వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో గ్రాండ్‌ ఓల్డ్ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌నుంచి ఇటీవలి కాలంలో ముఖ్యమైన నేతల వలసలు పార్టీని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో వేళ్లూను కోవడానికి యత్నిస్తున్న బీజేపీకి తక్షణ ఫలితాలివ్వకపోయినా సానుకూల పరిణామాలను మాత్రం సృష్టించగలవు. ముఖ్యంగా పార్టీకి కేరళ, తమిళనాడుల్లో ఎంపీలు లేరు. తెలంగాణలో నలుగురు, కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో 25 మంది పార్టీ తరఫున ఎంపీలుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరో అంశమేమంటే దక్షిణాదిలో కాంగ్రెస్‌ ‌నాయకులు బీజేపీ వైపు మరలుతున్నారన్న సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపడానికి ఈ చేరికలు ఉపయోగ పడవచ్చు. ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇవి బీజేపీకి మంచి ప్రాచుర్యం కలిగిస్తాయి.

ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌- ‌బీజేపీల మధ్య ముఖాముఖీ పోరు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్‌ ‌నుంచి నాయకుల వలసలు మొద లయ్యాయన్న సందేశాన్ని పంపే వ్యూహం ఇందులో ఉంది. మొదటిది తమిళ నాడుకు చెందిన సి.ఆర్‌. ‌కేశవన్‌ ‌బీజేపీలో చేరారు. ఈయన భారతదేశ తొలి గవర్నర్‌ ‌జనరల్‌ ‌చక్రవర్తుల రాజగోపాలచారి ముని మనుమడు. ఇక రెండవది కాంగ్రెస్‌కు వీర విధేయుడు, కేరళలో నిష్కలంక రాజకీయవేత్తగా పేరున్న మాజీ రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ పుత్రుడు అనీల్‌ ఆం‌టోని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జమ్ముకశ్మీర్‌ ‌ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్‌ ‌కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకు వచ్చి 2022 ఆగస్ట్‌లో ‘డెమోక్రటిక్‌ ‌పోగ్రెసివ్‌ ఆజాద్‌ ‌పార్టీ’ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పారు. కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల గాఢమైన అనుబంధం ఉన్న ఈయన జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరిగితే బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశాలను కొట్టిపారేయకపోవడం గమనార్హం.

దుమారం రేపిన ఆజాద్‌ ‌వ్యాఖ్యలు

రాహుల్‌ ‌గాంధీకి ‘అవాంఛనీయ వ్యాపార వేత్తల’తో సంబంధాలున్నాయంటూ గులాంనబీ ఆజాద్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. గౌతమ్‌ ఆదానీతో సన్నిహిత సంబంధాలున్న వారిలో గులాంనబీ ఆజాద్‌ ‌కూడా ఒకరంటూ వాయనాడ్‌ (‌కేరళ) మాజీ ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ ‌చేసిన నేపథ్యంలో ఆజాద్‌ ‌మలయాళం న్యూస్‌ ‌ఛానల్‌ ఆసియానెట్‌ ‌న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైవిధంగా తిప్పికొట్టారు. నిజానికి ఆదానీ గ్రూపుపై అమెరికన్‌ ‌పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేసిన దగ్గరి నుంచి రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌నుంచి బయటకు వెళ్లినవారిని, బీజేపీలో చేరినవారిని లక్ష్యంగా ఆదానీ వివాదంలోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆజాద్‌ ఎదురుదాడికి ప్రాధాన్యం ఏర్పడింది. రాహుల్‌ ‌గాంధీ 3500 కిలోమీటర్ల భారత్‌ ‌జోడో యాత్రను సెప్టెంబర్‌ 7‌న కన్యాకుమారి నుంచి ప్రారంభిస్తారన్న ప్రకటన వెలువడి పక్షంరోజులు కాకముందే అంటే 2022, ఆగస్టు 22న పార్టీలో సీనియర్‌ ‌నేత గులాంనబీ ఆజాద్‌ ‌పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బాంబు పేల్చారు. ఆయన ప్రకటన పార్టీని ఐదు విధాలుగా దెబ్బతీసిందనే చెప్పాలి. మొదటగా ఆగస్టు 29న కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తంగా 22 ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌లను నిర్వహించాలని తలపెట్టింది. కానీ ఆజాద్‌ ‌రాజీ నామా సందర్భంగా రాహుల్‌పై, కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమాల ప్రభావశీలతను తీవ్రంగా దెబ్బ తీశాయి. రెండోది ఆజాద్‌ ‌కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించడం కాంగ్రెస్‌కు రెండో దెబ్బ. అంతకు ముందు పార్టీని వీడిన జితేందప్రసాద్‌, ఆర్‌పీఎన్‌ ‌సింగ్‌లు బీజేపీలో చేరగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుష్మితా దేబ్‌ ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌లో చేరారు తప్ప ఆజాద్‌ ‌లాగా సొంత పార్టీని ఎవరూ ప్రకటించలేదు. ఆయనతో పాటు జమ్ము కశ్మీర్‌లో జి.ఎం.సురానీ, హజీఅబ్దుల్‌ ‌రషీద్‌, ‌మొహమ్మద్‌ అమీన్‌ ‌భట్‌, ‌గుల్జార్‌ అహ్మద్‌ ‌వాని, చౌదరి అహ్మద్‌ అ‌క్రమ్‌ ‌వంటివారు కూడా పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్రంలో పార్టీకి తీరని దెబ్బగా పరిణమించింది. ఇది బీజేపీకి బలం చేకూర్చే అంశం. మూడోది జమ్ముకశ్మీర్‌లో 370 అధికరణం రద్దు సమయంలో, త్రిపుల్‌ ‌తలాక్‌ ‌విషయంలో, జమ్ముకశ్మీర్‌ను రెండుగా విడగొట్టినప్పుడు పార్లమెంట్‌లో, బయటా కాంగ్రెస్‌ ‌తరఫున గట్టిగా వాణిని వినిపించిన నేతగా ఆజాద్‌ ‌పేరుపడ్డారు. అదీ కాకుండా అఖిలేష్‌యాదవ్‌ ‌నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, లాలూప్రసాద్‌ ‌యాదవ్‌ ‌నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌లు ముస్లింల ఓట్లపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న నేపథ్యంలో, ఆజాద్‌ ‌నిష్క్రమణతో ముస్లింలను తనవైపు తిప్పుకోవడం కాంగ్రెస్‌కు మరింత కష్టం కాగలదు. ఇక నాల్గవది రాహుల్‌ ‌గాంధీని ‘ఛైల్డిష్‌’, ‘‌నాన్‌ ‌సీరియస్‌ ‌పొలిటీషియన్‌’ అం‌టూ విమర్శించారు. కాంగ్రెస్‌లో పటిష్టమైన నిర్మాణ క్రమాన్ని ధ్వంసం చేశారని కూడా ఆరోపించారు. సోనియాగాంధీ కేవలం తన పిల్లలను ఎల్లప్పుడూ వెనకేసుకొచ్చే ‘సాధారణ తల్లి’ మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని కూడా విమర్శించారు. ఐదవది అక్టోబర్‌ 17‌న పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని అప్పట్లోనే కాంగ్రెస్‌ ‌ప్రకటించినప్పుడు ఎన్నికల పక్రియ కేవలం నామమాత్రమే. గాంధీ-నెహ్రూ కుటుంబం ఎంపిక చేసిన వ్యక్తి మాత్రమే పార్టీ అధ్యక్షుడవుతారంటూ తేల్చి పారేశారు. ఈవిధంగా ఆయన తన రాజీ నామాతో పాటు పార్టీ విశ్వసనీయతను ప్రజల్లో తీవ్రంగా దెబ్బతీశారు.

కేశవన్‌, అనీల్‌ ఆం‌టోనీల చేరికలు

తమిళనాడుకు చెందిన సి.ఆర్‌. ‌కేశవన్‌ ‌ఫిబ్రవరి 23న కాంగ్రెస్‌ ‌పార్టీకి తన రాజీనామాను సమర్పిం చారు. మాజీ కేంద్ర మంత్రి ఎ.కె. ఆంటోని పుత్రుడు అనిల్‌ ఆం‌టోనీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నెల రోజుల తర్వాత కేశవన్‌ ‌రాజీనామా చేయడం గమనార్హం. అనిల్‌ ఆం‌టోని ఏప్రిల్‌ 6‌న బీజేపీలో చేరగా, కేశవన్‌ అదే నెల 8వ తేదీన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. వీరు గత 22 సంవత్స రాలుగా కాంగ్రెస్‌ ‌పార్టీలో కొనసాగుతున్నారు. ఈ విధంగా పార్టీలో చేరిన కొత్త సభ్యులను 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రంగంలోకి దించే అవకాశాలున్నాయి. సి.ఆర్‌. ‌కేశవన్‌ ‌చేరిక వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్‌ ‌దాదాపు అంపశయ్య దశలో ఉన్న స్థితిలో ఈయన చేరిక బీజేపీ ఒక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లేందుకు ఉపకరించవచ్చు.

 కేరళకు చెందిన అనీల్‌ ఆం‌టోనీ చేరిక వల్ల కూడా బీజేపీకి తక్షణ లాభం ఉండదు. కాకపోతే దీర్ఘకాలంలో క్రైస్తవ ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉపయోపడవచ్చు. అనీల్‌ ఆం‌టోనీ బీజేపీలో చేరిక కాంగ్రెస్‌ ‌వర్గాల్లో ఆగ్రహం కలి గించడం సహజమే. అయితే ఈ నిష్క్రమణ కాంగ్రెస్‌ ‌కంటే, ఆ పార్టీకి విధేయుడిగా కొన సాగుతున్న ఆయన తండ్రి ఎ.కె. ఆంటోనీని బాగా బాధించిందనే చెప్పాలి. 2019 నుంచి కాంగ్రెస్‌ ‌సైబర్‌ ‌మీడియా సెల్‌కు అఖిల భారత సమన్వయ కర్తగా కొనసాగు తున్న అనీల్‌ ఆం‌టోనీ గత జనవరిలో తన పదవికి రాజీనామా సమర్పించగానే, అతని నిష్క్రమణను కాంగ్రెస్‌ అం‌చనా వేసింది. అనీల్‌ ఈ ‌పదవిలో కొనసాగడానికి తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ఆశీస్సులున్నాయి. మరి లెఫ్ట్ ‌పార్టీలు ఈ పరిణా మాలను ఏవిధంగా చూస్తాయనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌బీజేపీకి ఒక రిక్రూటింగ్‌ ఏజెంట్‌గా మారుతున్నదని, ‘నేటి కాంగ్రెస్సే రేపటి బీజేపీ’ అంటూ అవి ప్రచారం మొదలుపెట్టవచ్చు. అంతేకాదు కమలానికి వ్యతిరేకంగా పోరాడలేక, తన నాయకులనే కోల్పో తున్నదంటూ కూడా ప్రచారం చేసి రాజకీయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి యత్నించ వచ్చు.

క్రైస్తవులకు దగ్గరయ్యేందుకు..

కేరళలోని క్రైస్తవ కమ్యూనిటీకి చేరువ కావాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అనీల్‌ ఆం‌టోనీ చేరిక తమకు ఆ అవకాశాన్ని కల్పిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. కాకపోతే ఎ.కె. ఆంటోనీ మాదిరిగా అనీల్‌కు కేరళలో పెద్దగా ఫాలోయింగ్‌ ‌లేదు. అనీల్‌ ‌తల్లి రాష్ట్రంలోని వివిధ చర్చ్ ‌కార్య కలాపాల్లో పాల్గొంటుంటారు. ఇటీవల ఈస్టర్‌ ‌డే సందర్భంగా ప్రధాని మోదీ న్యూఢిల్లీలోని చర్చ్‌ను సందర్శించిన నేపథ్యంలో, కేరళ బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో క్రైస్తవ వర్గ ప్రజలను నేరుగా కలుసు కోవాలని నిర్ణయించింది. అయితే ఈ కార్యాచరణకు దిగడానికి ముందు నెలల తరబడి క్రిస్టియన్‌ ‌నేతలతో చర్చలు కొనసాగాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌ముస్లిం వర్గాల్లోకి ఏవిధంగా చొచ్చుకొని వెళ్లగలిగారో అదే పంథాను ఇప్పుడు కమలం అనుసరించేందుకు యత్నిస్తోంది. కేరళలో కాంగ్రెస్‌ ఇం‌కెంతో కాలం తన బేస్‌ను నిలుపుకో లేదన్న నమ్మకానికి తోడు, చర్చ్ ‌వర్గాలనుంచి సానుకూల స్పందన రావడం బీజేపీ నాయకుల్లో ఆనందాన్ని నింపుతోంది. తిరువనంతపురం, త్రిస్సూర్‌ ‌జిల్లాల్లో క్రైస్తవ జనాభా అధికంగా ఉండటంతో ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో పాగా వేయాలని ప్రణాళికలు మొదలుపెట్టింది. తిరువ నంతపురంలో ఈస్టర్‌ ‌గ్రీటింగ్స్ ‌లక్ష వరకు ప్రచు రించగా, విపరీతమైన డిమాండ్‌ ‌నేపథ్యంలో మరో 50వేలు ప్రింట్‌ ‌చేశామని ఇక్కడి నాయకత్వం చెప్పడం క్రైస్తవుల్లో పెరుగుతున్న బీజేపీ బలానికి సంకేతం. ఇక్కడ ఎల్‌.‌డి.ఎఫ్‌., ‌యు.డి.ఎఫ్‌ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత మాత్రమే కాదు, యు.డి.ఎఫ్‌., ‌ముఖ్యంగా కాంగ్రెస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తు లేదన్న బలమైన అభిప్రాయం ఉంది. ఇక ఎల్‌.‌డి. ఎఫ్‌. ‌బుజ్జగింపు రాజకీయాలు నడుపుతున్న కారణంగా ముస్లిం ఛాందసవాదులు సి.పి.ఎం. లో చేరిపోయారని వీరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రైస్తవ గ్రూపులు తమను కేవలం మైనారిటీ మోర్చాకే పరిమితం చేయకుండా, పార్టీకి సంబంధించిన వివిధ గ్రూపుల్లో భాగస్వాములను చేయాలని బీజేపీ నేతలను కోరుతున్నాయి. కేరళలో క్రైస్తవ, ముస్లిం కమ్యూనిటీలు సంప్ర దాయికంగా కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారు. కేరళలో ముస్లిం, క్రిస్టియన్‌ ‌కమ్యూనిటీలు 45శాతం. వీరిలో క్రిస్టియన్లు 18 శాతం. ఇప్పుడు బీజేపీ క్రైస్తవుల్లో ముఖ్యంగా కేథలిక్‌ ‌వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్ని స్తోంది.

కాంగ్రెస్‌ ‌దీనస్థితి

నిజానికి గత ఏడాది నుంచి కాంగ్రెస్‌ ‌నుంచి కీలక నేతల వలసలు బీజేపీలోకి కొనసాగుతున్నా ఆ పార్టీ అడ్డుకోలేకపోతోంది. 2015లో ఈశాన్య ప్రాంతానికి చెందిన పార్టీ కీలకనేత, హిమంత్‌ ‌బిశ్వశర్మ తన 23 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని తెంచుకొని బీజేపీలో చేరారు. ఇప్పుడాయన ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడమే కాదు, అస్సాం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మధ్య ప్రదేశ్‌ ‌నుంచి జ్యోతిరాదిత్య సింధియా 2021లో, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర ప్రసాద 2022లో, అదే ఏడాది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పద్రౌనా రాజ కుటుంబానికి చెందిన కున్వర్‌ ‌రత్నజిత్‌ ‌ప్రతాప్‌ ‌నారాయణ్‌సింగ్‌ (‌కేంద్ర మాజీ మంత్రి, రాహుల్‌ అనుయాయుడిగా గుర్తింపు పొందారు), గత ఆగస్టులో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జయ్‌వీర్‌ ‌షేర్‌గిల్‌లు బీజేపీలో చేరారు. గత ఏడాది సెప్టెంబర్‌ 28‌న హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌నుంచి హర్ష్ ‌మహాజన్‌, అదే నెలలో పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్‌, ‌ఝార్ఖండ్‌లో ఆర్‌.‌పి.ఎన్‌. ‌సింగ్‌ ‌గత ఏడాది బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ ‌పార్టీ బల హీనపడటం ఒక్క రాత్రిలోనో జరగలేదు. ఈ పతన ప్రస్థానం మూడు దశాబ్దాలుగా కొనసాగు తోంది. గాంధీ- నెహ్రూల కుటుంబం పట్టు క్రమంగా కోల్పోవడమే ఇందుకు కారణం. సోనియాగాంధీ అనారోగ్య సమస్యలు, 19 ఏళ్లు గడిచినా రాహుల్‌ ‌ఛరిష్మాటిక్‌ ‌నేతగా రాణించలేకపోవడం, ప్రియాంకా వాద్రాను ఎంతగా ఆకాశానికెత్తినా ఆమెలో ఆ సామర్థ్యం కొరవడటం వంటివి పార్టీపై కుటుంబ పట్టుపోవడానికి ప్రధాన కారణం. పార్టీ నౌక మునిగి పోయే స్థితిలో ప్రధాన నేతలు తమ దారి తాము చూసుకోవడంతో వెన్నెముకలేని నాయకులతో ‘గ్రాండ్‌ ఓల్డ్’ ‌పార్టీ ‘వృద్ధాప్య సమస్యలతో’ సత మతవుతోంది. 1991-96 మధ్యకాలంలో పి.వి. నరసింహారావు పార్టీకి నేతృత్వం వహించిన తర్వాత, మరే ఇతర నేతకు అంతటిస్థాయి ఆత్మవిశ్వాసం లేకపోవడం పార్టీకి పెద్దదెబ్బ. ఇందుకు పర్యవసానమే పార్టీ వేగంగా క్షీణపథంలో పయనించడం!

పట్టు బిగించినా ఫలితం శూన్యం

పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీ ఏక కాలంలో పార్టీపై పట్టుబిగింపును కొనసాగిస్తున్నారు. విచిత్రమేమంటే పార్టీపై వీరిపట్టు ఎంతగట్టిగా ఉన్నా కాంగ్రెస్‌ ‌పతనం మాత్రం అప్రతిహతంగా సాగిపోతూనే ఉండటం విషాదం. ఫలితంగా ఈ ముగ్గురు ‘గాంధీలు’ క్రమంగా ఏకాకులవుతున్న పరిస్థితి! 2020 ఆగస్టులో 23 మంది సీనియర్‌ ‌నేతలు (వీరినే జి- 23 అని పిలుస్తారు) జమ్ము కశ్మీర్‌లో సమావేశమై పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాగాంధీకి లేఖరాయడం సంచలనం సృష్టించింది.

‘బాధ్యతాయుత నాయకత్వం’ అవసర మని కూడా వీరు పేర్కొనడం తల్లిచాటున బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న రాహుల్‌కు చెక్‌పెట్టే ఉద్దేశమే. విచిత్రంగా ఈ నాయకులనే క్రమంగా పార్టీలో పక్కనపెట్టడం మొదలైంది. నిజానికి రాహుల్‌కు సీనియర్‌ ‌నేతలంటే పడదు. ఆయనది ఒంటరి వ్యవహారశైలి. ఇక సోనియా ఆరోగ్యం దెబ్బతినడంతో పార్టీకి, గాంధీ కుటుంబా నికి మధ్య అగాధం పెరిగిపోయింది. ఈ విధంగా పుట్టి మునుగుతున్న కాంగ్రెస్‌ ‌దుస్థితిలో కొట్టుమిట్టాడు తుంటే, బీజేపీ రోజురోజుకు బలపడుతోంది.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ 

About Author

By editor

Twitter
Instagram