‘ఆయన కులం ఏదో చెప్పరు. కానీ దేశంలో ఉన్నవాళ్లందరి కులాలు గురించీ కావాలాయనకి. అందాల పోటీలలో ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలు కనిపించరెందుకు అంటూ గంభీరంగా ముఖం పెట్టి అడుగుతాడు. ఈయనకి మానసిక ఆరోగ్య పరీక్షలేమైనా అవసరమేమో కదా!’ అన్నారు బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ. ఆ మాట నిజమే. ఆ పరీక్షలేవో సాధ్యమైనంత తొందరలో చేయించడం మరీ ముఖ్యం. తివారీ మాట ఎలా ఉన్నా, అందాల పోటీలలో అవకాశం దక్కని బడుగువర్గాలలో మైనారిటీలని, అందునా ముస్లింలని సౌకర్యంగా వదిలేశాడు రాహుల్‌. ఇక్కడ ఆ వర్గాలు అందాల పోటీలో చేరడం గురించి కాంగ్రెస్‌ నేత పక్షపాతంతో వ్యవహరించా డని అనుకోవాలా? లేకపోతే ఆ వర్గాల అమ్మాయిలకి అందాల పోటీలో చోటు లేదెందుకని అడిగితే గొడవలైపోతాయనా? ఓట్లు పోతాయనా? ఆయనే చెప్పాలి. కనీసం మానసిక ఆరోగ్యం మీద పరీక్షలు జరిగిన తరువాత అయినా ఈ సంగతి వివరంగా చెప్పాలి.

ఒక విషయంలో మాత్రం యావత్‌ భారతజాతి మనోజ్‌ తివారీతో ఏకీభవిస్తుంది. రాహుల్‌గాంధీ మానసిక ఆరోగ్యానికి సంబంధించి వైద్య పరీక్షలు అవసరమే. అదికూడా సాధ్యమైనంత త్వరలో నిర్వహిస్తే అది దేశానికి మంచిది. పౌరు లందరి కులగోత్రాలు ఏమిటో తెలియాలంటున్న రాహుల్‌, ఆయన కులగోత్రాలు అడిగే సరికి, నేను హర్ట్‌ అయ్యాను అంటూ బాల బుద్ధి ప్రదర్శిస్తారు. అధికారం లేకపోతే ఆ కుటుంబానికి ఊపిరి సలపదని, ఇప్పుడు రాహుల్‌ కూడా నీళ్లలో నుంచి బయటపడిన చేపలా విలవిల్లాడిపోతున్నారని మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించారు. ఈ వాచాలత యావత్తూ అధికారం నుంచి దూరంగా ఉండడం వల్ల వెల్లువెత్తుతున్నదే.

తేజీందర్‌ బగ్గా బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శి. ఆయన ఇచ్చిన వివరాలు రాహుల్‌ కళ్లు తెరిపించాలి. బగ్గా మిస్‌ ఇండియా పోటీలో నెగ్గిన వారి పేర్లు వెల్లడిరచారు. అందులో మైనారిటీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా చెప్పే వారి నుంచి కూడా యువతులు ఉన్నారు. అయినా ఇలాంటి ప్రకటనలు ఇచ్చేటప్పుడు కాస్త లోతుగా చదవాలి కదా అంటున్నారు బగ్గా. 21 మంది మిస్‌ ఇండియా విజేతల పేర్లను బగ్గా బహిర్గతం చేశారు. ‘రాహుల్‌ గాంధీ ఒక అజ్ఞాని. ఒక ప్రకటన ఇస్తే దాని గురించి ముందుగా కాస్త అధ్యయనం చేయాలి. తనకు తానే జనం ముందు నవ్వుల పాలు కాకూడదు. ఇక తప్పేదేముంది! మనమే ఆయనకి నాలుగు అక్షరాలు నేర్పుదాం. మిస్‌ ఇండియా పోటీలు 1947లో మొదలైనాయి. కొంతమంది మైనారిటీ వర్గాల సోదరీమణులు కూడా విజయం సాధించారు. ఈ విషయం రాహుల్‌ తెలుసుకోవాలి అన్నారు బగ్గా. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్‌, ఎక్స్‌ యూజర్‌ అజిత్‌ భారతి రంజైన చెణుకు విసిరారు. ‘నేను గాంధీ కుటుంబీకులు జాబితా తయారు చేశాను. అందులో ఒక్క దళిత్‌గాని, ఒక్క మైనారిటీ గాని లేరు తెలుసా!’ అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారాయన.

రాహుల్‌ గాంధీ బుద్ధి వికసిస్తున్న తీరుతెన్నులకి, అందులో పొటమరిస్తున్న వేగానికీ దేశం డంగైపో తోంది. ఆయన అందాల పోటీలలో కిరీటాలు దక్కించుకున్న వాళ్ల జాబితా కూలంకషంగా చూశాడట. అందులో ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీ వర్గాల వాళ్ల ఒక్క పేరూ లేదట. మరొక విషయం కూడా ఆయన కనిపెట్టారు. ఎవర్ని చూసినా దేశంలో క్రికెటర్ల గురించి మాట్లాడతారు. బాలీవుడ్‌ తారల గురించి మాట్లాడతారు. అంతేతప్ప చెప్పులు కుట్టే వాళ్ల గురించీ, పైపులూ గొడుగులూ అవీ బాగు చేసేవాళ్ల గురించీ మాట్లాడరు. ఆఖరికి మీడియాలో యాంకర్లగా ఉన్నవాళ్లంతా కూడా దేశంలో ఉన్న 90 శాతం వర్గాలకు చెందిన వారు కాదంటున్నారు రాహుల్‌.

అంటే రాహుల్‌ గాంధీ ఉద్దేశం మిస్‌ ఇండియా పోటీలలో, ఎంపికలలో రిజర్వేషన్‌ ఉండాలనా అని ప్రశ్నించారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు. సినిమా తారలకీ, ఆటలు ఆడేవాళ్లకీ కూడా రిజర్వేషన్‌ కల్పించాలని అనుకోవడం రాహుల్‌ బాలబుద్ధికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కొందరు నెటిజన్లు సినిమాలకీ, అందాల పోటీలకీ కూడా కులాలనీ, మతాలనీ అంటగట్టకు మహప్రభో అంటూ రాహుల్‌ని వేడుకున్నారు. అందాల పోటీలలో నడిచేవాళ్లనీ, క్రీడా పోటీలకు వెళ్లే వాళ్లనీ ప్రభుత్వాలు ఎంపిక చేయవు అంటూ ప్రతిపక్ష నేత అజ్ఞానాన్ని ఎత్తి చూపారు కిరెన్‌. అసలు అందాల పోటీలు అనేవి ప్రైవేటు వ్యక్తులు నిర్వహించు కుంటారన్న సంగతి రాహుల్‌కు తెలుసునా అన్న రీతిలో కిరెన్‌ ప్రశ్నించడం సబబే. 2016 నుంచి కూడా రాహుల్‌ మానసిక స్థితి ఎడల బీజేపీ వారికి గుబులు ఉంది. బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌ శర్మ ఆనాడు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. నోరు విప్పితే నరేంద్ర మోదీ మీద విరుచుకు పడడం, పార్లమెంట్‌ సమావేశాలంటే పారిపోవడం ఇవన్నీ మతి స్థిమితం కోల్పోయిన రాహుల్‌ చేస్తున్న పనులేనని ఆనాడే బీజేపీ నిర్ధారించింది. చర్చ జరగాలని దేశ విదేశీ వేదికల మీద నోరు పారేసు కుంటాడు. తీరా చర్చకు సిద్ధమంటే మాత్రం పార్లమెంట్‌ వైపు కూడా చూడడు. మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తాడు. ఏవీ రుజువులు అని అడిగితే నీళ్లు నములుతాడు. ఇప్పటి బీజేపీ నేతలు ఏమంటున్నారంటే, రాహుల్‌నే కాదు, ఆయన వందిమాగధులనీ, సన్నిహిత మిత్ర బృందాన్ని కూడా పనిలో పనిగా పిచ్చాసుపత్రిలో పరీక్షల కోసం చేర్పిస్తే ఒక పని పూర్తవుతందని అంటున్నారు.

అసలు రాహుల్‌ గాంధీ కుల గణన నినాదంలో ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు ఎన్నికల విశ్లేషకుడు, జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌. సరే, కులగణన వరకు అంగీకరిద్దాం. కానీ దానితోనే పేదరికం పరారైపోతుందంటూ రాహుల్‌ చెబుతున్న మాట మాత్రం ఏమాత్రం ఆధారం లేదనిదని ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శించారు. ఆరు దశాబ్దాలు పాలించారు కదా, పేదరికం గురించి మీ కుటుంబానకి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అని కూడా అడిగారాయన. తెల్లారి లేస్తే కులగణన అంటూ పలవరించే రాహుల్‌, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలలో ఆ గణనేదో చేసి చూపించాలని, దానితోనే పేదరికం ఎంత వేగంగా పారిపోతుందో నిరూపించాలని కూడా ప్రశాంత కిశోర్‌ సవాలు విసిరారు.

రాహుల్‌ ప్రతి విషయాన్ని కులం కోణంతోనే చూస్తున్నారని పైకి అనిపించినా , అంతకు మించిన ఉద్దేశమే ఆయనకు ఉంది. భారతీయ సమాజాన్ని చీల్చివేయడమే ఆయన ఉద్దేశం. కాకపోతే, అందాల పోటీలకీ, సినిమాలకీ, ప్రభుత్వాలకీ సంబంధం ఏమిటి? అందుకే ఈ దేశ ప్రతిపక్ష నేత బాలబుద్ధి మరీ కురచగా ఉందని బీజేపీ నేతలు విమర్శిస్తే తప్పేమిటి? ఆగస్ట్‌ 24న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఈయన ఇలాంటి అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశ ప్రజలని జడిపించారు. అంతిమంగా ఆయన మానసిక స్థితి మీద ఆయనే జాతికి అనుమానాలు రేపారు.

ఎంత అబద్ధమో చూడండి! అందాల పోటీ కిరీటాలు దక్కించుకున్న వాళ్ల జాబితా ఆయన చాలా శ్రద్ధగా చదివాడట. దుర్భిణ వేసి చూసినా అందులో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ మహిళ పేరు కనిపించనే లేదట. ఇప్పుడు అందాల పోటీలో రిజర్వేషన్‌ ఉండాలన్నట్టు మాట్లాడుతున్న రాహుల్‌ రేపు సినిమా రంగానికి కూడా వాటిని వర్తింపచేయాలని అడిగినా అడగొచ్చు. కానీ రాహుల్‌కు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందాల పోటీ అనేది అందరికీ ప్రయోజనం చేకూర్చేది కాదు. అందరి అభిరుచి అసలే కాదు. పైగా అందులో ఆత్మ గౌరవం విషయం ఉందని వాదించే వారూ తక్కువేమీ కాదు. అందా లను ఆరబోయడం ఆత్మగౌరవం లేకపోవడమేనన్న వాదన బలంగా ఉంది. అందాల పోటీల ర్యాంప్‌ మీదకు రాకుండా రాహుల్‌ మైనారిటీలను ఎందుకు మినహాయించారు? దీనికి ముందు సమాధానం చెప్పాలి.

 రాహుల్‌ గాంధీ దివాంధుడు. ఈ దేశానికి తొలిసారి ఎస్‌టీ మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని. మున్నెన్నడూ లేని రీతిలో కేంద్ర మంత్రి మండలిలో ఎస్‌సీ, ఎస్‌టీలు ప్రాతినిధ్యం పొందారు. ఈ విషయాన్ని కిరెన్‌ రిజిజు గుర్తు చేశారు. కాబట్టి ఆయన కోరుకున్నట్టు ఈ దేశం చీలికలు పేలికలు కాబోదు అని కిరెన్‌ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ సాగనివ్వరని కూడా ఆయన ప్రకటించారు. రాహుల్‌ ముత్తాత తాను ప్రధాని కావడం కోసం దేశాన్ని చీల్చారు. ఇప్పుడు ఈ విభజనవాది ప్రధాని కావడానికి, దేశం మరొకసారి చీలిపోవడానికి మేం ఎప్పటికీ అనుమతించబోమని కూడా కిరెన్‌ రిజిజు కరాఖండీగా వెల్లడిరచారు.

మరొక బీజేపీ ఎంపీ కపిల్‌ మిశ్రా మరొక కొత్త అంశం తెర మీదకి తెచ్చారు. అది కూడా ఎస్‌సీలు, ఎస్‌టీలకి ఈ దేశంలో అవకాశాలేమీ లేవు అంటూ రాహుల్‌ మొసలి కన్నీరు కారుస్తున్న నేపథ్యంలోనే మిశ్రా ఈ ప్రశ్న వేశారు. ఇవాళ క్షురకవృత్తి, దర్జీ పని, ప్లంబర్‌, రంగులు వేసే పని, ఏసీ మరమ్మతులు, కారు మరమ్మతులు, పళ్లు కూరల వ్యాపారం, బేకరీలు ` ఇవన్నీ ఒకే మతం వాళ్ల చేతులలో బందీలై పోయాయి. గుత్తాధిపత్యంలో ఉన్నాయి. దీని నేపథ్యం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా రాహుల్‌ హిందువుల మధ్య తంపులు పెట్టి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారు అని కపిల్‌ కుండబద్దలు కొట్టారు. వారి వృత్తులను కొల్లగొట్టిన వారి సంగతి మాట్లాడకుండా, రిజర్వేషన్‌ల కోసం వీధిన పడమంటూ హిందువులను మాత్రం రాహుల్‌ రెచ్చగొడుతున్నారని కపిల్‌ విమర్శించారు.

సినిమా రంగంలో దళితులు లేరని అంత కచ్చితంగా రాహుల్‌ ఎలా చెబుతున్నారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. నీ ప్రకటన శుద్ధ తప్పు అని ఒక ఎక్స్‌ యూజర్‌ ఎలుగెత్తాడు. పైగా ఈ దేశాన్ని ఇలాంటి ‘బాలబుద్ధి’ నుంచి ఆ దేవుడే రక్షించాలి అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఓట్ల కోసం ముస్లింలకి కోపం రాకుండానూ మైనారిటీ వర్గం పేరును రాహుల్‌ లాగలేదు కానీ, నిజానికి చాలామంది ముస్లిం యువతులు మిస్‌ ఇండియా పోటీలో నెగ్గారు. ఈ సంగతి కూడా చాలామంది ఎక్స్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల క్రితం ఒక గిరిజన యువతి అందాల పోటీలో కిరీటం దక్కించుకున్న సంగతి రాహుల్‌కి గుర్తు లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరీ పూర్వమేమీకాదు. రెండేళ్ల క్రితమే. చత్తీస్‌గఢ్‌ యువతి రియా ఎక్కా మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్నారు. ఈ సంగతి రాహుల్‌కి తెలియదా? తెలిసినా ఇవన్నీ మాట్లాడు తున్నారంటే, ఈ దేశాన్ని కులమతాల పరంగా విభజించడానికే అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారీ వ్యాఖ్యానించారు. అలాగే క్రీడారంగం. ఇంతకీ అందాల పోటీలలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ యువతులకు స్థానమే దక్కడం లేదని చెప్పడం అంటే వారు అందగత్తెలు కాదని రాహుల్‌ భావమై ఉండాలి అని మహారాష్ట్ర బీజేపీ నాయకు రాలు సీటీ పల్లవి అనుమానం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ విషయంలోను రాహుల్‌ అన్నీ అబద్ధాలే చెప్పారు. ఆ ఉత్సవంలో దళితులు, గిరిజనులు లేరు అన్న మాట శుద్ధ అబద్ధం.

రాహుల్‌కి మతి స్థిమితం ఉందా లేదా అన్న పరీక్ష అత్యవసరమని ఇప్పటికే జాతికి అర్ధమయింది. ఆ మధ్య సినీనటి, ఎంపీ కంగనా రనౌత్‌ మరొక పరీక్ష కూడా రాహుల్‌ గాంధీకి జరగాలని సూచించారు. దానిని కూడా దేశం పరిశీలించాలి. ఆయన మత్తు మందులు తీసుకుంటారామో, ఆ పరీక్షలు ఒకసారి జరిపిస్తే పోలా అన్నదే కంగన సూచన. మంచి సూచన.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE