– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌నరేంద్ర దామోదర్‌దాస్‌ ‌మోదీ… విలక్షణ నాయకుడు. అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకుడు కాదు. ప్రజాసేవే ఆయన పరమోన్నత లక్ష్యం. ఆదరించిన పార్టీని అత్యున్నత శిఖరాలకు చేర్చడమే ధ్యేయం. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఆయన ఏనాడూ అధికార పదవుల కోసం వెంపర్లాడలేదు. ఆయనలోని సేవానిరతిని, ప్రతిభను, సామర్థ్యాన్ని, పట్టుదలను, నాయకత్వ లక్షణాలను బట్టి పార్టీ పదవులు, అధికార పదవులు దక్కాయి. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి అయ్యేంతవరకు మోదీ ఎమ్మెల్యే కూడా కాదు. 2002లో రాష్ట్రంలో నాడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఏరి కోరి మోదీకి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని 2014లో పార్టీ నేరుగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్రంలో మంత్రి వంటి ఎలాంటి అధికార పదవులు చేపట్టకుండానే మోదీ నేరుగా ప్రధాని పగ్గాలు అందుకున్నారు. అంతకు ముందు అందరి సీఎంల మాదిరిగా మోదీ ఏనాడూ ఢిల్లీ చుట్టూ తిరగలేదు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలున్న భారత విదేశాంగ విధానాన్ని మోదీ ఎలా నడిపిస్తారన్న ఆసక్తి అప్పట్లో రాజకీయ వర్గాల్లో ఉండేది.

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధానిగా మోదీ పాలన రథాన్ని పరుగులు పెట్టించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ధ్యేయంతో పనిచేశారు. ఆ మేరకు విజయవంతమయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేనేలేదు. అదేవిధంగా పూర్వానుభవం లేనప్పటికీ విదేశాంగ విధానాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. భారత ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. మే 26, 2014న మొదటి ప్రమాణ స్వీకార ఉత్సవానికి ‘సార్క్’ (‌సౌత్‌ ఆసియన్‌ అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌రీజనల్‌ ‌కో ఆపరేషన్‌- ‌దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి) అధినేతలను ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తద్వారా ఇరుగు పొరుగుతో సత్సంబంధాలను కోరుకుంటున్నట్లు సంకేతాలను పంపారు. కార్యక్రమానికి హాజరైన షేక్‌ ‌హసీనా (బంగ్లాదేశ్‌), ‌మహింద రాజపక్స (శ్రీలంక), హమీద్‌ ‌కర్జాయ్‌ (అఫ్ఘానిస్థాన్‌), అబ్దుల్‌ ‌యమీన్‌ ‌గయూమ్‌ (‌మాల్దీవులు), షెరింగ్‌ ‌బోబ్లె (భూటన్‌) ‌తదితరులు మోదీకి అభినందనలు తెలిపారు. దాయది దేశమైన నాటి పాక్‌ అధినేత నవాజ్‌ ‌షరీఫ్‌ ‌సైతం హాజరై మోదీ అభిమానానికి ముగ్ధులయ్యారు.

 అప్పటివరకు గోద్రా అల్లర్లను సాకుగా చూపి మోదీకి వీసా నిరాకరించిన అమెరికా, బ్రిటన్‌ ‌వంటి పాశ్చాత్య దేశాలు సైతం దిగివచ్చాయి. పాత విషయాలను పక్కనపెట్టి ఆయనకు అభినందనలు తెలిపాయి. తమ తమ దేశాల్లో పర్యటనకు ఆహ్వానాలు పలికాయి. మధ్యప్రదేశ్‌లోని విదీష ఎంపీ, సీనియర్‌ ‌నేత సుష్మా స్వరాజ్‌ను విదేశాంగ మంత్రిగా నియమించారు. యూపీఏ హయాంలో ప్రతిపక్షనేతగా పనిచేసి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో ఆమె విజయవంతమయ్యారు. అజిత్‌ ‌ధోబాల్‌ ‌వంటి అంకితభావం గల అధికారిని జాతీయ భద్రతా సలహాదారుగా మోదీ నియమించుకున్నారు. ఆగ్నేయాసియా దేశాలతో మరింత మెరుగైన సంబంధాల ఆవశ్యకతను 90ల్లో గుర్తించిన నాటి ప్రధాని పీవీ ‘లుక్‌ ఈస్ట్’ ‌విధానాన్ని ప్రారంభించారు. దానిని ‘యాక్ట్ ఈస్ట్’ ‌విధానంగా మలిచిన మోదీ ఆగ్నేయాసియా దేశాలతో భారత బంధాన్ని మరింత బలోపేతం చేశారు. అఫ్ఘాన్‌ ‌పర్యటన నుంచి తిరిగి వస్తూ 2015 డిసెంబరులో మోదీ అనూహ్యంగా పాకిస్తాన్‌లో దిగి నవాజ్‌ ‌షరీఫ్‌కు స్నేహహస్తాన్ని అందించారు. పశ్చిమాసియాకు సంబంధించి గతంలో భారత అధినేతలు ఆచితూచి వ్యవహరించే వారు. ఇజ్రాయెల్‌ ‌తో సంబంధాలు కొనసాగిస్తే అరబ్‌ ‌దేశాలతో ఇబ్బందులు వస్తాయన్నది అప్పటివరకు భారత అధినేతల భావన. అందువల్లే టెల్‌ అవీవ్‌ ‌పర్యటనకు ఎవరూ సాహసించేవారు కారు. దీనిని పటాపంచలు చేశారు మోదీ. 2017 జులైలో ఇజ్రాయెల్‌లో పర్యటించడం ద్వారా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో పాలస్తీనా అంశానికి సంబంధించి భారత్‌ ‌మద్దతు ఎల్లప్పుడూ కొనసాగుతుందని అరబ్‌ ‌సమాజానికి భరోసా ఇచ్చారు. 70ల్లో నాటి జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్‌ ‌బిహారీ వాజపేయి ఇజ్రాయెల్‌ ‌సందర్శించారు. తరవాత అదే పార్టీకి చెందిన మోదీ ప్రధాని హోదాలో ఇజ్రాయెల్‌లో పర్యటించడం విశేషం. అమెరికా, రష్యాలతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా రెండు దేశాల మధ్య సమతూకం పాటించారు. 2014లో భూటాన్‌తో ప్రారంభమైన మోదీ విదేశీ పర్యటన తరవాత రోజుల్లో అనేక దేశాల్లో సాగింది.

 2019 మే 30న రెండోసారి ప్రధాని పగ్గాలు అందుకున్న మోదీ మళ్లీ తన ప్రమాణ స్వీకారానికి విదేశీ అధినేతలను ఆహ్వానించడం ద్వారా అంతర్జాతీయ అంశాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఈసారి బిమ్స్ ‌టెక్‌ (‌బే ఆఫ్‌ ‌బెంగాల్‌ ‌ఫర్‌ ‌మల్టీ సెక్టోరల్‌ ‌టెక్నికల్‌ అం‌డ్‌ ఎకనమిక్‌ ‌కోఆపరేషన్‌) అధినేతలను ఆహ్వానించారు. ఇందులో నేపాల్‌, ‌శ్రీలంక, భూటాన్‌, ‌థాయ్‌లాండ్‌, ‌మయన్మార్‌ ‌సభ్యత్వ దేశాలు. అబ్దుల్‌ ‌హమీమ్‌ (‌బంగ్లాదేశ్‌), ‌ఖడ్గ ప్రసాద్‌ ‌శర్మ ఓలీ (నేపాల్‌), ‌మైత్రీపాల సిరిసేన (శ్రీలంక), విన్‌ ‌మైంట్‌ (‌మయన్మార్‌), ‌లోటె షెరింగ్‌ (‌భూటన్‌), ‌ప్రవింద్‌ ‌జగన్నాధ (మారిషస్‌) ‌తదితరులు హాజర య్యారు. థాయ్‌లాండ్‌ ‌ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరైంది.

 రెండో దఫాలో మోదీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ‘క్వాడ్‌’ (‌చతుర్భుజ కూటమి)లో భాగస్వాములయ్యారు. ఇందులో అమెరికా, జపాన్‌, ఆ‌స్ట్రేలియా, భారత్‌ ‌సభ్యదేశాలు. 2020లో తూర్పు లద్దాఖ్‌ ‌లో చైనా దాష్టీకాన్ని తిప్పికొట్టడంలో విజయవంతమయ్యారు. చైనా సారథ్యంలోని బెల్ట్ ‌రోడ్‌ ఇనిషియేటీవ్‌ (‌బీఆర్‌ ఐ)‌కి దూరంగా ఉన్నారు. హిందూమహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. మార్చి చివర్లో భారత్‌ ‌లో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ‌యితో చర్చల సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్‌ ‌నిక్కచ్చిగా వ్యవహరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని తేల్చిచెప్పారు.

సంక్షోభ సమయాల్లో వివిధ దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయుల తరలింపులో మోదీ చురుగ్గా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సందర్భంగా అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 20వేల మంది భారతీయుల తరలింపులో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారతీయుల తరలింపును సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రులు కిరణ్‌ ‌రిజిజు, వీకే సింగ్‌, ‌జ్యోతిరాదిత్య సింథియా, హర్దీప్‌ ‌సింగ్‌ ‌పురిలను ప్రత్యేకంగా నియమించారు. వారు ఉక్రెయిన్‌ ‌సరిహద్దు దేశాలైన పోలండ్‌, ‌మాల్టోవా, హంగేరి తదితర దేశాల్లో మకాం వేసి సురక్షితంగా దగ్గరుండి భారతీయులను తరలించారు. భారతీ యుల తరలింపు కార్యక్రమానికి ‘ఆపరేషన్‌ ‌గంగ’  పేరుపెట్టి విజయవంతంగా పూర్తిచేశారు. గత ఏడాది అఫ్ఘానిస్థాన్‌ ‌నుంచి అమెరికా సైన్యం వైదొలగిన సందర్భంగా ‘ఆపరేషన్‌ ‌దేవీశక్తి’ పేరుతో అక్కడి భారతీయులను తరలించారు. కరోనా సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు ‘వందే భారత్‌’, ‌సముద్ర సేతు.. కార్యక్ర మాలను చేపట్టారు. సంక్షోభ సమయాల్లో క్రియా శీలకంగా వ్యవహరించి మోదీ ప్రజల ప్రశంసలు పొందారు. కరోనా టీకాను అనేక దేశాలకు సరఫరా చేసి మానవీయతను భారత్‌ ‌చాటుకుంది.

తాజగా ఉక్రెయిన్‌, ‌రష్యా యుద్ధంలోనూ తటస్థంగా వ్యవహరించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని మోదీ ఆయా దేశాలను కోరారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, ఐరోపా సమాజం నుంచి ఒత్తిడి వచ్చిన ప్పటికీ మాస్కోను దూరం చేసేందుకు విముఖుత చూపారు. యుద్ధాన్ని, ఏకపక్ష దాడిని భారత్‌ ఎప్పుడూ ఆహ్వానించదని పేర్కొనడం ద్వారా రష్యా చర్యను పరోక్షంగా ఖండించారు. అదే సమయంలో భారత ప్రయోజ నాలకు పట్టం కట్టారు. అనేక ఒత్తిళ్లు వచ్చినప్పటికి రష్యా నుంచి 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్‌ ‌కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో అమెరికా ఒకింత నిష్టూరంగా మాట్లాడినప్పటికీ దేశ ప్రయోజనాలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌సైతం భారత్‌ను ప్రశంసిం చడం విశేషం. స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తు న్నందుకు మన పొరుగు దేశం భారత్‌ను నేను అభినందిస్తున్నా… అని ఖైబర్‌ ‌ఫఖ్తూన్‌ ‌క్వా ప్రావిన్సులో తన మద్దతుదారులు నిర్వహించిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఇమ్రాన్‌ ‌పేర్కొన్నారు. క్వాడ్‌ (‌చతుర్భుజ) కూటమిలో సభ్యత్వ దేశమైన భారత్‌… అదే కూటమిలోని అమెరికా వద్దన్నా లెక్కచేయలేదని ఆయన గుర్తు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ ఇం‌ధన అవసరాలను తీర్చేందుకు ఇరాన్‌ ‌ముందుకు వచ్చింది. మూడో పక్షంతో సంబంధం లేకుండా నేరుగా సరఫరా చేస్తామని మన దేశంలోని ఇరాన్‌ ‌రాయబారి ఆలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరుదేశాల కరెన్సీ (రూపాయి, రియాల్‌)‌లోనే లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. భారత్‌కు చమురు ఎగుమతులు ప్రారంభమైతే రెండుదేశాల మధ్య వాణిజ్యం 30 బిలియన్‌ ‌డాలర్లకు చేరుకోగలదు. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ద్వీపదేశమైన శ్రీలంకను ఆదుకునేందుకు భారత్‌ ‌ముందుకు వచ్చింది. ఇటీవలే ఆ దేశానికి వంద కోట్ల డాలర్ల రుణం ప్రకటించింది.

మరోవైపు రక్షణ రంగంలో దశాబ్దాలుగా దిగుమతులపై ఆధారపడిన దేశం ఇప్పుడిప్పుడే ఎగుమతులు చేస్తుండటం విశేషం. ఇటీవలే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ ‌క్షిపణులను ఎగుమతి చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దాదాపు రూ.2770 కోట్ల విలువైన ఈ ఒప్పందం అంతర్జాతీయ ఆయుధ విపణిలో భారత్‌కు సరికొత్త అవకాశాలను తెరిచింది. ఇండోనీసియా, వియత్నాం తదితర దేశాలతో ఇటువంటి ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ (‌యూఏఈ)లకు బ్రహ్మోస్‌, ఆకాశ్‌ అ‌స్త్రాలను విక్రయించే విషయంలోనూ చర్చలు సాగుతున్నాయి. మోదీ వ్యూహ చతురత కారణంగా ఎనిమిదేళ్ల క్రితం వరకు రూ.1941 కోట్లకు పరిమితమైన భారత రక్షణ ఉత్పత్తుల విలువ ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెరగడం విశేషం. 2025 నాటికి 500 కోట్ల డాలర్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గతంలో వివిధ దేశాలనుంచి పెద్దసంఖ్యలో దిగుమతయ్యే రక్షణ ఉపకరణాలు ఇప్పడు దేశీయంగానే తయారవుతున్న విషయం గమనార్హం.

 పేదలకు ఆపన్న హస్తం…

 నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మోదీకి వారి బాధలేమిటో తెలుసు. అందుకే అధికారం చేపట్టగానే పెద్ద పెద్ద పథకాలకు బదులు పేదలకు ప్రత్యక్షంగా, నేరుగా, దళారులతో ప్రమేయం లేకుండా మేలు చేసే పథకాలను ప్రారంభించారు. గత ఏడేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకాల వల్ల వారికి ఎంతో ఊరట కలిగింది. తాజాగా పేదలను ఆదుకునేందుకు ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని ఈ ఏడాది సెప్టెంబరు వరకు పొడిగించారు. కరోనా కాలంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి వ్యక్తికి నెలకు అయిదు కిలోల బియ్యం, అయిదు కిలోల గోధుమలు ఉచితంగా అందజేస్తారు. దీని ద్వారా రమారమి 80 కోట్ల మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నట్లు అంచనా. 2020 మార్చిలో మొదలైన ఈ పథకం వాస్తవానికి ఈ ఏడాది మార్చితో ముగియాలి. అయినప్పటికీ పేదల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న మోదీ సర్కారు మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయిం చింది. ఇప్పటివరకు పథకం కింద రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేశారు. పొడిగింపు వల్ల సర్కారుపై మరో రూ. 80 కోట్ల భారం పడనుంది. అయినప్ప టికి ప్రభుత్వం వెనకాడలేదు.

గత ఏడేళ్లలో మోదీ సర్కారు ప్రారంబించిన పథకాలకు లెక్కలేదు. 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ ‌సత్ఫలితాలు ఇచ్చింది. అదే ఏడాది ప్రారంభించిన ‘నమామి గంగే’ పథకంతో గంగా నది శుభ్రపడింది. దీని కింద మురుగునీటి శుద్ధి, నదుల శుభ్రత, అడవుల పెంపకం, సంరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. భారతీయుల జీవనాడి, ఆత్మగా పరిగణించే గంగా నది ఇప్పుడిప్పుడే స్వచ్ఛతను సమకూర్చుకుంటోంది. అందరికీ పరిశుద్ధమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన హర్‌ ‌ఘర్‌ ‌జల్‌ ‌పథకం వల్ల మేలు జరుగుతోంది. 2024 నాటికి ప్రతి ఒక్కరికీ నీరందించాలన్న లక్ష్యం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. జీవిత చరమాంకంలో ఆసరాగా ఉండేందుకు అటల్‌ ‌పెన్షన్‌ ‌యోజన పథకాన్ని ప్రారంభించారు. దీని కింద 60 సంవత్స రాలు దాటిన వ్యక్తి ప్రీమియం చెల్లించే మొత్తం బట్టి నెలకు రూ. 1000 నుంచి రూ.5000 వల వరకు పింఛన్‌ ‌పొందే అవకాశం ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా పొందే సౌకర్యాన్ని కల్పించారు. జన్‌ ‌ధన్‌ ‌పథకం కింద నిరుపేదలను బ్యాంకింగ్‌తో అనుసంధా నించారు. గత ఏడేళ్లలో లక్షల మంది బ్యాంకు ఖాతాలు పొందారు. దీనివల్ల వారు బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం కలిగింది. 2019లో మొదలైన ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి వల్ల పేద రైతులు ప్రయోజనం పొందుతున్నారు. దీని కింద ఒక్కో రైతుకు ఏటా రూ.2000 వంతున మూడు దఫాల్లో అందజేస్తారు. దళారులతో ప్రమేయం లేకుండా ఈ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తున్నారు. ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన ద్వారా బాలికల సంక్షేమానికి పాటుపడుతున్నారు. డిజిటల్‌ ఇం‌డియా పథకం ద్వారా సాంకేతిక విప్లవానికి నాంది పలికారు. దీనిని పల్లెలకూ విస్తరింపజేస్తున్నారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకం ద్వారా నిరుపేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. ఉజ్జ్వల యోజన పథకం ద్వారా మారుమూల పల్లెలకు సైతం వంట గ్యాస్‌ ‌సిలిండెర్లు సరఫరా చేస్తున్నారు. దీంతో కుటుంబానికి అవసరమైన ఆహారం తయారీలో ఆడపడుచుల ఇబ్బందులు తొలగిపోయాయి.

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి వ్యక్తికీ ఉచితంగా టీకాలను సరఫరా చేశారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా రెండు డోసుల టీకాలను అందించారు. అనేక పేద దేశాలకు ఉచితంగా టీకాలను అందజేసి భారత్‌ ‌తన మానవీయతను చాటుకుంది. భారత్‌లో చేపట్టిన వ్యాక్సినేషన్‌ ‌ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంగా గుర్తింపు పొందింది. తక్కువ వ్యవధిలోనే సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన వ్యాక్సిన్‌ ‌తయారీ వైద్య రంగంలో భారత్‌ ‌స్వావలంబ నకు నిదర్శనం. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మరణాలు పెద్దసంఖ్యలో చోటుచేసుకోగా భారత్‌లో పరిమితంగానే నమోదైంది. మోదీ సర్కారు చేపట్టిన వివిధ చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు ఆదరణ ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.30 లక్షల కోట్లను అధిగమించడం విశేషం. సూక్ష్మ, చిన్న తరహా, మధ్యతరహా, కుటీర పరిశ్రమ లను ప్రోత్సహించడం వల్లే ఈ విజయం సాధ్య మైందని ఇటీవల జరిగిన మన్‌ ‌కీ బాత్‌ ‌కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ పేర్కొన్నారు. పార్టీ అజెండాలోని అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం ద్వారా ప్రజల అభీష్టం నెరవేరనుంది. త్వరలోనే దీని నిర్మాణం పూర్తి కానుంది. పార్టీ మొదటి నుంచి ప్రవచిస్తున్న 370వ అధికరణ రద్దు ద్వారా సంక్షుభిత, సరిహద్దు రాష్ట్రమైన జమ్ము-కశ్మీర్‌లో నూతన శకానికి నాంది పలికారు. ఎగువసభలో పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లేనప్పటికీ 2018 ఆగస్టులో ఈ బిల్లు ఆమోదం పొందడం విశేషం. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పేదల కోసం నిరంతరం పని చేయడం వల్లే అనేక సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. విపక్షాలు ఎంత గోల చేసినప్పటికి, ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తించారు. అందువల్లే ఇటీవల అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పట్టం కట్టారు. 2017లో సంపూర్ణ మెజార్టీ లేని మణిపూర్‌, ‌గోవా వంటి చోట్ల సైతం పార్టీ తాజా ఎన్నికల్లో సొంత బలం సమకూర్చుకోగలిగింది. వరుసగా రెండోసారి గెలిచే సంప్రదాయం లేని పర్వత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో సంపూర్ణమైన ఆధిక్యాన్ని సాధించింది. ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై విపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినప్పటికీ పంజాబ్‌లో పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. 2017 ఎన్నికల్లో 5.43 ఓట్ల శాతాన్ని పొందిన పార్టీ తాజా ఎన్నికల్లో దానిని 6.60 శాతానికి పెంచుకోవడం విశేషం. అకాలీదళ్‌ ‌వంటి ప్రాంతీయ పార్టీ మద్దతు లేనప్పటికి ప్రజాదరణ విషయంలో వె•నకబడకపోవడం గమనించదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోరాడేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయనుంది. రానున్న కాలంలో మరిన్ని కొత్త పథకాలు ప్రారంభించేందుకు, ప్రస్తుత పథకాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయన్స్ ‌ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram