– తురగా నాగభూషణం

జిన్నా టవర్‌ పేరు తొలగించి స్వాతంత్య్ర సమరయోధుల పేరు పెట్టాలని కేంద్ర లేబర్‌ బోర్డు ఛైర్మన్‌ వల్లూరి జయప్రకాష్‌ నారాయణ డిసెంబర్‌ 23న ట్వీట్‌ చేశారు. 30న గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అదే రోజు భాజపా జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌ ట్వీట్‌ చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం అయింది. తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు జిన్నా టవర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేశారు. భాజపా దీనిపై ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. జిన్నా మన దేశాన్ని విడదీశారు. లక్షలాది మంది పాకిస్తాన్‌లో సర్వస్వం పోగొట్టుకుని భారత్‌కు తరలిపోతుంటే అడ్డుకుని కాపాడలేకపోయారు. నమ్మినవారిని రక్షించలేని, సంఘాన్ని సంఘటితం చేయలేని చేతకాని వ్యక్తి మహమ్మద్‌ అలీ జిన్నా. ముష్కరమూకలైన వేర్పాటువాదులు చేసిన మారణకాండకు ఆయనే పరోక్షంగా కారకుడు. అలాగే కింగ్‌ జార్జి అక్రమంగా భారత్‌ను స్వాధీనం చేసుకుని ఎదురుతిరిగిన స్వాతంత్య్రయోధులను అణచివేసిన ఆంగ్లేయుడు. జిన్నా, కింగ్‌ జార్ట్‌ల జ్ఞాపకాలు భయానక సంఘటనలను గుర్తుచేస్తాయి. గుంటూరు లోని టవర్‌కు జిన్నా టవర్‌గా, విశాఖ ప్రభుత్వాసు పత్రికి కింగ్‌ జార్జి పేరును ఇంకా మనం ఎందుకు కొనసాగించాలి. వారిని ఇంకా మనం ఎందుకు గౌరవించాలి? నాటి బానిస, ముస్లిం ముష్కరుల నీచ సంస్కృతి ఏ రకంగా మనకు ఆదర్శం అవుతుంది. వీరిని గొప్ప వ్యక్తులుగా చెప్పి వీరి చేతిలో హతమైన మన యోధులను అవమానిద్దామా?

ఆ దేశాల్లో హిందూ నాగరికతలు ధ్వంసం

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఒకప్పుడు భారత్‌లో భాగాలే. విడిపోయిన పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో ఒకప్పుడు హిందువులు కూడా ఉండేవారు. హిందువులకు చెందిన ఆలయాలు, గొప్ప నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. హిందువులను బెదిరించడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, హత్యలు, అత్యాచారాలు చేయడంతో చాలామంది అక్కడ ఇస్లాం మతం తీసుకున్నారు. నేడు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువుల సంఖ్య ఒకటి రెండు శాతానికి తగ్గిందంటే ఎంత దారుణంగా ఘోరాలు జరిగియో అర్థం చేసుకోవచ్చు. హిందూ సంస్కృతిని ప్రతిబింబించే దేవాలయ నిర్మాణాలను ధ్వంసం చేశారు. కొన్నిటిని హోటళ్లుగా మార్చి హిందువులను అవమానించారు. అంతెందుకు ఇటీవల బంగ్లాదేశ్‌లో దేవీనవరాత్రుల సమయంలో హిందువులపై జరిగిన ఊచకోతలు, ఆలయాల విధ్వంసం గురించి ప్రపంచమంతా తెలిసింది. ఇప్పుడు ఈ రెండు దేశాల్లో అసలు హిందూ ఆనవాళ్లు కనిపించవు. పూర్తి ఇస్లాం దేశాలుగా మార్చేశారు. ప్రజలు కూడా హిందువులంటే శత్రువులనేలా ద్వేషం పెంచారు.

మహమ్మద్‌ అలీ జిన్నా భారత్‌ను విభజించి, ప్రత్యేక పాకిస్తాన్‌ ఏర్పాటును ప్రోత్సహించారు. లక్షలాది హిందువులు, భారత్‌లోని ముస్లింల హత్యలకు కారణమైన వేర్పాటువాది. అలాంటి వ్యక్తిని ఏవిధంగా మనం గొప్ప నాయకుడిగా గుర్తించగలం? జిన్నా తమ వర్గం కోసం మాత్రమే పోరాడారు. ముస్లింలీగ్‌ అనే పార్టీని స్థాపించి హిందువులతో విభేదించి ప్రత్యేకవర్గాన్ని ప్రోత్సహించారు. ఆంగ్లేయుల విభజించు-పాలించు సూత్రాన్ని అమలు పరచడంలో జిన్నా ఒక పావుగా మారారు. ఇందుకు విరుద్ధంగా జాతీయవాదులు ఆందోళనలకు దిగారు. దక్షిణా సియాలో హింస ప్రజ్వరిల్లింది. ఇదే అదనుగా బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌-పాకిస్తాన్‌లకు స్వతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్య్రం పొందిన ఇరుదేశాలలో కాందిశీకులు ఇరువైపులా ఎక్కువయ్యారు. విడిపోయిన పాకిస్తాన్‌లో ఉన్న హిందువులపై అక్కడి ముస్లింలు ఊచకోత కోసి మారణకాండకు పాల్పడ్డారు. ఆస్తులు లాగేసుకుని అత్యాచారాలు చేసి వెళ్లగొడితే హిందువు లంతా కట్టుబట్టలతో పారిపోయి భారత్‌ వచ్చేశారు. హిందువుల మృతదేహాలను రైళ్లలో భారత్‌కు పంపిన విషయాన్ని మరువలేం. తాను కోరుకున్న దేశంలోని ప్రజలు ఇంత దారుణాలకు పాల్పడితే జిన్నా వారిని ఆపలేకపోయారు. హిందువులను రక్షించలేక పోయారు. 1947 నుంచి నేటి వరకు భారత్‌పై జరుగుతున్న పాకిస్తాన్‌ ఉగ్రదాడులు, భారత్‌పై కవ్వింపు యుద్ధాలకు ఒక రకంగా ఆయనే ఆద్యుడు. ఒక రకంగా టిప్పుసుల్తాన్‌కు జిన్నాకు తేడా లేదు.

దేశ విభజనను వ్యతిరేకించిన భారత్‌లో ఉన్న ముస్లింలంతా జిన్నాను వ్యతిరేకించినవారే. జిన్నా భారత్‌కు ఏ రకంగానూ ఆప్తుడు కాదు. పరాయిదేశ నాయకుడిగా ఆయనను మనం గౌరవిస్తాం అంతే కాని పూజించం. కాని కాంగ్రెస్‌ పార్టీ జిన్నాను ఇంకా ముస్లింల నాయకుడిగా భావిస్తోంది. ముస్లింలకు ఇష్టం ఉన్నా లేకున్నా జిన్నాను వారి నాయకుడిగా, ఆత్మబంధువుగా అంటగట్టింది. కొందరు అమాయ కులైన ముస్లింలు కూడా కాంగ్రెస్‌ కల్లబొల్లి మాటలను నమ్మారు. మనను కాదనుకుని వెళ్లిన జిన్నాపై ముస్లింలలోనూ భిన్నాభిప్రాయాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా విద్యాధికులైన యువత జిన్నాను ఆప్తుడిగా అంగీకరించడం లేదు.

అలాంటి మహమ్మద్‌ అలీ జిన్నా పేరును గుంటూరులోని ఒక కట్టడానికి ఇంకా కొనసాగి స్తున్నారు. ముస్లింల సంతుష్టీకరణ కోసం రాజకీయ పార్టీలు గుంటూరులోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఒక టవర్‌ ఏర్పాటుచేసి దానికి పాకిస్తాన్‌ జాతిపితగా పేర్కొనే జిన్నా పేరుని పెట్టారు. పైగా శాంతి, సామరస్యాలకు చిహ్నంగా పేర్కొని హిందువులను మోసం చేశారు. దీనికి వారు చెప్పే సమాధానం కూడా ఎవరూ అంగీకరించేలా లేదు. సత్తెనపల్లెకి చెందిన 14 మంది ముస్లింలు హిందువులను హత్యచేసిన సంఘటనలో నాటి బ్రిటిష్‌ న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. అప్పుడు స్థానికుల కోరికపై ఢల్లీి నుంచి వచ్చిన జిన్నా ఈ కేసును విచారించి వారిని ఉరిశిక్ష నుంచి తప్పించారు. అప్పటికే ఏర్పడిన హిందూ`ముస్లింల మత ఘర్షణలు నివారించే పేరుతో కాంగ్రెస్‌ పార్టీ గుంటూరులోని మహాత్మా గాంధీ రోడ్డులో ఒక టవర్‌ను నిర్మించి దానికి జిన్నా పేరును పెట్టింది. 14 మంది హిందువుల మరణాలకు కారణమైన వారిని రక్షించిన జిన్నా మనకు ఏ విధంగా గౌరవనీయుడని జాతీయవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి పేరును తక్షణం తొలగించాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది.

ముస్లిం యువత ఆకాంక్ష అదే

పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన హమీద్‌ పేరును ఈ టవర్‌కు పెట్టాలన్న 1966లో అప్పటి మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానాన్ని కూడా భాజపా గుర్తుచేస్తోంది. స్వశక్తితో శాస్త్రజ్ఞుడిగా ఎదిగి, మిసైళ్లను తయారుచేసిన మేధావి, ఆటంబాంబును ప్రయోగిం చిన సాహసవంతుడు మన అబ్దుల్‌ కలాం. దేశం ఆయనను భారత రాష్ట్రపతిగా కూడా గౌరవించింది. కలాం మనకు ఆరాధ్యనీయుడు. ఆయననే తమకు స్ఫూర్తిగా ముస్లిం యువత భావిస్తున్నారు. వీరి ఆలోచనను భాజపా కూడా బలపరుస్తుంది. జిన్నా టవర్‌కు కలాంపేరు పెట్టాలని చాలామంది సూచిస్తున్నారు. అలాగే కవితా విశారద, కవికోకిల, అభ్యుదయవాది గుర్రం జాషువా పేరును కూడా పరిశీలించవచ్చు. అందువల్ల గుంటూరులోని టవర్‌కు జిన్నా పేరును తొలగించి ఆ స్థానంలో హమీద్‌, అబ్దుల్‌ కలాం లేదా గుర్రం జాషువాలలో ఒకరి పేరుపెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే తాము అధికారంలోకి వస్తే పేరు మారుస్తామని హెచ్చరించారు.

కింగ్‌ జార్జి పేరూ మార్చాలి

జిన్నా పేరు మాదిరిగానే విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్న కింగ్‌ జార్జి (కేజీహెచ్‌) పేరును తొలగించాలని భాజపా కోరుతోంది. కింగ్‌ జార్జి ఆసుపత్రి రెండువందుల ఏళ్ల క్రితం నిర్మించారు. నాటి బ్రిటిష్‌ రాజు జార్జి పేరును దానికి పెట్టారు. ఇప్పుడు భారత్‌లో బ్రిటిష్‌ పాలన లేదు. ఆంగ్ల రాజులు లేరు. రాణులు లేరు. భారతీయుల ఆస్తుల్ని సర్వస్వం దోచుకుని తమ దేశానికి తరలించుకుపోయారు. నాటి బ్రిటిష్‌ పాలకుల్ని మనం శత్రువులుగా భావిస్తున్నాం. నేడు మనదేశాన్ని మనం పాలించుకుంటున్నాం. ఇంకా వారి నామస్మరణ చేయడానికి మనమేమన్నా పౌరుషం లేనివారమా? విశాఖ ఆసుపత్రిని మనమే నిర్వహించు కుంటున్నాం. అందువల్ల కేజీహెచ్‌ పేరు మార్చాలి. దానికి తెన్నేటి విశ్వనాధం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టాలని భాజపా కోరుతోంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన వారిలో కాటన్‌తో పాటు వీణం వీరన్న అనే ఇంజనీర్‌ కూడా ఉన్నారు. ఆయనను మనం మరచిపోయాం. వీరన్న తన జీవితం మొత్తం ఈ బ్యారేజీ నిర్మాణానికి త్యాగం చేశారు. అందువల్ల ఆయనను కూడా గుర్తుచేసుకోవాలి.

పేరు మార్చిన నగరాలు, గ్రామాలు

భారత్‌లో ఆంగ్లేయులు తమ పరిపాలనా సౌలభ్యం, లేదా నోరుతిరగక పెట్టిన పేర్లు చాలా చెలామణిలో ఉన్నాయి. నాడు ఆంగ్లేయులు, ముస్లింల పాలనలో ఉన్నాం కాబట్టి వారి మాట కూడా వినాల్సి వచ్చింది. ఇప్పుడు మనం స్వాతంత్య్రం సాధించు కున్నాం. మనల్ని అన్యాయం చేసి, ఊచకోత కోసిన దుర్మార్గుల ఆనవాళ్లు ఇక మనకు అవసరం లేదు. అందువల్ల వాటిని ఇక ఉంచాల్సిన అవసరం లేదని స్థానికులు, జాతీయవాదులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి నిర్మాణాలను చాలా వరకు రాష్ట్ర ప్రభత్వాలు మార్చేశాయి. ఉదాహరణకు బెజవాడ లేదా బ్లేజ్‌బాడ అనేది విజయవాడగా, మద్రాసు చెన్నైగా, వాల్తేరు`విశాఖపట్నంగా, రాజమండ్రి`రాజమహేంద్రవరంగా, కలకత్తా` కోల్‌కతాగా, త్రివేండ్రం`తిరువనంతపురంగా, కొచ్చిన్‌ `కొచ్చిగా, బాంబే`ముంబైగా, పూనా`పుణెగా, బరోడా`వడోదరగా, ఒరిస్సా`ఒడిషాగా, గుర్గావ్‌` గురుగ్రాంగా, బెనారస్‌`వారణాసిగా, అలహాబాద్‌` ప్రయోగరాజ్‌గా, ఫైజాబాద్‌ను`అయోధ్యగా, బెల్గాం`కలుబుర్గిగా, పాండిచ్చేరి`పుదుచ్చేరిగా మార్చారు. ఇంకా చాలా ఉన్నాయి. ముంబైలోని విక్టోరియా టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌కు`ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా, మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌ను`దీన్‌ దయాళ్‌ స్టేషన్‌గా, వీలర్‌ ఐలెండ్‌ను అబ్దుల్‌ కలాం ద్వీపంగా పేర్లు మార్చారు.

వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌

About Author

By editor

Twitter
Instagram