శామ్యూల్‌ ‌పి హంటింగ్టన్‌ ‘‌నాగరికతల మధ్య ఘర్షణలు’ అనే సిద్ధాంతాన్ని చాలామంది నమ్మరు. కానీ 1979 సంవత్సరం నుంచి ఇస్లామిక్‌ ‌దేశాల మధ్య అంతర్గత వైరం నెలకొని ఉంది. అరబ్‌-ఇ‌జ్రాయెల్‌ ‌దేశాల మధ్య నెలకొన్న వివాదం ఇరాన్‌-అరబ్‌ ‌దేశాల మధ్య స్నేహాన్ని పెంచే పరిస్థితులను సంకేతిస్తున్నది. అంతేకాకుండా ఇస్లామిక్‌ ‌ప్రపంచ వ్యవహారాలలో టర్కీ శక్తిమంతమైన పాత్రను పోషిస్తుంది. 1979-89 మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించేందుకు అఫ్గానిస్తాన్‌లో సోవియట్‌ ‌యూనియన్‌ను అమెరికా-సౌదీ-పాకిస్తాన్‌ ఒక్కటై ఓడించాయి. అయితే 1979లో ఇరాన్‌ ‌దేశంలోని ఒకే మతానికి చెందిన వారి మధ్య ఘర్షణ తలెత్తింది. 1989 సంవత్సరం నాటి తదుపరి పరిణామాలు ఇస్లామిక్‌ ‌ప్రపంచానికి మింగుడుపడనంతగా మారాయి. ఒకవైపు మత ఆచరణలో మార్పుతో పాటు ఆధునీకరణ కోసం పట్టు పడుతుంటే, మరోవైపు మత మూలాలను పకడ్బందీగా పాటించేలా చేయాలనే వాదనలు పెరుగుతూ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ ‌విశ్వాసాలను పాదుకొలపాలనీ, ఇస్లామిక్‌ ‌ప్రపంచానికి నాయకత్వం వహించాలన్న ఆలోచనకూ అక్కడే బీజం పడింది. అదే ఇస్లామిక్‌ ‌దేశాల మధ్య అంతర్గత చిచ్చుకు దారితీసింది. ఒకే మతంలోని వేలాది వర్గాలు, ఉపవర్గాల మధ్య సంఘర్షణ మొదలైంది. అవి భౌగోళిక రాజకీయ వివాదాల్లోకి చేరినప్పుడు భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని రేకెత్తించ గలవు. అందుకు పాలస్తీనా-ఇజ్రాయెల్‌, అఫ్గానిస్తాన్‌, ఇరాక్‌, ‌యెమన్‌, ‌లిబియా, సిరియా వంటివి ఉదాహరణ మాత్రమే.

మరోకోణంలో రాజ్యానికి అతీతంగా అల్‌ ‌కాయిదా, ఇస్లామిక్‌ ‌స్టేట్‌, అల్‌ ‌షబాబ్‌, ‌బోకో హరాం వంటి ముస్లిం మతోన్మాద ఉగ్రవాద సంస్థలు నిరంతరం ఉద్భవిస్తూనే ఉన్నాయి. ఇస్లామిక్‌ ‌ప్రపంచం లోని గల్ఫ్ ‌కోఆపరేషన్‌ ‌కౌన్సిల్‌లో భాగమైన అరబ్‌ ‌దేశాలు ఆర్థికంగా ఎంతో బలమైనవి. 57 ఇస్లామిక్‌ ‌దేశాలు సభ్యత్వం కలిగిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కోఆపరేషన్‌ ‌సంస్థకు సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. చెప్పుకోదగ్గ ఐకమత్యం, ముందుచూపు లేకున్నా ఆయా దేశాలు తమ సమస్యలను ఈ సంస్థ ద్వారా పరిష్కరించు కుంటున్నాయి.

గడచిన రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటే, ముఖ్యంగా కొవిడ్‌ ‌మహమ్మారి తరువాత ఇస్లామిక్‌ ‌దేశాల మధ్య వ్యవహారశైలి మారుతూ వస్తోంది. ఆయా దేశాలు, ప్రాంతాల మధ్య జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను విశ్లేషించ డానికి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఎటువంటి వ్యూహాలను ఆయా దేశాలు అనుసరించనున్నాయి అనేవి వాటి మధ్యనున్న బంధాలను నిలబెడతాయా లేదా సంఘర్షణను మరింత పెంచుతాయా అనేది అంచనా వేయడం అనేది ఇప్పటిలో స్పష్టపడక పోవచ్చు.

మధ్య ప్రాచ్య దేశాల్లో గందరగోళమైన పరిస్థితులు తగ్గుతూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల్లో ప్రభావం చూపిన అరబ్‌-ఇ‌జ్రాయెల్‌ ‌సంబంధాలలో మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా సౌదీ అరేబియా-ఇరాన్‌ ‌మధ్య వివాదానికి తెరలు లేస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో శాంతియుత సంబంధాలను ఏర్పరచుకునేందుకు సౌదీ దేశీయులు తమ విధానాలను మార్చు చేసుకుంటున్నారు. కాకపోతే అందుకు సంబంధించిన విధానాలు రూపొందాల్సి ఉంది. మధ్య ప్రాచ్యంలోని చాలా దేశాలకు ఇజ్రాయెల్‌ ‌నేడు శత్రువుగా పరిగణనలో లేదు. చాలా దేశాలు ఇజ్రాయెల్‌తో తమ సంబంధా లను సాధారణ స్థితికి తెచ్చుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. అందుకు అమెరికా కూడా తన వంతు పాత్రను పోషిస్తోంది. సిరియా, లెబనాన్‌ ‌వంటి దేశాలు ఈ విధానాన్ని అవలంబించక పోయినప్పటికీ, మిగిలిన దేశాలు ఇజ్రాయెల్‌తో సత్సబంధాలను ఏర్పరచుకోవడంతో ఆయా దేశాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఖతార్‌ ‌నుంచి అమెరికా సేనల ఉపసంహరణతో కూడా ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో స్థిరత్వానికి దోహదపడే అవకాశం లేకపోలేదు. మధ్య ప్రాచ్య దేశాలతో అమెరికాకు ఇంధన సంబంధిత వివాదాలు కొంత మేర మాత్రమే తగ్గడం గమనార్హం. అది కూడా స్థిరత్వానికి దారి తీసేందుకు దారి ఏర్పరుస్తోంది. చైనా, జపాన్‌, ‌భారత్‌ ‌వంటి దేశాలు తమ దేశాల ప్రగతి కోసం మధ్య ప్రాచ్య దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తాయి. ప్రపంచంలో తన వ్యూహాత్మక ఉనికిని చాటు కునేందుకు, వనరులపై తన పట్టును నిలుపుకునేందుకు అమెరికా మధ్య ప్రాచ్య దేశాల్లోని ప్రాంతాలతో పాటు ఇండో-పసిఫిక్‌ ‌ప్రాంతంపై కన్నేసింది. 1973 సంవత్సరంలో రేకెత్తిన ఇంధన సంబంధిత వివాదాలు మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.

ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఓటమి తరువాత ఉగ్రవాదం చతికిలపడినట్టు కనిపించింది. ఉగ్రవాద సంస్థలు తిరిగి బలాన్ని పుంజుకోవడానికి ఇరాన్‌ ‌వంటి దేశాలు అంతర్గతంగా సహాయం అందించే అవకాశాలున్నాయి. కాకపోతే సంప్రదాయ పద్ధతుల్లో అంతర్గత యుద్ధాలను గెలవడం సాధ్యపడదు. భవిష్యత్తులో అత్యధిక గందరగోళాన్ని రేకెత్తించేందుకు వివిధ దేశాల్లో ప్రజల ఆస్తులు, జనాభా, నాయకత్వాలపై తరచూ దాడులు జరిగే అవకాశం ఉంది. సిరియా అంతర్గత యుద్ధం తరువాత నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థాయికి తెచ్చే క్రమంలో ఇజ్రాయెల్‌ ‌బూచి భావం కూడా తొలగిపోవడానికి దోహదపడనుంది. ముఖ్యంగా ఎవరు ఎవరితో సంఘర్షణ పడుతున్నారో తెలియని తరుణంలో స్థిరమైన పరిస్థితులకు మార్గం కనిపిస్తుంది.

ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో టర్కీ శక్తిమంతమైన పాత్రను పోషించింది. ముఖ్యంగా యూరప్‌ ‌దేశాల పతనంలో దాని పాత్ర స్పష్టంగా కనిపించింది. ముస్తాఫా కెమాల్‌ ఆశయం చెల్లాచెదురు కావడంతో టర్కీ గురి మరింత పెరిగింది. పాకిస్తాన్‌-ఇరాన్‌ ‌దేశాలతో కలసి అరబ్‌ ‌దేశాలకు ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కంట్రీస్‌కు సవాల్‌ ‌విసిరేందుకు సన్నద్ధం అయ్యింది. నాగర్నో-కర్బక్‌ ‌గురించి అర్మేనియాతో యుద్ధం గెలవడానికి అజర్బైజాన్‌కు టర్కీ సహకరించింది. ప్రస్తుతం ఇరాన్‌కు వ్యతిరేకంగా వెళ్లేందుకు, ఇజ్రాయెల్‌, ‌సౌదీ అరేబియాతో స్నేహంగా ఉండేందుకు టర్కీ సంకేతాలను పంపుతోంది. తద్వారా అమెరికా నూతన నాయకత్వానికి వేదికను ఏర్పాటు చేస్తోంది. అమెరికా తమపై విధించిన నిషేధాన్ని తొలగించి నూతన అమెరికా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందనే ఆశతో టర్కీ ఉంది.

ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో తరచూ వస్తున్న అనూహ్యమైన మర్పులు స్పష్టంగా లేకపోయినప్పటికీ వాటి విశ్వసనీయత అమ్మకానికి ఉన్నట్టు సూచనలను ఇస్తున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్‌ ఎప్పటిలాగే సౌదీ దేశాలతో కలిసి వెళ్లాలా.. లేక టర్కీ, ఇరాన్‌ ‌సమూహంతో ఉండాలా అనే సందిగ్ధంలో ఉంది. అమెరికా-సౌదీ దేశాల స్నేహపూర్వక శైలి కారణంగా కశ్మీర్‌ ‌విషయంలో సౌదీ సున్నితంగా వ్యవహరిస్తోంది. కాకపోతే అఫ్గానిస్తాన్‌-‌పాకిస్తాన్‌ ‌మధ్యనున్న వివాదాలు మాత్రం ప్రపంచం దృష్టిలో పడతాయి.

సమీప భవిష్యత్తులో సిద్ధాంతపరమైన విబేధాలకు సౌదీ కేంద్ర బిందువు కానుంది. ఇస్లాంకు చెందిన పవిత్ర క్షేత్రాలన్నీ సౌదీ అరేబియా ఆధీనంలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఇస్లాంకు సంబంధించిన ప్రతి అంశం కూడా అరబిక్‌ ‌భాషతో ముడిపడి ఉంది. ఇస్లామిక్‌ ‌భావనను ఆ భాష ప్రకటిస్తుంది. అది ఇస్లామిక్‌ ‌ప్రపంచంలో నాయకత్వ వివాదానికి దారీ తీయనుంది.

అరబ్‌ ‌మరోసారి పునరుజ్జీవం పొందుతుందా, ఇరాన్‌ ‌తన వివాదాలను ఎలా పరిష్కరించు కుంటుంది, ఉగ్రవాద సంస్థలు తిరిగి బలాన్ని పుంజు కుంటాయా, ఇస్లామిక్‌ ‌ఫోబియా తొలగుతుందా, వలస వచ్చిన వారి పట్ల యూరప్‌ ఎలా వ్యవహ రిస్తుంది అనే అంశాలు భౌగోళిక రాజకీయాల్లో ఇస్లామిక్‌ ‌దేశాల పాత్రను నిర్ణయించనున్నాయి.

– రచయిత సయ్యద్‌ అతా హస్నేన్‌ శ్రీ‌నగర్‌ ‌కేంద్రంగా పని చేసిన మాజీ కమాండర్‌, ‌ప్రస్తుత కశ్మీర్‌ ‌యూనివర్సిటీ ఛాన్సలర్‌.

About Author

By editor

Twitter
Instagram