జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి కార్తీక శుద్ధ నవమి – 23 నవంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


కరోనా విపత్తును ఎదిరించడంలో మన దేశ ప్రజలు అద్భుతమైన సమైక్యత, సమన్వయం, సహకారం ప్రదర్శించారు. భారత స్వాతంత్య్ర సమర చరిత్ర తెలిసిన వారికి కరోనా వ్యతిరేక పోరాటం మరో స్వాతంత్య్ర సమరాన్ని స్ఫురింప జేస్తున్నది. నాడు దేశ ప్రజలు ఆగ్లేయులకు వ్యతిరేంకంగా పోరాడితే నేడు కరోనాకు వ్యతిరేకంగా పోరాడారు.

స్వాతంత్య్ర సమరం జరిగే రోజుల్లో సామాన్యుల నుండి జాతీయ స్థాయి నేతల వరకూ అందరిదీ ఒకే లక్ష్యం, ఒకటే ఆలోచన. పర పాలకులైన బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టాలి. భరతజాతిని బానిసత్వం నుండి విముక్తం చేసి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో ముందుకు నడిపించాలి. పదాలు కాస్త అటూ ఇటుగా ఉన్నా గాంధీ నుండి గాడ్సే దాకా, జిన్నా నుండి జవహర్‌లాల్‌ ‌నెహ్రూ దాకా రాజగోపాలాచారి నుండి రాజేద్ర ప్రసాద్‌ ‌దాకా, ప్రకాశం పంతులు నుండి పటేల్‌ ‌దాకా అందరి ఆలోచన ఇలాగే ఉండేది. స్వాతంత్య్ర సమరం ముమ్మరంగా సాగుతున్న1920ల నాటికి వైద్య విద్యలో పట్టా పుచ్చుకు వచ్చిన డా.కేశవరావు బలీరామ్‌ ‌హెడ్గెవార్‌ ‌కూడా గాంధీజీ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్లారు. విడుదలై వచ్చాక జైలు అనుభ వాలతో ఆయన ఆలోచనలు మారిపోయాయి. విభిన్న మతాల, కులాలకు చెందిన ప్రజలు ఉమ్మడి శత్రువైన ఆంగ్ల పాలకులకు వ్యతిరేకంగా పోరాడ్డానికి ఒకే జాతి భావనతో సమైక్యంగా నిలిచారు. బ్రిటిష్‌ ‌వారు వెళ్లిపోయాక ఈ ప్రజలు జాతీయ భావనతో ఒకే జాతిగా నిలబడి ఐకమత్యంతో పురోగమిస్తారా అని డాక్టర్జీ తర్కించారు.

చరిత్రను సింహావలోకనం చేస్తే అనైక్యత కారణంగానే ఈ జాతి గతంలో పరాజిత అయింది. ఇప్పటి ఐక్యత శత్రువు పట్ల వ్యతిరేకతతో ఏర్పడినదే కాని మనం స్వతఃసిద్ధంగా ఒక జాతి కనుక ఐకమత్యంతో మెలగాలి అన్న భావనతో సమకూడినది కాదు. కనుక ఉమ్మడి శత్రువు నిష్క్రమించగానే మనం మళ్లీ విడిపోవడం, బలహీనపడడం జరగొచ్చు. అందువల్ల ఈ డొల్లతనపు సమైక్యత కన్నా అసలైన జాతీయ భావనతో కూడిన ఐకమత్య అవసరం అని భావించి డాక్టర్జీ 1925లో విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ను స్థాపిచారు. స్వాతంత్య్ర పోరాటం ఫలించి ఆగ్లేయులు వైదొలగక ముందే హిందువులు, ముస్లిములు వేరు వేరనే ద్విజాతి సిద్ధాతం ప్రబలింది. దేశ విభజన జరగడంతో డాక్టర్జీ అంచనాలు అక్షర సత్యాలు కావడం చరిత్ర. అలాంటి విచ్ఛిన్నకర దోరణులు తలెత్తడం నేటికీ చూస్తునే ఉన్నా.ఈ అనుభవాల నేపథ్యలో కరోనా తరువాత మన వైఖరి గురించి సందేహాలు పొడసూపుతున్నాయి.

 స్వాతంత్య్ర సమరంలో మాదిరే కరోనా వ్యతిరేక పోరాటంలో కూడా కమ్యూనిష్టులైనా, కాంగ్రెస్‌ అయినా ఒకే విధంగా స్పందించారు. నిర్దిష్ట సమయంలో దీపాలు వెలిగించమని, గంటలు కొట్టమని ప్రధాని మోదీ పిలుపునిస్తే అంతా పాటించారు. ఆరోగ్యవంతమైన జీవన సరళితో మాత్రమే కరోనాను ఎదుర్కోగలం అని అందరూ అంగీకరించారు. పరిశుభ్రత, సామాజిక ఎడం పాంటించడం, తగినంత బలవర్థక ఆహారాన్ని నియమబద్ధంగా తీసుకోవడాన్ని అందరూ అలవాటు చేసుకొన్నారు. కరోనాకు అలోపతిలో స్పష్టమైన మందు లేనప్పుడు ఆసుపత్రికి వెళ్లి పడుకోవడం కన్నా ఇంట్లో పడుకుని మిరియాల చారు, శొఠి కషాయం తాగడం మేలని భావించి ఇట్లోనే ఉండి కొందరు కోలుకున్నారు. వారి అనుభవాలు కరోనా వ్యతిరేక పరిశోధనలకు ఊతమిచ్చాయి. భారతీయుల ఆహారపు అలవాట్లు, వంట దినుసులు ఇలా మానవుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పలు అంశాల చుట్టూ వైద్య ఆరోగ్య నిపుణుల, శాస్త్రవేత్తల పరిశీలన, విశ్లేషణలు సాగాయి. ఆయుర్వేద, ప్రకృతి చికిత్సాలయాల్లో జరిగిన వైద్యంలో భారతీయ వంటింటి దినుసులను వాడి కరోనా చికిత్స ఫలప్రదమైంది. ఓ వైపు కరోనాకు వ్యాక్సిన్‌ ‌కనుగొనే ప్రయత్నాలు జరుగుతుడగానే భారతీయులు సాధిచిన విజయాలపైన, ముఖ్యగా భారత్‌లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి గల కారణాలపైన కూడా విశ్లేషణ సాగింది. తరతరాలుగా భారతీయులు సాగిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు వంట దినుసుల కారణంగా భారతీయుల్లో రోగ నిరోధక శక్తి అధికమై అది కొనసాగి, ఈతరపు భారతీయులు కరోనా దాడిని తట్టుకు నిలబడ్డారని పలువురు నిర్థారించారు.

కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా మనం పాశ్చాత్య శైలికి చెందిన ఆలింగనాలు మానేసి, ఆప్యాయతతో పలకరించడం, కర చాలనం మానేసి రెండు చేతులతో నమస్కరిచడం వంటి భారతీయ మర్యాదలను పునరుద్ధరించుకున్నా. నేడు ప్రపంచం అంతా అలవర్చు కుంటున్న ఈ భారతీయ జీవన శైలిని కరోనా అంతమయ్యాక కూడా కొనసాగిస్తామా లేదా! జాతీయ ప్రాధాన్యత గల అశాల్లో సహకారం, సమన్వయం కొనసాగిస్తామా లేదా అనే అంశాల పైనే భారత జాతి ఆరోగ్య, భవిష్యత్తు నిర్ణయం కాగలదు. కరోనా విపత్తు సంభవిచిన కాలంలో మనలో పెల్లుబికిన సహకారం, సమన్వయం, ఆరోగ్యప్రదమైన జీవనశైలికి చెందిన అలవాట్లు, ఆహార నియమాలను కొనసాగిద్దాం. సంపూర్ణ ఆరోగ్యశక్తిగా భారతజాతిని తీర్చు దిద్దుకొదాం!

About Author

By editor

Twitter
Instagram