భారత్, వియత్నాం దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి  ఇరు దేశాలు నిర్ణయించాయి. తూర్పు ఆసియా దేశాలలో అత్యంత కీలకమైన వియత్నాంతో భారత బంధం మరింత ధృడపడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్న అవగాహనకు వచ్చాయి. ఆర్థిక, వాణిజ్య, రక్షణ, ఆధ్యాత్మిక సహకారాన్ని మరింత విస్తరించాలని నిశ్చయించాయి. వియత్నాం అధ్యక్షుడు టోలామ్  భారత పర్యటన సందర్భంగా కుదిరిన చారిత్రక ఒప్పందాలు ఆసియా ప్రాంతంలో కొత్త శక్తి సమతుల్యతకు దారి తీయనున్నాయి.

టోలామ్ మే 5 నుంచి మన దేశంలో మÖడు రోజులు పర్యటించారు. ఏప్రిల్ నెలలో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తన తొలి అధికారిక పర్యటన భారత్ నుంచే ప్రారంభించడం విశేషం. టోలామ్ ముందుగా బౌద్ధ గయ వెళ్లారు. అక్కడి ఆలయంలో ప్రార్థనలు చేసి బోధి వృక్షం కింద ధ్యానం చేశారు. బౌద్ధ గయను సందర్శించడం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న లోతైన నాగరిక, ఆధ్యాత్మిక బంధాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2025లో వియత్నాంలో బౌద్ధ అవశేషాలను ప్రదర్శించినప్పుడు కోటిన్నర మందికి పైగా ప్రజలు వాటిని దర్శించుకోవడం ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధానికి నిదర్శనమని ప్రధాని గుర్తుచేశారు. ఆ తర్వాత ఢిల్లీ వచ్చిన టోలామ్‌కు రాష్ట్రపతిభవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ, టోలామ్ హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇరు దేశాల నాయకులు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరుపక్షాలు 13 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం

ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి  25 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం మార్కెట్ ప్రాప్యతను సులభతరం చేస్తూ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐని వియత్నాం ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. దీనివల్ల పర్యాటకం, వ్యాపార లావాదేవీలు సులభతరం అవుతాయి. ముఖ్యంగా అక్కడ భారతీయ మందుల లభ్యతను పెంచేందుకు రెండు దేశాల ఔషధ నియంత్రణ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక ఉత్పత్తుల ఎగుమతిని సరళతరం చేయాలని నిర్ణయించారు. ఆ దేశం వద్ద ఉన్న అరుదైన ఖనిజాలు, మూలకాలు నిల్వల విషయంలో సహకారం కోసం మన దేశం ఆసక్తి చూపింది. ఔషధాలు, ఖనిజాలు, వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక ఉత్పత్తుల ఎగుమతులను సరళతరం చేయాలని నిర్ణయించారు. విద్య, బ్యాంకింగ్, సంస్కృతి సహా పలు రంగాలలో లోతైన ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశం కల్పిస్తాయి. ఇంధన రంగాలలో సహకారం పెంచుకోవడం ద్వారా ఆర్థిక భద్రతను పటిష్టం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేందుకు ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య సహకా రాన్ని పెంచే దిశగా కొత్త అడుగులు పడ్డాయి.

వియత్నాంకు బ్రహ్మోస్

దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక బలాన్ని పెంచుకుంటున్న విషయం కూడా ఇరుపక్షాల మధ్య జరిగిన ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛాయుత నౌకాయానం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వియత్నాం భారత్ నుంచి దాదాపు రూ.5,800 కోట్ల విలువైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి చర్చలు జరిపింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం రక్షణ సామర్థ్యాలను పెంచనుంది. ఇప్పటికే తూర్పు ఆసియాలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా మన దేశం నుంచి బ్రహ్మోస్ కొనుగోలు చేశాయి. ఇది చైనాకు ఆందోళన కలిగించే విషయం. సైనిక శిక్షణ, సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిఘా సమాచార మార్పిడిని పెంచుకోవాలని  ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్ ఇప్పటికే వియత్నాంకు ‘ఐఎనఎస్ కిర్పన’  క్షిపణి నౌకను కానుకగా ఇచ్చింది. ఇతర రక్షణ సాంకేతికతలను పంచుకుంటోంది.

భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట’ విధానంలో వియత్నాం కీలక దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. “విజన్ మహాసాగర”కు ఒక కీలకమైన స్తంభంగా ఆయన అభివర్ణించారు. ఆ దేశం సహకారంతో ఆసియాన్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం వియత్నాంతో కలిసి భారత్ పని చేస్తుందని తెలిపారు. పెహల్గావ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో అండగా నిలిచినందుకు వియత్నాంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని అనుసరించ డానికి అంగీకరించామని మోదీ తెలిపారు. ఇది భారతదేశానికి, అన్ని ఆసియాన్ దేశాలకు మధ్య వాణిజ్యానికి, పెట్టుబడులకు కొత్త ఊపునిస్తుంది. కీలక ఖనిజాలు, ఇంధన సహకారంలో కొత్త కార్యక్రమాలు మన రెండు దేశాల ఆర్థిక భద్రతను, సరఫరా గొలుసు మెరుగుపరుస్తాయి. అనుసంధానం, సామర్థ్య నిర్మాణం మన భాగస్వామ్యానికి ముఖ్యమైన స్తంభాలు. రెండు దేశాల మధ్య విమాన అనుసంధానం నిరంతరం పెరుగుతుండటం చాలా సంతోషంగా ఉంది అని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వియత్నాం అధ్యక్షుడు టోలామ్ తెలిపారు.

బౌద్ధ బంధం

భారత్, వియత్నాం మధ్య రెండు వేల ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. వియత్నాం బౌద్ధమతాన్ని పాటించే దేశం. ఒకటో శతాబ్దంలోనే బౌద్ధం  మన దేశం నుంచి సముద్ర, భూ మార్గాల్లో ఆ దేశంలోకి  ప్రవేశించింది. ముఖ్యంగా 10 – 15 శతాబ్దాల మధ్య లీ, ట్రాన్ రాజవంశాల పాలనతో బౌద్ధం అధికారిక మతంగా స్థిరపడింది. ఈ కాలాన్ని వియత్నాంలో స్వర్ణయుగంగా చెబుతుంటారు. వియత్నాంలో ప్ర< ó‘నంగా మహాయాన బౌద్ధం ప్రాచుర్యంలో ఉంది. అయితే దక్షిణ వియత్నాంలో థేరవాద బౌద్ధం కూడా కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత భారత్, వియత్నాంల మధ్య 1972లో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. బౌద్ధమతం రెండు దేశాల మధ్య వారధిగా చెప్పవచ్చు. భారత ‘యాక్ట్ ఈస్ట’ విధానంలో వియత్నాం అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉంది.

క్రాంతిదేవ్ మిత్ర

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE