‌ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక చేత్తో ఆకాశం వైపు చూపించి మరో చేత్తో వీపు విమానం మోత మోగించడంలో దిట్ట. అది 2019లో బాలాకోట్‌ ‌దాడులు కావొచ్చు. మే7న అర్ధరాత్రి దాటాక ఒంటిగంటా నలభై నాలుగు నిమిషాలకు ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పేరిట పాకిస్తాన్‌లో, పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌(‌పీవోకే)లో తొమ్మిది ఉగ్రమూకల స్థావరాలపై దాడి కావొచ్చు. ఇలా రెండు సందర్భాల్లోనూ మోదీ చేసిన పర్యటనలు, ప్రసంగాల మాయా వలలో పడి పాకిస్తాన్‌ ‌దారుణంగా దెబ్బతింది. ఏ మాత్రం ఊహకందని భారత్‌ ‌ప్రధాని వ్యూహంతో మ్రాన్పడిపోయింది. గేలానికి చిక్కిన చేపలా గిలగిలాడిపోయింది.

ఒక అడుగు(బాలాకోట్‌) ‌పడితే అది భంగిమ, రెండు అంతకు మించి అడుగులు పడితే (ఆపరేషన్‌ ‌సింధూర్‌) అది సమరానికి మోదీ చేసే నృత్యమవు తుంది. ఇంకా చెప్పాలంటే అది ఎలాంటి సంకేతాల్లేకుండా అంతర్జాతీయ వేదికపై విస్ఫోటనం సృష్టించే భావగర్భితమైన తాండవం ఔతుంది. ఈ రెండు దాడులు జరగడానికి ముందు చోటు చేసుకున్న ఘటనల మధ్య సారూప్యత అత్యంత అసాధారణ మైంది. పాకిస్తాన్‌ ‌బాలాకోట్‌ ‌దాడులకు ముందు ప్రధాని మోదీ ఎలా ప్రవర్తించి చూసింది. ఆపరేషన్‌ ‌సిందూర్‌కు ముందు ఆయన చేష్టలను, మాటలనూ చూసింది. బాలాకోట్‌ ‌దాడుల నుంచి నేర్చుకున్న పాఠంతోనైనా ఆపరేషన్‌ ‌సిందూర్‌ను ముందుగా కనిపెట్టడంలో తన అసమర్థతకు, తెలివి తక్కువతనానికి అది తన చెప్పుతో తనను తానే చెడామడా కొట్టుకోవాలి.

బాలాకోట్‌ ‌దాడులకు 48 గంటల ముందు

భారత్‌ ‌ఫిబ్రవరి 26, 2019న తెల్లవారక ముందే బాలాకోట్‌ ‌దాడులకు పాల్పడింది. అయితే ప్రధాని మోదీ దాడులు జరగడానికి 48 గంటల ముందు యధావిధిగా తన రోజువారి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన భారత సాయుధ బలగాల ధైర్య సాహసాల గురించి మాట్లాడారు. అయితే ప్రధాని పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ‌పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో ఉగ్రమూకల స్థావరాలపై జరుప తలపెట్టిన దాడుల గురించి నామమాత్రంగా  నైనా ప్రస్తావించలేదు సరికదా ఎలాంటి సంకేతా లనూ ఇవ్వలేదు.

ఫిబ్రవరి 25 రాత్రి 9 గంటలకు భారత యుద్ధ విమానాలు టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మోదీ సరిగ్గా అదే సమయానికి న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన భారత్‌ ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి సంకల్పం గురించి మాట్లాడారు. ప్రధాని ప్రసంగిస్తున్నప్పుడు నేపథ్యంలో గడియారం టిక్కు టిక్కు మంటున్నప్పటికీ ఆయన హావభావాల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. మోదీ నుదురు ముడతపడలేదు. ముఖంపై ఆందోళన లేదా అనుమానం రేఖామాత్రంగానైనా కనిపించలేదు.

మనస్తత్వవేత్తలు చెప్పిన దాన్ని బట్టి ఒక గొప్ప నేత ఎప్పుడూ కూడా పెను ఉత్పాతం విరుచుకు పడుతున్నప్పటికీ ప్రశాంతతను, అగ్ని కీలలు ముంచుకొస్తున్నప్పటికీ గుండె ధైర్యాన్ని కలిగి ఉంటారు. దీనికి ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఒక తార్కాణంగా చూసి వారు ఆనందపడి ఉంటారు. ఇదే విషయాన్ని మున్ముందు ప్రచురితమయ్యే వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో ఒక అధ్యాయంగా మనం చూడవచ్చు.

ఆపరేషన్‌ ‌సిందూర్‌కు కొద్ది గంటల ముందు

ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌కార్యరూపం దాల్చడానికి కొద్ది గంటల ముందు అంటే మే 6వ తేదీ రాత్రి న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి ఒక ఆర్థిక శక్తిగా అవతరించడంలో భారత్‌ ఆకాంక్షలు, కలలు గురించి ఆయన మాట్లాడారు. ఆరేళ్ల క్రితం బాలాకోట్‌ ‌దాడులు జరగడానికి ముందు రోజు రాత్రి కూడా మోదీ ఒక సదస్సులో పాల్గొనడం గమనార్హం. మే 6వ తేదీ రాత్రి సదస్సు విషయానికి వస్తే ప్రధాని 30 నిమిషాలు మాట్లాడినప్పటికీ నిండుకుండలా తొణక్కుండా ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి, తొట్రుపాటు లేకుండా ప్రశాంతంగా ప్రసంగించారు. మధ్య మధ్యలో జోకులు కూడా వేశారు. ప్రధాని ఆ మాట ఎప్పుడెప్పుడు అంటారా? అని సభికులు ఆత్రంగా ఎదురు చూసినప్పటికీ పాకిస్తాన్‌ ‌గురించి మోదీ పల్తెత్తు మాట కూడా అనలేదు. ఫిబ్రవరి 25 రాత్రి, 2019లో ఎలాగైతే ఓ ధీమా కలిగి స్థితప్రజ్ఞతను సంతరించు కున్న నేతలా వ్యవహరించారో మే 6 రాత్రి, 2025లో కూడా అదే వైఖరిని ప్రధాని మోదీ ప్రదర్శించారు.

మరీ లోతుగా పరిశీలిస్తే తప్ప ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గురించి తన ప్రసంగంలో ఆయన ఇచ్చిన సంకేతం బోధపడదు. ప్రధాని ‘‘జనం ఏమంటారో’’ అనే భయంతో కీలకమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాల చేతకానితనం గురించి మాట్లాడారు. అన్నిటికన్నా కూడా దేశానికి మరీ ముఖ్యంగా జాతి ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యత (నేషన్‌ ‌ఫస్ట్) ఇవ్వాలని అన్నారు. కానీ ఆ సందర్భంలో అక్కడ ఉన్న మైండ్‌ ‌రీడర్లు మాత్రమే ఆపరేషన్‌ ‌సిందూర్‌కు సంబంధించి మోదీ ఆలోచనల నుంచి మాటల రూపంలో వెలువడిన సంకేతాలను డీకోడ్‌ ‌చేయగలరు.

పాకిస్తాన్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ఉం‌డదులే అన్న భ్రమల్లో ఉండిపోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటిగా భారత్‌ అం‌తటా మాక్‌ ‌డ్రిల్‌ ‌నిర్వహించా లంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను చెప్పుకోవచ్చు. మోదీ ఆ ప్రకటనతో యావత్‌ ‌దేశాన్ని సైనిక చర్య, దాని విపరిణామాలకు సిద్ధం చేస్తూ ఉండిపోయారనే భావనలో మతోన్మాద దేశం ఉండిపోయింది. కానీ ఇదంతా కూడా తనను మహేంద్ర జాలంలో ఉంచడానికి భారత ప్రధాని పన్నిన వ్యూహం అని తెలుసుకునేసరికి పాకిస్తాన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అందుకే యుద్ధ వ్యూహాలను, తంత్రాలను ఔపోసన పట్టినవారు అంటుంటారు.. ‘‘నువ్వు కనుక నీ శత్రువును గురించి పూర్తిగా తెలుసుకోగలిగితే చాలు యుద్ధంలో విజయలక్ష్మి నిన్నే వరిస్తుంది’’ అని. పాకిస్తాన్‌ ఇకనుంచి ప్రధాని మోదీని చదివే పని మొదలుపెడుతుంది. ఆయన మా•ల వెనుక మర్మాన్ని డీకోడ్‌ ‌చేయడానికి ప్రయత్నిస్తుంది. మోదీ చేతల్లో దాగి ఉన్న చాణక్యాన్ని కనుక్కోవడానికి ప్రయాస పడుతుంది. ఆయన ముఖంలో మచ్చుకైనా కనిపించని ఒత్తిడి, ఆత్రుత తాలూకు సంకేతాలను ఒడిసిపట్టడానికి వేగిరపడుతుంది. అయినా ఆ మందమతికి అవి అంత తేలిగ్గా అంతుపట్టవు.

అసాధ్యం అనే మాట ఎవరికైనా వర్తిస్తుందేమో కానీ అది మోదీకి మాత్రం ముమ్మాటికి వర్తించదు. భారత ప్రధాని అంటే శత్రువులకు ఎంతకూ విడువని ఓ పీటమూడి… అంతుపట్టని ఓ చిక్కు ప్రశ్న. ఒక చేత్తో ఆకాశం వైపు చూపించి మరో చేత్తో వీపు విమానం మోత మోగించే దిట్ట.

About Author

By editor

Twitter
YOUTUBE