సైబర్ స్పేస్ అనేది అత్యాధునిక యుద్ధభూమి. ఈ రణరంగంలోకి భారత్ ఇప్పుడిప్పుడే అడుగుపెడుతోంది. భారత్ మాత్రమే కాదు అగ్రదేశాల్లోని సంస్థలు, వ్యవస్థలన్నీ సైబర్ దాడుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. గడచిన నాలుగేళ్ల కాలంలో చైనా-అమెరికాలు పరస్పరం వేల సంఖ్యలో సైబర్ దాడులు చేసుకున్నాయి. అమెరికా-ఉక్రెయిన్‌లపై రష్యా గతేడాది భారీ స్థాయిలో సైబర్ దాడులకు తెగబడింది.

సాంకేతికత విసురుతున్న పంజా దెబ్బకు సకల రంగాలు, వ్యవస్థలూ కకావికలమవుతున్నాయి. ప్రగతికి దారులు వేసిన సాంకేతిక విప్లవం సంక్షోభా లనూ సృష్టిస్తోంది. భద్రత నుంచి బ్యాంకింగ్ వరకూ.. వైద్యం నుంచి విమానయాన రంగం వరకూ ప్రతి చోటా సైబర్ దాడుల ముప్పు పొంచి ఉంది. దాదాపు అన్ని రంగాలూ ఇంటర్‌నెట్‌తో అనుసంధానమైన డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్నాం. భారత్‌లో 80 కోట్లకు పైగా ఇంటర్ నెట్ వినియోగదారులున్నారు.

వేగవంతమైన అద్భుత ప్రయోజనాలే కాదు… హ్యాకింగ్‌లూ, వైరస్ దాడులూ, మోసాలూ మన సాంకేతిక సామర్థ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. ఆసియా దేశాల్లో సైబర్ దాడులకు గురవుతున్న తొలి మూడు దేశాల్లో భారత్ కూడా ఒకటి. దేశంలో 2033 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 17 ట్రిలియన్ల సైబర్ దాడులు జరిగే అవకాశముందని నిపుణుల అంచనా.

రక్షణ, బ్యాంకింగ్ రంగాలతో పాటు వ్యూహాత్మక కేంద్రాలపై సైబర్ దాడులు జరుగుతున్నాయి. భారత అణు కేంద్రాలు, ఎన్నికల కమిషన్, పారిశ్రామిక రంగాలతో పాటు ఇంధన వ్యవస్థలపై శత్రుదేశాలు నిరంతరం సైబర్ దాడులు చేస్తున్నాయి. వైమానిక రంగంపై జీపీఎస్ స్పూఫింగ్ దాడి జరగడంతో భారత విమానయాన రంగం నష్టాలను చవిచూసింది. తాజాగా నాలుగు రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లు ఇతర డేటా సైట్లపై ఏకకాలంలో సుమారు 68లక్షల సైబర్ దాడులు జరిగాయి. భారత ఎన్నికల కమిషన్ నిర్వహణలో ఉండే ECINET వెబ్‌సైట్ పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా సాగడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పోలింగ్ బూత్‌ల నుంచి ఎప్పటికప్పుడు సమాచా రాన్ని సేకరిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా…వివరాలు తెలుసుకుని, రీపోలింగ్ నిర్వహించాల్సిన కేంద్రాలను గుర్తిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు-ఓట్ల లెక్కింపు సమయంలో జ్పుుIచీజుT సైట్ పై కొద్ది గంటల వ్యవధిలో 68లక్షల సైబర్ దాడులు జరగడంతో సమాచార లోపంతో పాటు సమన్వయంలో ఇబ్బం దులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన ఎన్నికల కమిషన్ టెక్నికల్ టీమ్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ప్రధానంగా ఓట్ల లెక్కింపును సైబర్ ముఠాలు టార్గెట్ చేశాయి.

ఎన్నికల కమిషన్ సైట్లు ఎందుకు లక్ష్యంగా మారుతున్నాయి?

సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించ డంతో వైరి దేశాలు కొత్త వ్యూహాలకు పదునుపెట్టాయి. కీలక రంగాలే లక్ష్యంగా ఎన్ని సైబర్ దాడులు చేసినా భారత ప్రభుత్వం వాటిని తిప్పికొట్టే బృందాలను ఏర్పాటు చేయడంతో శత్రుదేశాల ఎత్తులు పారలేదు. దీంతో అసలు ప్రభుత్వ ఏర్పాటుకు కారణమయ్యే ఎన్నికల వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుంటే కనీసం 2029లో జరిగే ఎన్నికల నాటికైనా ఎన్డీఏ కూటమిని గద్దె దింపవచ్చని ప్రత్యర్థి దేశాలు అంచనా వేశాయి. అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల కమిషన్‌పై దాడులు జరుగుతున్నాయనేది ఒక అంచనా.

మన దేశంలో ఎన్నికల కమిషన్‌పై గతంలో ఎప్పుడూ ఆరోపణలు రాలేదు. కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నంత కాలం ఎన్నికల కమిషన్ పవిత్ర కార్య సాధనలో నిమగ్నమైన సంస్థ. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత ఎన్డీSఏ కూటమి 2019, 2024లో వరుస విజయాలు సొంతం చేసుకుంది.

రాష్ట్రాలను తమ అధీనంలో ఉంచుకున్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా ఓటమి పాలు కావడం, అదే స్థానంలో బీజేపీ స్వంతంగా లేదా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో ‘ఎన్నికల కమిషన’ పవిత్రతపై, స్వతంత్ర వైఖరిపై, ఎన్నికల నిర్వహణపై విపక్షాపార్టీలకు అనుమానాలు మొదలయ్యాయి. అవి క్రమంగా ఆరోపణల స్థాయికి ఆ తర్వాత ఏకపక్ష నిర్ధారణల వరకూ వెళ్లిపోయాయి. చివరకు ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఒకానొక శాఖగా అభివర్ణించే స్థాయికి చేరింది.

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జాతీయ, అంతర్జాతీయ సర్వే సంస్థలు మోదీ హ్యాట్రిక్ సాధించనున్నట్టూ అంచనాలను ప్రకటించాయి. 2019లో ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్ద నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దుతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జీఎస్టీని ప్రవేశపెట్టింది. విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని అవలంబిం చింది. సరికొత్త విదేశాంగ నీతిని ఖరారు చేసింది. ఇది అగ్రరాజ్యం అమెరికా సహా చైనా, పాకిస్థాన్ వంటి దేశాలకు గిట్టలేదు. దీంతో మరోసారి మోదీ అధికార పగ్గాలు చేపడితే.. ఏమవుతుందో అనే ఉద్దేశంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణను, ఫలితాల ప్రకటనను గందరగోళ పరిచే ప్రయత్నాలు తీవ్ర మయ్యాయి. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడుతున్న దశలో పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడులు ఫలితాల ప్రకటనను ఆటంకపరిచాయి.

ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. స్థానాల సంఖ్య తగ్గినా..మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2024 నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడే ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అసాధ్యమనీ, మహారాష్ట్రలో కేంద్రం-ఎన్నికల కమిషన్ కుమ్మక్కైన కారణంగానే మహాయుతి గెలిచిందంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండికూటమి నేరెటివ్‌ను నిర్మించడం మొదలుపెట్టింది. ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ’ అనే నినాదాన్ని ఖరారు చేసింది.

అమెరికా కేంద్రంగా పనిచేసే ఉద్యోగ కల్పన సంస్థ LinkedInఅలో 2024, జూన్ 1న అభిరూప్ గుహ “Safeguarding Democracy: Understanding Cybersecurity Threats During Election Times in India” శీర్షికన ఆసక్తికరమైన వ్యాసం రాశారు. ఎన్నికల సమయంలో ఈసీ వెబ్ సైట్లు ఇతర డేటా సెంటర్లపై జరిగే 4రకాల సైబర్ దాడులను ప్రస్తావించారు. 1. Phishing Attacks 2. Distributed Denial of Service (DDoS) Attacks 3. Social Engineering Attack 4. Ransomware Attacksగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఫిషింగ్, మాల్వేర్ దాడులు అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రశ్రేణిలోని మూడు దేశాల్లో ఉంది. అభిరూప్ గుహా చాలా ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన పరిశీలనను చేశారు. భారత వైరి దేశాలకు ఎన్నికల కమిషన్ ఎందుకు లక్ష్యంగా మారిందో విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు గుహ. Aiming to manipulate public opinion, compromise electoral infrastructure, and undermine the credibility of the electoral outcome అంటారు.

ప్రజాభిప్రాయాన్ని నేర్పుతో మార్చడం, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ పారదర్శకతను అనుమానాస్పదం చేయడం, ఎన్నికల ఫలితాల విశ్వసనీయతను దెబ్బ తీయడం సైబర్ దాడుల లక్ష్యమంటారు అభిరూప్ గుహ. తప్పుడు సమాచార వ్యాప్తి, పారదర్శకతను ప్రశ్నార్థకం చేయడం, తమ ఓటు తామే వేశామా లేదా అనే రీతిలో గుంజాటనలోకి నెట్టడం వైరి దేశాల హ్యాకింగ్ ముఠాల పనిగా తేల్చి చెప్పారు అభిరూప్ గుహ.

భారతదేశంలో కీలక దశలో ఎన్నికలు జరుగు తున్నప్పుడు సైబర్ దాడులు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగాయి. భారత్‌లో ఏ ప్రభుత్వం మనుగడ సాగించాలో విదేశీ శక్తులు నిర్ణయించే స్థాయిలో సైబర్ దాడుల తీవ్రత పెరిగింది. మన దేశంలోని విపక్షాపార్టీలు ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ’ పేరిట నేరెటివ్ నిర్మిస్తున్న కాలంలోనే విదేశీ సైబర్ శక్తులు మన ఎన్నికల వ్యవస్థపై దాడికి దిగడం కాకతాళీయం కాదు. ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మక కేంద్రాలపై, వ్యవస్థలపై జరుగుతున్న దాడిగా చూడాలి.

పెహెల్గావ్ దాడి తర్వాత ఏం జరిగింది?

పెహెల్గావ్ దాడి తర్వాత మన దేశంలోని కీలక రంగాలపై సుమారు 15లక్షల సైబర్ దాడులు జరిగాయి. మెజారిటీ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ సుమారు 150 సార్లు మాల్‌వేర్‌తో మన నెట్‌వర్క్‌లోకి చొరబడగలిగారు. ‘ఏపీటీ 36’ అనే పాక్ గ్రూప్ భారతీయ రక్షణ సంస్థలపై మాల్‌వేర్ దాడికి తీవ్రంగా ప్రయత్నించింది. చైనా లోపాయికారి సహకారం అందించింది. రణరంగం లోనే కాదు సైబర్ యుద్ధ మైదానంలో పాకిస్థాన్, చైనాలను ఎదుర్కొనేందుకు భారత్ సైబర్ విధాన రూపకల్పనకు పదును పెడుతోంది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత…

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ తలమునకలైన సమయంలో పాకిస్థాన్ సహా దాని మిత్ర దేశాలన్నీ ఏకమై సైబర్ దాడులకు దిగాయి. ఏకంగా ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకింగ్ గ్రూపులే పాలుపంచు కున్నాయి. పాకిస్థాన్, తుర్కియే, బాంగ్లాదేశ్, మలేసియా, ఇండోనేసియా, ఇరాక్, చైనాకు సంబం ధించిన ప్రభుత్వ, ప్రభుత్వేతర హ్యాకింగ్ గ్రూపులు ఎయిర్ పోర్టులు, పోర్టులు, పవర్ గ్రిడ్లు సహా బీఎసఎనఎల్, యూపీఐ, డిజిటల్ వాలెట్లు, స్టాక్ ఎక్స్ ఛేంజీలు, దిగ్గజ ఐటీ కంపెనీలపై దాడులు చేశాయి. రక్షణరంగ సంస్థల వద్దగల కీలక డేటాను తస్కరించేందుకు శతవిధాలుగా ప్రయత్నించాయి. దీన్ని సైబర్ యుద్ధంగా ఇంటర్ పోల్ ట్రెయిన్ నిపుణులు అభివర్ణించారు.

సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ సమయంలోనే సైబర్ దాడి గురైంది. ‘మిస్టర్ హబీబ్ 404’ అనే హ్యాకింగ్ గ్రూపు దాడి చేసినట్టు గుర్తించారు. 13వేల మంది సభ్యులున్న డ్రాగన్ ఫోర్స్ మలేసియా అనే ముఠా ప్రతినిత్యం భారత్ లక్ష్యంగా దాడులు చేస్తూనే ఉంటుంది.

 ఆ సైబర్ దాడుల్లో ఇరాక్ కు చెందిన ‘ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ’, పాలస్తీనాకు సంబంధించిన ‘టీమ్ అజ్రాయిల్ ఏంజెల్ ఆఫ్ డెత’, బాంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే ‘సైల్హెట్ గ్యాంగ్ ఎస్జీ’, ‘పాకిస్థాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేక్ పాక్, మిస్టీరియస్ బాంగ్లాదేశ్, ఇండో హ్యాక్ సెక్, సైబర్ గ్రూప్ హోక్స్, పాక్ ప్రభుత్వ పరోక్ష సహకారంతో పనిచేసే ‘నేషనల్ సైబర్ క్రూ’ గ్రూపులు గతేడాది మే నెల సాంతం వరుస దాడులకు పాల్పడ్డాయి. అజ్రాయిల్ ఏంజెల్ ఆఫ్ డెత్ అనే పాలస్తీనా గ్రూప్ ఎన్నికల కమిషన్ సైట్లోకి చొరబడి 10లక్షల మంది ప్రజల డేటాను దొంగిలించాయి.

పాక్ మద్దతుతో చెలరేగిపోయిన హ్యాకర్ గ్రూపులు భారత పవర్ గ్రిడ్లపై దాడి చేసి విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో 70శాతం అంతరాయం కలిగించాయి. పాకిస్థాన్‌కు చెందిన ‘ఏపీటీ 36’ అనే హ్యాకింగ్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైందిగా దీనికి మరోపేరు ట్రాన్సపరెంట్ ట్రైబ్ అనే పేరు కూడా ఉందని నిపుణులు ఏడాదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు.

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో భారత్ ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తోందనే భావనతో పాలస్తినా హ్యాక్టివిస్ట్‌లు భారత్ పై గురిపెట్టారు. ఘోస్ట్ ఆఫ్ పాలస్తీనా, ఎనానిమస్ అరబిక్, క్రామెక్స్ వంటి గ్రూపులు మాల్ వేర్ దాడులు చేశాయి. డేటా చౌర్యానికి పాల్పడ్డాయి. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు తప్పుడు సమాచారం వ్యాప్తి చేశాయి. 2025లో భారత్‌పై 150కి పైగా హ్యాక్టివిస్టు గ్రూపులు రోజుకు 50 చొప్పున దాడులు చేశాయి. భారతీయ కంపెనీల నుంచి, ప్రభుత్వం నుంచి కీలక సమాచారాన్ని కాజేయడానికి పదే పదే యత్నించాయి. సెర్ట్ నెట్‌వర్క్, ఇండియన్ అయిల్, పోలీస్, బీఎసఎనఎల్ నెట్‌వర్కుల్లో చొరబడి కీలక సమాచారాన్ని రాబట్టాయి.

ప్రపంచ భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తతల నేపథ్యంలో దౌత్య, సైనిక పరిష్కారాలతో పోలిస్తే, సైబర్ దాడులే మెరుగైన ఫలితాలిస్తాయని అనేక దేశాలు నమ్ముతున్నాయి. తమ వైరి దేశాలపై సైబర్ దాడులకు తెగబడుతున్నాయి. మౌలిక వసతులను దెబ్బతీయడం, కీలక రంగాలను, రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయడానికి ర్యాన్సమ్ వేర్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. శత్రుదేశాలతో పాటు ఉగ్రవాద సంస్థలు సైతం సైబర్ వారియర్ బృందాలను నియమించి దాడులు చేస్తున్నాయి. సాంకేతిక యుద్ధంలో కోట్లాది రూపాయలను ఉగ్రవాద సంస్థలు కొల్లగొడుతున్నాయి.

2021లో ఢిల్లీకి చెందిన వ్యాపారి అకౌంట్లో నుంచి కొల్లగొట్టిన రూ.4.5 కోట్ల సొమ్ము హమాస్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయని ఇజ్రాయిల్ గూఢచార సంస్థ ‘మొస్సాద’ పసిగట్టి, భారత్‌ను అప్రమత్తం చేసింది. డబ్బు ఎవరికి చేరిందో ఐడీని కనిపెట్టినా…ట్రాక్ చేయడం క్లిష్టంగా మారడంతో భారత్ ‘మొస్సాద’ సాయం కోరింది. సైబర్ అస్త్రంతో భారత్‌లో కొల్లగొట్టిన డబ్బు హమాస్ సైనిక విభాగం అల్ కస్సమ్ బ్రిగేడ్‌కు చేరినట్లు తేలింది.

భారత్‌పై సైబర్ దాడులు చేస్తున్న వారిలో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటే చైనా, ఉత్తర కొరియాలు తర్వాత ఉంటాయి. భారత మిత్ర దేశం రష్యా సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఇండో నేసియాకు చెందిన ‘ఏనన్ బ్లాగ్ ఫాగ’, బంగ్లాదేశ్‌కు చెందిన హ్యక్టివిస్ట్ గ్రూపుల నుంచి ఇటీవలి కాలంలో ముప్పు పెరిగింది. ‘ఆపరేషన్ సిందూర’ తర్వాత పాకిస్థానీ హ్యాకర్లు భారతీయ వెబ్ సైట్ల రూపురేఖలు మార్చేస్తున్నారు. మాల్‌వేర్‌ను చొప్పిస్తున్నారు. హంతక దాడులు, సైబర్ దాడులు, మేధావులు, సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అనైతిక దాడులను వేరు వేరుగా చూడకూడదంటారు నిపుణులు. భారత్‌పై శత్రుదేశాలు బహుముఖీనమైన దాడి చేస్తున్నాయంటారు. ఏకకాలంలో రాజకీయ పక్షాలు మన ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి దిగడం..ఇదే సమయంలో పెహెల్గావ్ తరహా భయంకరమైన దాడులు చేయడం, ఇదే అదనుగా సైబర్ దాడులు చేయడం వల్ల… ప్రజల్లో ఒక రకమైన అభద్రత, అపనమ్మకం, అనవసర భయాలు పెరిగిపోతాయి. ఇలాంటి సంక్లిష్ట స్థితిలో జరిగే కీలక ప్రక్రియలు ఏవైనా.. ప్రభావితం కావడం సహజం.

 ప్రశాంత్ జోషి, జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE