ఆరఎసఎస్ స్వయంసేవక్‌గా శ్రీ అశోక్ సింఘాల్‌జీ సేవలందించారు. జీవితంలో చివరి శ్వాస వరకు అదే సేవాభావనకు కట్టుబడి ఉన్నారు. సింఘాల్‌జీ జీవన ప్రస్థానం ఆసాంతం పరిశీలించినప్పుడు నింగి, నేల, నీరు మÖడింట అపారమైన ఖ్యాతిని గడిస్తావు అని భగవంతుడు ఆయన నుదుటిపైన రాసి భూమిపైకి పంపించాడేమో అని అనిపిస్తుంది. అశోక్‌జీకి వారి అమ్మగారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఏడుగురు సోదరుల్లో ఆయన ఒకరు. ఒకసారి వారి నాన్నగారు అనారోగ్యానికి గురి అయ్యారు. నాన్నగారి బాగోగులు చూసుకోవాలని అశోక్‌జీని అమ్మగారు కోరారు. అందుకు నాకు ఆరఎసఎస్ సేవాపనులు ఉన్నాయి. నా బదులుగా నాన్నగారి బాగోగులను తమ్ముడ్ని చూసుకోమను అని అమ్మగారితో ఆయన అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు నాకు చెప్పినదాని ప్రకారం ఆ మాట విన్న వెంటనే ఆయన అమ్మగారు ఒక కత్తితో తన బొటనవేలిపై గాటు పెట్టుకున్నారు. అశోక్‌జీ నుదుటన నెత్తుటి తిలకం దిద్దారు. వెళ్లు.. సంఘ పని చూసుకో.. అని ఆశీర్వదించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మైనింగ్, మెటలర్జీలో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మట్టి నుంచి ధాతువులను వెలికితీయడానికి బట్టి(కొలిమి)లో ఇంధనాన్ని ఆయన మండించాల్సి వచ్చేది. ఆ సందర్భంగా ఆయనను ఒక కల వచ్చింది. ఆ కýలో తాను ఇంధనానికి uదులుగా హిందూ ధార్మిక గ్రంథాన్ని మండిస్తున్న వైనం కనిపించింది. వెంటనే ఆయన నిద్ర నుంచి దిగ్గున లేచి కూర్చున్నారు. దీనికోసమేనా నేను చదువుతున్నది అని తనను తాను ప్రశ్నించుకున్నారు. చదువు మానేసి ఇంటికి వచ్చేశారు. అయితే ఇంట్లో అతిథులుగా ఉన్న సాధువుల్లో ఒక కేరళ సాధువు అలా అర్థంతరంగా చదువును వదిలేసి రావడం మంచిది కాదు. చదువును పూర్తి చేసిన తర్వాత నీకు నచ్చిన మార్గంలో నడువు అని సింఘాల్‌జీకి హితబోధ చేశారు. సాధువు ప్రేరణతో ఆయన తిరిగి చదువు బాట పట్టారు. భగవంతుని ఆజ్ఞ కారణంగానే కావచ్చు, 1950లో ఇంజినీరింగ్ చదువును పూర్తి చేసిన తర్వాత ఆయన ఇంటికి తిరిగి రాకుండా ఆరఎసఎస్ కార్యక్రమాల వైపు సాగారు. 1950 నుంచి 1981 వరకు ఆరఎసఎస్ పనుల్లో నిమగ్నమైపోయారు. 1982లో విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) పనుల కోసం ఆయన నియుక్తులయ్యారు. నేడు లక్షలాదిగా యువకులు వీహెచ్‌పీలో పనిచేస్తున్నారంటే దాని వెనుక ప్రేరణగా అశోక్‌జీ ఉన్నారు. 1994లో ఆయన పిలుపు మేరకు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు లక్ష మందికిపైగా యువకులు హాజరయ్యారు. ఆ సందర్భంగా గో రక్షణ సందేశాన్ని వారికి ఆయన ఇచ్చారు. మాననీయ రజ్జుభయ్యా కారణంగా రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు అనాయసంగా వచ్చింది. ఎలాంటి ప్రయత్నం లేకుండానే అలాంటి ఒక మహత్తరమైన అవకాశం ఆయనకు లభించింది. స్వయంగా భగవంతుడే ఆయనకు ఆ పనిని అప్పగించాడు. అప్పట్లో తనకు అందివచ్చిన మాధ్యమాల ద్వారా హిందూసమాజాన్ని ఏకీకృతం చేశారు. హిందువులను సమీకరించారు. దేశంలో మÖడు లక్షల గ్రామాలను కదిలించారు. ఆ క్రమంలో ఆరంభం నుంచి ఒక మాటను ఆయన చెబుతూ వచ్చారు. మందిరాన్ని నిర్మిస్తాం.. మరెవ్వరూ కూల్చలేనంతగా, వెయ్యి సంవత్సరాల వరకు పటిష్టంగా ఉండే మందిరాన్ని నిర్మిస్తాం అని ధీమాగా చెబుతుండేవారు. నేడు ఆయన వాక్కు ఫలించింది. వెయ్యి సంవత్సరాల పాటు మనగలిగే పునాదితో వెయ్యేళ్లపాటు నిలిచిపోయే భవ్యమైన రామ మందిరం ఆయన ప్రేరణతో మన కనుల ముందు సాక్షాత్కరించింది. 1987లో పరమపూజనీయ సర్‌సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ ప్రేరణతోశాంతిని నెలకొల్పే దిశగా అశోక్ సింఘాల్‌జీ పంజాబ్ యాత్ర చేపట్టారు. ఆయన నిత్యం సామాజిక సమరసత గురించి ఆలోచించేవారు. నవంబర్ 9, 1989న రామజన్మభూమి శిలాన్యాస్ జరిగింది. బిహార్ వీహెచ్‌పీ సంఘటనా మంత్రి, ఎస్సీ వర్గానికి చెందిన కామేశ్వర్ చౌపాల్‌తో శిలాన్యాస్ చేయించారు. ఉత్తర భారతదేశంలో ఆరు ప్రాంతాలలో అశోక్‌జీ ప్రేరణతో హిందూ`బౌద్ధ సమ్మేళనాలు జరిగాయి.1994 నుంచి ఉత్తరభారతదేశంలో వేదాల కంఠస్థీకరణ, శృతిపరంపరకు ఆయన నాంది పలికారు. దీనిలో అశోక్‌జీకి బాసటగా గోవింద్ దేవ్ గిరిజీ నిలిచారు. గోవులు, మఠాలు, మందిరాల రక్షణకు ఆయన పాటుపడ్డారు. పంజాబ్‌లో సద్భావన యాత్ర, ప్రపంచంలో అజేయశక్తిగా అవత రించడంలో హిందూ`బౌద్ధ ఐక్యతకు, ఊతమిచ్చారు. అశోక్‌జీ జీవనం, వారు చేపట్టిన కార్యక్రమాల పట్ల సమాజంలో అవగాహన కలిగించే దిశగా వారి జన్మ శతాబ్ది వేడుకలను నిర్వహించాలని వీహెచ్‌పీ నిర్ణయించింది.


“దేశవ్యాప్తంగా అశోక్ సింఘాల్‌జీ శతాబ్ది వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వారి లక్ష్య సాధనలో అసంపూర్ణంగా మిగిలి ఉన్న దానిని పూర్తి చేయడంపైన దృష్టి పెడదాం. ప్రపంచంలో ప్రతి 750 సంవత్సరాలకు ఒకసారి మతాల మధ్య, సంప్రదాయాల మధ్య గందరగోళం చోటు చేసు కుంటుంది. ప్రతి 2,000 నుంచి 3,000 సంవత్స రాలకు ఒకసారి ప్రకృతి లో మార్పు చోటు చేసు కుంటుంది. అలాంటి ఒక సంధికాలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆరఎసఎస్ అనేది లేనిపక్షంలో మనమంతా బాప్టిజం స్వీకరించి ఉండేవారం. యావత్ ప్రపంచంలో మానవాళికి ఆచార, వ్యవహారాలలో దిశానిర్దేశం చేసేదిగా హిందూ ధర్మం ఉంది. వారు వీరు అని లేకుండా అందరికీ అనువైన ఒక జీవన విధానాన్ని అందిస్తుంది. మానవులుగా మనం విజ్ఞానాన్ని పెంచుకున్నాం. సరికొత్త సాంకేతికతలను అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి దానికి కృత్రిమ మేధ(ఏఐ)పైన ఆధారపడే పరిస్థితికి చేరు కుంటున్నాం. ఏఐ ఎంతకాలం ఉంటుందనేది మనకు తెలియదు. కానీ మనలను అన్ని విధాలుగా ఆదుకునే హిందూ ధర్మం చిరంజీవిగా వర్థిల్లుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో నాలుగు వ్యవస్థలు అగమ్యగోచరంగా ఉన్నాయి. అవి విద్యావ్యవస్థ, వైద్య, ఆరోగ్య వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఈ నాలుగూ పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేయకుండా మనం సాంకేతికంగా ఎంత ముందుకు పోయినప్పటికీ మానవాళికి ఒరిగేది ఏమీ ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సాంకేతికంగా చోటు చేసుకుంటున్న అభివృద్ధి చింతపండును తీసుకొనివెళ్లి బావిలో పిండినట్టు అవుతుంది. అశోక్ సింఘాల్‌జీతో నాకు అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది. వారితో అనేక పర్యాయాలు మాట్లాడాను. ఢిల్లీ, తిరుపతి లాంటి చోట్ల మేమిద్దరం ఒకే గదిలో నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూలిపోయిన సమయంలో నేను అక్కడే ఉన్నాను. అంతా గందరగోళం. నాకు ఏర్పాటు చేసిన అంగరక్షకులు కనిపించకుండా పోయారు. అప్పుడు సింఘాల్‌జీ చేతిని నేను పట్టుకున్నాను. జరిగేది ఏదో జరిగి తీరుతుంది. ఆందోళన చెందవద్దు అని ఆయన నాకు ధైర్యం చెప్పారు. దేవాలయాలు, మఠాలు, గోవుల పరిరక్షణకు తోడు సామాజిక సమరసతకు అండగా అశోక్ సింఘాల్‌జీ నిలిచారు.”

– శ్రీశ్రీశ్రీ సంగ్రామ్ మహరాజ్, సమర్థ రామదాస్ పీఠం, హనుమాన్ దీక్షాపీఠం


“ఎవరైతే భారతదేశానికి ఆత్మ అయిన స్వామి వివేకానంద ప్రబోధాలకు ప్రభావితులై, జాతి జీవన పునర్ నిర్మాణానికి కృషి చేశారో అలాంటివారందరికీ పరస్పరం అవినాభావ సంబంధం ఉంటుంది. అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఇప్పటి మన అశోక్ సింఘాల్‌జీలను చూసి నప్పుడు మన అంతరాత్మలో నిలిచిపోయిన వారి సందేశం మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ దేశాన్ని పునర్ నిర్మించుకోవాలనే వారికి వెన్నెముక, గుండె తరహాలో రెండు ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. త్యాగం, సేవ అనేవి భారత్ పునర్ నిర్మాణానికి ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఈ రెండు లక్షణాలను అశోక్‌జీ స్వీకరించారు. వారి జీవన పర్యంతం పాటించారు. వారు సన్యాసి లేదా యతీశ్వరుడు లేదా ప్రచారక్ అనేది వారికే తెలుసు. ఆధ్యాత్మిక జీవితానికి తొలి మెట్టుగా త్యాగం ఉంటుంది. దానిని పోతపోసుకున్న మానవరూపంగా అశోక్‌సింఘాల్ మనకు కనిపించారు. ఈ సందర్భంగా వర్తమాన భారతదేశంలో సగటు హిందువు ఆలోచనా విధానం ఎలా ఉందనేదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లక్షలాదిగా హిందు ఆడ బిడ్డలు ముస్లింలకు బలి అయిపోతున్నారు. అయినప్పటికీ మనకు హృదయం రగిలిపోవడం లేదు. ఈ రోజు అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామమందిర నిర్మాణం జరిగింది. ఎందుకు జరిగింది అంటే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో కొన్ని వేలమంది మందిర నిర్మాణం జరిగేంతవరకు పగిడిని, పాదరక్షలను ధరించేది లేదని, ఆహారం తీసుకునేది లేదని ప్రతినబూనారు కాబట్టి. వారి త్యాగాల ఫలితంగా రామమందిర నిర్మాణం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. కట్టూ బొట్టూ సహా హిందూ సంస్కృతీ సంప్రదాయాలను , ఆచార, వ్యవహారాలను కాపాడుకోవాలి. అలా చేసినప్పుడే అశోక్ సింఘాల్‌జీకి నిజమైన నివాళి అవుతుంది.”

– శ్రీశ్రీశ్రీ దుర్గానందపురి స్వామీజీ, మాతా అన్నపూర్ణేశ్వరి కాశీవిశ్వనాథ పీఠం


“ఆరఎసఎస్ ప్రచారక్‌గా ఉన్న అశోక్ సింఘాల్‌జీ విశ్వహిందూపరిషత్(వీహెచ్‌పీ) బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఒక మద్యమ నిర్మాణం జరిగింది. అందరిని ఏకం చేసే ఒక ప్రయత్నం జరిగింది. రామజన్మభూమిని కాపాడు కుంటేనే మన జన్మభూమిని కాపాడుకోగలం. ఆ క్రమంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. వీట న్నింటికి ఆధారంగా అశోక్‌జీ నిలిచారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినప్పటికీ వారు చూపిన మార్గం  మన ముందు ఉంది. యావత్ భారతదేశం రామజన్మభూమి అనే భావనతో ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా అశోక్‌జీ జన్మ శతాబ్ది వేడుకలను ఏడాది పాటు జరుపుకుందాం.”

– ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు విభాగం పూర్వ శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.