పాలు పోస్తున్నాము కదా అని విషం కక్కే పాము మన మీద ఎప్పుడూ ప్రేమ చూపించదు. నీతి లేనివాడు తన నిజస్వరూపం చూపించినట్టు పాము కూడా తరచూ విషం కక్కుతూనే ఉంటుంది. ఈ పోలికలు మజ్లిస్ పార్టీగా పేరున్న ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తేహాద్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కు సరిగ్గా సరిపోతాయి. తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాల కోసం విష పాము లాంటి మజ్లిస్ పార్టీని వాడుకునే బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి “రెడ్డి అయినా… రావు అయినా.. మా వద్దకు రావాల్సిందే… మేము ఎప్పుడూ వారి వద్దకు వెళ్లము. వారే మా వద్దకు వస్తారు..” అంటూ ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అహంకారంగా వ్యాఖ్యానించినా వారికి గట్టి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలు చేసే ఏఐఎంఐఎం కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీల పుణ్యమా అని చాపకింద నీరులా తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న తీరు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాజకీయల్లో పార్టీల విస్తరణ సర్వసాధారణమే అయినా మజ్లిస్ విషయంలో ప్రమాదకరం అని వ్యాఖ్యానించడానికి హైదరాబాద్ పాతబస్తీలో వారు వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం.
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఆ పార్టీ ప్రమాదకర విస్తరణ తేటతేల్లమవుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పతంగి పార్టీ పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. ఇంతకాలం గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితమనే ముద్రను చెరిపేసుకుంటూ 2026 స్థానిక ఎన్నికల్లో 15 మున్సిపాల్టీల్లో 48 వార్డులను, 4 కార్పొరేషన్లలో 22 డివిజన్లతో మొత్తం 70 స్థానాల్లో పాగా వేసి రాష్ట్రంలో తన సత్తా చాటింది. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో 14 స్థానాలు గెలిచి బీజేపీకి మేయర్ పీఠం దూరం చేస్తూ కాంగ్రెస్‌తో కలిసి అధికారాన్ని పంచుకుంది. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో చెరో 3 డివిజన్లు, నల్గొండలో మరో 2 డివిజన్లు గెలిచింది. భైంసా, బోధన్ మున్సిపాల్టీలలో చెరో 12 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఆదిలాబాద్‌లో 6, నిర్మల్‌లో 3, జహీరాబాద్, నారాయణపేట, జగిత్యాలలో చెరో 2 డివిజన్లు, సంగారెడ్డి, కాగజ్ నగర్, గద్వాల, కోహీర్, కొడంగల్, వికారాబాద్, ఆర్మూర్, తాండూరు మున్సిపాల్టీల్లో చెరో ఒక వార్డు గెలిచి తెలంగాణలో అన్ని వైపులా తన ఉనికిని చాటుకుంది. కాంగ్రెస్‌తో జతకట్టి నిజామాబాద్ డిప్యూటీ మేయర్‌తో పాటు, బోధన్‌లో వైస్ చైర్మన్ పదవి పొందింది. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, బీఆరఎస్, ఇండిపెండెంట్లతో కలిసి వైస్ చైర్మన్ పదవి సాధించింది. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో అధిక స్థానాలు సాధించి మేయర్, చైర్మన్ పోస్టులకు కొద్ది దూరంలో నిలిచిన బీజేపీకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిన శక్తులతో చేతులు కలిపిన మజ్లిస్ పార్టీ అక్కడ విజయవంతమైంది. రాష్ట్రంలో 2020 మున్సిపల్ ఎన్నికల్లో 1,21,364 ఓట్లతో 3 శాతం ఓట్లు పొందిన ఈ పార్టీ 2026లో 1,24,236 ఓట్లతో 2.3 శాతం ఓట్లు సాధించింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి లభించిన ఓట్లలో పెద్దగా పెరుగుదల కనిపించకపోయినా భారీగా సీట్లు పొంది రాష్ట్రంలో పలుచోట్ల క్రియాశీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ “రెడ్డి అయినా.. రావు అయినా..” మాకేంటి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ తెలంగాణలో ఇతర జిల్లాల్లో కూడా విస్తరించ డానికి కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలే ప్రధాన కారణం. ఈ పార్టీలు అధికారం కోసం బుజ్జగింపు మత రాజకీయాలకు పాల్పడుతూ మజ్లిస్ విష సర్పాన్ని పెంచి పోషించాయి. ఈ రెండు పార్టీల బలహీన తలను వ్యూహాత్మకంగా తనకు అనుకూలంగా మజ్లిస్ మార్చుకుంది. అవసరమైనప్పుడు వీరికి మద్దతిస్తూ తమ పార్టీ విస్తరణతో పాటు ఇతర ప్రయోజనాలకు వాడుకుంటుంది. ఇందుకు ఉదాహరణ చూస్తే ఇటీవల గ్రేటర్‌లో హైడ్రా పలు అక్రమ కట్టడాలు కూల్చివేసినా ఓవైసీ సోదరుల ఆస్తుల వద్దకు వచ్చేసరికి ప్రభుత్వం చేతులు కట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. మూసీ సుందరీకరణ విషయంలో కూడా ఆ పార్టీ హెచ్చరికలకు ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ఎదుటివారి బలహీనతలను సొంత ప్రయోజ నాలకు ఉపయోగించుకోవడం మజ్లిస్ పార్టీకి కొట్టిన పిండి. కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పలు అవసరాలకు వాడుకున్న ఆ పార్టీ అనంతరం మొండి చేయి చూపడం పరిపాటి. తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్‌తో, అనంతరం బీఆరఎస్‌తో, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌తో జట్టు కట్టింది.
మజ్లిస్ పార్టీ ఆడుతున్న రాజకీయ పాచికల నుండి పాఠాలు నేర్వని ఈ రెండు పార్టీలు నవ్వుల పాలవుతున్నా అధికారమే పరమావధిగా చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ ఓవైసీ సోదరులు ఏమన్నా, ఏమి చేసినా దులుపుకుంటున్నాయి. రెడ్డి.. రావు.. ఎవరైనా అంటూ జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ గెలిచిందని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానిస్తే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తప్ప ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరూ ముందుకొచ్చి మాట్లాడలేకపోయారు. ఆయన కూడా సుతిమెత్తగా మేము ప్రజా బలంతో గెలిచామన్నారే కానీ, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు సూటిగా గట్టిగా సమాధానం ఇవ్వలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ పాతబస్తీలో మూడు, నాలుగు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పుణ్యమాని ఇప్పుడు తెలంగాణలో ఏడు అసెంబ్లీ స్థానాలను తనకు కంచు కోటగా మార్చుకుంది. 2009లో నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఇటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో, అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో సమయం చూసి పాచిక లేసింది. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాల్లో ఆరితేరిన మజ్లిస్ పార్టీ నేతలకు జంకిన నాటి ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనలో వారి మాటలకు వత్తాసు పలకడంతో నగర ప్రజలకు ప్రధానంగా పాతబస్తీ వాసులకు శాపంగా మారింది. గతంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, కార్వాన్ అసెంబ్లీ సెగ్మంట్లతో పాటు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ మజ్లిస్ పార్టీ గట్టి పోటీ ఎదుర్కొనేది. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హిందూ ఓటర్లున్న ప్రాంతా లను విభజించడం, ముస్లిం ఓట్లున్న ప్రాంతాలను ఒక్కటిగా చేయడంతో అసెంబ్లీ నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, కార్వన్, బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, మలక్‌పేట నియోజవకవర్గాలు ముస్లిం మత ప్రాతిపదికన మజ్లిస్‌కు కంచుకోటగా మారిపోయాయి. 2009 పునర్విభజనకు ముందు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి నగర శివార్లయిన చేవెళ్ల, పరిగి, వికారాబాద్ సెగ్మంట్లు కూడా ఉండడంతో ఆ పార్టీకి గట్టి పోటీ ఉండేది. 2009లో నియోజక వర్గాల పునర్విభజనతో పాటు ముస్లిం జనాభా పెరుగుదల, అక్రమ వలసలు అన్నీ కలిసి ప్రస్తుతం నగరంలో ప్రధానంగా నగర దక్షిణ ప్రాంతంలో మజ్లిస్ పార్టీకి ఎదురన్నది లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే నగరంలో ఆ పార్టీ ఇప్పుడున్న 7 స్థానాలకు అదనంగా మరో ఒకటి రెండు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి గెలిచినా ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలతో విష వక్షంలా పెరిగిన మజ్లిస్ పార్టీ బీఆరఎస్ రూపంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీతో రాష్ట్ర ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆరఎస్ అధికారంలోకి రాగానే జతకట్టడం విచిత్ర రాజకీయా లకు ఉదాహరణ. అంతవరకూ కాంగ్రెస్‌తో పూసు కొని తిరిగిన ఓవైసీ సోదరులు బీఆరఎస్ అధికారం లోకి రాగానే వారిపై ప్రేమ పెరిగి కేసీఆర్‌ను కౌగిలించుకున్నారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలేసుకున్న మజ్లిస్ పార్టీ 2016 జీహెచఎంసీ ఎన్నికల సందర్భంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే భౌతిక దాడికి ప్రయత్నించింది. తర్వాత 2023 వరకు బీఆరఎస్‌తో చెలిమి చేసిన ఓవైసీ సోదరులు కేసీఆర్‌కు దేశ ప్రధానమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతులున్నాయని ప్రకటిస్తూ తమ అవసరాలను తీర్చుకున్నారు. కాలచక్రం తిరిగింది. బెదిరింపులతో అధికారంలో ఉన్న వారి పంచన చేరడం పరిపాటిగా మార్చుకున్న మజ్లిస్ పార్టీ కేసీఆర్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గేరు మార్చి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యింది.
నామమాత్రం బలంతో ఉండే మజ్లిస్ పార్టీ చెప్పుచేతుల్లో కాంగ్రెస్, బీఆరఎస్ బందీలు కావడానికి మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలొక కారణమయితే, మరో ప్రధాన కారణం శాంతిభద్రతల అంశం. ఆ పార్టీతో ఘర్షణ వైఖరి ఉంటే సున్నితమైన పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే అభద్రతాభావంతో బీఆరఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఓవైసీ సోదరులకు దాసోహం అన్నాయి. కాంగ్రెస్, బీఆరఎస్ బానిసత్వమే ఆ పార్టీ బలానికి ప్రధాన కారణం. హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆరఎస్‌లపై ఒత్తిడి తెచ్చి బలమైన హిందూ అభ్యర్థులను దింపి హిందు ఓట్లను చీలుస్తూ, ముస్లిం ఓట్లను గంపగుత్తగా పొందుతూ మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. అందుకే కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీ అభ్యర్థులు టికెట్ల కోసం వారి పార్టీ కార్యాలయాల కంటే మజ్లిస్ కార్యాలయం దారూ సలం చుట్టూ తిరుగుతుంటారు. మరోవైపు ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉండే నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు చీలకుండా స్వార్థ ప్రయాజనాల కోసం తమ చెప్పుచేతుల్లో ఉండే పార్టీకి మద్దతిస్తుంటారు. ఇటీవల జరిగిన జూబ్లీహీల్స్ ఉప ఎన్నికలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు ముస్లింల ప్రభావముండే ఖైరతా బాద్, ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు చీలకుండా బీజేపీ ఓటమి కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్ని స్తుంటుంది.
మైనార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలతో మజ్లిస్ వ్యవహరిస్తుంటే బీఆరఎస్, కాంగ్రెస్ పార్టీలు స్వార్థప్రయోజనాల కోసం ఆ పార్టీతో లాలూచీ పడుతున్నాయి. ఈ పరిస్థితి బీజేపీని వ్యూహాత్మకంగా బలహీనపరిచే వాతావరణాన్ని తెచ్చి పెట్టే అవకాశాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో నియోజక వర్గాల పునర్విభజనను అవకాశంగా తీసుకొని బలపడిన మజ్లిస్ పార్టీ 2026లోనూ అదే వ్యూహాలను రచిస్తోంది. త్వరలో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. మరోవైపు అధికార సౌలభ్యం పేరుతో గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరోక్షంగా నగరాన్ని మజ్లిస్ పార్టీకి కట్టబెట్టనుంది. ఆ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను కార్పొరేషన్‌గా రూపొం దించి వారికి అప్పగిస్తోంది. నగరంలో హిందువులు అధికంగా ఉండే ప్రాంతాలను రెండు కార్పొరేషన్లుగా చేసిన ప్రభుత్వం మైనార్టీల ప్రభావం ఉన్న ప్రాంతా లను ఒక కార్పొరేషన్‌గా చేసింది. 150 డివిజన్లతో జీహెచఎంసీ, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజిగిరి మొత్తం 300 వార్డులతో అశాస్త్రీయంగా మూడు ముక్కలు చేశారు.
చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రా బాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ ఎంసీ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్లుగా విభజించారు. మజ్లిస్ పార్టీకి 60`70 స్థానాలు వచ్చేలా జీహెచఎంసీని ఏర్పాటు చేశారు. హిందువులు అధికంగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలను జీహెచఎంసీ నుండి వేరుచేసి ముస్లింలు అధికంగా ఉండే చార్మినార్, గోల్కొండ, రాజేంద్రనగర్‌కు తోడుగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, శంషాబాద్ జోన్లలో చేర్చారు. ఖైరతాబాద్‌లోని జూబ్లీహీల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, సికింద్రాబాద్‌లోని కవాడిగూడ, ముషీరాబాద్, శంషాబాద్‌లోని జల్‌పల్లి, బడంగ్‌పేట ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉండడంతో జీహెచఎంసీలో మజ్లిస్ బలం పెరగడం ఖాయం. కార్పొరేషన్ల ఏర్పాటులో కుట్రలున్నాయనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాభిప్రాయం లేకుండా, రాజకీయ పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేయ కుండా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలున్నాయి. మరో కీలకాంశం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనగణన ప్రారంభిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా సరిహద్దులు మారుస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. జనగణనను దష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, తిరుపతి గ్రేటర్ నిర్ణయాలను వాయిదా వేసిన సంగతి ఇక్కడ గమనార్హం.
ఆదిలోనే మజ్లిస్ పార్టీ వ్యూహాలను, బలాన్ని అడ్డుకోకపోతే దీర్ఘకాలిక పర్యవసానాలు ఎదుర్కో వాల్సి ఉంటుందని గత అనుభవాలే నిరూపిస్తు న్నాయి. 2009 తప్పిదాలతో భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పుడు గ్రేటర్‌లో కార్పొరేషన్ల విషయంలో కూడా స్పందించకపోతే నగరంలో ఆ పార్టీ ఆగడాలను అంతులేకుండాపోతుంది. బీఆరఎస్, కాంగ్రెస్ కుహనా సెక్యులర్‌వాదంతో మజ్లిస్ పార్టీకి దాసోహం అన్నాయి. ఈ ఆగడాలను అడ్డుకోవాల్సిన బీజేపీ కూడా క్రియాశీలకంగా వ్యవహరించకుండా ప్రకటనలకే పరిమితమైతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టవుతుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముస్లిం ఓట్ల శాతం గురించి మాట్లాడుతూ నిజామా బాద్‌లో 41శాతం, కరీంనగర్‌లో 23, ఆదిలాబాద్‌లో 27, నల్లగొండలో 24, భైంసాలో 54, బోధన్‌లో 55, జహీరాబాద్‌లో 44, కోహీర్‌లో 55, తాండూ రులో 44, సంగారెడ్డిలో 34, కోరుట్లలో 33 శాతం ముస్లిం ఓట్లు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పారు. ఓట్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నప్పుడు స్థానిక పార్టీ నాయకులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న ఉదయి స్తుంది. అంతా అయిపోయాక న్యాయపోరాటం చేస్తా నంటే అది న్యాయస్థానం ముందు కూడా నిలబడదు. ఇదే సమయంలో అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన ‘సర’ పై పార్టీ శ్రేణులను, ముస్లింలను అప్రమత్తం చేస్తూ ముస్లిం ఓట్లు ‘సర’లో ఉండేలా చూసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇదే సమయంలో ఒకవైపు పాతబస్తీ వంటి ముస్లిం ప్రాంతాల్లో హిందువుల ఓట్లు తొలగి పోకుండా, మరోవైపు అక్రమ ఓటర్లు, వలస ఓటర్లు జాబితాలో ఉండకుండా బీజేపీ తమ పార్టీ శ్రేణులను జాగృతం చేయడంతోపాటు త్వరలో జరిగే నియోజక వర్గాల పునర్విభజనలో కూడా గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలి.
అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మారుపేరుగా మజ్లిస్ పార్టీ నిలుస్తున్నందుకే పాతబస్తీలో వరుసగా మేము గెలుస్తున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నా అది అవాస్తవం. పాతబస్తీలో గెలుస్తున్న ఆ పార్టీ అక్కడ అభివృద్ధికంటే మత రాజకీయాలకే ప్రాధాన్య తను ఇస్తూ సెంటిమెంట్‌తో విజయాలు సాధిస్తుంది. నాలుగు దశాబ్దాలకుపైగా అక్కడ గెలుస్తున్న మజ్లిస్ పార్టీ హయాంలో పాతబస్తీ అభివృద్ధి ఏమేరకు జరిగిందో అందరికీ తెలిసిందే. 2000 సంవత్సరం తర్వాత వెలిసిన ప్రాంతాలతో పోలిస్తే పాతబస్తీ పూర్తిగా వెనుకబడడానికి కారణం ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలి. ప్రభుత్వాలతో అంటకాగే ఓవైసీ సోదరులు పాతబస్తీ అభివృద్ధి కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పడానికిì ఆ ప్రాంత దుస్థితి తార్కాణంగా నిలుస్తోంది. ఒకానొక సందర్భంలో మాజీ సీఎం రోశయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నా అక్కడి స్థానిక రాజకీయాలు, నేతలు సహకరించడం లేదని నర్మగర్బంగా చెప్పడం ఇక్కడ గమనించాల్సిన అంశం. గ్రేటర్‌లో చేపట్టిన మెట్రో రైలు మొదటి దశలో పాతబస్తీలో పనులు పూర్తి కావాల్సి ఉన్నా మజ్లిస్ పార్టీ అడ్డుకోవడంతోనే నాటి బీఆరఎస్ ప్రభుత్వం పనులు ప్రారంభించడానికి వెనకడుగు వేసిందనేది బహిరంగ రహస్యం. దీంతో పాతబస్తీ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్లింది.
బీజేపీ వ్యతిరేక పార్టీలు వాటి స్వార్థ ప్రయోజ నాల కోసం లౌకికవాదం పేరుతో మత ఛాందసంతో రాజకీయాలు నడిపే మజ్లిస్ పార్టీతో అంటకాగుతూ ఆ పార్టీకి పూర్తిగా దాసోహం అంటున్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి శక్తులను ఆదిలోనే అడ్డుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉంది. గ్రేటర్‌లో కార్పొరేషన్ విభజనతో పాటు త్వరలో జరిగే ‘సర’ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజనలో జాగృతం కాకపోతే మరో తరం నష్ట పోవాల్సిన పరిస్థితులు ఏర్పడు తాయి. ఇప్పటికే పాతబస్తీలో వారి ఆగడాలతో ఎంతో మంది హిందువులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇప్పటికైనా మేలుకోకపోతే ఇకపై కొత్త నగరం వంతు అవుతుంది. అందరూ కలిసికట్టుగా విస్తరిస్తున్న విష సర్పం కోరలు తీయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరో పాతిక సంవత్సరాలు దుష్ట శక్తులతో బాధపడాల్సి వస్తుంది.
– శ్రీపాద