, రెచ్చగొట్టేట్టు చేస్తున్న ఉపన్యాసాలకు లోటు లేదు. కోస్తాంధ్ర మొత్తం మాదే అని వేదిక ఎక్కి ప్రసంగిం చిన ఒక పాస్టర్, ప్రభుత్వోద్యోగులు జైశ్రీరాం అంటూ పలకరించుకోవడాన్ని తప్పు పడుతున్నాడు. అదొక ప్రమాద ఘంటికగా అభివర్ణిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కంటే, ముస్లిం పార్టీలు, సంఘాల సభ్యులలోనే ఎక్కువ ఉత్సాహం కనిపి స్తున్నది. హిందువుల మీద ఇంత ద్వేషం కాంగ్రెస్ రాష్ట్రాలలోనే కనిపిస్తున్నది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో ఇది సుస్పష్టం. దీని ఆత్మబంధువు డీఎంకే కూడా అదే పనిలో ఉంది. తిరుప్పురకుండ్రం ఇందుకు కచ్చితమైన ఉదాహరణ. కేరళ స్టోరీ 2 పేరుతో విడుదల కానున్న సినిమా గురించీ ఇదే రకమైన చౌకబారు ప్రచారం. అందులో హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో మోసం చేస్తున్నా రని చెప్పడమే నేరమైంది. నేను అబద్ధం చెప్పడం లేదు, పోలీసు స్టేషన్‌లలో, కోర్టులలో ఉన్న కేసుల ఆధారంగానే ఇతివృత్తం తయారయిందని నిర్మాత చెప్పినా, ఇది ముస్లిం వ్యతిరేక ప్రచారం అంటూ గగ్గోలు లేపుతున్నారు.
దేశంలో గడచిన పుష్కర కాలంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మత కల్లోలాలు లేవు. అది ఎన్‌డీఏ ప్రభుత్వ ఘనత. హనుమాన్ శోభాయాత్రల మీద రాళ్ల దాడులు జరిపితే అలాంటి వాళ్ల తోకలు కత్తిరించారు. దీనితో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, డీఎంకే వంటి వేర్పాటువాద పార్టీల పబ్బం గడవడం లేదు. వీటిని ఏదో ఒక రకంగా ఎక్కడో ఒకచోట సృష్టించగలిగితే చాలు. దేశం మొత్తాన్ని అగ్నిగుండం చేయవచ్చు నన్నదే కాంగ్రెస్ వ్యూహం. కానీ ఇది సాధ్యం కాదని ఆ పార్టీ గుర్తించవలసి ఉంటుంది. ముస్లింలను 1970 దశకంలోనే ఉండిపోయేటట్టు చేసినప్పటికి, హిందువులు ఇప్పుడు చైతన్యవంతమయ్యారు. అది కాంగ్రెస్ గుర్తించాలి. పార్లమెంట్‌లోను, ఏఐ సదస్సు జరిగిన భారత మంటపం (ఢిల్లీ), ఇతర అంతర్జా తీయ వేదికల మీద దేశం పరువు తీయడానికి కాంగ్రెస్, దాని తైనాతీలు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీని అపఖ్యాతి పాలు చేయడానికి శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రయత్నం, శ్రమ వృథా అని 12 ఏళ్లుగా ఉన్న మత సామరస్యం వెల్లడిస్తున్నది.
– జాగృతి డెస్క్