జాతీయ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్డా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భాజపా ఏపీ శక్తి కేంద్రాల ప్రముఖు లతో సమావేశమైన నడ్డా 2024 ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌ ఇచ్చారు. పోలింగ్‌బూత్‌•‌లను పటిష్టం చేసుకోవాలని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విభజన అంశాలు, ప్రత్యేక హోదాపై తెదేపా, వైకాపా చేసిన అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని చెప్పారు.  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ ‌పార్టీ వైకాపా ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాటాలు ఉధృతం చేయడం ద్వారా ప్రతిపక్షంగా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా వారికి దగ్గరవ్వాలని దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో పార్టీని వ్యాప్తి చేయడమే కాక, ప్రతి ఒక్క వర్గాన్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు జిల్లా అత్మకూరు అసెంబ్లీ నియోజ కవర్గం ఉపఎన్నికలో అభ్యర్థిగా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌ ‌యాదవ్‌ ‌పేరును నడ్డా ప్రకటించారు. ఈ సమావేశంలో ఆయన సూచనల్లో కులం, మతం, ప్రాంతం, వర్గం ఆధారంగా విడిపో యిన ఆంధప్రదేశ్‌లో ప్రతి వర్గాన్ని కలుపుకుపోయి విజయం సాధించడం అనే అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. భారత రాజకీయాల్లో కులం, మతం ప్రాధాన్యం వహిస్తాయనేది తెలిసిందే. ముస్లింలను, ఎస్సీలను ఓటుబ్యాంకుగా మార్చుకున్న కాంగ్రెస్‌, ‌ప్రాంతీయ పార్టీలు వారి అభివృద్ధికి చేసింది శూన్యం. ఈ వర్గాలకు భాజపా హయాంలోనే మేలు జరిగిందన్నది జగమెరిగిన వాస్తవం. దీనిని ఆయా వర్గాలు కూడా అంగీకరించాలి. కాని ఇంటికే పరి మితం చేయాల్సిన మతాన్ని ఓటుకోసం వాడి ఈ వర్గాలు తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. ఏపీలో ఈ వర్గాల పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. వైకాపా పాలనలో కూలినాలి చేసుకునే ముస్లిం, ఎస్సీ పేదలకు కూడు లేదు. ఇసుక ఆపి, ధరలు పెంచి వారిని దెబ్బ మీద దెబ్బకొట్టారు. కేంద్రం మంజూరు చేసిన గూడును సైతం ఇవ్వక ఎండా, వానల్లో నిలబెట్టారు. ఇది ఈ వర్గాలు గమనించాలి. తమకు మేలు చేస్తున్న భాజపాను ఆదరించాలి. ఉత్తరాదిలో ఈ రకమైన మార్పు రాబట్టే నేడు ఆయా రాష్ట్రాల్లో భాజపా వరుసగా గెలుస్తూ ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ఏపీలో కూడా ఈ రకమైన మార్పు రావాలి.

అందరూ కలిస్తేనే ప్రజలు. కాని ఆంధప్రదేశ్‌లో ఈ పరిస్థితి లేదు. తెదేపా, వైకాపా ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల పేరిట రెచ్చగొట్టి విడదీశాయి. వైకాపా హయాంలో అయితే పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అన్యమతా లకు ప్రోత్సాహం ఇస్తూ, హిందూమతాన్ని పట్టించు కోవడం లేదు. పైగా అన్యమతస్తులు హిందూమత ధర్మంపై దాడులు చేస్తుంటే చర్యలు తీసుకోవడంలేదు.

ఒక్క వైకాపా అనే కాదు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి అనే మాటను పక్కనపెట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తు న్నాయి. దాంతో ఫలానా కులాలు, మతాలు ఆయా పార్టీలకే మద్దతు ఇస్తున్నాయన్నది తెలిసిపోయింది. వారి ఓట్లు ఫలానా పార్టీకే వేస్తారని, ఇతర పార్టీలకు పడవనేది కూడా అందరికీ తెలిసిన విషయమై పోయింది. పోనీ ఆయా వర్గాలకు వారు ఏమైనా న్యాయం చేస్తున్నారా? అంటే అదీ లేదు. చర్చిల నిర్మాణానికి నిధులు వెచ్చించడం, పాస్టర్లు, ముల్లాలకు గౌరవ వేతనాలివ్వడం తప్ప వారికి లబ్ధి కలిగించే కార్యక్రమాలు ఒక్కటీ చేయడం లేదు. భావోద్వేగాలకే పరిమితమైన ఆయా వర్గాలు తమ నిత్య అవసరాలను, సమస్యలను మాత్రం మరచి పోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వయం ఉపాధి, పేదరిక నిర్మూలన కింద ఆర్థిక సహాయ పథకాలు కేంద్రం అమలుచేస్తున్నది. కాని వీటిని వైకాపా ప్రభుత్వం అమలుచేయడం లేదు. వారిని మతం ఉచ్చులో బిగించి శాశ్వతంగా పేదలుగా మగ్గిపోయేలా చేస్తోంది.

గుడులపై దాడులు చేస్తే ఖండించరా?

కొంతమంది క్రైస్తవులు, ముస్లింలు హిందూ ధర్మంపై చేస్తున్న విమర్శలు, దాడులను క్రైస్తవ, ముస్లిం సమాజం ఎందుకు ఖండించలేదు. అటు వంటి మూర్ఖపు పనులను ఎందుకు సమర్థిస్తున్నారు. వీరి మౌనం అందరి అభిప్రాయంగా భావించాల్సి వస్తోంది. మత వ్యవహారాల్లో ఎక్కువగా లాభపడేది చర్చి పాస్టర్లు, మసీదు నిర్వాహకులు మాత్రమే. భక్తులు ఇచ్చే కానుకలు ఈ ప్రార్థనా స్థలాల్లోని ఆచార్యులే వాడుకుంటారు. తమ ఆదాయం కోసం వీరు హిందువులను విమర్శిస్తూ తమ వర్గంవారిలో హిందువుల పట్ల ద్వేషభావాన్ని నింపుతున్నారు. హిందూధర్మాన్ని అవమానించినా, గుడులపై దాడులు చేసినా తమకొచ్చిన లాభం ఏమిటో అన్యమతాలు ఆలోచించాలి. టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహం కడితే ఏమొస్తుంది? హనుమాన్‌ ‌శోభాయాత్రలపై దాడులు చేస్తే ఎవరికి లాభం? ఆయా ప్రార్థనా స్థలాల యాజమాన్యాలకు తప్ప ఎవరికీ ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్లని రెచ్చగొడితేనే వారికి వారం వారం దశమ భాగాలొస్తాయి.

ఓటుబ్యాంకు రాజకీయాలను తిప్పికొట్టాలి

రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులు సరిగా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, ‌తెదేపా, వైకాపా ప్రభుత్వాల వల్ల తాము సాధించిన ప్రగతి ఏంటి? ఎవరి హయాంలో అయినా రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? మౌలిక సదుపాయాల కల్పన జరిగిందా? అనేది వారు ఒక్క సారి ఆలోచించాలి. అదే చేస్తే ఈ పరిస్థితి ఉండదు. ఉచితంగా బ్యాంకు ఖాతాలు తెరిచి ప్రభుత్వం అందించే నగదును నేరుగా లబ్ధిదారులకు చేరవేసింది ఎవరు? కట్టెల పొయ్యితో కళ్లు పోగొట్టుకునే దారుణ పరిస్థితి నుంచి ఉచితంగా గ్యాస్‌ ‌సరఫరాను ఇచ్చినది ఎవరు? పేద రైతాంగాన్ని ఆదుకునేలా పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి రూ. 6 వేల చొప్పున పంపిణీ చేస్తున్నది ఎవరు? ఏడాదికి రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యచికిత్సలను అందిస్తున్నది ఎవరు? అతి తక్కువ ప్రీమియంతో బీమా పథకాలు అమలు చేస్తు న్నది ఎవరు? పేదలకు ఉచితంగా కరెంటు కనెక్షన్లు ఇచ్చింది ఎవరు? పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నది ఎవరు? కరోనా సమయంలో అదనంగా బియ్యం ఇచ్చింది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో వర్గానికి పలు రకాల సంక్షేమ పథకాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రమే అందించింది. ఈ పథకాల్లో ఎక్కువగా లబ్ధిపొందుతున్నది ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలే. కానీ వీరు భాజపాకు దూరమ య్యారు. దీనికి కారణం ఓటుబ్యాంకు రాజకీయాలు. భాజపాపై క్రైస్తవులు, ముస్లింలను ఎగదోసే వైకాపా తమకేం చేయలేదని గుర్తించాలి.

ఎస్సీలపై దాడులు నిజం కాదా?

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో దాదాపు వెయ్యిమందికి పైగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగినట్లు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులే చెబుతున్నాయి. రోజుకో మహిళపై అత్యా చారం జరుగుతోంది. బాధితురాళ్లలో 90 శాతం మంది ఎస్సీలే. ఎస్సీల కోసం పుట్టినట్లు చెప్పే వైకాపా మూడేళ్లుగా వారికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీలకు స్వయం ఉపాధి పథకం కింద రూ. 14 లక్షలు విలువచేసే వాహనాలు ఇచ్చింది. కాని ఈ ప్రభుత్వం రాష్ట్రంలో అసలు ఈ పథకాన్నే అమలు చేయలేదు. ఇదే కాదు, ఇలాంటి పథకాలేవీ అమలుకు నోచుకోవడం లేదు. పేద కుటుంబాలకు చెందిన వారికి జీవనోపాధి కోసం ఇచ్చే ఆర్థిక సహాయం కూడా నిలిపివేశారు. పెళ్లిళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం లేదు. ముస్లింల పరిస్థితీ ఇంతే. తమ కోసం ఏమీ చేయని వైకాపా ప్రభుత్వాన్ని తాము ఎందుకు ఆదరించాలో ఈ వర్గాలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఈ విషయాలేవీ ఆలోచించకుండా చేసేందుకే అనవసరపు అంశాలను తెరపైకి తీసుకువస్తున్నారనేది గుర్తించాలి.

హిందువుల ఆలయాలపై దాడులు జరిగితే ఖండించకపోవడం వంటివి సమాజంలో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలుసుకోవాలి. ఇవేవీ తమ అభివృద్ధికి దోహదం చేసేవి కావని తెలుసు కోవాలి. సమాజంలో తాము అంతర్భాగమేనని, అందరితో కలసి వెళ్లాలనేది గుర్తించాలి. వైకాపా, తెదేపాలు చేసే ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి బయటపడి అభివృద్ధి జపంచేసే భాజపాకు మద్దతు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే భాజపా జాతీయ నాయకత్వం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింప జేయడంతో పాటు అన్ని వర్గాలను కలుపుకుని వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర శాఖలకు ఆదేశాలిచ్చింది.

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram