సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. సన్నిహితులు, స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. వాహనాలు, స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారులకు అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగులకు మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు మరింత అనుకూలమైన కాలం. 20,21 తేదీలలో కుటుంబంలో సమస్యలు. వృథా ఖర్చులు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. దూరప్రయాణాలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నూతన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మరింత గౌరవం పొందుతారు.. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు సాధిస్తారు. వ్యాపారులు మరింత లాభాలు ఆర్జిస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు దక్కే అవకాశాలు. కళాకారులు, క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. 17,18 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. స్నేహితులతో తగాదాలు.. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలను సజావుగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. ఆశించిన ఆదాయం దక్కి అవసరాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులకు పురస్కారాలు. 19,20 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. కొన్ని రుణాలు కూడా తీరతాయి. సన్నిహితులకు మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో తగాదాలు పరిష్కారం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, పరిశోధకులకు యత్నకార్యసిద్ధి. 21,22 తేదీలలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. తరచూ ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు చికాకు పరుస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవు. శారీరక రుగ్మతలు వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. రచయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 20,21 తేదీలలో ఆకస్మిక ధనలాభం. వాహనసౌఖ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఒక ముఖ్య విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఉద్యోగయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలలో పురోగతి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. 22,23 తేదీల్లో కుటుంబసభ్యులతో తగాదాలు. స్వల్ప అనారోగ్య సూచనలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి..
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకున్న మేరకు రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేసే వరకు విశ్రమించరు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు నూతన విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు సమీకరించి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులకు కార్యసిద్ధి. 18,19 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది. సంఘంలో మీరంటే గౌరవం మరింత పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబ్యంధించిన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు సమర్థత వెలుగులోకి వస్తుంది. కళాకారులకు అన్ని వ్యిధాలా అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులు విశేష కీర్తి పొందుతారు. 10,11 తేదీలలో ఖర్చులు అధికమవుతాయి. దూరప్రయాణాలు. విష్ణుసహస్రమానామ పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. కుటుంబంలో వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. కొన్ని వివాదాల పరిష్కారదశకు చేరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పోస్టుల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు చిక్కులు తొలగుతాయి. కళాకారులు, రచయితలు ప్రగతిపథంలో సాగుతారు. 20,21తేదీల్లో స్వల్ప శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
బంధువులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. ఊహించని శుభవార్తలు అందుతాయి.. ప్రముఖులు పరిచయమవుతారు. వాహన, గృహయోగాలు కలిగే అవకాశాలు. సమాజంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. రాబడి సంతృప్తినిస్తుంది. విద్యార్థుల శ్రమ కొలిక్కి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. రచయితలు, క్రీడాకారులు ప్రతిభను చాటుకుంటారు. 18,19 తేదీల్లో కొత్తగా అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి..
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. స్నేహితులతో కష్టసుఖాలు విచారిస్తారు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ఆదాయం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు కొత్త సంస్థల ఏర్పాటులో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. పరిశోధకులు, క్రీడాకారులు కొంత ప్రగతి సాధిస్తారు. 19,20 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను ల్లడిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధువులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు రావచ్చు. రాజకీయవేత్తల యత్నాలు సఫలం. కళాకారులు, రచయితలకు నూతన అవకాశాలు దక్కవచ్చు. 20,21తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. శారీరక రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠించండి..