‘కశ్మీరీల హక్కుల గురించి మేం మాట్లాడుతూనే ఉంటాం’ ఇది పాకిస్తాన్‌ ‌ప్రధాని పదవి చేపట్టిన ప్రతివాడు అనే మాటే. కశ్మీర్‌ అం‌శం అక్కడి రాజకీయ నాయకులకి అధికార రక్షా కవచం. కశ్మీరీలను అణచివేస్తున్నారని భారత్‌ ‌మీద ఆరోపణలు చేయడం వాళ్ల రాజకీయ జీవితంలో రివాజు. అయితే కశ్మీరీ పండిత్‌లకు హక్కులు ఉండక్కరలేదు. పాక్‌ అం‌డ చూసుకుని కొందరు స్థానికులు, ఉగ్రవాదులు లోయ నుంచి వారిని  తరిమివేయవచ్చు. ఇది కూడా ఆ దేశం వైఖరిలో స్పష్టంగా కనిపించే వాస్తవమే. ప్రపంచ మానవ హక్కుల నాటకాల రాయుళ్లు కూడా పాకిస్తాన్‌కే వంత పాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే,  పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ అలజడుల గురించి, అక్కడి ప్రజలు సాగిస్తున్న అస్తిత్వ పోరాటం గురించి ఆ దేశానికి తెలియదా? అలాగే బలూచిస్తాన్‌ ‌ప్రజానీకం మీద చైనాతో కలసి పాకిస్తాన్‌ ‌చేస్తున్న అరాచకాల గురించి ఈ ప్రపంచానికి తెలియవా? బలోచ్‌ ‌ప్రజలు చేస్తున్న పెద్దవీ, చిన్నవీ డిమాండ్లు పాకిస్తాన్‌ ‌చెవిటి నేతలకి ఇంతకాలం వినపడడం లేదా?

గడచిన 26 రోజులుగా పాకిస్తాన్‌ ‌ప్రావిన్సు లలో ఒకటైన ఆ బలూచిస్తాన్‌లో అలజడులు తీవ్రమైనాయి. పాకిస్తాన్‌ ‌పాలకుల అణచివేతలూ తీవ్రమైనాయి. దాదాపు ఏడుదశాబ్దాలుగా సాగుతున్న వారి ఉద్యమంలో ఇప్పుడు ఇంకొంత విస్త•ృతి, కొత్త ఊపు కనిపిస్తున్నాయి. బలూచీల తాజా ఉద్యమం మీద చైనా చేసిన వ్యాఖ్యతో సంబంధం లేకుండా పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మరొక వ్యాఖ్య చేశారు. అది చైనా ప్రకటనకు వ్యతిరేకమే కూడా. ఇవన్నీ పాకిస్తాన్‌ ఆం‌గ్ల దినపత్రిక ‘డాన్‌’ ‌నివేదికల ఆధారంగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. బలూచిస్తాన్‌ ‌ప్రజల స్వేచ్ఛా నినాదం పదునెక్కిందన్నమాట వాస్తవం. పాక్‌ ‌ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ‌వారి 19 డిమాండ్లను పరిశీలిస్తామని మొత్తానికి ప్రకటించారు.

డిసెంబర్‌ 9, 10 ‌తేదీలలో బలూచిస్తాన్‌లోని రేవు పట్టణం గ్వాదర్‌ అలజడులతో ఊగిపోయింది. పాకిస్తాన్‌ ‌సైన్యానికి, అణచివేతలకు భయపడకుండా వేలాదిమంది ఆ పట్టణంలో ఊరేగింపు జరిపారు. ‘గ్వాదర్‌ ‌కో హక్‌ ‌దో’ (గ్వాదర్‌ ఉద్యమానికి హక్కులు ఇవ్వండి) పేరుతో గడచిన 26 రోజులుగా అక్కడ ఉద్యమం జరుగుతున్నది. జమాతే ఇస్లామి ప్రధాన కార్యదర్శి మౌలానా హిదాయత్‌ ఉర్‌ ‌రెహమాన్‌ ఈ ఉద్యమం నిర్వహిస్తున్నారు. తమ ఉద్యమం హక్కులు కోల్పోయిన జాలర్లు, కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేకపోతున్న బలూచిస్తాన్‌ ‌పేదలు నిర్వహిస్తున్న దేనని వారు చెబుతున్నారు. పేద కార్మికులు, విద్యార్థులు కూడా చేయూతనిస్తున్న ఈ ఉద్యమం ప్రజల కోర్కెలు తీరేవరకు సాగుతుందని కూడా ప్రకటిస్తున్నారు. గ్వాదర్‌ ‌పట్టణం నుంచే కాకుండా తుర్బత్‌, ‌పిష్కన్‌, ‌జమ్రాన్‌, ‌బులేదా, ఉర్మారా, పస్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి మహిళలు, పిల్లలు  ఆ భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు. సెరాతున్‌- ‌నబీ చౌక్‌ ‌నుంచి ఈ భారీ ప్రదర్శన ఆరంభమైంది. మొత్తం 19 డిమాండ్లను ఉద్యమకారులు బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్ ‌ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు.

ఈ తాజా ఉద్యమానికి చైనా తనదైన శైలిలో భాష్యం చెబుతోంది. గ్వాదర్‌ ‌నౌకాశ్రయం మీద ప్రస్తుతం చైనా ఆధిపత్యం ఉంది. చైనా ఓవర్సీస్‌ ‌పోర్ట్ ‌హోల్డింగ్‌ ‌కంపెనీ ఆ పని మీదే ఉంది. ఈ ప్రజా ప్రదర్శన, అందులో భారీగా ప్రజలు పాల్గొ నడం ఇవన్నీ గాలి వార్తలేనని అంటూ చైనా కొట్టి పారేసింది. తాము నిర్మిస్తున్న గ్వాదర్‌ ‌నౌకాశ్రయం ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్యోగాలు రానివారే ఈ ఆందోళన బాట పట్టారని చైనా వికృత వాదన వినిపిస్తున్నది. అసలు ఈ ఉద్యమం చైనాకు వ్యతిరేకంగా మొదలయినదేనంటూ వస్తున్న వార్తలను తాము విశ్వసించబోమని చైనా అధికారులు చెబుతున్నారు. ఈ ఉద్యమ ఉద్దేశాలలో ఒకటి-గ్వాదర్‌ ‌నౌకాశ్రయంలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

 గ్వాదర్‌ ‌ప్రాంత ఉద్యమ వార్తలన్నీ గాలి వార్తలేనని చైనా వ్యాఖ్యానించడాన్ని ఫ్రీ బలూచిస్తాన్‌ ‌మూవ్‌మెంట్‌ ‌ప్రతినిధి (లండన్‌) ‌జమాల్‌ ‌నాసిర్‌ ‌బలోచ్‌ ‌ఖండించారు. అసలు బలూచిస్తాన్‌లోని గ్వాదర్‌ ‌పట్టణమే ఒక పెద్ద కారాగారంలా మారి పోయిందని జమాల్‌ ఆరోపిస్తున్నారు. స్థానికుల మీద అన్ని వైపులా నిర్బంధాలే ఉన్నాయని అంటున్నా రాయన. బలూచిస్తాన్‌ ‌సముద్ర ఉత్పత్తులను చైనా దోపిడీ చేస్తున్న సంగతి అందరికీ తెలుసునని జమాల్‌ ‌చెబుతున్నారు. అక్కడ పాకిస్తాన్‌ ‌సైనికాధికారులు, చైనా జాతీయులు కలసి చేపల వాణిజ్యాన్నీ, పర్యావరణాన్నీ ధ్వంసం చేస్తున్నారని కూడా బలూచి స్తాన్‌ ‌విముక్తి పోరాటవాదుల వాదన. పాకిస్తానే అక్కడి చైనా నౌకాశ్రయం రక్షణ పేరుతో స్థానికులను అణచివేస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు. చైనా నౌకాశ్రయం పేరుతో పాకిస్తాన్‌ ‌వలసవాది దేశంలా తనదికాని బలూచిస్తాన్‌ను అణచివేస్తున్నదని కూడా ఉద్యమకారులు తీవ్రంగానే విమర్శిస్తున్నారు. 62 బిలియన్‌ ‌డాలర్లతో నిర్మిస్తున్న గ్వాదర్‌ ‌నౌకాశ్రయం వల్ల స్థానికులకు ఒరిగేదేమీ లేదనే వారంతా ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్‌ను బలూచిస్తాన్‌ ‌ప్రజలు వలసవాద దేశంగానే పరిగణిస్తున్నారు. ఎక్కడైనా వలసవాది దేశం అది ఆక్రమించిన ప్రాంతంలోని వారి అభివృద్ధికి ఎలాంటి ఆసక్తి చూపదని కూడా వారంతా చెబుతారు. ప్రస్తుతానికి బలూచిస్తాన్‌ ‌విముక్తి పోరాట యోధుల దృష్టిలో చైనా, పాకిస్తాన్‌ ‌కూడా తమను అణచివేస్తున్న వలసవాద దేశాలే. ఆ రెండు దేశాల భద్రతా బలగాలే లక్ష్యంగా ఉద్యమకారులు పోరాటం సాగిస్తున్నారు. మౌలానా హిదాయత్‌ ఉర్‌ ‌రహమాన్‌ ‌నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమం ధ్యేయం కూడా ఇదేనని బాహాటంగానే చెబుతున్నారు. చైనా ట్రాలర్లు బలూచిస్తాన్‌ ‌ప్రాంతంలో విస్తరించి ఉన్న అరేబియా సముద్ర ప్రాంతంలోని మొత్తం మత్స్య సంపదను దోచుకుపోతున్నాయని వారి ఆరోపణ. స్థానికులు ఆ జలాలలోకి గ్వాదర్‌ ‌ప్రాంతీయులు వెళ్లకుండా చైనాయే కాదు, దానిని అంటకాగుతున్న పాకిస్తాన్‌ ‌కూడా అడ్డుకుంటున్నాయి. అందుకే ప్రస్తుతం ఊపందుకున్న ఉద్యమంలో తమ జాలర్లకు ఇలాంటి అడ్డంకులు ఉండకూడదని ఉద్యమకారులు కోరుతున్నారు. ఇంతకాలంగా గ్వాదర్‌ ‌కొ హక్‌ ‌దొ ఉద్యమం అహింసా మార్గంలో సాగుతోంది. ఇది బలూచిస్తాన్‌ ‌తీరంలోనే ఉన్న మక్రాన్‌కు కూడా విస్తరిస్తున్నది. ఈ పరిస్థితులలో అసలు ఈ ఉద్యమం, అందుకు సంబంధించిన వార్తలు అంతా బూటకమని చైనా వదరడం వారిలో సహజంగానే ఆగ్రహం పెల్లుబికింది. చిత్రంగా చైనా ప్రకటన గురించి తెలిసి కూడా పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌డిసెంబర్‌ 12‌న ఆ ప్రాంత సముద్రంలో జరుగుతున్న అక్రమ చేపల వేటను నిరోధిస్తామని ప్రకటించడం విశేషం. దీని మీద చైనా ఎలా స్పందించనున్నదో మరి!

ఫ్రీ బలూచిస్తాన్‌ ‌మూవ్‌మెంట్‌ ‌తరఫున లండన్‌ ‌నుంచి మాట్లాడిన జమాల్‌ ‌మాటలలో మౌలానా హిదాయత్‌ ఉద్యమానికి మద్దతు స్పష్టంగానే కనిపిస్తున్నది. హిదాయత్‌ ‌మాదిరిగానే అవామీ వర్కర్స్ ‌పార్టీ నాయకుడు, హక్కుల కార్యకర్త యూసుఫ్‌ ‌మస్తీఖాన్‌ ‌కూడా పాకిస్తాన్‌ ‌మీద తీవ్రంగా పోరాడుతున్నారు. 77 ఏళ్ల మస్తీఖాన్‌ ‌కేన్సర్‌ ‌బాధితుడు. ఈయనను డిసెంబర్‌ 9‌న అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ ‌రాజ్యాంగ సంస్థలకు వ్యతిరేకంగా మస్తీఖాన్‌ ‌రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఇచ్చారనీ, దేశద్రోహానికి పాల్పడ్డారనీ ఆరోపిస్తూ ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన ఏమన్నారు? ‘బలూచిస్తాన్‌ను 1947లో బలవంతంగా పాకిస్తాన్‌లో విలీనం చేశారు.’ ఇదేకాదు, ఈ ప్రాంత ప్రజలను పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ఎప్పటి నుంచో బానిసలుగా చూస్తున్నదని కూడా ఆయన ఆరోపణ. అది పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ అయినా, కొన్ని వాస్తవాలను పేర్కొన్నది. 1953 నుంచి మా ప్రాంతం నుంచి పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం వంట గ్యాస్‌ను దొంగిలిస్తున్నదని మస్తీఖాన్‌ ఆరోపించారన్న విషయం కూడా అందులో ఉంది. మౌలానా హిదాయత్‌ ఆరోపణ గ్వాదర్‌ ‌ప్రాంతంలో జరుగుతున్న వనరుల దోపిడీ. మస్తీఖాన్‌ ఆరోపణ వంటగ్యాస్‌కు సంబంధించినది. అన్నట్టు పాకిస్తాన్‌లో కూడా మానవహక్కుల కమిషన్‌ ఒకటి ఉంది. అది నోరు కూడా విప్పింది. మస్తీఖాన్‌ అరెస్టును ఖండించింది. ‘మస్తీఖాన్‌ అం‌త ప్రమాదకరమైన పనేం చేశాడని! బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్‌లోని ప్రజలకు ప్రభుత్వం ఇవ్వవలసిన రాజకీయ, ఆర్థిక హక్కులు ఇవ్వడం లేదనే కదా అన్నాడు.’ అని పేర్కొన్నది. దేశంలో ఉండే మిగిలిన హక్కుల కార్యకర్తలు కూడా మస్తీఖాన్‌ అరెస్టు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇదెంత దారుణం! ఆయన రాజకీయ కార్యకర్త కావచ్చు. కేన్సర్‌ ‌ముదిరిన రోగి ఆయన. అయినా ఆ స్థితిలో అరెస్టు చేశారంటూ ఒక నెటిజన్‌ ‌వాపోయాడు. బలూచిస్తాన్‌ ‌ప్రజలు కూడా ఈ చర్య పట్ల ఆగ్రహంతో ఉన్నారని రాశాడు.

గడచిన నెల రోజులుగా బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఊపందు కున్నాయి. ఉద్యమం పేరు, అది వినిపిస్తున్న డిమాండ్లు వేర్వేరు కావచ్చు. కానీ అవన్నీ బలూచిస్తాన్‌ ‌విముక్త పోరాటంలో అంతర్భాగమే. భారత్‌ ‌మీద పగతో పాకిస్తాన్‌ ‌నాయకత్వం చైనా మోచేతి నీళ్లు తాగుతూ ఉండవచ్చు. కానీ ఇదే దేశ ప్రజలందరి అభిప్రాయం కాదు. అదీకాక, గ్వాదర్‌ ‌ప్రాంత ప్రజలది ధర్మాగ్రహమే కూడా. వారి కోర్కెలు నిజానికి చాలా చిన్నవి. అవన్నీ మౌలిక అవసరాలకు సంబంధించినవే. తాగు నీటి వసతి కల్పించాలని, జివాని నుంచి కరాచీ వరకు ఉన్న జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన అనవసర తనిఖీ కేంద్రాలు తొలగించాలని, సముద్ర జలాలలోకి వెళ్లకుండా ఆంక్షలు తొలగించాలని, సరిహద్దు వాణిజ్యం మీద పెట్టిన నిషేధాలను తొలగించాలని, ఇరాన్‌ ‌నుంచి ఆహారపదార్థాలను అనుమతించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో గ్వాదర్‌లోనే కాకుండా గడచిన కొన్ని వారాల నుంచి తుర్బత్‌, ‌జమ్రాన్‌, ఉర్మారా, పస్నిలో భారీ స్థాయిలో ప్రజా ప్రదర్శనలు జరుగుతున్నాయి. మొత్తానికి గ్వాదర్‌ ఉద్యమకారుల డిమాండ్లను గుర్తించక తప్పని స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ఉంది. అలాగే కశ్మీరీల హక్కుల గురించేనంటూ ప్రపంచం ఎదుట అబద్ధాలు వెదజల్లే ముందు బలూచీల హక్కులు, పోరాటంలోని వాస్తవాలను పాకిస్తాన్‌ ‌గుర్తిస్తే మంచిది.

About Author

By editor

Twitter
Instagram