వైసీపీ ప్రభుత్వం క్రైస్తవ మతంలో చేరినవారికి ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చేలా తీర్మానం చేసి వారిని మోసం చేస్తోంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఓట్ల రాజకీయం చేస్తూ, మత వివక్షకు పాల్పడుతూ క్రైస్తవులను, ముస్లింలను వెనకేసుకు వస్తోంది. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఆ రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ అసెంబ్లీలో తాజాగా తీర్మానం చేసింది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని తెలిసినా ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తుండడం, మరోవంక ఎస్సీలలో కూడా వైసీపీ పట్ల అసంతృప్తి పెరుగు తుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబునాయడు కూడా ఇలాగే తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి ఎదురు కానుంది.

సాధ్యం కాని వ్యవహారం

సాధ్యం కాని వాటికి, తమ పరిధిలో లేని వాటికి తీర్మానాలు చేయడం వైసీపీ ప్రభుత్వానికి మామూలు వ్యవహారమై పోయింది. ఏదో ఒక కాగితం రాసి అసెంబ్లీలో తీర్మానం చేసి తాము ఆయా వర్గాలకు ఏదో చేశామంటూ జనాలను నమ్మించడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం సాధ్యం కాదని తేల్చినా, మతంమారినవారికి ఎస్సీ రిజర్వేషన్లు ఇచ్చే అంశం సుప్రీంకోర్టులో నలుగుతున్నా, అదేమి పట్టనట్టు ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా మభ్యపెట్టే ప్రకటన చేసింది. శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల చివరిరోజున హడావిడిగా తీర్మానం చేసింది. దానిని కేంద్రానికి పంపిస్తున్నామని ప్రకటించింది.

అంబేద్కర్‌ను అవమానించడమే

‘మనమంతా ఒకే ప్రజ, ఒకే దేశం అనే ఏకాత్మత ఉన్నందు వల్లే ఒక దేశంగా ఏర్పడ్డామ’ని డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌భావించారు. ఆయన అందించిన రాజ్యాంగానికి మనం బలం చేకూర్చాలంటే కులాల కతీతంగా మన మధ్య సోదర భావం ఏర్పడాలి. డాక్టర్‌ అం‌బేద్కర్‌, ఇతర కులాలపై ఎస్సీలలో ద్వేషం రగిలించకుండానే స్వేచ్ఛను ప్రసాదించిన మానవతావాది. లక్షలాది బడుగు వర్గాలను విదేశీ భావాలకు బానిసలు కాకుండా కాపాడిన కారుణ్య మూర్తి. ప్రపంచంలోని అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రాసి అందులో అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించారు. అంతేకాకుండా ఎస్సీలను హిందువుల నుండి వేరు చేయకుండా హిందూకోడ్‌ ‌బిల్లు పెట్టి, ఎస్సీలు సహా బౌద్ధులు, సిక్కులు, జైనులను కూడా అందులో కలిపిన నిజమైన సమగ్ర సమతావాది. హిందూమతంలోని అంటరానితనం, వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్‌ను వర్తింపచేయాల్సి ఉంటుంది. క్రైస్తవం, ముస్లిం మతాలకు ఈ రిజర్వేషన్‌ ‌వర్తించదు. హిందూమతానికి చెందిన ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే వారిని వెనుకబడిన తరగతి వర్గాల (బీసీ-సి) కింద పరిగణించాలని చట్టం చెబుతోంది. కాని మొదటి నుంచి క్రైస్తవులను ఓటు బ్యాంకుగా చూస్తున్న జగన్‌ ఈ అం‌శం సుప్రీంకోర్టులో ఉందని తెలిసి కూడా కేంద్రానికి తీర్మానం చేసి పంపుతున్నట్లు ప్రకటించి క్రైస్తవులను మభ్యపెడుతున్నారు. అంతెందుకు కోర్టులో ఉందని చెప్పి సచివాలయ ఉద్యోగాల్లో ఈడబ్ల్యుఎస్‌ ‌రిజర్వేషన్లను జగన్‌ అమలు చేయలేదు. ఇదే రీతిలో కాపులకు ఈడబ్ల్యుఎస్‌లో 5 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదు. కాని మతంమారిన క్రైస్తవులు, ముస్లింలను మాత్రం ఎస్సీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం త•మ పట్ల చూపుతున్న నిర్ల్యక్ష ధోరణి కాదా? అని ఆయా వర్గాలు విమర్శిస్తున్నాయి.

భయపెట్టి మతమార్పిడులు

మత మార్పిడుల విషయంలో క్రైస్త•వ సంఘాలు వందల ఏళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తున్నాయి. ధనాదాయం పెరుగుతుందని, పేదరికం తగ్గి పోతుందని, అపాయాలు తొలగిపోతాయని, అనారోగ్యాలు పోతాయని పేదలను ప్రలోభ పెడుతూ మతమార్పిడులు చేస్తున్నారు. బ్రిటిషర్ల కాలం నుంచి ఇది జరుగుతూనే ఉంది. మన దేశంపై ఆధిపత్యానికి ముస్లిం, క్రైస్తవ పాలకులు మతమార్పిడులను ఉపయోగించారు.

కత్తి చూపి భయపెట్టి, కాసులు చూపి, విద్య సేవల పేరుతో మతమార్పిడులు కొనసాగించారు. తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు మతమార్పిడి కార్యక్రమాల కోసం సామ్రాజ్యవాద పశ్చిమ దేశాలు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటికీ కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తున్నాయి. మత మార్పిడి అనేది మతకల్లోలాలకు మరో దారి. మత మార్పిడులు మత సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయి. బలవంతపు మతమార్పిడిలు అనైతికం కూడా. నిజానికి అన్ని మతాలు ఒకటే అని చెప్పేవాళ్లు మతం మారాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఒక్కడే అయినప్పుడు రాముడిని పూజిస్తే ఏం? ‘మా మతం పాటిస్తేనే స్వర్గానికి వెళతార’ని చెప్పటం ఎందుకు? జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేసిన తాజా తీర్మానాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో మరో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించడానికి వెనుకాడబోవమని విశ్వహిందూ పరిషత్‌ ‌హెచ్చ రించింది.

ప్రభుత్వాన్ని మోసం చేస్తూ….

మతంమారినవారు ఇంట్లో క్రైస్తవం, బయట హిందువులా చలామణి అవుతున్నారు. వారు తాము క్రైస్తవులుగా ప్రభుత్వ నిర్దేశిత పత్రాల్లో ప్రకటించడం లేదు. హిందువులుగానే ఉన్నట్లు విద్యార్హత సర్టిఫికెట్లలో నమోదు చేయించు కుంటున్నారు. దాంతో వారికి ఎస్సీ రిజర్వేషన్‌ ‌వర్తిస్తుంది.అలా ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. పేర్లు హిందువులవే అయినా చర్చిలకు వెళతారు, ఏసుక్రీస్తును పూజిస్తారు. పుట్టుక నుంచి వివాహం, మరణం వరకు క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు దేశం మొత్తం ఇదే వ్యవహారం నడుస్తోంది.

రిజర్వేషన్‌ ఇస్తే మత మార్పిడులు ప్రోత్సహించి నట్లే మతం మారిన కైస్తవులు, ముస్లింలకు కూడా ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపచేస్తే మతమార్పిడులను ప్రోత్సహించినట్లే. దీనిని గుర్తించే క్రైస్తవ సంఘాలు మతంమారిన క్రిస్టియన్లను, ముస్లింలను ఎస్సీలుగా గుర్తించి, రిజర్వేషన్లు వర్తింపచేయాలని ఏళ్ల తరబడి డిమాండ్‌ ‌చేస్తూ ఉన్నాయి. పలు క్రైస్తవ సంఘాలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఎస్సీలకు, క్రైస్తవులకు,  ముస్లింలకు మొదటి నుంచి అనుకూలంగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ‌రంగనాథ మిశ్రా కమిషన్‌ ‌వారికి రిజర్వేషన్‌ ‌ఫలాలు అందించాలంటూ సిఫారసు చేసింది. అయితే ఆ నివేదిక లోపభూయిష్టమంటూ ఇప్పటి ఎన్‌డిఏ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ ఏడాది జనవరి 19న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. ఈ అంశంపై గత అక్టోబర్‌లో జస్టిస్‌ ‌కేజీ బాలకృష్ణన్‌ ‌నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు, అది రెండేళ్లలో నివేదిక ఇస్తుందని కేంద్రం కోర్టుకు తెలిపింది.

చట్టం పటిష్ట అమలుకు చర్యలు

హిందూ మతంలోని  అణగారిన వర్గా లకు ఎస్సీ రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉండగా చాలా రాష్ట్రాలు అమలు చేయడం లేదు. ఎక్కడైనా కోర్టుల్లో కేసులు పడినప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దానిని అమలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఈ చట్టానికి పదును పెంచింది. ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరిస్తే వారికి ఎస్సీ సర్టిఫికేట్‌ ఇవ్వరాదంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా ఈ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ చర్యలు తీసుకుంది. అయితే మన రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేసిన పరిస్థితులు కూడా పెద్దగా లేవు.

క్రైస్తవులను, ముస్లింలను బుజ్జగించడం, ప్రోత్సహించడం వంటి పనులు తప్పించి వారికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ఒక్క పనీ చేయలేదు. అసలు హిందువులపై. హిందూ ధర్మంపై ఇతర మతాల నుంచి దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీనిపై బీజేపీ తీవ్ర పోరాట చేసింది. ఇదిలాఉంటే, ఈ అంశంపై నాలుగేళ్లుగా ఒక్కమాట కూడా మాట్లాడని జగన్‌, ఎన్నికలకు ఒక ఏడాది ముందు హడావిడిగా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయించడం ఓట్ల రాజకీయం కోసమే.

బీజేపీ అగ్రహం

సీఎం జగన్మోహనరెడ్డి దళితుల్ని మోసగించే నిర్ణయాలు తీసుకొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  సోము వీర్రాజు ఆరో పించారు. మతంమారినవారిని క్రైస్తవులను ఎస్‌సీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో పార్టీ మార్చి 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్య క్రమాలు చేపట్టింది.

ఓట్ల కోసం జగన్‌ ‌తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అసలైనవారికి తీరని అన్యాయం జరుగుతుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మతాలు మారిన అనేక మంది ఎస్సీలకు హిందూమతంలోనే ఉన్నట్లు చెప్పి ఎస్సీ సర్టిఫికెట్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్నారు.

ఇక కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేస్తోంది. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై ఎలా తీర్మానం చేస్తారు? ఎస్‌సీలు ఇప్పటికే సరైన ఉద్యోగాల్లేక ఇబ్బంది పడుతుంటే అంబేద్కర్‌ ఆలోచనలకు విరుద్ధంగా జగన్‌ ‌ప్రభుత్వం తీర్మానాలు చేయడం గర్హనీయం అని బీజేపీ మండి పడింది. దీనిపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌, ‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
Instagram