దేశంలో ఏ మూల ముస్లిం మతోన్మాదులు దాడులు చేసి రక్తపాతం సృష్టించినా ఇక తెలంగాణ వైపు, ఆంధప్రదేశ్‌ ‌వైపు వేలు పెట్టి చూపక తప్పదా? హైదరాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌తదితర ప్రాంతాలు ముస్లిం మతోన్మాదులకు ఎప్పటి నుంచో అడ్డాలుగా ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లో కూడా కొన్ని పట్టణాలు వీళ్లకి ఆలవాలంగా ఉన్నా ఇప్పుడు ఆ వాస్త వాలు వెలుగు చూస్తున్నాయి. అత్యంత దారుణ నేరచరిత్ర కలిగిన ఇద్దరు ఉగ్రవాదులు రెండు దశాబ్దాలుగా ఒకేచోట ఉంటున్నా వారి ఆచూకీ కనుగొనలేకపోవడం నిఘా వర్గాలకు అవమానం కాదా? ఒకవేళ నిఘా వర్గాలకు, పోలీసులకు నిజం తెలిసినా వారిని అదుపు లోకి తీసుకోకుండా ఏ ప్రభుత్వాలు నిరోధించాయి? ఏ శక్తులు అడ్డుపడ్డాయి? పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌దగ్గర బాంబులు పేల్చడం, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మాజీ మంత్రి లాల్‌కృష్ణ అడ్వాణీ హత్యకు కుట్ర వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఆంధప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉంటూ, 30 ఏళ్ల తరువాత పట్టుబడడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ ఇద్దరు ఆల్‌-ఉమ్మ ఉగ్రవాదులు. రాయచోటిలోనే ఉంటూ దేశంలోని మూడు ప్రధాన నగరాలలో విధ్వంసానికి వీళ్లు పన్నాగం పన్నడం మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. నిఘావర్గాల దాడులలో వీళ్ల దగ్గర ఐఈడీ, పెట్టెల కొద్దీ బాంబులు, పేలుళ్లకు ఉపయోగించే రసాయనాలు పెద్ద ఎత్తున దొరికాయి. ఇదంతా చూస్తుంటే రాయలసీమ ముస్లిం ఉగ్రవాదులకు రక్షణ స్థావరంగా మారినట్టు అనుమానించవలసి వస్తున్నది.

అబూబకర్‌ ‌సిద్దికి, మహమ్మద్‌ అలీ అనే ఇద్దరు రాయచోటి పట్టణంలో కిరాణా, వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్లిద్దరూ సోదరులే. ఎక్కడి నుంచో వచ్చి అక్కడి మహిళలను పెళ్లి చేసుకుని, దొంగపేర్లు పెట్టుకుని ఉంటున్నారు. కానీ వీరి నేర చరిత్ర ఘోరమైనది. దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఘనత వీళ్లిద్దరిదీ. తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ ‌స్క్వాడ్‌, ‌రాష్ట్ర పోలీసులతో కలసి అరెస్టు చేసే వరకు ఈ కర్కోటకుల గురించి స్థానికులకు తెలియలేదు. కొత్తపల్లి అనే ప్రాంతంలో చీరలు, కిరాణా సరుకులు అమ్ముకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నట్టు నటించినప్పటికీ అతి పెద్ద కుట్రకు పథక రచన, మందుగుండు సామగ్రి సిద్ధం చేసుకునే క్రమంలో ఉన్నారు. తమిళనాడు, కర్ణాటకలలో దారుణ నేరాలకు పాల్పడిన ఈ ఇద్దరు, దేశంలో మూడు చోట్ల రక్తపాతం సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు.

1997 నుండి 2011 వరకు ఆల్‌-ఉమ సంస్థ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో పలు బాంబు పేలుళ్ల కేసుల్లో ఈ ఇద్దరు నిందితులుగా ఉన్నారని, బీజేపీ నేత అడ్వాణీ రథయాత్ర సందర్భంగా జరిగిన పేలుళ్లు, ఎగ్మోర్‌ ‌పేలుడులో కూడా ఇద్దరు నిందితులు. 1995 మద్రాసు హిందు మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులో కూడా వీరు నిందితులుగా ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తురు, కేరళ, తిరుచ్చిలలో బాంబు పేలుళ్లు జరిపారు. 2012 సంవత్సరంలో వేలూరులో డా. అరవింద్‌రెడ్డి హత్య, 2013లో కర్ణాటకలోని మల్లేశ్వర బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి ఇలా 10 కేసులలో ప్రధాన నిందితులు. వీరిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించారు. ఈ అన్నదమ్ములు రాయచోటిలో స్థిరపడిన తరువాతే సౌకర్యంగా కార్యకలాపాలు సాగించారు. దేశంలోను మూడు ప్రధాన నగరాలతో పాటు రైల్వేస్టేషన్‌లలో వాటి నెట్‌వర్క్‌కు సంబంధించిన మ్యాపులు దొరికాయి. వీరు సేకరించిన వస్తువులతో 20 నుండి 30 బాంబులు తయారు చేయవచ్చునని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న విధ్వంసక పదార్ధాలను ప్రత్యేక పోలీసులు నిర్వీర్యం చేశారు. అలాంటి కర్కోటకులకు, అసాంఘిక శక్తులకు షెల్టర్‌ ‌జోన్‌గా రాయలసీమ మారుతోంది. దేశంలో ఎక్కడ, ఏ తీవ్రవాదుల కార్యకలాపాలు జరిగినా మూలాలు ఇక్కడ ఉంటున్నాయని అంటే అతిశయోక్తి కాదు.

కర్నూలు రేంజ్‌ ‌డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌కోయ ప్రవీణ్‌, ‌పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ ‌వి. విద్యాసాగర్‌ ‌నాయుడు ఈ వివరాలు విలేకరులకు వెల్లడించారు. 1995 నాటి పార్సిల్‌ ‌బాంబు పేలుళ్ల కేసులలో వీరికి సంబంధం ఉంది. 2011లో మదురై బాంబుదాడుల కేసుతో కూడా ఈ ఇద్దరికి సంబంధం ఉంది. ఆ పేలుళ్ల లక్ష్యం బీజేపీ అగ్రనేత అద్వాణీ రథయాత్ర. ఆ దాడుల తరువాత అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రాయచోటిలో నివాస ముంటున్నారు. దారుణ నేరాలలో సూత్రధారులైన ఈ ఇద్దరిని మద్రాసు ప్రత్యేక పోలీస్‌ ‌దళం జూలై 2న అరెస్టు చేసింది. మద్రాసు నిఘా పోలీసులు నిందితులు ఇక్కడ ఉన్నారన్న సమాచారంతో స్థానిక ఎస్‌పీ విద్యాసాగర్‌ ‌నాయుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసులతో 3 నెలలపాటు నిఘావేసి మారు వేషాలలో తిరుగుతూ వీరిని అరెస్టు చేశారు.

ఎలా గుర్తించారు?

30 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులపై నాన్‌ ‌బెయిలబుల్‌ ‌వారెంట్‌ ఉం‌ది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులకు సంబంధించినవే అవి. రాయచోటిలో ఉన్నట్లు అనుమానం రావడంతో తమిళనాడు ఇంటిలిజెన్స్ ‌పోలీసులతో స్థానిక ఎస్‌పీ ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసారు. కొత్తపల్లెలో ఉంటున్న అమానుల్లాయే అబూబకర్‌ ‌సిద్దికి అనీ, మన్సూర్‌ను మహమ్మద్‌ అలీగా గుర్తించారు. ఎస్‌పీకి సరైన సమాచారం రావడంతో అర్ధరాత్రి స్థానిక పోలీసుల సహాయంతో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని తమిళనాడు పోలీసులు చెన్నై తరలించారు.

కరుడుగట్టిన ఈ నేరగాళ్ల గతాన్ని బట్టి నిందితుల ఇండ్లను సోదా చేస్తే దిమ్మతిరిగిపోయే రహస్యాలు బయటపడ్డాయి. బాంబుల తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. కత్తులు, బాకులు, కొడవళ్లు 2 ల్యాప్‌టాప్‌లు, ప్రధాన నగరాల మ్యాపులు, రైల్వే స్టేషన్ల వివరాలు, బైనాక్యులర్లు, సెల్‌ఫోన్‌లు, వాకీటాకీలు స్వాధీనం చేసుకొన్నవాటిలో ఉన్నాయి. ఇంకా, ఫ్యూయల్‌ ఆయిల్‌తో కలిపిన అమోనియం నైట్రేట్‌, ఇం‌ప్రొవేజ్‌ ఎక్స్ ‌ప్లోజివ్‌ ‌స్లర్రీ ఎక్స్ప్లోజివ్‌ ‌పి.ఇ.టి.ఎన్‌ ‌తో నిండిన 20 కిలోల సూట్‌ ‌కేసు, మరొక్క సూట్‌కేసులో ఐ.ఇ.డి., గన్పౌడర్‌, ‌డాగర్‌, ‌టైమలర్లు పేలుళ్ల సమయంలో తీవ్ర గాయాలు అయ్యేందుకు ఉపయోగించే బోల్టులు, బాలు, అబూబకర్‌ ‌తమిళంలో రాసిన డైరీలు, కొన్ని ప్రధాన పత్రాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్‌పీ పాత్రికేయులకు వివరించారు. దేశంలో పలు నగరాలకు సంబంధిం చిన చాలా వివరాలు వీళ్ల దగ్గర ఉన్నాయి. తరలించేందుకు బాంబులు సిద్ధంగా ఉంచారు. బాంబులు పేల్చి ఉండి ఉంటే చాలా ప్రాణ, ఆస్తినష్టం జరిగి వుండేదని వీరు ఏమైనా బాంబులను తరలించారా, ఎక్కడికి తరలించాలని సిద్ధంగా ఉంచుకొన్నారో విచారణలో తెలుస్తుందని పోలీస్‌ ‌డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌పేర్కొన్నారు. సోదాల సమయములో అబూబకర్‌ ‌సిద్ధికి భార్య సైరాబాను మహమ్మద్‌ అలి భార్య షేక్‌ ‌షమీమ్‌ ‌మహళా పోలీసులను దుర్భష లాడుతూ, దాడి చేసేందుకు ప్రయత్నించారు. వీరిని అరెస్టు చేసి పోలీసులు కడప జైలుకు తరలించారు.

ఎంతమందిని తయారు చేశారో?

30 సంవత్సరాలుగా ఉంటూ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీరు తీవ్రవాద భావజాలాన్ని ముస్లిం యువతకు నూరిపోసి ఎంతమందిని తీవ్రవాదం వైపునకు మరల్చారో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎవరి సహకారం లేకుండా ఇక్కడ నివాసం ఏర్పరుచుకోవడం, వివాహం చేసుకోవడం జరగదు. ఇక్కడ వీరి కార్యకలాపాలకు ఎవరు సహకరించారో ఎంతమంది వీరి భావజాలా నికి ఆకర్షితులయ్యారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముస్లింలు అధికంగా కలిగిన కడప, మదనపల్లి, మరి కొన్ని ప్రాంతాల్లో వీరి అనుచరవర్గం ఉన్నట్లు తెలుస్తోంది. రాయచోటిలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఆల్‌-ఉమ తీవ్రవాద భావజాలంతో జరిగి వుండవచ్చుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో వీరి అనుచరులు ఉన్నారా? లేరా అన్న నిజానిజాలు తెలుస్తాయి.

వీరి లక్ష్యం ఏమిటి?

దేశంలో పేలుళ్ల ద్వారా మారణహోమం  సృష్టించడం, ఆస్తి, ప్రాణనష్టం చేసి అశాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఆల్‌ ఉమ తీవ్రవాద సంస్థ పని చేస్తున్నది. 1995 నుండి 2013 వరకు దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఉగ్రదాడులు జరిపింది. ఎన్నో ఉగ్రవాద సంస్థలతో స్నేహభావం పెట్టుకొని వీరి కార్యకలాపాలను అడ్డూ అదుపూ లేకుండా చేశారు. 1995 నుండి రాయచోటిలో ఉంటు వీరు ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారు. స్థానికంగా దొరికే వస్తువులతో నట్లు, బోల్డులు, బాల్సు, టైమర్‌లను బాంబుల తయారికి సేకరించి నట్లు పోలీసుల సోదాలలో బయటపడింది.

లోపం శాపంగా మారక ముందే మేల్కొనాలి

దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయి… ఎన్ని మదరసాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి అన్న లెక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. నిర్వాహకులు ఎవరు ఆదాయ, వ్యయ లెక్కలు ప్రభుత్వానికి తెలుపరు. ఎవరు వస్తున్నారో, పోతున్నారో, మదరసాలో ఏమి బోధిస్తున్నారో బయటికి తెలియదు. హిందు దేవాలయాలు, సంస్థల పైన పెత్తనం చేలాయిస్తున్న ప్రభుత్వాలు, మసీదులు, చర్చిలు, మదరసాల పట్ల ఉదాసీనంగా ప్రవర్తిం చడం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం లోపంగా మారింది. ఈ లోపమే శాపంగా మారి దేశభద్రత, ప్రజల రక్షణపై ప్రభావం చూపుతుంది. ఉగ్రవాదం పట్ల యువత ఆకర్షితులు కాకముందే పటిష్టమయిన భద్రత ఏర్పాటు చేసి దేశభద్రతలో ఎలాంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవడం అవసరం.

– డి. సురేష్‌ ‌కుమార్‌

About Author

By editor

Twitter
YOUTUBE