జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 2025 ‌సంవత్సరంలో శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. దాని సైద్ధాంతిక పునాది, నిర్వహణ నిర్మాణం, నిస్వార్థ సేవ కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది.

సమ్మిళిత, బలమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారతదేశానికి వ్యతిరేకంగా దేశం లోపలా, బయటా కొన్ని విధ్వంసక శక్తుల కారణంగా, సంస్థను కించపరిచే మీడియా కథనం తరచుగా, ముఖ్యంగా పాశ్చాత్య మీడియాలో వస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది స్ప్రింగ్‌ ‌లాంటి ఆర్‌ఎస్‌ఎస్‌పై ఎంత బలంగా ఒత్తిడి పెంచితే అంతే స్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రతి చర్యా ఉండటం.

బ్రిటీష్‌వారి విభజించు, పాలించు విధాన ఫలితంగా మతం ప్రాతిపదికగా భారత్‌ ‌విభజన జరిగింది. దురదృష్టవశాత్తు, స్వతంత్ర భారతదేశంలో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అదే వలసవాద మనస్తత్వంతో, అదే విధానాన్ని అనుసరించాయి తప్ప పెద్దగా తేడా చూపించలేదు. ఈ ప్రభుత్వాలు వివిధ కులాలు, వర్గాలు, భాషా సమూహాల రూపంలో సామాజిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తూనే ఉన్నాయి. సంక్షేమం ముసుగులో చేపట్టిన బుజ్జగింపు విధానాలు జాతి నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలను బలహీనపరిచాయి.

కొన్ని వర్గాలను నడిపిస్తున్న మతమౌఢ్యం ఆ వర్గాల్లోని అమాయక ప్రజలను తీవ్రవాద/ఛాందస వాద భావజాలం వైపు ప్రేరేపిస్తోంది. అలాంటివారు తమ మతం దేశానికి అతీతమైనదిగా ప్రకటించు కున్నారు. మిగిలినవారితో కలిసి శాంతియుతంగా జీవించడానికి నిరాకరిస్తున్నారు. దీంతో దేశం పట్ల వారి విధేయత ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి ఒక ధోరణి పట్ల అదే మతానికి చెందిన మేధావులు కానీ రాజకీయ నాయకత్వం కానీ సామాన్య ప్రజలు కానీ ఆగ్రహం వ్యక్తం చేయకపోవడం విడ్డూరంగా ఉంది.

ఈ నేపథ్యంలో, జాతి పునర్నిర్మాణాన్ని వేగ వంతం చేయడానికి, భారతీయ సమాజాన్ని మార్చ డానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పంచ పరివర్తనలతో ముందుకు వచ్చింది. వాటిలో సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్‌, ‌పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, పౌరుల కర్తవ్య పాలన అనే ఐదు అంశాలు ఉన్నాయి.

ఈ వ్యాసం, పర్యావరణ పరిరక్షణకు సంబం ధించిన కొన్ని అంశాలను, ఆలోచనలను చర్చించింది. అలాగే ప్రాచీన భారత దేశంలో ప్రకృతికి ఇచ్చిన ప్రాముఖ్యత, ప్రస్తుత పర్యావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యల గురించి క్లుప్తంగా చర్చించింది.

‘పర్యావరణం అంటే ఏమిటి’? తో ప్రారంభిద్దాం. పర్యావరణం అంటే విస్తృత అర్థంలో మన చుట్టూ ఉన్నది, ఈ భూమిపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రతి జీవి మనుగడకు సహాయపడుతుంది.

పర్యావరణాన్ని జీవ సంబంధితమైనవి (మానవులు, పక్షులు, జంతువులు, మొక్కలు, చెట్లు, సూక్ష్మజీవులు), నిర్జీవమైనవి (భౌతిక మూలకాలు, వాతావరణం, జలావరణం, భూమి, సూర్యకాంతి, అంతరిక్షం) అని మరొక విధంగా వర్గీకరించవచ్చు. ఇవ్వన్నీ సంక్లిష్టమైన ‘‘జీవన వలయం’’లో అనుసంధా నితమై పరస్పరం ప్రభావితమవుతుంటాయి.

‘భూమిపై జీవితం’ భగవాన్‌ ‌చేత నడుస్తుందని చెప్పడం సముచితంగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, పంచ భూతాలు (భ + అగ్‌ + ‌వ + ఆ + ఎన్‌) ఇక్కడ ‘భ’ అంటే భూమి, ‘అగ్‌’ అగ్ని, ‘వ’ వాయువు, ‘ఆ’ ఆకాశ్‌, ‘ఎన్‌’ అం‌టే నీరు ఇవ్వన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఏర్పరిచాయి.

పర్యావరణం మన మనుగడ, జీవనోపాధికి చాలా ముఖ్యమైనది. ఇది మనకు అవసరమైన ఆహారం, గాలి, నీరు అనే సహజ వనరులను అందిస్తుంది. స్వచ్ఛమైన పర్యావరణం కూడా జీవన ప్రమాణాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వివిధ కాలుష్య కారకాలను గ్రహించి వాటిని తిరిగి ఉపయోగించుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పర్యావరణ సమస్యలను అవి ప్రభావం చూపించే స్థాయులను బట్టి ప్రపంచ, స్థానిక సమస్యలుగా వర్గీకరించవచ్చు.

ప్రాచీన భారతదేశంలో పరిరక్షణ

పర్యావరణ పరిరక్షణ అనేది ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది. ఇక్కడ ప్రకృతిని పవిత్రంగా భావిస్తారు. చారిత్రాత్మ కంగా ప్రకృతి, వన్యప్రాణుల పరిరక్షణ భారతీయ సమాజం రోజువారీ జీవితం, పురాణాలు, జానపద కథలు, ధర్మం, కళ, సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది.

వన్యప్రాణులు, చెట్లు, అడవులను రక్షించడం రాజు విధిగా 2300 సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి ప్రకటించాడు. అడవులను నాశనం చేయడాన్ని, వివిధ జాతుల జంతువులను చంపడాన్ని నిషేధిస్తూ తన రాజ్యం అంతటా రాళ్లు, ఇనుప స్తంభాలపై శాసనాలు చెక్కించాడు. నేటికీ మిగిలి ఉన్న ఈ చారిత్రక సాక్ష్యం, ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణకు మొట్టమొదటి ఆనవాలుగా నిలిచి పోయింది.

జీవావరణ శాస్త్రపు ప్రాథమిక సూత్రాలైన అన్ని జీవుల పరస్పర సంబంధం, పరస్పర ఆధారితం భారతీయ ఆచార విచారాల్లో మమేకమై ఉన్నాయి. అవి మన పురాతన గ్రంథం ఈశోపనిషత్తులో ప్రతిబింబించాయి. ‘‘మహోన్నత శక్తిమంతుడైన పరమాత్ముడు అన్ని జీవుల ప్రయోజనం కోసమని ఈ విశ్వాన్ని సృష్టించాడు. కాబట్టి ప్రతి జీవి, ఇతర జీవులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ద్వారా వ్యవస్థలో ఒక భాగమై వ్యవస్థ అందించే ప్రయోజనాలను ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఏ ఒక్క జీవి మరొక జీవి హక్కులను ఆక్రమించకూడదు, అతిక్రమించకూడదు’’ అని ఈశోపనిషత్తు పేర్కొంది.

మన గతం నేటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. నవంబర్‌ 24, 2025‌న అయోధ్యలోని శ్రీరామ ఆలయంలో ప్రధానమంత్రి ‘ధ్వజారోహణ’ సందర్భంగా ధ్వజంపై కోవిదార చెట్టు ప్రాముఖ్యతను ఎత్తి చూపారు. ఇది మొదటి జీవసాంకేతిక శాస్త్రవేత్త కశ్యప మహర్షి మందార, పారిజాత చెట్లను సంకరం చేయగా ఉద్భవించినది. ఇది పురాతన విజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తోంది. పవిత్రమైన మన సంప్రదాయాలను కొనసాగిస్తోంది.

భారత్‌ ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లు

భారత్‌ ‌ప్రస్తుతం వాయు, నీటి కాలుష్యం, భూసార క్షీణత, నశిస్తున్న పరిరక్షణ మండలాలు, క్షీణిస్తున్న జీవ వైవిధ్యం వంటి అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతీయుల జీవనశైలి భూమి పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు భారతీయులను గొప్పదైన వారి జీవనశైలికి దూరం చేస్తున్నాయి.

భారత్‌ ‌శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల తోడ్పాటుతో ఒక సున్నితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. దానికి బాధ్యత కలిగిన పౌరులను జోడించాలి. తద్వారా ఒక ఆచరణీయమైన పర్యా వరణ సంస్కృతిని నెలకొల్పవచ్చు. భారత్‌ ‌రాజ్యాంగ పరంగా కూడా, తన పర్యావరణ వ్యవస్థలను రక్షించు కోవడానికి తగినన్ని భరోసాలను కలిగి ఉంది.

సొంత మార్గంలో ముందుకు

ప్రభుత్వం పర్యావరణ పతనాన్ని ఆపడానికి ఎన్ని పనులు చేసినప్పటికీ అంతిమంగా ప్రజల్లో పర్యావరణ స్పృహ అనేది ఉండాలి. ఈ విషయంలో పంచ పరివర్తనలో ప్రస్తావించిన పర్యావరణ పరిరక్షణ చక్కగా పనిచేస్తుంది.

భారత్‌ ‌గత కొద్ది కాలంగా పర్యావరణ పరిరక్షణకు పాశ్చాత్య నమూనాలను అనుకరిస్తోంది. కానీ మనం ఇప్పుడు నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ప్రజా రవాణా, వాయు కాలుష్యం వంటి విషయాల్లో పర్యావరణ పరిరక్షణకు మనకంటూ సొంత కార్యాచారణను రూపొందించి, అభివృద్ధి చేసి, ఆచరించడానికి సమయం ఆసన్నమైంది.

ప్రభుత్వంలోని మూడు అంగాలైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు వాటి విధానాలు, పక్రియలను పునఃపరిశీ లించడం ద్వారా సుస్థిరమైన ప్రణాళికను రూపొందించడం కూడా ముఖ్యం. మీడియా సైతం పర్యావరణ పరిరక్షణకు అనుకూల మైన సందేశాలను ప్రచారం చేయడంలో తన వంతు పాత్రను రూపొందించు కోవాలి.

ఆర్థిక నిర్వహణకు సంబంధించి దేశంలోని అన్ని స్థాయులలో పర్యావరణానికి సానుకూలమైన, ప్రతికూలమైన అంశాలను పరిగణనలోకి తీసు కోవాలి. ఉదాహరణకు, జాతీయ సగటు కంటే ఎక్కువ అటవీ ప్రాంతాన్ని (విస్తీర్ణం లోనూ, సాంద్రత లోనూ) కలిగి ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక పురస్కారాలు ఇవ్వాలి. ఆ పురస్కారాల ప్రయోజ నాలు అడవుల్లో నివసించే వారికి చేరాలి. ప్రస్తుతం, మన వన్యప్రాణుల సంరక్షణ చట్టం పరిరక్షణ కార్యకలాపాలలో ప్రైవేట్‌ ‌రంగం పాల్గొనడాన్ని నిరుత్సాహపరుస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని సముచితంగా సవరించడం ద్వారా దేశంలో వివిధ స్థాయులలో ‘వంతరా’ (జామ్‌ ‌నగర్‌లో అతి పెద్ద ప్రైవేట్‌ ‌వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం) వంటి వాటిని ప్రోత్సహించాలి. అదేవిధంగా, వన్యప్రాణుల సంరక్షణ చట్టం భారతదేశంలోని మైదాన ప్రాంతాల్లో వన్య ప్రాణుల సంరక్షణను నిషేధిస్తుంది. కనుక మన పరిరక్షణ చర్యలను పునఃపరిశీలించి, ప్రస్తుత ధోరణు లకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉంది.

స్టార్టప్‌లు అభివృద్ధి చేస్తున్న అనేక అంశాలలో, స్వదేశీ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ప్రస్తావించదగినది.

‘‘భారత్‌లో తయారైంది. స్వదేశీ ఉద్యమానికి గర్వకారణంగా నిలిచింది. ఈ ఉద్యమంలో నవకల్పన సుస్థిరతతో సంగమిస్తుంది. వ్యర్థాల నిర్వహణ ప్రపంచ స్థాయి ఉత్పాదకతకు దారి తీస్తుంది. భారత్‌లో ఆవిర్భవించిన స్వదేశీ రథ చక్రాలు పురోగతి దిశగా వడివడిగా ముందుకు సాగుతాయి. వ్యర్థాల నిర్వహణలో ప్రజలకు మార్గదర్శనం చేస్తాయి. పర్యావరణాన్ని కాపుకాస్తాయి. అవి అధునాతనమైన పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ, వాటిని తిరిగి వాడటం, వనరుల సేకరణ, హరిత విధానాన్ని దేశీయ తయారీ నైపుణ్యంతో రూపొందించిన ఏకైక మొబైల్‌ ‌వేదికపైకి చేరుస్తాయి. దీంతో సరికొత్త భారత్‌ ఆవిష్కృత మవుతుంది.

నవకల్పన అనేది మనలో నరనరాన ఇంకిపోయి ఉన్నది. నవకల్పన ద్వారా మన ప్రజలకు సుస్థిరమైన పరిష్కారాలను అందించాలి. పరిశుభ్రమైన నగరాలు, పల్లెల కోసం వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహిం చాలి. ప్లాస్టిక్‌ ‌నుంచి జౌళి రంగం వరకు స్వదేశీ ఉత్పాదకత ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ను బలోపేతం చేస్తుంది. స్వదేశీ పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ, వాటిని తిరిగి వాడటం అనేది మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద పర్యావరణ సవాళ్లలో కొన్నింటికి తగిన సమాధానం ఇస్తుంది. సుస్థిరమైన స్వదేశీ రథం కేవలం ఒక వాహనం కాదు. అది వృద్ధి చెందుతున్న భారత్‌ ‌సామర్థ్యానికి ఒక సంకేతం. ప్రతీ ఇంటికి సుస్థిరతను అందుబాటులోకి తెచ్చే ఒక వాగ్దానం. సాంకేతికత, పర్యావరణం,ఉత్పాదక సామర్థ్యాన్ని సమ్మిళితం చేసే ఒక దృక్పథం. భారత్‌లో ఉద్భవించే సుస్థిరమైన స్వదేశీ రథం స్వదేశీ స్ఫూర్తిని అణువణువునా కలిగి ఉంటుంది. నవకల్పన చోదకంగా, సుస్థిరమైన ఉత్పాదకత ఇంధనంగా ముందుకు సాగుతుంది. అది పరిశుభ్రమైన, హరిత భవిష్యత్తును నిర్మించడానికి తననుతాను అంకితం చేసుకుంటుంది.’’

చివరిగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రవచిస్తున్న పంచ పరివర్తనలు భారతీయ సమాజానికి అన్ని విధాలుగా ఉపకరిస్తాయి.

– డా. శైలేంద్రకుమార్‌ ‌జోషి

About Author

By editor

Twitter
YOUTUBE