సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి మార్గశిర బహుళ షష్ఠి

04 జనవరి 2021, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆసక్తికర వార్తల వేటలో కిరాయిమూకల గొంతును ప్రజాభిప్రాయంగా మలచి ప్రపంచాన్ని భ్రమింపజేయడం మీడియా చమక్కు. ప్రజా చైతన్యం మేలుకొన్న వేళ మీడియా చమత్కారాలు చెల్లవని జమ్ముకశ్మీర్‌ ‌పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. రెండోసారి కూడా తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి రావడం, ప్రధానిగా మోదీ మరింత సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం విపక్షాలకు మింగుడు పడడం లేదు. ఇటీవలి వ్యవసాయ చట్టాలు, త్రిపుల్‌ ‌తలాక్‌ ‌నిషేధం, జమ్ముకశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ఇలా ప్రతిదాన్నీ విపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

బీజేపీ, మోదీ పట్ల వ్యతిరేకత ఉన్మాదంగా మారిన ఊపులో వాస్తవాలకు విరుద్ధంగా సైతం ప్రలాపిచడం విపక్ష నేతలకు పరిపాటిగా మారింది. దేశంలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ఆరోపించడం తాజా ఉదాహరణ మాత్రమే. డిసెంబరు 24న రాష్ట్రపతిని ముగ్గురు కాంగ్రెస్‌ ‌ప్రతినిధులు కలుస్తారని అపాయింట్‌మెంట్‌ ‌తీసుకుని దానికి భిన్నంగా ఓ గుపుతో ప్రదర్శనగా రావడాన్ని పోలీసులు అడ్డుకోగానే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించి దేశాన్ని బహిరంగ జైలుగా మార్చిన ఇందిర మనవడికి ఈ సందేహం కలిగే సమయానికి జమ్ముకశ్మీర్‌ ‌చరిత్రలో మొదటిసారిగా జరిగిన డీడీసీ (డిస్ట్రిక్ట్ ‌డెవలప్‌మెంట్‌ ‌కౌన్సిల్‌)‌ల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

నెహ్రూ దయ వల్ల జమ్ముకశ్మీర్‌ ‌రాష్ట్రానికి తొలిపాలకుడిగా పీఠమెక్కిన షేక్‌ అబ్దుల్లా నుండి కాంగ్రెస్‌, ‌దాని మిత్రులతో సహా ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌ ‌పాలకులు ఎవరూ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించనే లేదు. విద్య, వైద్య, విద్యుత్తు, రహదారుల అభివృద్ధి కోసం అక్కడి గ్రామాలు చకోర పక్షుల్లా ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్య భారతంలో ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి వల్ల లభించే ఆర్థిక ప్రయోజనాలు కొద్దిమంది పాలకవర్గాలకు, వారి తాబేదార్లకు కామధేనువు కాగా వేలాది గ్రామాలకు, సామాన్య ప్రజలకు అవి ఎండమావులు కావడం విషాదం.

జమ్ముకశ్మీర్‌ ‌విషయమై భారత రాజ్యాగంలోని 370, 35 ఎ అధికరణాలను రద్దు చేసిన తరువాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్ముకశ్మీర్‌ ‌స్థానిక సంస్థలకు డిసెంబర్‌ ‌చివరిలో ఎన్నికలు జరిగాయి. డీడీసీలు అనే ఈ జిల్లా అభివృద్ధి మండళ్లకు జమ్ముకశ్మీర్‌ ‌చరిత్రలో జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఈ ఎన్నికల్లో కశ్మీరీలు పాల్గొనరని వేర్పాటువాద శక్తుల మద్దతుదార్లతో సహా బీజేపీ, మోదీ వ్యతిరేక రాజకీయ పార్టీలు అన్నీ పిల్లి శాపనార్ధాలు వినిపించాయి. ఆర్టికల్‌ 35 ఎ ‌సహా జమ్ముకశ్మీర్‌ ‌ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ జరిగే వరకు ఎన్నికలలో పాల్గొనబోమని మెహబూబా ముఫ్తీ నాయకత్వలోని పీడీపీ, అబ్దుల్లా కుటుబానికి చెందిన నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌తదితర పార్టీలు ప్రకటించాయి. తీరా ఎన్నికల సమయం ముంచుకు రాగానే ఇలాంటి ఏడు పార్టీలు అన్నీ గుప్కార్‌ ‌కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పాల్గొన్నాయి. వేర్పాటువాదుల, తీవ్రవాదుల అడ్డాగా పేర్కొనే కశ్మీర్‌ ‌లోయతో సహా జమ్ముకశ్మీర్‌ అ‌ంతటా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి ఒత్తిడి, వ్యతిరేకత లేని హైదరాబాద్‌ ‌జిహెచ్‌యంసి ఎన్నికల్లో 47. 48 శాతం ఓట్లు పోలయితే జమ్ముకశ్మీర్లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో 51 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యత స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల నిర్వహణ గురించి ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేక ఆరోపణలు చేయకపోవడం గమనార్హం.

ఆరు జిల్లాల్లో గుప్కార్‌ ‌కూటమి ఆధిక్యం సాధించగా ఐదు జిల్లాల్లో బీజేపీ సొతంగా ఆధిక్యతను సాధించిది. అన్ని జిల్లాల్లో కలిపి పోలైన ఓట్లలో బీజేపీకి 4,87,364 ఓట్లు రాగా యన్‌సిపికి 2,82,574 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,39,382 ఓట్లు, పీడీపీకి 57,789 ఓట్లు వచ్చాయి. దీంతో జమ్ముకశ్మీర్‌ ‌ప్రజలు మోదీ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని, మెజారిటీ ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని స్పష్టమైంది.

రాజకీయ పార్టీల గెలుపు ఓటములకు మించి ఈ ఎన్నికలు ప్రపంచానికి కొన్ని ముఖ్యాంశాలను వెల్లడించాయి. జమ్ముకశ్మీర్‌ ‌విషయమై మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టిందని, కశ్మీరీలు దాన్ని ఆమోదించరని, పాకిస్తాన్‌ ‌చిలుక పలుకులను వల్లె వేసిన రాజకీయ పార్టీలు, వాటికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించిన మీడియా బండారం బయటపడింది. వేర్పాటువాదులకు, విదేశీ శక్తులకు వత్తాసు పలికే రాజకీయ పార్టీల వెంట ప్రజలు లేరని, అసలైన ప్రజాభిప్రాయాన్ని పసిగట్టి ప్రపంచానికి వెల్లడించడంలో మీడియా విఫలమైందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. తప్పుదోవ పట్టిన కిరాయిమూకలకు బాకా ఊదడం మాని నికార్సయిన ప్రజాగొంతుకను ప్రతిఫలిచి మీడియా విశ్వసనీయతను కాపాడుకుటుదని ఆశిద్దా!

About Author

By editor

Twitter
Instagram