దేశం ప్రశాంతంగా ఉండటం కొన్ని శక్తులకు ఇష్టంలేదు. నిరంతరం ఏదో సమస్యను సృష్టించి అశాంతిని కొనసాగించడమే ఈ శక్తుల లక్ష్యం. ఎన్నో స్లీపర్‌ ‌సెల్స్ ‌చాపకింద నీరులా పని చేస్తున్నాయి. ఉదయ్‌పూర్‌లో కన్హయ్యాలాల్‌, అమరావతిలో ఉమేశ్‌ ‌ప్రహ్లాద్‌ ‌రావు కొల్హే. రాజస్థాన్‌, ‌మహారాష్ట్రల్లో జరిగిన ఈ దారుణ హత్యలు దేశ వ్యాప్తంగా కలకలం సృష్ట్టించాయి. రాష్ట్రాలు వేరైనా నేపథ్యం ఒక్కటే. మహమ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంటూ నుపూర్‌ ‌శర్మను హతమారుస్తామని ప్రకటించిన శక్తులు సోషల్‌ ‌మీడియాలో ఆమెకు మద్దతు ప్రకటించినవారిపై తమ ప్రతాపాన్ని చూపించాయి. హంతకులు ఏకంగా ప్రధానమంత్రికి కూడా హెచ్చరికలు జారీ చేయడాన్ని తేలికగా తీసి పారేయలేం. ఇవి మొదట మతోన్మాదులు చేసిన హత్యలుగా కనిపించినా, ఇందులో విదేశీ కుట్రలు స్పష్టంగా బయట పడ్డాయి.

టైలర్‌ ‌హత్యకు పాకిస్తాన్‌కు లింక్‌..

‌జూన్‌ 28‌వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌ ‌పూర్‌లో పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హాథీపోల్‌ ‌ప్రాంతంలోని టైలర్‌ ‌కన్హయ్యా లాల్‌ ‌సాహు దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు బట్టలు కుట్టాలని చెప్పడంతో ఆ టైలర్‌ ‌వారి కొలతలు తీసుకోవడం ప్రారంభించగానే మరో వ్యక్తి పదునైన కత్తితో దాడి చేశారు. 28 పోట్లు పొడిచాడు. ఆ తర్వాత త•ల నరికేశాడు. ఈ తతంగాన్ని మరో నిందితుడు మొబైల్‌ ‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ తర్వాత దీన్ని సోషల్‌ ‌మీడియాలో పెట్టాడు. కొద్ది సేపటికే మరో వీడియోను కూడా రిలీజ్‌ ‌చేశారు. అందులో ఇద్దరు నిందితులు తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బెదిరించారు. అందులో ‘నా పేరు మహమ్మద్‌ ‌రియాజ్‌ అక్తర్‌. ‌నా పక్కన ఉన్నది ఘోష్‌ ‌మహమ్మద్‌ ‌భాయ్‌. ఉదయ్‌పూర్‌లో ఒకరి తల నరికేశాం. ఏయ్‌.. ‌నరేంద్ర మోదీ! విను. నిప్పు నువ్వు రాజేశావు. మేం ఆర్పుతాం. ఇన్షా ఆల్లా. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది. ఉదయ్‌పూర్‌ ‌వాస్తవ్యు లారా! ఇప్పుడు ఒక్కటే నినాదం. తప్పు చేస్తే తల తెగిపడుతుంది’ అని ఉంది.

కన్హయ్యాలాల్‌ ‌హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని తెలిసి పోయింది. ఇంతకీ కన్హయ్యా లాల్‌ ‌మీద వీరు ఇంత దారుణానికి తెగబడటానికి కారణం ఏమింటే… మహమ్మద్‌ ‌ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన• నుపూర్‌ ‌శర్మకు మద్దతుగా నిలవడమేనట. అంతకు పది రోజుల క్రితం కన్హయ్యాలాల్‌ ‌సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌పెట్టాడు. దీనిపై కొందరు ముస్లింలకు, కన్హయ్యకు మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. అనంతరం కన్హయ్యాలాల్‌కు వారినుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్నాళ్లు షాపు మూసేసి అజ్ఞాతంలో గడిపిన ఆయన మళ్లీ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కన్హయ్యా లాల్‌ ‌తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సకాలంలో స్పందించలేదు. ఈ దారుణ ఘటన తర్వాత కొందరు పోలీసు అధికారులను సస్పెండ్‌ ‌చేశారు. పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రముఠాకు చెందిన స్లీపర్‌ ‌సెల్స్ ఈ ‌హత్య చేశాయని వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ‌స్వీకరించింది. ఈ ఘటనను ‘పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాద చర్య’గా ఎన్‌ఐఏ ‌భావిస్తోంది. ఇది ‘ఐఎస్‌ఐఎస్‌ ‌తరహా హత్యే’ అని ఐపీఎస్‌ ‌మాజీ అధికారి ఒకరు తెలిపారు. దావత్‌-ఎ-ఇస్లామీకి చెందిన మహ్మద్‌ ‌రియాజ్‌ ‌ద్వారా ఐసిస్‌కు చెందిన రిమోట్‌ ‌స్లీపర్‌ ఆర్గనైజేషన్‌ ‘అల్‌ ‌సుఫా’తో వారు సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. గౌస్‌, 2014‌లో కరాచీకి వెళ్లి అక్కడ దావత్‌-ఎ-ఇస్లామీ సంస్థతో టచ్‌లో ఉన్నాడని తేలింది. ఈ సంబంధాలపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

కన్హయ్యను హత్య చేసిన గౌస్‌ ‌మహ్మద్‌, ‌రియాజ్‌ అఖ్తారీ =జీ 27 • 2611 నంబర్‌ ‌గల బైక్‌పై పారిపోతూ దొరికిపోయారు. ఈ వాహనం నెంబర్‌ ‌ముంబయి ఉగ్రదాడి తేదీని (26/11)కి దగ్గరగా ఉండటం గమనించాలి.

గతంలో రాజస్థాన్‌లో పెద్దగా మతకలహాలు జరిగేవి కావు. బీజేపీ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కానీ కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత మతపరమైన అల్లర్లు మొదలయ్యాయి. శ్రీరామ నవమి, హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్ర లపై రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయి. గత ఏడాది కరౌలీ, జోధ్‌పూర్‌, అల్వార్‌లలో మతపరమైన హింస చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ముస్లిం జనాభాలో 10 శాతం మంది ఒక్క ఉదయ్‌పూర్‌లోనే నివసిస్తు న్నారు. కన్హయ్యాలాల్‌ ‌హత్య తర్వాత ఉదయ్‌పూర్‌తో పాటు పలు నగరాలు అట్టుడికి పోయాయి.

మెడికల్‌ ‌షాపు యజమాని హత్య వెనుక..

దేశ వ్యాప్తంగా ఉదయ్‌పూర్‌ ‌ఘటనపై చర్చించు కుంటున్న సమయంలోనే అంతకు వారం రోజుల ముందు మహారాష్ట్రలో మరో దారుణం జరిగిపో యింది. జూన్‌ 21‌న జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమరావతి నగరంలో మెడికల్‌ ‌షాప్‌ ‌నడిపించే 54 ఏళ్ల ఉమేశ్‌ ‌ప్రహ్లాద్‌ ‌రావు కొల్హే, ఎప్పటిలాగే రాత్రి స్టోర్‌ ‌మూసేసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ప్రహ్లాద్‌రావు భార్య, కుమారుడు సంకేత్‌ ‌మరో వాహనంపై ఆయన వెంటే వెళుతున్నారు. ఆ సమయంలో రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు పదునైన కత్తితో ప్రహ్లాద్‌రావు మెడపై నరికి పారిపోయారు. రోడ్డుపైనే కుప్పకూలిపోయిన ప్రహ్లాద్‌ను ఆయన కుమారుడు సంకేత్‌ ‌వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేపోయింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రహ్లాద్‌రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జరిపిన దర్యాప్తులో ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌ ‌ఖాన్‌తో పాటు ముదస్సిర్‌ అహ్మద్‌(22) ‌షారుఖ్‌ ‌పఠాన్‌(25), అబ్దుల్‌ ‌తౌఫీక్‌(24), ‌షోయబ్‌ ‌ఖాన్‌ (22), అతిబ్‌ ‌రషీద్‌(22), ‌యూసుఫ్‌ ‌ఖాన్‌ ‌బహదూర్‌ ‌ఖాన్‌(44)‌లను పోలీసులు అరెస్ట్ ‌చేశారు.

ప్రహ్లాదరావు హత్యను మొదట దొంగతనం కేసుగా పోలీసులు భావించారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నుపూర్‌ ‌శర్మకు మద్దతుగా ఓ వాట్సప్‌ ‌గ్రూప్‌లో పోస్ట్‌లు పెట్టినందుకే వీరు కక్షకట్టి హత్య చేశారని తేలింది. ఆ గ్రూప్‌లో కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. వీరంతా ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రహ్లాద్‌రావు హత్యకు ఇర్ఫాన్‌ ‌ఖాన్‌ ‌కుట్ర పన్నాడు. ఇందుకు ఐదుగురు వ్యక్తులను నియమించాడు.

ఉమేష్‌ ‌కోల్హే హత్య కేసుపై లోతుగా విచారణ చేపట్టాలని ఎన్‌ఐఏని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఆదేశించారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే మరిన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి. కొల్హే హత్యను జాతీయ దర్యాప్తు సంస్థ ‘ఉగ్ర చర్య’గా అభివర్ణిం చింది. దేశంలోని ఓ వర్గం ప్రజలను భయభ్రాంతు లకు గురి చేయాలన్న లక్ష్యంతోనే కొల్హేను హతమార్చారని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.

అమరావతిలో మెడికల్‌ ‌షాప్‌ ‌యజమాని హత్య చాలా దారుణమైన ఘటన అని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ నిందితుల అంతర్జాతీయ సంబంధాలపై కూడా పరిశీలిస్తోందన్నారు. దీనిని మొదట దొంగతనం కేసుగా చిత్రీకరించారని, దానిపై కూడా విచారణ జరుగుతుందని మీడియాకు వెల్లడించారు. ఫార్మసిస్టు ఉమేష్‌ ‌కోల్హే హత్య కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టించారని ఎంపీ నవనీత్‌ ‌రాణా ఆరోపించారు. దోపీడి కేసుగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నించారని అన్నారు. ఉదయ్‌పూర్‌ ‌టైలర్‌ ‌హత్య మాదిరిగా కనిపిస్తోందని ఎన్‌ఐఏ ‌విచారణ ప్రారంభమయ్యే సమయంలోనే పోలీసులు చెప్పారని ఆమె అన్నారు. మృతుడు ఉమేష్‌ ‌కోల్హే చాలా సౌమ్యుడని, ఆయనకు ఎవరితోనూ గొడవలు లేవని తమకు తెలిసిందని అన్నారు. ఇది ఉదయ్‌పూర్‌ ‌తరహా ఘటనే అని ఆమె అన్నారు. ఎవరైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి ఉంటే, ఆ డబ్బును కూడా దోచుకునేవారని, కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.

బీజేపీలోకి ఉగ్రవాదులు?

దేశంలో విధ్వంసాలను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న ఉగ్రవాదులు తమపై అనుమానాలు రాకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. బీజేపీలో ఉంటే తమపై ఎలాంటి అనుమానాలు రావు అని తెలివైన ఎత్తుగడ వేశారు.

ఉదయ్‌పూర్‌లో టైలర్‌ ‌కన్హయ్యాలాల్‌ను హత్య చేసిన రియాజ్‌ అఖ్తరీ, గోస్‌ ‌మొహమ్మద్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిందితులు బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫొటోలను విడుదల చేసింది. రియాజ్‌ అఖ్తరీ రాజస్థాన్‌ ‌బీజేపీ మైనారిటీ సెల్‌లో కీలక సభ్యుడని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత పవన్‌ ‌ఖేడా ఆరోపించారు. బీజేపీ మైనార్టీ సెల్‌ ‌నేతలైన ఇర్షాద్‌ ‌చైన్‌వాలా, మహ్మద్‌ ‌తాహిర్‌తో ప్రధాన నిందితుడు దిగిన ఫొటోలను ఆయన బయటపెట్టారు. రాజస్థాన్‌ ‌బీజేపీ నేత, మాజీ మంత్రి గులాబ్‌చంద్‌ ‌కటారియా కార్యక్రమాల్లో కూడా రియాజ్‌ ‌పాల్గొన్నాడని తెలిపారు.

అయితే కాంగ్రెస్‌ ‌నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది. కన్హయ్యాలాల్‌ను చంపిన నిందితులు బీజేపీ సభ్యులు కాదని మైనారిటీ విభాగం చీఫ్‌ ‌సాదిక్‌ ‌ఖాన్‌, ‌పార్టీ ఐటీ సెల్‌ ‌చీఫ్‌ అమిత్‌ ‌మాల్వియా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని విమర్శించారు. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ‌బూటకపు వార్తలు ప్రచారం చేస్తుండటం తనకు ఆశ్చర్యంగా లేదన్నారు అమిత్‌ ‌మాల్వియా. బీజేపీలోకి చొరబడేందుకు వారు చేసిన ప్రయత్నం..రాజీవ్‌ ‌గాంధీని చంపడానికి ఎల్‌టీటీఈ వారు కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నం లాంటిదని పేర్కొన్నారు.

కాగా రియాజ్‌ ‌బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బీజేపీ కార్యక్రమాలకు పబ్లిక్‌గా హజరవుతూ, ప్రైవేటుగా అదే పార్టీని విమర్శించేవాడని పోలీసుల విచారణలో బయటపడింది. తన సన్నిహితులతో బీజేపీని అనేకసార్లు విమర్శించినట్లు విచారణలో తేలింది. అయితే ఇక్కడ నిందితుల మాస్టర్‌ ‌మైండ్‌ ‌స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీలో చేరి నేరాలకు పాల్పడితే ఎవరికీ అనుమానం రాదని వారి పన్నాగం.

మరోవైపు జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో పట్టుబడిన ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదుల్లో ఒకరు బీజేపీ క్రియాశీలసభ్యుడని తేలడం సంచలనం రేపింది. రాజౌరీ జిల్లాకు చెందిన హుస్సేన్‌ ‌షా బీజేపీ క్రియాశీల సభ్యుడని పోలీసులు తెలిపారు. మైనార్టీ మోర్చా ఐటీ అండ్‌ ‌సోషల్‌ ‌మీడియా ఇన్‌చార్జిగా ఉన్నాడు. జమ్ముకశ్మీర్‌ ‌బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ ‌రైనాతో పాటు ఇతర నాయకులతో దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. అయితే ఆన్‌లైన్‌ ‌సభ్యత్వ నమోదు వ్యవస్థ వల్ల ఈ తప్పిదం జరిగిందని, ఇదొక కుట్ర కోణం అని బీజేపీ ప్రకటించింది. అయితే, తాలిబ్‌ ‌హుస్సేన్‌ ‌కేవలం 18 రోజులు మాత్రమే పార్టీ సభ్యుడిగా కొనసాగారని, 2022 మే 27న రాజీనామా చేశారని వెల్లడించింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఉదంతాలు చెబుతున్నాయి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram