సెప్టెంబర్‌ 17 ‌మోదీ జన్మదినం

ఏడున్నర దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో మరెవరికీ దక్కనటువంటి అరుదైన, అసాధారణమైన ఘనత ఆయనది. నరేంద్ర దామోదర్‌ ‌దాస్‌ ‌మోదీ. ఆధునిక కాలపు భారతదేశ చరిత్రకు కేంద్ర బిందువు. సామాన్య కుటుంబంలో జన్మించి అంచె లంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌కు ప్రధానిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక తను దక్కించుకున్నారు. సెప్టెంబర్‌ 17‌న 75వ జన్మదినం జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ జీవితం భారతీయులకు, భారత ప్రజాస్వామ్యానికి కూడా ఒక కొండ గుర్తు.

పెహల్గావ్‌ ఉదంతం తరువాత ఆయన పాకి స్తాన్‌ను లొంగదీసిన వైనం చెప్పుకోదగినది. అమెరికా అధ్యక్షుడి ఫోన్‌ ‌కాల్‌ను నాలుగుసార్లు పట్టించుకోక పోయినా, మోదీ తనకు మంచి మిత్రుడని ట్రంప్‌ ‌చెప్పవలసి వచ్చింది. ఆయన రాజకీయ సంకల్పం, దేశం పట్ల నిబద్ధత ఇటీవలి అద్భుతాలు. ప్రధాని మోదీ ఇంతటి ప్రజాదరణ ఎలా పొందగలుగు తున్నారో అర్థం చేసుకోవాలంటే ఆయన జీవిత మూలా ల్లోకి వెళ్లాలి. పేదరికంలో పుట్టి పెరగడమే తనకు మొదటి స్ఫూర్తి అని ‘టైమ్‌’ ‌మ్యాగజైన్‌ ఇం‌టర్వ్యూలో అన్నారు మోదీ.

దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడేళ్లకు సెప్టెంబర్‌ 17, 1950‌న నరేంద్ర దామోదర్‌దాస్‌ ‌మోదీ జన్మించారు. మోదీ చిన్నతనంలో తిండి కోసం పడ్డ కష్టాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తన తల్లి ఇల్లు గడవడానికి నాలుగు ఇళ్లలో పని చేసేదని, తన తండ్రి స్థానికంగా ఉన్న స్టేషన్‌లో ఛాయ్‌ అమ్ముకుని జీవించేవారని, తండ్రికి సహాయంగా తానూ వెళ్లేవాడినని తరచూ చెప్తుంటారు.

నరేంద్రునికి చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌తో పరిచయమైంది. ప్రచారక్‌గా సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు సాధించి, దృఢమైన నేతగా ఎదిగారు. చిన్నప్పుడు సైన్యంలో చేరాలని జామ్‌నగర్‌ ‌సైనిక్‌స్కూల్‌లో ప్రవేశానికి ప్రయత్నించారు కూడా. కానీ, ఆర్థిక సమస్యలతో ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే.. 1965 ఇండో-పాక్‌ ‌వార్‌ ‌సమయంలో స్టేషన్‌కు చేరుకునే భారత సైనికులకు టీ అందించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నట్లు చెప్పేవారు.

మోదీ తన 17వ ఏట తొలిసారి దేశ పర్యటనకు వెళ్లారు. కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ప్రయత్నించారు. అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. అందుకే ఆయన రాజకీయ దృష్టిలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా అంతర్లీనంగా ఉంటుంది. 20 ఏళ్లు వయసు నాటికి ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు.

మోదీ తన పర్యటనను ముగించుకొని స్వగ్రామ మైన వాద్‌ ‌నగర్‌ ‌కి చేరుకున్నారు. అనంతరం తల్లి హిరాబాయి దీవెనలు తీసుకొని అహ్మదాబాద్‌లో మేనమామ నడుపుతున్న ఆర్టీసీ క్యాంటిన్‌లో పని చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తన గురువు లక్ష్మణరావు ద్వారా తిరిగి ఆర్‌ఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. సంఘ కార్యక్రమాల్లో చురుకగా పాల్గొంటూ 1975లో గుజరాత్‌లో విశ్వహిందూ పరిషత్‌ ‌తలపెట్టిన సాధు పరిషత్‌ ‌కార్యక్రమ బాధ్యత లను సమర్థవంతంగా నిర్వహించడంలో భాగస్వామి అయ్యారు. తర్వాత ఏబీవీపీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ‘గుజరాత్‌ ‌లోక్‌ ‌సంఘర్ష్ ‌సమితి’కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఒక మనిషి దేశభక్తి ప్రజాస్వామ్యంలోనే ఎక్కువ రాణింపునకు వచ్చే అవకాశం ఉందని రుజువు చేసిన వారు బీజేపీ ఇద్దరు ప్రధానులు. అటల్‌ ‌బిహారీ వాజపేయి సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. మోదీ కూడా అంతే. కానీ వీరి దేశభక్తి అత్యున్నత పీఠం వైపు నడిపించింది.1986లో భారతీయ జనతా పార్టీలో చేరిన మోదీ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టారు. దీనికి నాటి పార్టీ జాతీయ అధ్యక్షుడు లాల్‌ ‌కృష్ణ అడ్వానీ ప్రోత్సాహం తోడైంది. అనతి కాలంలోనే గుజరాత్‌ ‌రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్య దర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1990లో అడ్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు గుజరాత్‌ ఇన్‌చార్జీగా, 1992లో మరళీ మనోహర్‌ ‌జోషి చేపట్టిన కన్యా కుమారి-కశ్మీర్‌ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్‌చార్జీగా పనిచేశారు.

1995లో గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోదీ కీలక పాత్ర పోషిం చారు. ఈ విజయం తరువాత పార్టీ మోదీని హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌హర్యానా రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించింది. అలా కొంత కాలం గుజరాత్‌ ‌రాజకీయాలకు దూరంగా ఉన్నారు. శంకర్‌ ‌సింగ్‌ ‌వాఘేలా రూపంలో పార్టీలో చీలిక వచ్చి రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక వర్గం ఖజారియాగా, మరో వర్గం హుజూరియాగా పేర్గాంచాయి. ఆ సమయంలో ఓ జర్నలిస్టు మీరు ఏ శిబిరం అని అడిగితే తాను మజ్బూరియా అని చెప్పారు.. అంటే తాను పని చేసేవాడిని మాత్రమే అని.

గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా..

2001లో గుజరాత్‌లోని కచ్‌ ‌ప్రాంతంలో సంభ వించిన భారీ భూకంపం తర్వాత సహాయ కార్యక్ర మాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫల మైందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. 2001 అక్టోబరులో నరేంద్ర మోదీని గుజరాత్‌ ‌సీఎంగా ప్రకటించింది. అప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయని మోదీ ఉప ఎన్నికలో రాజ్‌కోట్‌ ‌నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ‌ఘటన తర్వాత రాష్ట్రవాప్తంగా అల్లర్లు చెలరేగినప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ గుజరాత్‌ ‌ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా దుష్ప్రచారం సాగించింది. మోదీ, బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలనే డిమాండ్‌ ‌వినిపించడంతో శాసనసభను రద్దుచేసి మళ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు.

2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 126 స్థానాలలో విజయం సాధించడంతో మోదీ వరసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. తన అధికారాన్ని సుసిర్థం చేసుకున్నారు. గుజరాత్‌ను ప్రగతి పథంలో నడిపించి దేశంలోనే ఉత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. 2007, 2012ఎన్నికల్లో కూడా మోదీ నాయత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌కు వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మోదీ తన గుజరాత్‌ అభివృద్ధి నమూనా ద్వారా దేశ ప్రజల దృష్టిలో అద్భుత నాయకునిగా గుర్తింపు పొందారు

2013లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ’గుజరాత్‌ ‌మోడల్‌’ఎం‌తగానో ఉపకరించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్టానం నరేంద్రమోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది. నరేంద్ర మోదీ వారణాసి నుంచి దాదాపు 5 లక్షల భారీ మెజారిటీతో గెలు పొందారు. ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఆర్టికల్‌ 370 ‌రద్దు, పౌరసత్వం సవరణ చట్టం, ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌రద్దు, రామమందిర నిర్మాణం వంటి ఎన్నో ఉన్నాయి.

పీఎం కిసాన్‌సమ్మాన్‌ ‌నిధి, ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన, శ్రమయోగి మాన్‌ ‌ధన్‌ ‌యోజన, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం, ఆయుష్మాన్‌ ‌భారత్‌, ‌ప్రధాన మంత్రి జన్‌ ‌ధన్‌ ‌యోజన, జన్‌ ‌సురక్ష, పిఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి, మేక్‌ ఇన్‌ ఇం‌డియా, యోగా దివస్‌ ‌వంటి పథకాలు ప్రవేశపెట్టారు. 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు. 2024లో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మోదీ. కుటుంబ పాలనలు సాగుతున్న ఈ రోజుల్లో బంధుప్రీతి చూపకుండా యావత్‌ ‌దేశం తన కుటుంబంగా భావించి పరిపాలన కొనసాగించడం ఈ దేశంలో ఎంత మంది రాజకీయ నాయకులకు సాధ్యం?

