30 ‌సంవత్సరాలు ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు ప్రాంత ప్రచారక్‌గా బాధ్యత నిర్వహిస్తూ, శత్రుదుర్భేద్యమైన (కమ్యూనిస్టు ప్రభావిత) స్థలాల్లో కూడా సంఘాన్ని శీఘ్రంగా వ్యాపింపచేయడంలో అవిశ్రాంతంగా పనిచేస్తూ,  కార్యకర్తలను మలచిన అభినవ శిల్పి సోమేపల్లి సోమయ్యగారు. సంఘ శతాబ్ది సందర్భంగా జాగృతి పాఠకులకోసం వారి గురించిన కొన్ని జ్ఞాపకాలు..

1959‌లో సోమయ్యగారు ఆంధప్రదేశ్‌ ‌ప్రాంత ప్రచారక్‌ ‌బాధ్యత స్వీకరించాక తెలంగాణలో సంఘ కార్యం బలపడేందుకు విస్తృతంగా పర్యటన కొనసాగించారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులకు తెలంగాణ జిల్లాల్లో మంచి బలం ఉండేది. నల్లగొండ, వరంగల్లు జిల్లాలు మరొకరు చొరరాని ప్రదేశాలుగా ఉండేవి. రజాకార్ల హింస కాలంలోనే కమ్యూనిష్టులు కూడా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్య్రం తెస్తామని ప్రజలను నమ్మించారు. అడవులలో స్థావరాలు ఏర్పాటుచేసుకొని దున్నేవాడిదే భూమి అని, ఆవులు, ఎద్దులు పంచి పెడతామని సామాన్య ప్రజలకు అనేక ఆశలు చూపారు. ఆ రోజులలో గ్రామాలకు గ్రామాలు కమ్యూనిస్టు అడ్డాలుగా మారిపోయాయి. అప్పుడు జరిగిన ఎన్నికలలో వరంగల్లు జిల్లాలో పెండ్యాల రాఘవరావు అనే ఒక సామాన్య కమ్యూనిస్టు కార్యకర్త మూడు నియోజక వర్గాలలో విజయం సాధించాడంటే ఆనాడు వారి పట్ల ప్రజాభిమానం ఎంత వెల్లువగా ఏర్పడి ఉందో అర్థం అవుతుంది. అయితే కాలక్రమేణ వారు చేసిన వాగ్దానాలన్నీ గాలి కబుర్లని, నీటి మూటలని ప్రజలు గ్రహించనారంభించారు. అయినప్పటికి 1959-60 ప్రాంతంలో కూడా నల్లగొండ జిల్లాలో వారి ప్రాబల్యానికి ఎదురులేని పరిస్థితి ఉంది. ఆ స్థితిలో సోమయ్యగారు విస్తృతంగా పర్యట నలు జరుపుతూ సంఘ ప్రచారకులను ఆ ప్రాంతానికి పంపి కొత్త శాఖలు ప్రారంభింపచేస్తుండేసరికి కమ్యూనిస్టులు దాదాపుగా పగపట్టినట్లుగా వ్యవహరించారు. కోస్తా జిల్లాల నుండి వచ్చి పనిచేస్తున్న ఇ.సి.రామ్మూర్తి చాలా చొరవగల ప్రచారక్‌, ‌సోమయ్యగారి మార్గదర్శనం వల్లను, నిరంతర కృషి కారణంగాను జిల్లాలో చిన్న చిన్న గ్రామాలలో కూడా సంఘ శాఖలు ప్రారంభించారు.

నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి, అన్నారం, పొట్లపాడు గ్రామాలు కమ్యూనిస్టు కోటలుగా పరిగణించబడేవి. ఆ గ్రామాలలో కూడా సంఘ శాఖలు ఆరంభమయ్యాయి. ఇది కమ్యూనిస్టులకు సుతరాము గిట్టని విషయం. అందుచేత గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ప్రారంభించారు. సంఘంలో చేరితే దుష్పరిణామాలు సంభవిస్తాయని భయపెట్టడం, కొన్నిచోట్ల సంఘ కార్యకర్తలను కొట్టడం ప్రారంభిం చారు. సంఘానికి అది ఒక సవాలుగా మారింది. అయినప్పటికీ ఈ ప్రతిఘటనను ఎదుర్కొంటూనే సంఘశాఖలు కొనసాగించారు. ఎప్పటికప్పుడు సోమయ్యగారు తగువిధంగా మార్గదర్శనం చేసేవారు.

కవ్యనిస్టుల ఆగడం

ఆ ప్రాంతంలో మోదుగ రంగారెడ్డి అనే స్వయంసేవక్‌ ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండేవాడు. ఆయన పట్టుదల గల కార్యకర్త. అన్నారంలో కవ్యనిస్టులు శాఖ నడపనీయడం లేదని తెలుసు కొని అక్కడ శాఖ నడపడానికి వెళ్లాడు. రంగారెడ్డి ఆ గ్రామంలో ప్రవేశించగానే కవ్యనిస్టులు కొందరు ఆయనను కొట్టేందుకు చుట్టు ముట్టారు. అయినా ధైర్యంగా తన చేతిలో ఉన్న దండతో ఎదురుదాడి జరిపారు. అతడు ఎక్కువసేపు ప్రతిఘటించలేక పోయాడు. వారు ఆయనను కొట్టి, పట్టుకెళ్లి ఒక గదిలో పెట్టి తాళం వేశారు. ఆయన వెంట ఉన్న ఒకరిద్దరు కార్యకర్తలను వెంటనే ఊరివిడిచి వెళ్లిపొమ్మని కవ్యనిస్టులు హెచ్చరిక చేశారు. ఈలోగా ఆ ఊరిలోని కార్యకర్త ఈ వార్తను సూర్యాపేటలో ఉండే స్వయంసేవకులకు చేరవేశారు. సూర్యాపేట నుండి స్వయంసేవకులు దండలు తీసుకొని కవ్యనిస్టులతో ఢీకొనడానికి వచ్చారు. కవ్యనిస్టులు కూడా కొట్లాటకు సిద్ధపడ్డారు. ఈ స్థితిలో డాక్టర్‌ ‌పుల్లయ్యగారు కొందరు పోలీసులను తీసుకొని జీపులో అక్కడికి చేరారు. పోలీసులను చూసి కవ్యనిస్టులు జారుకొన్నారు.  స్వయంసేవకు లలో పట్టుదల పెరిగింది. ఏమైనాసరే అన్నారంలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టాలని నిశ్చయించారు. ఆ కార్యక్రమానికి తిరుమలగిరి, పొట్లపాడు గ్రామాల నుండి కూడా స్వయంసేవకులను సమీకరించాలని నిర్ణయించుకొన్నారు.

సోమయ్యగారిపై దాడి

ఆ తరుణంలోనే సోమయ్యగారు నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో భాగంగా ‘తొండ’లో కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రానికి అన్నారం కార్యక్రమానికి చేరుకోవాలి. ఇంతలో తొండలో కవ్యనిస్టులు జిల్లా ప్రచారక్‌ ఈ.‌సి.రామవ•ర్తిగారిపై దాడిచేశారు. బాగా దెబ్బలు తగిలాయి. అయినప్పటికి సోమయ్యగారు ముందుగా నిర్ణయించుకొన్న కార్యక్రమం ప్రకారం మరో కార్యకర్తను తోడుచేసుకొని అన్నారం చేరారు. ఆ సాయంత్రం కార్యక్రమానికి 200మంది స్వయంసేవ కులు వచ్చారు. కవ్యనిస్టుల నుండి ఎటువంటి దాడి జరిగినా త్రిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమం అంతా అయిపోయింది. స్వయంసేవకు లంతా ఎవరిళ్లకు వారు తిరిగి వెళ్లిపోబోతున్నారు. అంతా సవ్యంగానే జరిగిపోయిందని ఎవరికి వారు అజాగ్రతకు లోనయ్యారు. ఇంతలో కమ్యూనిష్టులు ఆకస్మికంగా దాడిచేశారు. వచ్చీరావడంతోనే సోమయ్యగారి మీద పడ్డారు. నిర్ఘాంతపోయిన స్వయంసేవకులు చెల్లాచెదురైపోయారు. కవ్యని స్టులు సోమయ్యగారిని ముందుకు త్రోసివేశారు. ఆయన బోర్లపడిపోగా కర్రలతో ఇష్టం వచ్చినట్లుగా బాదారు. సోమయ్యగారు తలపైన చేతులు పెట్టి తలను కాపాడుకొంటూ ఆ దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయారు. ఆయన చనిపోయారని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ వార్త తెలియగానే పరుగెత్తుకుంటూ అక్కడికి చేరిన ఒంటెద్దు రాఘవరెడ్డి పలకరించి చూద్దామని ‘సోమయ్యగారూ ఏమయింది’ అంటూ కేకపెట్టారు. ఆయన కాస్త స్పృహలోకి వచ్చారు. ఆయన నోటినుండి వెలువడిన మొదటి మాట ‘నీవు ఎట్లా ఉన్నావు’ అని. అన్ని దెబ్బలు తగిలిన వ్యక్తి తన బాధను గూర్చి ఒక్కమాట కూడా చెప్పకుండా ‘నీవు ఎట్లా ఉన్నావు’ అంటూ అతడి యోగక్షేమాన్ని విచారించడం విన్న రాఘవరెడ్డి కన్నీరు ఆగలేదు. స్థితప్రజ్ఞులకు మాత్రమే సాధ్యమయ్యే ప్రవర్తన సోమయ్యగారిది. ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వారి ముఖకవళికలలో ఎలాంటి భయాందోళనలు కనిపించలేదు. బాధను భరిస్తూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ స్థితిలో వారిని చూసిన గ్రామస్థులు రెచ్చిపోయి కవ్యనిస్టులకు గట్టిగానే బుద్ధి చెప్పారు. సోమయ్యగారు, ఆయనవద్ద శిక్షణ పొందిన ప్రచారకులు ప్రదర్శించిన ఆత్మస్టయిరం, పట్టుదల కారణంగానే తెలంగాణా ప్రాంతంలో సంఘకార్యం వేగం పుంజుకొంది.

స్థిత ప్రజ్ఞత, సమయోచిత వ్యవహారము

పూర్వపు నల్లగొండజిల్లా మొత్తం కవ్యనిస్టుల కంచుకోట అని ప్రతీతి. సీపీఐ-సీపీఐఎంలుగా చీలిపోయినప్పటికిని వారి గుండాయిజానికి ఎదురుండేది కాదు. నేటి సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో 1960లో సంఘశాఖ ప్రారంభ మైంది. కవ్యనిస్టులు కాంగ్రెసువారు కలిసికట్టుగా సంఘశాఖ నడవకుండా చేయాలని కక్ష కట్టారు. బెదిరింపులకు దిగారు. కవ్యనిస్టుల కేంద్రమైన ఇప్పగూడెం గ్రామములో పుట్టి పెరిగినవాడిని కనుక కవ్యనిస్టుల గుండాగిరిని ఎదుర్కోవటం తెలిసి ఉన్నందున (అప్పటికే జనగామలో జనసంఘ్‌ ‌పూర్తి సమయ కార్యకర్తగా ఉన్న) నన్ను తిరుమలగిరి కేంద్రంగా సంఘపని చేయడానికి విస్తారక్‌గా పంపించారు. క్రమంగా పరిసరగ్రామాల్లో శాఖలు ప్రారంభమైనవి. సంఘవిస్తరణను చూసి కవ్యనిస్టులు సహించలేక మేము ఒక ఇంట్లో సమావేశమైనప్పుడు దాడి చేశారు. మేము ప్రాణాలకు తెగించి చేసిన ఎదురుదాడిలో వారి గుండాలు, నాయకులు చాలామంది గాయాల పాలైనారు. నాతోసహా 15 మంది స్వయంసేవకులను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి క్రిమినల్‌ ‌కేసులు పెట్టారు. పోలీసులు గ్రామాన్ని దిగ్బంధనం చేసి స్వయం సేవకుల్ని బెదిరించారు. దానితో సంఘశాఖలకు రావటానికి చాలామంది జంకినారు. ఈ సమయంలో మా।। సోమయ్యగారు ఆ ఊరికి వచ్చి అందరినీ పరామర్శించి ధైర్యాన్ని కలిగించారు. శాఖను మళ్లీ ప్రారంభంచేసి స్ఫూర్తిదాయకమైన బౌద్ధిక్‌ ఇచ్చారు. వారి ప్రేరణతో రెట్టింపు ఉత్సాహంతో సంఘవిస్తరణ వేగవంతమైంది. రామావరం, తొండ, తాటిపాముల, తదితర గ్రామాలలో శాఖలు ప్రారంభమైనవి.

నల్లగొండ జిల్లా అంతటా సంఘం విస్తరించడమే కాక సమాజంలో ప్రముఖులైన శ్రీ కట్టా రాంరెడ్డి (మాజీ శాసనసభ్యులు) సీనియర్‌ అడ్వకేట్‌, శ్రీ ‌గవ్వా మధుసూదన్‌రెడ్డి సీనియర్‌ అడ్వకేట్‌ (‌వీరు ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర జనసంఘ అధ్యక్షులుగా పని చేశారు) శ్రీ గోవింద రెడ్డి అడ్వకేట్‌, శ్రీ ‌డా।। పోటు పుల్లయ్యగారి లాంటి పెద్దలు సంఘంలో చేరారు. అప్పటికి నల్లగొండ జిల్లా ప్రచారక్‌ ఈ.‌సి. రాంవ•ర్తిగారు కలిగించిన ఉత్తేజంతో రోజు రోజుకు సంఘ శాఖలు కొత్త గ్రామాలలో ప్రారంభమౌతుంటే కవ్యనిస్టులు తమ కంచుకోటలు కూలి పోతాయన్న భయం, కక్ష, ద్వేషంతో ఉన్మాదులై దాడులకు దిగారు.

మా।। సోమయ్యగారి పర్యటనలో భాగంగా తొండ గ్రామ శాఖలో ప్రసంగిస్తుండగా సి.పి.ఐ (ఎం) గూండాలు గుంపుగా వచ్చి సోమయ్యగారితోపాటు స్వయంసేవకులందరిని తీవ్రంగా గాయపరిచారు. దాడులకు బెదరకుండా పర్యటన కార్యక్రమం ప్రకారం తర్వాత నాగులపాటి, అన్నారం గ్రామ శాఖలకు వెళ్లారు. పథకం ప్రకారం అక్కడ కూడా సి.పి.ఐ (ఎం) గూండాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేసిన దాడిలో సోమయ్యగారు తీవ్రంగా గాయపడ్డారు.

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లమని చాలామంది సూచించారు. అయినప్పటికీ అలా  వెళ్లకుండా సూర్యాపేటలోనే డా।। పుల్లయ్యగారి ఇంట్లో ఉండి చికిత్స పొందారు. ఎందుకంటే కవ్యనిస్టుల వరుసదాడులతో స్వయం సేవకుల నైతిక స్థయిర్యం, ధైర్యం దిగజారకుండా ఉండాలని భావించి చికిత్స పొందుతూనే అనారోగ్య తీవ్రతను లెక్కచేయకుండా ఆ ప్రాంత స్వయంసేవకుల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

దాడి విషయం తెలిసి ఆందోళనతో నేను సూర్యాపేటకు వెళ్లి కలిశాను. శరీరంలో గాయాలు లేనిచోటు లేదు. అయినా ఎప్పటివలెనే చిరునవ్వుతో మాట్లాడినాడు. ఇన్ని గాయాలనొప్పిని భరిస్తూ కూడా చిరునవ్వుతో ఉండటం వారికి మాత్రమే సాధ్యమైంది. నాయకుడైనవాడు ఇలాంటి సమయాల్లో స్థితప్రజ్ఞునివలే గుండెనిబ్బరంతో ఉండి సహచరులకు స్ఫూర్తినివ్వాలి. సోమయ్యగారు అది ఆచరణలో చూపెట్టారు.

సూర్యాపేటలో వారు స్వయంగా పర్యవేక్షించి వ•డువిధాల కార్యక్రమాలు రూపొందించారు :

1) దాడి జరిగిన గ్రామాలలో బహిరంగసభలు జరిపి కవ్యనిస్టుల అరాచక చర్యలను ఖండించి ప్రజలను చైతన్యపరచటం.

2) స్వయంసేవకుల మనోధైర్యాన్ని నిలబెట్టం కోసం గ్రామాలను పర్యటించడం, గాయపడ్డ స్వయంసేవకుల బాగోగులు చూడటం.

3) దాడిచేసిన గుండాలతోపాటు దాడికి పథకంవేసి ఉసిగొల్పిన సిపిఐ(ఎం) అగ్రనాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడైన భీంరెడ్డి నర్సింహారెడ్డి కూడా చట్టపరంగా శిక్షించబడే విధంగా ప్రయత్నించడం.

ఆ ప్రకారం దాడి జరిగిన గ్రామాలలో భారీ బహిరంగ సభలు జరిపి కవ్యనిస్టుల దౌర్జన్యాలను ఎదిరించాలని ప్రచారం చేశారు. గ్రామాల పర్యటన, పరమర్శకు కొందరికి బాధ్యతను అప్పగించారు.

ఇక అప్పటికే పరారిలో ఉన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి దుర్మార్గాల గురించి, కవ్యనిస్టుల అరాచకాలగురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పోలీసులపై ఒత్తిడిపెంచే విధంగా విస్తృతంగా కరపత్రాలు పంచాలని నిర్ణయించారు. మన వాళ్లెవరో వ్రాసి ఇచ్చిన డ్రాఫ్ట్ ‌కరపత్రం చదివి ఇది కవ్యనిస్టు లకు సరిపోయేంత ఘాటుగా లేదన్నారు. నన్ను పిలిచి కరపత్రం వ్రాయాలని అది వ్రాసేంతవరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ఒక రోజంతా ఆలోచించి రాత్రి నిద్రపోకుండా నాలుగు పేజీలకు సరిపోయేంత డ్రాఫ్ట్ ‌వ్రాసి వారికిచ్చాను. ఆసాంతం చదివి తెలంగాణ యాస-పల్లెటూరి సామెతలతో సైడ్‌ ‌హెడ్డింగ్లతో కామ్రేడులకు సరిపడే ఘాటైన డోసు ఇచ్చావని మెచ్చుకున్నారు.

లక్ష కరపత్రాలు ముద్రించి నల్లగొండజిల్లా అంతటా, అసెంబ్లీ ఆవరణలో, ఎం.ఎల్‌.ఏ. ‌క్వార్టర్స్‌లో, సెక్రటేరియట్‌లో పంచటంతో రాష్ట్రంలో పెద్ద సంచలనం అయ్యింది. మరునాడే భీంరెడ్డి నర్సింహారెడ్డిని అరెస్టు చేసారు. ఆనాటి సంఘటనలో మా।। సోమయ్యగారు సూర్యాపేటలో మకాం వేయకుండా హైదరాబాద్‌ ‌వెళ్లిపోయి ఉన్నట్లయితే ఆ జిల్లాలో సంఘానికి పూడ్చలేనంత నష్టం జరిగి ఉండేదని స్వయంసేవకులకు మనోబలాన్ని ఈ విధంగా పెంచారని శ్రీ మందాడి సత్య నారాయణరెడ్డి (మాజీ శాసనసభ్యులు) తెలియజేశారు.

(‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకం నుంచి)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE