సంపాదకీయం

శాలివాహన 1947 శ్రీ విశ్వావసు మాఘ శుద్ధ పాడ్యమి – 19 జనవరి 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టీ2 టెర్మినల్‌ వద్ద మొన్న నవంబర్‌లో కొంతమంది ముస్లింలు నమాజ్‌ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్‌ అంటూ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. బహిరంగ ప్రదేశాలను అందుకే ఎంచుకుంటున్నారు. దీనిని ఎలా అనుమతిస్తారని అప్పుడు కొంతమందయినా దుమ్మెత్తి పోశారు. రోడ్లు, పార్కులు, ఫుట్‌పాత్‌లు నమాజ్‌లకు స్థలాలుగా చేసుకోవడం గురించి కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఆఖరికి టీజింగ్‌కు కూడా నమాజ్‌ను ఉపయోగించుకుంటున్న వికారపు పనులు కూడా వెలుగు చూస్తున్నాయి. కానీ ఈ జనవరి 9,10 తేదీలలో వచ్చిన రెండు వార్తలు మత కల్లోలాల కోసం నమాజ్‌ను ఉపయోగించు కుంటున్నట్టు చెప్పడానికి వీలుగానే ఉన్నాయి. న్యాయస్థానం తీర్పు ద్వారానే అయినా అయోధ్య హిందువులకు దక్కడం సహించలేని వర్గం ఒకటి ముస్లింలలో ఉన్నమాట నిజం. వీళ్లు ఒక ఘర్షణ కోసం, దేశంలో మత కల్లోలాల కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు.  పైన పేర్కొన్న ఆ రెండు తేదీలలోను అయోధ్య రామమందిరంలో మొత్తం నలుగురు నమాజ్‌ చేయడానికి సాహసించడమే ఇందుకు నిదర్శనం.

55 ఏళ్ల ఒక ముస్లిం అయోధ్య రామమందిర పరిసరాలలోని సీతా రసోయి వద్ద జనవరి 9న నమాజ్‌ చేయడానికి ఉద్యుక్తుడు అవుతుండగా భద్రతా సిబ్బంది నిర్బంధించింది. ఈ ప్రదేశం ప్రధాన దేవాలయానికి 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇతడిని కశ్మీర్‌లోని షోఫియాన్‌కు చెందిన అహ్మద్‌ షేక్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది తన నమాజ్‌ ప్రయత్నాన్ని ఆపడం ఈ కశ్మీరీ ముస్లింకు బొత్తిగా నచ్చలేదు. అందుకే గట్టిగా నినాదాలు కూడా చేశాడని మీడియా వార్తలను బట్టి తెలుస్తున్నది. అవి మత నినాదాలని గమనించాలి. యథా ప్రకారం ఇతడు కూడా ‘మతిస్థిమితం లేనివాడే’ నని తేల్చి పారేశారు. అందుకు రుజువుగా ఇతని కుటుంబ సభ్యులు షేక్‌గారు మతి స్థిమితం లేనివాడే అంటూ శ్రీనగర్‌ వైద్య కళాశాలలోని మానసిక రోగుల విభాగం అధికారులు ఇచ్చిన వివరణను కూడా చూపించారు. ఇతడి బ్యాగులో జీడిపప్పు, ఎండుద్రాక్ష దొరికాయి. అజ్మీర్‌ వెళుతున్నట్టు కూడా చెప్పాడు.

మకర సంక్రాంతి ఉత్సవాలకు అయోధ్య మందిరం ముస్తాబవుతున్న తరుణంలో ఈ ఉదంతం జరిగింది. దీనిని యథాప్రకారం ముస్లిం మతోన్మాదపు చర్యగా కాకుండా, భద్రతా లోపంగా చిత్రించే ప్రయత్నం జరిగింది. ఇలా ఉండగా జనవరి 11న ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కూడా ఇలాంటి వార్తే వెలువడిరది. జనవరి 10వ తేదీన ఒక యువతి, ఇద్దరు యువకులు అయోధ్య ఆలయ సముదాయంలోనే నమాజ్‌ చేసే సాహసం చేశారు. ఆ ముగ్గురిని ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నప్పుడు ముస్లిం మతానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ముగ్గురు కూడా కశ్మీర్‌కు చెందినవారిగానే సిబ్బంది గుర్తించింది. షరామామూలే అన్నట్టు వీళ్లు కూడా మతి స్థిమితం లేని వాళ్లో కాదో ఇంకా తెలియరాలేదు. ఆ యువతి పేరు సోఫియా అని, ఒక యువకుడి పేరు అబు అహ్మద్‌ షేక్‌ అని వెల్లడైంది.

హిందువులు శతాబ్దాల పాటు పోరాటం చేసి గెలిచి అయోధ్యలో రామ మందిరం నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ముస్లిం ఉగ్రవాదుల నుంచి, ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి ఈ ఆలయానికి రకరకాలుగా బెదిరింపులు, హెచ్చరికలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆగస్ట్‌, 2024లో అయితే నాలుగు వేల కిలోల ఆర్‌డీఎక్స్‌తో కొత్త నిర్మాణాన్ని పేల్చివేస్తామని బెదిరింపు సమాచారం వచ్చింది. ఇదంతా ఏమిటి? పుష్కరకాలంగా ఆగిపోయిన భారీ మతకల్లోలాలను ఏదో విధంగా సృష్టించడానికి కాక మరేమిటి? ఇలా హిందూ ఆలయాలలో నమాజ్‌ చేసే వికృతబుద్ధి కొందరిదైతే, అమ్మవారి ఆలయాలలో మల విసర్జన చేసే నీచ వర్గం కూడా వీళ్లలోనే బయలుదేరింది. హైదరాబాద్‌లోని సఫిల్‌గూడలో ఇదే జరిగింది. అన్నట్టు ఇంత కుసంస్కారం ప్రదర్శించిన ఈ జంతువు ‘మతి స్థిమితం’ లేనిదే. ఈ నేపథ్యంలో వినిపిస్తున్నదే హిందూ దేవాలయాల పరిసరాలలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలన్న డిమాండ్‌. రామలల్లా ప్రతిష్ఠ జరిగింది కాబట్టి అయోధ్య ఆలయ పరిధిలోకి ముస్లింలు, ఇతర మతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలని హనుమాన్‌ ఘడీ మహంత్‌ రాజు దాస్‌ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అసమంజసం కాదు. ముగ్గురు లేదా నలుగురు ముస్లింలు అయోధ్య ఆలయ ప్రాంగణంలో నమాజ్‌ చేయడానికి చొరబడడం అత్యంత హేయమని ఆయన వ్యాఖ్యానించారు.

చేయకూడని చోట నమాజ్‌లు చేయడానికి సాహసించడం, మలమూత్రాలు విసర్జించడం వెనుక ప్రోద్బలం ఏమిటి? ముస్లింలంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే ముస్లింలు అని మాట్లాడిన కొత్త రాజకీయ బిచ్చగాళ్ల ప్రేలాపన వంటివి దీని వెనుక లేవని అనగలమా? అయోధ్యలో రాజు దాస్‌ కోరినట్టే, సఫిల్‌గూడ స్థానికులు కూడా ఆ పరిసరాలలోకి ముస్లింలను అనుమతించరాదని కోరడంలో వింతేమీ లేదు. వారి కోరికను ప్రభుత్వాలు సత్వరమే పరిశీలించడం అవసరమే. హిందూ ఆలయాల పరిసరాలలో దుకాణాలు నడుపుతూ, గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇలాంటి వారిని అక్కడ నుంచి తరలించడమే మంచిది. ఎదుటి మతాల వారి ప్రార్థనాస్థలాల పట్ల ఇంత వికృత దృష్టి ఎందుకు వస్తున్నది?  ఎవరి ప్రార్థనా స్థలమైనా పవిత్రమైనదే. హేయమైన పనులకు పాల్పడుతున్న అలాంటి ద్విపాద పశువులు మొదట గుర్తించాలి. లేదంటే పోలీసులే తమదైన తీరులో గుర్తించేటట్టు చేయవలసి ఉంటుంది. అలా కాకుండా హిందూ సమాజం అందుకు నిజంగా నడుం బిగిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి.

About Author

By editor

Twitter
YOUTUBE