‘సబ్‌ ‌కా సాథ్‌, ‌సబ్‌ ‌కా విశ్వాస్‌’ ‌మంత్రంతో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహిత మైన పాలన అందించే దిశగా ఒక కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. అంత్యోదయ అంటే చివరి వ్యక్తికి కూడా పథకాలు, సేవలను అందించాలన్న ధ్యేయంతో కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచంలో అతి పెద్దదైన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్‌. 50 ‌కోట్ల మంది భారతీయుల కు వర్తించే ఈ కార్యక్రమం పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను సమకూర్చుతోంది.

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయంలో చైనా మన దేశ భూభాగాలను ఆక్రమించినా ధీటుగా జవాబు ఇవ్వలేదు. కానీ 2017లో భారత్‌, ‌భూటాన్‌ ‌సరిహద్దుల్లోని డోక్లామ్‌లో చైనా చొరబాటును మన సైన్యం గట్టిగా ప్రతిఘటించింది. 2020లో లద్దాక్‌ ‌లోని గాల్వాన్‌ ‌లోయలో చైనా సైనికుల అతిక్రమణను మన సైనికులు అడ్డుకున్నారు. ఈ రెండు ఘటనలతో చైనాకు భారత్‌ ‌గట్టి బుద్ది చెప్పింది.

భారత్‌ ‌గతంలో ఇతర దేశాల వెంట, ముఖ్యంగా అమెరికా వెంట పరుగులు తీసేది. ఇప్పుడు అగ్రరాజ్యం మనను గుర్తించేలా చేస్తున్నాం. తాజాగా అమెరికా విధించిన సుంకాలకు కూడా లెక్క చేయలేదు ప్రధాని మోదీ. అమెరికా, యూరప్‌ ‌దేశాల ఆంక్షలను పెడచెవిన పెట్టి చౌకగా రష్యా నుండి ఆయిల్‌ ‌కొనుగోలు చేశారు. బ్రిక్స్ ‌దేశాల కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెచ్చే ప్రయత్నాల ద్వారా అమెరికాకు షాక్‌ ఇచ్చారు ప్రధాని మోదీ. గ్లోబల్‌ ‌లీడర్‌లలో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.

స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మొదటి ప్రధాని, ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానిగా ఘనత సాధించిన నరేంద్రమోదీ ఖాతాలో మరో రికార్డ్ ‌చేరింది. రెండుసార్లు మెజారిటీతో గెలిచిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడిగా నిలిచిన నరేంద్ర మోదీ అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ ‌దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరిట ఉండేది. తాజాగా ప్రధాని మోదీ ఈ ఘనత సాధించారు. హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి అత్యధిక కాలం పనిచేసిన ప్రధాని కూడా మోదీనే. రెండు పూర్తి వరుస పదవీకాలాలను పూర్తి చేసిన, రెండుసార్లు మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి, ఏకైక కాంగ్రెసేతర నాయకుడు నరేంద్ర మోదీ. లోక్‌సభలో సొంతంగా మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెసేతర నాయకుడుగా నిలిచారు. అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీనే. పలు దేశాలు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. తన బంధువులకు కూడా ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. దానితో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాహితం దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాడనే  ప్రజలకు ప్రగాఢ విశ్వాసం ఉన్నది.అది ఆయన ప్రధాన మంత్రి అయిన తర్వాత కూడా నిరూపిత మైంది. మోదీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసినా అలసిపోరు. ఆ పని వల్లే తనకు నిద్ర దూరమైందని, కాకపోతే యోగా, ప్రాణాయామం వల్ల తాను ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలుగు తున్నానని మోదీ తరచూ చెప్తుంటారు.

ఉన్నత పదవుల్లో, స్థానాల్లో ఉన్నవాళ్లు తరచూ విరామం తీసుకోవడం చూస్తుంటాం. కానీ, నరేంద్ర మోదీ మాత్రం గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా.. పదమూడేళ్లలో ఏనాడూ సెలవు పెట్టింది లేదు. అసలు ఆయన అంతకాలంలో జ్వరం బారిన పడిన దాఖలాలు, విరామం తీసుకున్నారనేది కూడా లేకపోవడం విశేషం. ఇప్పుడు ప్రధానిగానూ దేశం కోసం ఆయన అదే నిబద్దతను ప్రదర్శిస్తున్నారు. నిత్యం యోగా చేసే అలవాటు ఉన్న ఆయన.. పక్కా శాకాహారి. ఫొటోగ్రఫీ, కవితలు-పద్యాలు రాయడం ఆయనకు ఇష్టం. ఆయన ఫొటోలతో చాలాసార్లు ఎగ్జిబిషన్‌ ‌కూడా నిర్వహించారు.మరి ఇలా మంచి లక్షణాలు ఉండి రాజకీయాల్లో విజయం సాధిస్తున్న నాయకులు ఎందరు ఉన్నారు.

క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE