కర్షకుల రగడ ట్వీట్‌ ‌యుద్ధంగా పరిణమించింది. ఈ దేశ వ్యవహారాలు మీకు అనవసరం అంటూ ట్వీట్ల ద్వారా విదేశీయులను నిలదీయడం కూడా పొరపాటైపోయింది. అందుకు భారతరత్నలను కూడా  మోదీ వ్యతిరేకులు వదలలేదు. మన దేశం మీద ప్రేమతో మాట్లాడిన నేరానికి  గాయని లతా మంగేష్కర్‌, ‌క్రికెటర్‌ ‌సచిన్‌లను ఇప్పుడు బీజేపీ వ్యతిరేకులు బోనులో నిలబెడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, హక్కులు, సెక్యులరిజం, పేదరికం మీద పోరాటం, సంస్కృతి- ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ వేదికల నుంచి బిగ్గరగా వినిపిస్తున్న నినాదాలు. కొన్నిదేశాల, కొన్ని వర్గాల గొంతు వినిపించకుండా చేయడానికీ, వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకూ, అసలు దేశభక్తి అనేది పెద్ద నేరమని దబాయించడానికి  కుట్రదారు లకు ఆ నినాదాలు బాగా ఉపయోగపడుతున్నాయి.  2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన పేరుతో ఢిల్లీలో జరిగిన షాహీన్‌బాగ్‌ ‌తమాషా మాదిరిగానే, ఇప్పుడు అక్కడే రైతుల పేరిట జరుగుతున్న అరాచకం గురించి కూడా ప్రపంచాన్ని మభ్య పెట్టే వ్యూహం  యథేచ్ఛగా సాగుతోంది. ఒక్క ఉదాహరణ చూద్దాం. హస్తినలో రైతాంగం మీద జరిగిపోతున్న సామూహిక హత్యాకాండ మీద మనం స్పందించవద్దా అంటున్నది ఒక పర్యావరణవేత్త. ఆమె చెప్పింది నిజమని ఆఖరికి కమ్యూనిస్టులు కూడా అనలేకపోతున్నారు.  సాగుచట్టాలక• వ్యతి రేకంగా ‘శాంతియుతంగా’ సాగుతున్న ఉద్యమానికి కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతు ఒక కుట్రలో భాగమని రుజువైంది. ఈ మద్దతు వెనుక జార్జ్ ‌సారస్‌ ‌వంటి క్రైస్తవ రాజపోషకుడు నిలబడ్డాడు.  మో ధాలివాల్‌ అనే ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాద మద్దతుదారు ఉన్నాడు.

జార్జ్ ‌సారస్‌, ‌మో ధాలివాల్‌

ఫిబ్రవరి 2వ తేదీన ట్విట్టర్‌లో ఢిల్లీ రైతుల గురించి రాసి మరొకసారి హఠాత్తుగా వార్తలలోకి వచ్చిన పేరు గ్రెటా థన్బర్గ్. ‌స్వీడన్‌ ‌దేశానికి చెందినది గ్రెటా. ‘ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మనం సంఘీభావం ప్రకటించాలి’ అన్నదే ఆ ట్వీట్‌. ‌గ్రెటా అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షకురాలు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించింది. అంతా చప్పట్లు కొట్టారు. పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ ఈమెను కలుసుకుని, భుజం తట్టి కీర్తిని ఇంకాస్త జోడించారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పిలిచి ఈ బాలవాక్కు విని తరిస్తున్నాయి. ఇన్ని వీరతాళ్లు ఉన్నాయి కాబట్టి ఆమె కాకలు తీరిన యోధురాలనో, అనేక ఉద్యమాలు నడిపిన ఉద్యమ కారిణి అనుకుంటే శుద్ధ పొరపాటు. ఈమె వయసు కేవలం 18 సంవత్సరాలు. 15వ ఏట నుంచే ఇలా ప్రపంచ పర్యావరణాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో గగనయానం చేస్తూ క్షణం తీరికలేకుండా ఉంది. కాబట్టి చదువులేదని ఇట్టే చెప్పవచ్చు. ఈమె ఇప్పుడు భారతదేశంలో రైతుల పరిస్థితి గురించీ, వాళ్ల ఉద్యమానికి భూగోళం మీద ఉన్న యావన్మంది జనులు మద్దతు ఇవ్వవలసిన అగత్యం గురించీ సుద్దులు చెబుతున్నది. ఆ ట్వీట్‌తో పాటు మరొక ‘ప్రణాళిక’ కూడా జత చేసేసింది. అదేమిటంటే, సాగు చట్టా రద్దే ధ్యేయంగా డిసెంబర్‌ ‌నుంచి ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న ఉద్యమ పథక రచనకు సంబంధించిన కుట్ర పాఠమది. జనవరి 3 నుంచి కుట్ర ఆరంభ మైంది. మళ్లీ జనవరి 26 వరకు రైతులు ఎలాంటి విధ్వంసం సృష్టించాలి? ప్రభుత్వాన్ని ఎలా రెచ్చ గొట్టాలి? వంటివన్నీ విఫులంగా వివరించే ప్రణాళిక (టూల్‌కిట్‌లో) ఉంది. జనవరి 26న రైతులు మరీ మరీ రెచ్చిపోవాలనీ, దీనితో పోలీసులు లాఠీలకీ, తుపాకులకీ పని చెబుతారనీ, ఆపై ఎలా స్పందిం చాలో కూడా ముందే రాసిపెట్టిన ప్రణాళిక అది. హ్యాష్‌ట్యాగ్‌లు, వాల్‌పోస్టర్లు ఉన్నాయి. ఆ రిపబ్లిక్‌ ‌డే ప్రదర్శనకి వాళ్లు పెట్టిన పేరు ‘గ్లోబల్‌ ‌యాక్షన్‌ ‌డే’ ఆ రోజు రెచ్చిపోవాలనీ, కాల్పులు జరుగు తాయనీ వాటి ఆధారంగా ప్రపంచ దేశాలలో దౌత్య కార్యాలయాల ముందు ధర్ణాలు చేయాలని భావించారని అర్థమైంది. అంటే మొన్న జనవరి 26 నాటి అల్లరంతా ఈ చిన్నారికి ముందే తెలుసునన్న మాట. ఆ తేదీనే ట్రాక్టర్‌ ‌ర్యాలీని నిర్వహిస్తామని రైతులు మంకు పట్టడం ఇందుకే. కానీ నాలుక్కరు చుకున్న ఈ ‘బాలిక’ కొన్ని గంటలలోనే తన ట్వీట్‌ ‌నుంచి దానిని తొలగించింది.

లతా మంగేష్కర్‌, ‌సచిన్‌

బీజేపీ అన్నా, మోదీ అన్నా గంగవెర్రులెత్తిపోయే కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులు, ఒవైసీ వంటివాళ్లు గ్రెటా గురించి డీఎన్‌ఏ ‌పత్రిక తెలియచేసిన కొన్ని అమూల్యమైన వివరాలు తెలుసుకుంటే మంచిది.గ్రెటా 2019లో పర్యావరణం గురించి ఐక్యరాజ్య సమితిలో ఓ ఉపన్యాసం ఇచ్చింది. మానసిక వైకల్యం ఉన్న చిన్నపిల్ల ఏదో మాట్లాడిందిలే అని అప్పుడు చాలామంది ఊరుకోలేదు. ఈ బాలిక మానసిక వ్యాధితో బాధపడుతోంది అని అమెరికా న్యూస్‌ ‌కార్పొరేషన్‌ ‌ఫాక్స్ ‌న్యూస్‌ ‌కాలమిస్ట్ ‌మైఖేల్‌ ‌నోలెస్‌ ‌నిర్మొహ మాటంగా వ్యాఖ్యానించారు. అలాగే, ఈమె తీవ్రమైన కలతకు గురైందని ఆస్ట్రేలియా న్యూస్‌ ‌కార్పొరేషన్‌ ‌కాలమిస్ట్ ఆం‌డ్రూ బోల్ట్ ‌విమర్శించారు.

 ఏస్పర్జర్స్ ‌హైఫంక్షనింగ్‌ ఆటిజమ్‌, అబ్సెసివ్‌ ‌కంపల్సివ్‌ ‌డిజార్డర్‌ (ఓసీడీ) అనే వ్యాధితో గ్రెటా బాధపడేది. ఇందుకోసం 2015లో వైద్యం చేయించు కుంది. చెప్పాలనుకున్నది సరిగ్గా వ్యక్తం చేయలేక పోవడం, నలుగురిలో కలవలేకపోవడం ఆ వ్యాధి లక్షణాలు. ఆమె ఈ లక్షణాలను అధిగమించ గలిగింది. దానితో ఆ వ్యాధికి వైద్యం చేయించు కుంటున్నవారికి ఆదర్శప్రాయంగా చూపారు (ఫిబ్రవరి 5, డీఎన్‌ఏ). ఇదంతా బాగానే ఉంది. ఇంతలో జరిగిందేమిటో కానీ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణిగా రాత్రికి రాత్రికి అవతరించేసింది. ఆ ఏస్పర్జర్స్ (‌సిండ్రోమ్‌) ‌తనలో అసమాన శక్తులు నింపిందని ఆమె భావించడమే చిత్రం. అదేమీ అసమాన శక్తీ కాదు, మరొకటీ కాదు అని చెప్పేవాళ్లంటే ఆ బాలికకి మంట. కొంతమంది అజ్ఞానులు దానిని వ్యాధి అనుకుంటారు, పట్టించు కోకండి అంటోంది. జనవరి 3, 2003న పుట్టిన ఈమె, ఐరాస జనరల్‌ అసెంబ్లీ వేదిక ఎక్కి పర్యావరణ మార్పు కోసం తక్షణ చర్యలు తీసుకునే దమ్ము మీకు లేదా అని ప్రపంచ దేశాలకు సవాలు విసిరింది. ప్రతి అంతర్జాతీయ సదస్సులోను ఈమె ఆ చిలకపలుకులే చెబుతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి చిలకపాత్రనే ఢిల్లీ రైతుల ఉద్యమం గురించి శ్రద్ధగా పలికింది గ్రెటా. ఈ సంగతి బీజేపీ వారో, రైతు ఉద్యమ వ్యతిరేకులో చెప్పడం లేదు. సాక్షాత్తు కాంగ్రెస్‌ ఎం‌పీ, సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్‌ ‌మను సింఘ్వి అభిప్రాయం కూడా ఇదే. ఫిబ్రవరి 4న ఆయన చేసిన ట్వీట్‌లో ఇదే ఉంది.

ఢిల్లీలో రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమానికి బయటివాళ్లు మద్దతు ఇవ్వడం గురించి సింఘ్వి గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రముఖులు దాని గురించి ట్వీట్లు ఇవ్వవలసిన పనేమిటని ప్రశ్నించారు. ఈ ప్రముఖులు రైతు ఉద్యమం గురించీ, దాని లోతుపాతుల గురించీ బాగా తెలుసుకుని ఆ మేరకు అభిప్రాయాలు పెడితే అర్ధం చేసుకోవచ్చు. కానీ గ్రెటా ట్వీట్‌తో పాటు ఒక మాస్టర్‌ ‌డాక్యు మెంట్‌ ‌బయటపడిపోయింది. పైగా ఈ ప్రముఖుల ప్రకటనలన్నీ ఒకే తీరులో ఉన్నాయి అని ట్వీట్‌ ‌చేశారాయన. రిహన్నా, గ్రెటా వంటివారు అనవసర ప్రకట నలు ఇచ్చి, భారత వ్యవహా రాలలో జోక్యం చేసుకోవడం తగదని క్రికెటర్లు రవిశాస్త్రి, సచిన్‌, ‌గాయని లత, నటులు అజయ్‌ ‌దేవ్‌గణ్‌, ‌కంగనా రనౌత్‌, అక్షయ్‌కుమార్‌ ‌వంటివారు హెచ్చరిం చారు. ఇదే ఇప్పుడు నేరమైపోయింది.ఈ ట్వీట్లన్నీ ఒకే విధంగా ఉన్నాయి ఇది కేంద్రం చేయించిన పని అంటున్నారు. రైతుల ఉద్యమాన్ని అవమాన పరచవద్దంటూ లత, సచిన్‌ల మీద పవార్‌ ‌ధ్వజమెత్తారు. రైతుల మీద ప్రేమ పేరుతో ఆయన ప్రదర్శిస్తున్న మోదీ వ్యతిరేకత ఎంతవరకు వెళ్లిదంటే ఆయన కనుసన్నల లోని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన వారి ట్వీట్ల మీద దర్యాప్తు చేయిస్తానంటున్నది. ఇంత నీచత్వం ఏమిటి? భారత రత్నలు, వారు ఈ దేశానికి తెచ్చిన ప్రతిష్ట కూడా పవార్‌ ‌వంటి వాళ్లకి కనిపించడం లేదా? భారత్‌ ‌గురించి కాస్త కూడా తెలియని అజ్ఞానులు ఇచ్చిన ట్వీట్లను ఖండించడమే నేరమా? దేశభక్తిని ప్రదర్శించడం తప్పు అన్న అర్బన్‌ ‌నక్సల్స్ ‌నీచ వ్యూహంలో పవార్‌ ‌వంటివారు కూడా చిక్కుకు న్నారా? లేక ఆయన నిజరూపం కూడా అదేనా?

కేరళ యువజన కాంగ్రెస్‌ ‌నిర్వాకం మరీ జుగుప్సాకరం. బీజేపీ ఆధ్వర్యంలో గోవధ నిషేధ ఉద్యమం జరుగుతుంటే, ఒక ఆవును బాహాటంగా వధించి చూపి తమ నిరసనను తెలియచేసిన ఘనత, దానిని వీడియో తీసి వైరల్‌ ‌చేసిన నీచత్వం వీళ్ల సొంతం. రిహన్నా వగైరాల తిక్క రాతలకు సమాధానం ఇచ్చినందుకు, మా సమస్యలు మేం పరిష్కరించుకుంటాం, మేమంతా ఐక్యంగానే ఉన్నాం అని ట్వీట్‌ ‌చేసినందుకు సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌మీద పరమ వికృతమైన రీతిలో ఆ యువజన కాంగ్రెస్‌ ‌దాడికి దిగింది. సచిన్‌ ‌కటౌట్‌ ‌మీద నల్లటి ఆయిల్‌ ‌పోసి నిరసన ప్రకటించారు. అంతేకాదు, మమ్మల్ని క్షమించు అంటూ టెన్నిస్‌ ‌క్రీడాకారిణి మారియా షరపోవా(రష్యా)ను కోరుతూ వేలాది ట్వీట్లు చేశారు. మధ్యలో ఇదేమిటి? ఏమిటంటే- ఏడేళ్ల క్రితం ఆమె ఒక సమావేశంలో సచినా? ఆయనెవరు అని అడిగినందుకు ఈ కేరళ యువతరమే మారియా బొమ్మకు అవమానం చేశారట. దానికి ఇప్పుడు పరిహారమన్నమాట. ఈ దేశం ఐక్యంగా ఉందనీ, మా సమస్యలు మేం పరిష్కరించు కుంటాం అన్నందుకూ యువజన కాంగ్రెస్‌ ‌స్పందన ఇది. కేరళ మహిళా కాంగ్రెస్‌ ఆ ‌మధ్య మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లకూ, రిహన్నా విడుదల చేసిన ట్వీట్‌ ‌కార్బన్‌ ‌కాపీలా ఉందని పోలీసులు చెబుతు న్నారు. ఒక్క దెబ్బకి కేరళ మహిళా కాంగ్రెస్‌ ‌ట్వీట్‌ ‌మాయమై పోయింది. అన్నట్టు రాహుల్‌ ‌గాంధీ ఆ రాష్ట్రం నుంచే లోక్‌సభకు

రిహన్నా, రాకేశ్‌ ‌తికాయత్‌

ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దేశాన్ని ఇప్పుడు బీజేపీ పాలిస్తూ ఉండి ఉండవచ్చు. అంత మాత్రాన యువ కాంగ్రెస్‌ ఇం‌త జాతి వ్యతిరేకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందా?

రిహన్నా అనే పాప్‌ ‌సింగర్‌ ‌సీఎన్‌ఎన్‌ ‌చానెల్‌లో ప్రసారమైన కథనాన్ని చూసి నేను ఆ రైతులకు మద్దతు ఇస్తున్నాను అని ట్వీట్‌ ‌చేశారు. ఈమె ఎవరో నాకు తెలియదు కానీ, అలా ట్వీట్‌ ‌చేయడాన్ని నేను స్వాగతిస్తాను అన్నారు రైతు నాయకుడు రాకేశ్‌ ‌తికాయత్‌. ‌తికాయత్‌కు తెలుసో లేదో కానీ, ఈమె ఎవరో కొన్ని మన చానెళ్లకు బాగా తెలుసు. అందుకే కొన్ని నిమిషాల పాటు టీఆర్‌పీ రేటు పెంచుకోవ డానికి బాగానే ఉపయోగించుకున్నారు. చిన్న చిన్న చెడ్డీలతో ‘ఉర్రూతలు’ ఊగించే సామర్ధ్యం ఉందామెకు. ఆ దృశ్యాలూ, ఆమె ట్వీట్‌ ‌వార్త జమిలిగా చూపించాయి చానళ్లు. ప్రస్తుతం ఈమె అమెరికాలో పాటతో, ఆటలతో, ఇతరత్రా వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తింది. కానీ ఆఫ్రికా ఖండంలోని ఈమె స్వదేశం బార్బడోస్‌ ‌పేదదేశం. ఈ దేశానికే మోదీ లక్ష కరోనా నిరోధక టీకాలు ఉచితంగా పంపించారు. రిహన్నా మన రైతుల ఉద్యమం గురించి కంటే, ఆమె స్వదేశం పేదరికం గురించి మాట్లాడవలసిన అవసరమే ఎక్కువ. రిహన్నాకు తాము 2.5 మిలియన్‌ ‌డాలర్లు ఇచ్చి అలాంటి ట్వీట్‌ ‌చేయించలేదనీ, మొత్తంగా ఆ ఉద్యమాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలనే భావించా మనీ పొయెటిక్‌ ‌జస్టిస్‌ ‌ఫౌండేషన్‌ (‌పీజేఎఫ్‌) ఒప్పుకుంది. ఈ ట్వీట్‌ల యుద్ధంలో మెరుపులా మెరిసిన ఇంకొక ప్రముఖురాలు ఉంది- మియా ఖలీఫా. ప్రస్తుతం లెబనీస్‌- అమెరికన్‌ ‌మీడియా ప్రముఖురాలు. ఒకప్పుడు నీలిచిత్రాల నటి. అమెరికా కొత్త ప్రభుత్వం సాగుచట్టాలను శ్లాఘించింది. కానీ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ ‌సోదరి కుమార్తె మీనా హ్యారిస్‌ ‌రైతులకు మద్దతు ప్రకటించారు. ఈవిడ కూడా న్యాయవాదే. పైగా రైతులకు మద్దతు అనే మాటకే కట్టుబడి ఉన్నాను. నేను బెదరను, అదరను, భయపడను అని కూడా ప్రకటించింది. ఎవరు బెదిరించారో, భయపెట్టారో మాత్రం ఎవరికీ తెలియదు. ఇదంతా చూస్తుంటే ఈ మధ్య అసాంఘిక ఉద్యమాలకి జాతీయ పతాకాలు, మహిళలు, చిన్నారులని ముందు పెట్టడం, ఉపయోగించుకోవడం ఒక వ్యూహం. నాడు షాహిన్‌బాగ్‌లో అనుసరించినట్టే అదే వ్యూహాన్ని ఇప్పుడు ఢిల్లీ రైతు ఉద్యమంలో కూడా ప్రయోగిస్తున్నారని అంటే తొందరపాటుకాదు కదా! వీళ్ల గురించి ఇప్పటికే చాలా ఎక్కువగా చెప్పుకున్నట్టే.

 ఇలా ఒక్కసారిగా భారతీయ రైతుల మీద అంతర్జాతీయ ప్రముఖులు ప్రేమానురాగాలు ఉప్పొంగడం గురించి వెంటనే అనుమానాలు వచ్చాయి. భారత్‌ను విచ్ఛిన్నం చేయడం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న శక్తులు వీటి వెనుక ఉన్నాయని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్‌ ‌మాలవీయ ఇప్పటికే వ్యాఖ్యానించారు. నిజానికి భారత్‌ను అస్థిరం చేయడానికి చాలా ఉగ్రవాద శక్తులు పనిగట్టుకు పనిచేస్తున్నాయి, తస్మాత్‌ ‌జాగ్రత్త అంటూ చాలామంది ట్వీట్లు చేశారు. చిత్రమేమిటంటే, ఈ రిహన్నా అనే పాప్‌ ‌సింగర్‌ ఒట్టి చవట అంటూ బాలివుడ్‌ ‌నటి కంగనా రనౌత్‌ ‌ట్వీట్‌ ‌చేయడం మాత్రం చాలామందికి నచ్చడం లేదు. ఈమెను సామాజిక మాధ్యమాల నుంచి తక్షణం బహిష్కరించాలని గోల మొదలెట్టారు. భారత రైతుల పేరుతో జరుగుతున్న అరాచకం గురించి తెలియకుండా, అసలు సాగు చట్టాల సంగతే తెలియకుండా గుప్పించిన ఆ ముగ్గురి ట్వీట్లు మాత్రం బీజేపీ వ్యతిరేకులకి మహా మధురంగా ఉన్నాయి.

టూల్‌కిట్‌ (‌గ్రెటా రైతు ఉద్యమ ప్రణాళిక ఇచ్చినది)కూ, కెనడా కేంద్రంగా పనిచేసే సిక్కు ఉగ్రవాదులకు సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే కేసు పెట్టి, ఆ కోణం నుంచి దర్యాప్తు చేయాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అలాగే పీజేఎఫ్‌ (‌పొయెటిక్‌ ‌జస్టిస్‌ ‌ఫౌండేషన్‌) ‌రైతుల ఉద్యమం వెనుక ఉందని పోలీసులు చెబుతున్నారు. దీని వ్యవస్థాపకుడు మో ధాలివాల్‌. ఇతడు నేను ఖలిస్తాన్‌వాదినని స్వయంగా ప్రకటించుకున్నాడు. గ్రెటా టూల్‌కిట్‌లో పెట్టిన డాక్యుమెంట్‌ ‌ధాలివాల్‌దే.

కెనడాలో పుట్టిన ధాలివాల్‌ ‌కూడా సిక్కు మతస్తుడే. రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలోనే జనవరి 26న వైరల్‌ అయిన ఒక వీడియో గురించి కూడా ఢిల్లీ పోలీసులు పరిశోధిస్తున్నారు. కెనడాలోని వాంకోవర్‌ ‌నగరంలో ఉన్న భారత దౌత్యకార్యాలయం దగ్గర ధర్ణాకు దిగిన సిక్కులను ఉద్దేశించి అతడు ఇచ్చిన ఉపన్యాసమే ఆ వీడియో. సాగు చట్టాలు రేపే రద్దు చేస్తే అది విజయం కాదు. ఆ చట్టాల రద్దుతోనే అసలు ఉద్యమం ఆరంభమైనట్టు అంటున్నాడతడు. చట్టాల రద్దుతో మీరంతా ఖలిస్తాన్‌ ఉద్యమానికి దూరమవుతారని ఎవరైనా చెబితే నమ్మవద్దు. మీరంతా ఆ ఉద్యమంలోనే ఉన్నారు అన్నదే, అక్కడ రైతుల విజయమంటే ఖలిస్తాన్‌ ‌విజయం అన్నదే ఆ వీడియో సారాంశం. కశ్మీర్‌ ‌సమస్యను అంతర్జాతీయ వేదికల మీద చర్చించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కూ, ఈ శక్తులకూ ఏమిటి తేడా? ఇలాంటి శక్తులను కూడా సమర్ధించడానికి ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది. అదే విషాదం. నాకు ఐదు కోట్లు ఇస్తే మోదీని అంతం చేస్తానంటాడో పుదుచ్చేరి పిచ్చివాడు. ఇవన్నీ దేనికి నిదర్శనం? కనీసం మేధావులను కుంటున్నవారేనా ఆలోచిస్తున్నారా?

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram