‘‘•••నివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’’ (విశ్వ ఏకత్వ వేడుక)లో పాల్గొన్న 5,000 మంది సమక్షంలో ప్రసంగిస్తూ, ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే భావన ద్వారా మానవాళి ఏకత్వాన్ని నొక్కిచెప్పే మహోపనిషత్తులోని శ్లోకాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ భావన హిందూ మనస్తత్వంలో ఎలా అంతర్లీనంగా ఉందో వివరించారు. ఆ తర్వాత, సంఘ్ లక్ష్యాల గురించి అవాస్తవ ప్రచారాలు చేసే ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వం విమర్శకులను ఉద్దేశించి ‘‘భారతదేశంలో ముస్లింలు నివసించకూడదని భావించే వారెవరైనా నిజమైన హిందువు కాజాలరు’’ అన్నారు. ‘‘నిజమైన హిందువు’’కు ఆయన ఇచ్చిన ఈ నిర్వచనం మొత్తం సంఘ్ పరివార్‌ను అప్రమత్తం చేసేలా ఉంది. సుమారు 14 కోట్ల మంది ప్రాథమిక సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకునే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో వేళ్లూనుకున్న బీజేపీకి కూడా ఇది ఒక బలమైన సందేశం. అయినప్పటికీ, కొన్నిసార్లు ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు తమ పరిధిని దాటి ఇతర మతాల పట్ల అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేస్తుంటారు. ముస్లింలు, ఇతర వర్గాల వారితో హిందువులు సామరస్యపూర్వకంగా జీవించడాన్ని సూచించే ‘‘నిజమైన హిందువు’’ గురించిన భాగవత్ నిర్వచనం, సంఘ్ పరివార్‌లోని అతివాద ధోరణి కలిగిన సభ్యుల ఆలోచనా విధానాన్ని మార్చాలి. ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే, అది కచ్చితంగా సామాజిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది.
దేశంలో సామరస్యపూర్వక సహజీవనానికి బహుళత్వం కేంద్రమని భాగవత్ పదేపదే నొక్కి చెప్పడం, 1940వ దశకంలోని భయంకరమైన, విభజన రాజకీయాల గురించి తెలిసిన వారందరికీ ఒక నిర్ణయాత్మకమైన అంశం. ముస్లింలు ఒక ప్రత్యేక జాతి అని ప్రకటించిన జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ కరాచీలో చేసిన తీర్మానంతో ఈ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దానితోనే రక్తసిక్తమైన విభజన రాజకీయాలు మొదలయ్యాయి, అవి భారతదేశాన్ని రెండుగా చీల్చి, 1947లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశాయి. అయితే, ముస్లింలు ఒక ప్రత్యేక ఇస్లామిక్ దేశాన్ని ఏర్పాటు చేసుకోగా, విభజన తర్వాత భారతదేశంలో అల్పసంఖ్యాకులైన సిక్కులు, బౌద్ధులు, జైనులు వంటి ఇతర భారతీయ మతాల అనుచరులతో పాటు ఒక లౌకిక, ప్రజా స్వామ్య, ఉదారవాద దేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని 88 శాతంగా ఉన్న హిందువులు తీర్మానించారు. ఇదే విషయాన్ని భారత రాజ్యాంగంలో పొందు పరిచారు. చాలా మంది ముస్లింలు ఇస్లామిక్ రాజ్యంలో ఉండటానికి ఇష్టపడినప్పటికీ, 3.5 కోట్ల మంది ముస్లింలు భారతదేశంలోనే ఉండిపోయారు. నేడు వారి జనాభా 22.50కోట్లకు పెరిగింది. భాగవత్ ప్రస్తావించిన హిందూసహనానికి ఇంతకంటే గొప్ప రుజువు ఇంకేమైనా కావాలా? విభజన తర్వాత హిందూ-మెజారిటీ భారతదేశం ఎంచుకున్న రాజ్యాంగం కూడా, సనాతన ధర్మంపై నిర్మితమైన నాగరికత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహి స్తుందనడానికి ఒక నిదర్శనంగా నిలిచింది.
ముఖ్యంగా, ఆయన హాజరైన అంతర్జాతీయ మత నాయకుల సదస్సు, ‘‘ద్వేషం, హింస లేదా అమానవీయతను సమర్థించడానికి మతాన్ని ఉపయో గించడాన్ని’’ వ్యతిరేకిస్తూ పంచసూత్రాల కార్యాచరణ ప్రణాళికను, తీర్మానాన్ని ఆమోదించింది. ఇది భారతదేశంలోని రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా ఉంది. ఎందుకంటే, రాజ్యాంగ, మానవతా సూత్రాల కంటే మతానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని, అలాగే ఇతర మతాల వారిపై ద్వేషాన్ని, హింసను ప్రోత్సహించ డాన్ని ఇది వ్యతిరేకిస్తుంది.
విశ్వ ఐక్యతను ప్రోత్సహించే ఈ అత్యంత ముఖ్యమైన సమావేశంలో భాగవత్ ప్రసంగంలో ఇది ప్రధానాంశం అయినప్పటికీ, ఎప్పటిలాగే ఇస్లా మిస్టులు, క్రైస్తవ మత ప్రచార బృందాలు, మతిలేని నకిలీ లౌకికవాదులు, వామపక్షవాదులు వంటి నిరసనకారులు భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, గట్టిగా నినాదాలు చేశారు. వారు ప్లకార్డులు, పోస్టర్లు పట్టుకుని కనిపిం చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జీవో అయిన ఆర్‌ఎస్‌ఎస్‌పై దశాబ్దాలుగా సాగిస్తున్న అబద్ధాల ఆధారంగా వారు చేస్తున్న ప్రచారం, నినాదాలు, ఆ సభలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి చేసిన వాదనలు, ప్రకటనల నేపథ్యంలో ఏమాత్రం అర్థవంతంగా లేవు. అంతేకాకుండా, వారి నినాదాల్లోని చాలా భాగం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు వ్యతిరేకంగా ఉంది. వీటిని వింటుంటే, హిందువులు, ఆర్‌ఎస్‌ఎస్ గురించి వారికి అసలు అవగాహన ఉందా అని అనిపించింది.
కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనల సందర్భంగా కూడా ఉదారవాదం, మతాలు, జాతుల మధ్య సామరస్యం గొప్పతనాన్ని భాగవత్ కొనియా డారు. టొరంటోలో, ‘వసుధైవ కుటుంబకం’ అనే ఇతివృత్తంపై జరిగిన ‘‘హిందూ-విశ్వ బంధు’’ కార్య క్రమంలో ప్రసంగిస్తూ, హిందూ ధర్మం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ అని, దానిని ఒకే భాషకు, ఒకే జీవనశైలికి లేదా ఒకే ఆరాధనా విధానానికి పరిమితం చేయలేమని స్పష్టం చేశారు. దీని ఫలితంగానే బహుళ సమాజ భావన పట్ల దానిని అనుసరించేవారిలో అధిక స్థాయిలో సహనం నెలకొని ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హింసకు గురైన వర్గాలను అక్కున చేర్చుకోవడానికి కూడా భారతీయులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందుకే శతాబ్దాలుగా హింసకు గురైన వర్గాలకు భారతదేశం ఆశ్రయం కల్పిస్తోందని తెలిపారు.
భారతదేశం ఒక రాజకీయ సూపర్‌పవర్‌గా మారాలని కలలు కంటున్న బీజేపీ మద్దతుదారులకు భాగవత్ ఒక సలహా ఇచ్చారు. మానవాళికి చేసే సేవ ద్వారానే భారతదేశం ఒక విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు.
మాడిసన్ గార్డెన్‌లో, భారీ సభలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి చేసిన ప్రసంగం, ఆ కార్యక్రమానికి ప్రధాన వ్యతిరేకిగా ఉండి, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని ‘‘బహిష్కరణవాద’’మైనదిగా అభివర్ణించిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీకి చెంపదెబ్బలా తగిలి ఉంటుంది. ఆ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందు జరిగిన ఒక పత్రికా సమావేశంలో తాను ఆ సభకు మద్దతు ఇవ్వడం లేదని మమ్దానీ చెప్పారు. ‘‘బహిష్కర ణవాద దృక్పథంపై ఆధారపడిన ఒక ఉద్యమం ఎదగడం ఆందోళన కలిగిస్తోంది’’ అని అన్నారు. మమ్దానీని విమర్శించే చాలామంది, ఆయన ‘‘లౌకిక’’ నటనను, హిందూసంస్థల పట్ల ఆయనకున్న పక్షపా తాన్ని తప్పు బట్టారు. ఆయనను హిందూ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తిగా చూస్తున్నారు. అందువల్ల, ఆర్‌ఎస్‌ఎస్ వ•ల విలువలను ప్రపంచానికి పరిచయంచేసే ప్రయ త్నంలో భాగంగా అమెరికా, కెనడా, •••కేలలో భాగవత్ చేసిన పర్యటనను ఒక అఖండ విజయంగా చూడాలి. ఇది భారతదేశ దేశీయ రాజకీయాలకు కూడా అత్యంత ముఖ్య మైనది, ఎందుకంటే ఆయన మత దురభిమానానికి వ్యతిరేకంగా గట్టి గీత గీసి, సామరస్యానికి బలమైన సమర్థకుడిగా నిలిచారు.

ఎ. సూర్యప్రకాశ్
మాజీ చైర్మన్, ప్రసారభారతి