దేశాన్ని కాపాడేది సైనికులు, సైనిక వ్యవస్థ. అలాగే కనిపించని కొన్ని వ్యవస్థలు, వ్యక్తులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేసి తమ ఉనికి కూడా చరిత్రలో లేకుండా పోరాడిన ఎందరో స్మరణీయులున్నారు.
ఈనాటి సినిమాల్లో దురంధర్ లాంటి హీరోలను చూస్తున్నాం. శత్రు దేశాల్లోకి దూసుకెళ్లి, కనిపించకుండా తిరిగి, తెలివితోనే దెబ్బతీసి, దేశాన్ని కాపాడుతున్నట్టు, ఆ థ్రిల్, ఆ సెస్పెన్స్, ఆ తెలియని ధైర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. కానీ ఆ సినిమా హీరోలకు పునాదివేసిన గొప్ప మనిషి “రామేశ్వర్‌నాథ్ కౌ” ఆయన రాజకీయ నాయకుడు కాదు, యుద్ధరంగంలో తుపాకీ పట్టిన సైనికుడు కాదు. కాని ఆయన తెలివి, ఆయన ప్రణాళిక దేశ భవిష్యత్తును మార్చేశాయి. ఆయన వల్లనే రిసెర్చ్ అండ్ ఎనాలసిస్‌వింగ్ (R&AW) అనే భారత విదేశీ గూఢాచారి సంస్థను నిర్మించిన అసలైన శిల్పి.
1962లో చైనా యుద్ధం, 1965లో పాకిస్తాన్ యుద్ధం భారతదేశానికి ఒక చేదు నిజం తెలిపింది. బలమైన గూఢచారి వ్యవస్థ లేకపోతే దేశం ఎదురుదెబ్బలు తినాల్సిందే కాబట్టి అప్పటి ప్రభుత్వం ఈ పనిని ఆర్.ఎన్.కౌ కి అప్పగించింది. ఆయన 1968లో ‘రా’ అనే సంస్థను స్థాపించాడు. భారతదేశం ప్రపంచ వేదికపై కన్పించని బలంగా మారిన క్షణం, 1971 బాంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ‘రా’ పాత్ర ప్రత్యేకం, 93,000 మంది పాకìస్తాన్ సైనికుల లొంగుబాటు. ‘రియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ ఇన్ సైలెన్స్.’ శత్రుదేశాల వ్యూహాలను పసిగట్టడం. విదేశీ రాజకీయ పరిణామాలను ముందే అణచివేయడం, ఇవన్నీ ఆయన నిర్మించిన వ్యవస్థవల్లే సాధ్యపడ్డాయి. దేశం కోసం పనిచేసిన రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో ఉంటారు, సైనికులు యుద్ధ గాథల్లో ఉంటారు. దేశాన్ని కనిపించకుండా కాపాడిన గూఢచారులు మాత్రం కదిలే కాలంలో కలిసిపోతారు. ఆ గూఢచారుల్లో అత్యున్నత స్థానం ఆర్.ఎన్.కౌ ది. ఆయన ఎప్ప్పుడూ పేరు కోసం పని చేయలేదు. పతకాల కోసం జీవించలేదు. దేశం సురక్షితంగా ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో జీవించారు. భారత ఇంటిలిజెన్స్‌నేత అజిత్ దోవల్ గోల్డెన్ టెంపుల్‌లోకి ఐ.ఎస్.ఐ.ఏజెంటుగా దూసుకెళ్ళి, మిలిటెంట్ల మధ్య జీవించి ముఖ్య సమాచారం సేకరించి ఆపరేషన్ బ్లాక్ ధండర్‌కు పునాది వేశారు. పాకిస్థాన్‌లో సంవత్సరాల తరబడి రహస్యంగా ఉండి శత్రు భూమిలో భారత్‌కోసం పనిచేశారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన, రహస్య గూఢాచార సంస్థలు మొసాద్ (ఇజ్రాయిల్), సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (అమెరికా), ‘రా’ (భారతదేశం), ఎమ్.16 రైపిల్ (బ్రిటన్), ఎఫ్.ఎస్.బి.`ఫె˜డరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (రష్యా), ఐ.ఎస్.ఐ.`ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (పాకిస్తాన్), ఎమ్.ఎస్.ఎస్.` మినిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటీ (చైనా) ఇలా ఎన్నో గూఢచార సంస్థలు పని చేస్తున్నాయి.
చాలాకాలం క్రితం పుదుక్కొట్టైలో దొరికిన తాళపత్రాల ఆధారంగా అతి కష్టంమీద ఈ రాయవాచకాన్ని జనంలోనికి తీసుకొచ్చారు. రాయవాచకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాయలకాలం నాటి వ్యావహారిక భాషలో ఉన్న ఏకైక పుస్తకం, ఈ పుస్తకసారాంశమేమిటంటే విశ్వనాథ్ నాయకునికి సమర్పించిన నివేదిక. ఇది శ్రీకృష్ణ రాయల పట్టాభిషేకంతో మొదలై కళింగరాజుపై దండ యాత్ర ఘట్టంతో ముగుస్తుంది. కృష్ణరాయల నిత్యకృత్య వివరణ ఇలా చెపుతాడు` “రాత్రి కొలువు తీరిన తరువాత నగరు శోధనకు విచ్చేసి సకల కార్యములున్నూ తెలుసుకున్నాక… తాము రాత్రి నగర శోధనకు బయలు మెరశిన వేళ గనుకొన్న కార్యములు, విన్న కార్యములన్నియు మనసున దెచ్చుకొని’ ఇలా సాగుతుంది. దీనిలో మనకు కావలసిన అంశం ఏమంటే “నగరశోధన” చేసేవారు. వేగులు (గూఢచారులు) సమాచారాన్ని ఎప్పటికప్ప్పుడు చక్రవర్తికి నివేదించేవారు.
లోకవార్తలు తెచ్చుటకు వేగర్లను నియమించుట (పే`20) తెలుగు చారిత్రక గ్రంథమైన రాయవాచకంలో తలారి జంగయ్య ప్రస్తావన విజయనగర సామ్రాజ్య రాజధాని రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, కృష్ణదేవరాయల ప్రజా చారుత్వానికి (రహస్య నిఘా) ఒక ఆసక్తికరమైన ఘట్టం. తలారి జంగయ్య విజయనగర పట్టణానికి ప్రధాన కాపలాదారుడు లేదా నగర రక్షకుడు (తలారి అంటే ఆ కాలంలో పోలీసు అధికారి లేదా కాపలాదారు) పట్టణంలో రాత్రింబవళ్లు జరిగే శాంతిభద్రతలను పర్యవేక్షించడం ఇతని భాద్యత.
ఒకసారి నగరంలో రాత్రివేళ జరిగిన కొన్ని సంఘటనలను సరిగ్గా గమనించ నందుకు శ్రీకృష్ణదేవరాయలు జంగయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. “మేము రాజ్య పరిపాలన చేసేది, నువ్వు తలారికం చేసేది ఎందుకు?” అని రాయలవారు మందలించారు. రాయల వారి కోపానికి భయపడిన తలారి జంగయ్య ఆ రాత్రి నుండి అన్నపానీయాలు, నిద్రమాని, వీధుల్లో తన మనుష్యులను (కావలి కట్లవారిని) ఉంచి క్షణక్షణం నగరంలో జరిగే వార్తలను కనిపెడుతూ ఉంటాడు.
శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా లీలావతారంగా (రహస్య వేషంలో) రాత్రి వేళల్లో నగరశోధనకు (ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవడానికి) బయలు దేరుతారు. రాయలవారు నగరశోధన ముగించుకుని తిరిగి కోటలో ప్రవేశించే సమయంలో హజారము (సింహద్వారం) వద్ద కాచుకుని ఉన్న తలారి జంగయ్య రాయల వారిని కలుసుకుంటాడు. అప్ప్పుడు రాయలవారు “మేము నిత్యకృత్యంగా నగరశోధనకు వస్తూ ఉంటాము. నువ్వు, నీతో ఉన్న నీతిగల సేవకులు మాకు ఎక్కడా దూరాన కూడా కనిపించకుండా, (అంటే రహస్య పర్యటనకు భంగం కలగకుండా, కానీ నగర రక్షణకు లోటు రాకుండా) మీ విధులు నిర్వర్తించండి” అని ఆదేశిస్తారు. ఆనాటి నుండి జంగయ్య మరింత భయభక్తులతో రాయలవారు నగరశోధన చేసి తిరిగి కోటలో ప్రవేశించేవరకు వీధివీధులూ తిరుగుతూ పట్టణాన్ని కాపాడుతుంటారు. మరుసటిరోజు ఉదయం కొలువులో రాయలవారు అడిగినప్ప్పుడు రాత్రి నగరంలో జరిగిన విశేషాలన్నీ జంగయ్య విన్నవించేవాడు.
“రాయ వాచకం” గ్రంథóŠం ప్రకారం విజయనగర రాజ్యంలో నిఘా వ్యవస్థ అత్యంత శక్తిమంతంగానూ శాస్త్రీయంగానూ నడిచేది. నిఘా వ్యవస్థను రెండు రకాలుగా విభజించారు. ఒకటి “నగర నిఘా”, రెండు రాజ్య / పరరాజ్య నిఘా (శత్రు రాజుల కదలికలను కనిపెట్టడానికి).
రాయల వారివేగులు సన్యాసులుగా, జంగాలు, జోగులు, వర్తకులు, బైరాగులు, యాచకులు, పిచ్చివారు, సమయాన్నిబట్టి వారు వేషధారణ ఉండేది. శత్రు దుర్గాలలో ప్రవేశించి అక్కడి సైనిక బలాన్ని రహస్యాలను సేకరించేవారు. వేగుల సమాచారంపైనే గాక శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా రాత్రివేళల్లో సామాన్యుడి వేషంలో నగర వీధుల్లో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను, అధికారుల ప్రవర్తనను తెలుసుకునేవారు అని రాయవాచకం స్పష్టం చేస్తున్నది. పొరుగున ఉన్న బహమనీ సుల్తానులు, గజపతులు, ఇతర సామంతరాజుల సభలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి “కమ్మలు” (రహస్య లేఖలు) మోసుకు వెళ్లే వేగవంతమైన దూతలు ఉండేవారు. వారిలో కమలనాభయ్య, వాయువేగ హనుమంతయ్య, మనోవేగి పురిషయ్య, కరుణాకరయ్య, మారీచ రామయ్య మొదలైనవారు పేరెన్నిక గన్న విజయనగర గూఢచారులు. గూఢచారుల లక్షణా లను గురించి రాయవాచకం ఇలా చెబుతున్నది `మారువేషాలు వేయగలగాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు, సన్యాసులు, జ్యోతిష్యులు, కళాకారులు, వైద్యులు, భిక్షాటన చేసేవారు. ఒక సందర్భంలో కోట లోపలి సమాచారం తేవడానికి మలం ఎత్తే పనివానిగా లోపలికి ప్రవేశించాడు.
సమాచార సేకరణకు విక్రయకేంద్రాలు దేవాలయాలు, సత్రాలు, మద్యం షాపులు, వ్యభిచార గృహాలు, సంతలు ప్రధానకేంద్రాలని చెపుతుంది. రద్దీ ప్రాంతాలలో తిరుగుతూ పుకార్లు, వర్తకుల లావాదేవీలు, అనుమానితుల కదలికలను గమ నించాలి. బహమనీ వంటి పొరుగు సుల్తానుల రాజ్యంలో కూడా గూఢచారులు శాశ్వతంగా స్థిరపడి, అక్కడ బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసిన గూఢచారి ‘మారీచ రామయ్య’, సేకరించిన సమాచారాన్ని అత్యంతవేగంగా చక్రవర్తికి చేరవేయడానికి వాయువేగ హనుమంతప్ప, మనోవేగి పురీషయ్య సిద్ధంగా ఉం టారు. అలాగే కొందరు గూఢచారులు డబుల్ ఏజెంట్లుగా కూడా పని చేసేవారు తాము విజయనగరవాసులమని రాజుతో విభేదించామని వారి రహస్యాలు తెలియజేస్తామని నమ్మబలికి తప్ప్పుడు సమాచారం ఇచ్చేవారు.
కళింగ గజపతుల రాజ్యంలో “కమలనాభయ్య” ఏజెంటుగా పనిచేసేవాడు. కమలనాభయ్య కళింగ రాజ్యంలో “కర్పాటకం దారి సానాపతి” (విజయ నగర ప్రతినిధి)గా కరుణాకరయ్య (గూఢచారి) రహస్య మిత్రులు పనిచేస్తూనే, అంతర్గతంగా శ్రీకృష్ణ దేవరాయల కోసం గూఢచర్యం బాధ్యతలు నిర్వహిం చాడు. గజపతిరాజు అంతఃపురం, సైనిక కదలికలు, వారి యుద్ధ వ్యూహాలను నిరంతరం గమనిస్తూ కళింగరాజ్యంపై దండయాత్ర చేయవలసిన సమయం, శత్రువుల బలహీనత, కటక్ (ఒడిస్సా) రాజ్య రక్షణ వ్యూహాలను రాయలవారికి వాయువేగి హనుమంతప్ప ద్వారా చేరవేశాడు.
కరుణాకరయ్య రాజధాని అయిన కటక్‌పురం లోనికి ప్రవేశించాడు, గజపతి రాజులవద్ద వారి మంత్రులవద్ద నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. శత్రువుల ప్రధాన సైనికవ్యూహాల చర్చలలో భాగమయ్యాడు. గజపతుల వద్ద ఉన్న చతురంగ బలాలను గురించి విజయనగరానికి “రహస్య సంకేతాలతో దూతల ద్వారా” సమాచారాన్ని చేరవేశాడు. తిమ్మరుసుకు మాత్రమే ఈ వార్త తెలపాలి. అతని మేధోసంపత్తి, చాణక్యనీతి, గూడచర్య వ్యూహాలతో కృష్ణదేవరాయలు కళింగ దేశంపై కత్తిపట్టకుండా విజయాన్ని పొందాడు.
తిమ్మరుసుకు అందిన సమాచారం ప్రకారం ప్రతాపరుద్ర గజపతికి 16 మంది బలమైన సామంతులున్నారు. సైన్యం కూడా విజయనగర సైన్యాన్ని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి వారిపై యుద్ధం చేసి గెలవడం కష్టం కాబట్టి 16 బంగారు పెట్టెలను సిద్ధం చేసి వాటిలో బంగారు ఆభరణాలు వజ్రాలు పెట్టి ఒక రహస్య లేఖనుంచారు. ఆ లేఖలో ఇలా ఉంది. మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం ప్రారంభం కాగానే మీ గజపతిరాజును బంధించి మాకు అప్పగించండి. దానికి ప్రతిఫలంగా ఈ ముందస్తు బహుమతులు (బంగారం, వజ్రాలు) విజయం తర్వాత మిమ్మల్ని ఆయా ప్రాంతాలకు స్వతంత్రరాజులను చేస్తాం.” ఈ పెట్టెలను విజయనగర గూఢాచారుల ద్వారా 16మంది ఇళ్లకు చేర్చారు. అయితే ఇది గజపతి రాజుల ఆంతరంగిక వేగులకు తెలిపేలా ప్రణాళిక వేశారు. రాజుకు ఈ విషయం తెలిసి 16మంది ఇళ్ళపై దాడులు చేయించి బంగారు పెట్టెలను లేఖలను స్వాధీనం చేసుకుని తన 16మంది సామంతులు కృష్ణదేవరాయలతో చేతులు కలిపారని భావించాడు గజపతి, ఒంటరివాడినైపోయానని తలచి యుద్ధం చేయకుండా లొంగిపోయి, సంధి చేసుకొని తన కుమార్తె జగన్మోహిని (తుక్కాదేవి)ని కృష్ణదేవ రాయలకిచ్చి వివాహం జరిపించాడు.
మారీచ రామయ్య విజయనగర సామ్రాజ్యంలో ప్రతిభావంతుడైన గూఢచారి. ఉర్దూ, తెలుగు, కన్నడ, తమిళ భాషలను అనర్గళంగా మాట్లాడుతాడు. ఏ భాష మాట్లాడితే అతడు ఆ ప్రాంతంవాడు అని అనిపించే అంతగా అభ్యాసం చేశాడు. కృష్ణదేవ రాయల కాలంలో బహమనీ రాజ్యంలో పనిచేసిన అత్యంత ప్రతిభావంతుడైన గూఢచారి.
రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్య వాసంలో ఉన్నప్ప్పుడు మారీచుడు బంగారు లేడి రూపంలో కనిపించగా సీతాదేవి ఆ లేడి కావాలన్నది. ఆమె కోర్కె తీర్చడం కోసం ఆ లేడిని వేటాడగా అది పడిపోయి “హా లక్ష్మణా” అని అరిచింది. అది అచ్చు గుద్దినట్లు శ్రీరామచంద్రుని మాటేనని సీతాదేవికే అన్పించింది. వెంటనే లక్ష్మణుడు తన అన్నకోసం వెళగా రావణుడు సీతాదేవిని ఎత్తుకు పోయాడు. అంతగా ధ్వని అనుకరణ చేసేవాడు. గనుక ఇతనిని మారీచ రామయ్యగా పిలిచారు. అడవుల్లో తిరుగుతూ జంతువులు పక్షుల అరుపులను అనుకరించి చీకటి రాత్రులు సమాచారాన్ని చేరవేసేవాడు. బహమనీ సామ్పు్య్రాంపై విజయం సాధించడంలో ఈ మారీచ రామయ్య పాత్ర చాలా కీలకం.
గూఢచర్యం ముఖ్య ఉద్దేశ్యం రహస్య సమాచారాన్ని సేకరించి దేశభద్రతను కాపాడటం, ప్రత్యర్థుల కదలికలను ముందుగా గుర్తించి విదేశీదాడులను, స్వదేశీ కుట్రలను భగ్నంచేసి దేశంలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలను సుఖసంతోషాలతో ఉంచగలుగుతుంది. అయితే గూఢచారులకు మాత్రం క్షణక్షణ గండమే, వారు ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు