– డా. త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ఐటీ రంగ నిపుణులు, సలహాదారు

నేను భారతజాతీయుడిని అని చెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడను. పశ్చాత్తాపానికి లోనుకాను.

ఆ అభిప్రాయాన్ని దృఢంగా ప్రకటిస్తాను. ‘హిందువు’ను అని బహిరంగంగా చాటుకుంటాను. భారతదేశంలో చెడ్డవి, అతిచెడ్డవి, మరీ చెడ్డవిగా ఉన్న రాజకీయ పక్షాల్లో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. సామ్యవాదం ఎలాగయితే చైనీయుల స్వభావాన్ని పుణికిపుచ్చుకుందో మన దేశంలో ప్రజాస్వామ్యం కూడా కొన్ని దేశీయ లక్షణాలను ఒంటపట్టించుకుంది. రాజవంశాల వారసత్వం, బలీయమైన కులబంధాలు, లౌకికవాదం పేరిట హిందువులను బలిపెట్టి మహమ్మదీయులను, క్రైస్తవులను తృప్తిపరచటం, ప్రభుత్వం అప్పు చేసిన సొమ్మును ఖర్చుపెట్టి సంక్షేమం అనటం, పేదల సంరక్షణ, సామాజిక న్యాయం అమలు చేయటం రాజకీయ నాయకులకు అధికారాన్ని, అపరిమితమైన ఆదాయాన్ని అందిస్తూ అధికార వారసత్వం అందుకోవటానికి దోహదం చేసేవిగా కనిపిస్తాయి.

భారతీయ జనతాపార్టీని అన్ని రాజకీయ పార్టీలతో పోలిస్తే అతి తక్కువ వంశపారంపర్య చరిత్ర కలిగి ఉంది. ఆ పార్టీ అగ్రనేతలు అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయ్‌, ‌ప్రధాని నరేంద్రమోదీలకు వారసత్వం అందుకోగల కుటుంబం లేదు. ఎక్కువ మంది బీజేపీ నేతలు ధర్మమార్గంలో శిక్షణ పొంది, అంకితభావం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలుగా ఎదిగివచ్చిన వారే. నెహ్రూ-గాంధీ కుటుంబం పెంచి పోషించిన చిత్రమైన భారతీయ ప్రజాస్వామిక లక్షణాలు వారికి సంక్రమించలేదు. దాని ప్రభావానికి వారు అంతగా లోను కాలేదని చెప్పాలి.

పై అభిప్రాయాలను వ్యక్తం చేయటంతోపాటు, ప్రస్తుత బీజేపీ నాయకత్వాన్ని, ప్రపంచం మొత్తం నెత్తిన పెట్టుకునే ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి ఒక విషయాన్ని కచ్ఛితంగా తీసుకువెళ్లదలిచాను. లోక్‌సభకు నిర్వహించే 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీగానీ, దానితో కూడిన ఎన్డీఏ గానీ మంచి మెజార్టీ దక్కించుకోలేకపోతే, అది ఒక్క హిందువులకే కాదు, యావత్‌ ‌భారతదేశానికి కూడా విషాదంగా మారుతుంది.

‘భారత్‌ అం‌దరి కోసం. ఒక్క హిందువులకు తప్ప’ అని స్వర్గీయ రామ్‌మనోహర్‌ ‌లోహియా అనేవారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే హిందువులకు అదే పరిస్థితి ఎదురవుతుంది. హిజాబ్‌ ‌వివాదం నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత రెండు మార్లు కొందరు ముస్లిం ప్రముఖులను కలసి సమన్వయం కోసం యత్నించడాన్ని లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ తప్పుపట్టారు. హిజాబ్‌ ‌ధరించిన ముస్లిం వనిత త్వరలో ప్రధాని అవుతారని వ్యాఖ్యా నించారు. ఇటీవల నిషేధానికి గురయిన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా ప్రధాన ధ్యేయం 2047 నాటికి భారత్‌ను ముస్లిం దేశంగా మలచటమే.

నాటి నేతలు జాతీయ కాంగ్రెస్‌ను ముస్లింలను తృప్తిపరిచే సంస్థగా మలిచారు. హిందూ-ముస్లింల ఐక్యత, స్వాతంత్య్ర సమరంలో ఎక్కువ మంది ముస్లింలు భాగస్వాములయితే తప్ప దేశం కోరుకున్న విధంగా బ్రిటన్‌ ‌స్వాతంత్య్రం ఇవ్వటానికి ముందుకు రాదనే తర్కరహితమైన ఆలోచన చేశారు. బెంగాల్‌ను విభజించి మెజార్టీ ముస్లింలతో ప్రావిన్స్‌ను ఏర్పర చాలన్న నిర్ణయంపై 1905-11 మధ్య దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగి బ్రిటన్‌ ఆ ‌విభజనను రద్దు చేయ టానికి సిద్ధమయినప్పుడు గాంధీజీ భారత్‌లో లేనేలేరు. విభజన రద్దులో అసలు ముస్లింలకు అంత భాగస్వామ్యం లేదు. లోకమాన్య బాలగంగాధర తిలక్‌, ‌లాలాలాజపత్‌రాయ్‌, ‌బిపిన్‌ ‌చంద్రపాల్‌ (‌లాల్‌-‌బాల్‌-‌పాల్‌) ‌త్రయం హోరెత్తించిన వందే మాతరం, స్వదేశీ, స్వరాజ్‌’ ‌నినాదాలు, అరబిందో సాహిత్యం బ్రిటిష్‌ ‌పాలకులను లొంగతీశాయి. బెంగాల్‌ ‌విభజనకు వ్యతిరేకంగా ముస్లింల ప్రాతినిధ్యం ఏ మాత్రం లేకుండా సాగిన అత్యంత శక్తిమంతమైన సమైక్య హిందూ ఉద్యమం స్వాతంత్య్రం సిద్ధించటానికి కారణమైందని గాంధీ కూడా అర్థం చేసుకోలేకపోయారనిపిస్తుంది. హిందూ-ముస్లింల ఐకమత్యం, దక్షిణాఫ్రికాలో భారతీయులు అవమానాలకు గురికావటం, మానవహక్కులకు దూరం కావటం వంటి వాటిపై సమైక్యపోరాటం స్వాతంత్య్రం కోసం కాదు. అహంకారులయిన యూరోపియన్‌ ‌పాలకులు మానవహక్కులను తృణీకరించటంపైనే. భారత్‌లో పరిస్థితి అది కాదు. ఇక్కడ పోరాటం స్వాతంత్య్రం కోసం. ప్రజాస్వామ్య సాధన కోసం. అలాంటి భార త్‌ను అధిక సంఖ్యాకులుగా ఉన్నవారు (హిందువులు) పాలించాలి. ఒకప్పుడు తాము దేశాన్ని ఏలిన వాళ్లమని, చాలాకాలం పాటు అణచివేతకు గురయిన హిందువులు పాలనలో గడపటం తమకు ఇష్టం లేదని ముస్లింలు భావించారు. హిందువులకు భిన్నమైన ఇస్లామిక్‌ ‌దేశాన్ని కోరుకున్నారు. దాంతో భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ ఏర్పాటు చేయటానికి ప్రతిఘటించలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు ఓట్లు మాత్రమే కాదు, హత్యలతో కూడిన అల్లర్లు కూడా కారణమయ్యాయి. ‘లడ్‌ ‌కే లేంగే పాకిస్తాన్‌’, ‘‌హస్‌ ‌కే లేంగే హిందూస్తాన్‌’ అన్న నినాదాలు ముస్లింల ఉన్నతవర్గాలను, సామాన్యులను కూడా సమానంగా ప్రేరేపించాయి. అయితే 90 శాతం ముస్లింలు విభజన తర్వాత కూడా తాము సృష్టించిన పాకిస్తాన్‌కు వలస పోకుండా భారత్‌లో ఉండిపోయారు. నెహ్రూ కాంగ్రెస్‌ ‌వారిని ఓటు బ్యాంకుగా పరిగణించి ఆదరించటం మొదలు పెట్టింది. కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలు కూడా పోటీపడి మరీ వారిని సంతృప్తిపరిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం హిందువులను పక్కన పెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో మక్కా, జెరూసలెం తీర్థయాత్రలకు సబ్సిడీ ఇవ్వటం, హజ్‌ ‌హౌన్‌లు ఉర్దూ ఘర్‌లు షాదీఖానాలు, చర్చిలు నిర్మించటం, ఇమామ్‌లకు, ముయిజ్జీన్లకు, పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వటం వంటివి చేస్తున్నారు. హిందువుల తీర్థయాత్రలకు గానీ, అర్చకులకు, ఇతర సిబ్బందికి గానీ ఇటువంటి సౌకర్యాలను ఏర్పరచలేదు.

ప్రజల ప్రాథమికమైన ఐక్యతను, ఈ భూభాగం నైతికవర్తనను కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రాంతీయ పార్టీలు, అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలు విభేదిస్తూ ప్రశ్నిస్తున్నాయి. కమ్యూనిస్టులు, ముస్లింలు, ఎస్సీ పార్టీలు బలహీనమైన కేంద్రం ఉండాలని కోరు కుంటున్నాయి. సమాఖ్య భావనతో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలని ఆశిస్తున్నాయి.

బలహీనంగా లేని, కుంచించుకుపోని కేంద్ర ప్రభుత్వం ఉండాలి. అది పటిష్ఠమైన జాతీయతను, సనాతన ధర్మానికి విలువైన వారసత్వాన్ని అందిం చాలి. ఇందుకోసం 2024 లోక్‌సభ ఎన్నికల్లో, హిందువుల పట్ల అయిష్టత, ద్వేషభావం, దురభి మానం ఏ మాత్రం లేని పార్టీగా బీజేపీ విజయం సాధించి తీరాలి. ఈ సందర్భంగా 2004లో బీజేపీ నాయకత్వంలోని కూటమి వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. అప్పుడు ‘భారత్‌ ‌వెలుగులీనుతోంది’ నినాదం ప్రతిధ్వనించినా పార్టీ ఓటమి పాలయ్యింది. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ విజయాలను కీర్తిం చటం, దాని గురించి ఎక్కువగా చెప్పుకోవటం అనేది ఓ రకంగా ‘భారత్‌ ‌వెలుగులీనుతోంది’ తరహా ప్రచారమే అవుతుంది. దీని గురించి ఒక సూచన చేస్తున్నాను. మోదీ-అమిత్‌ ‌షా ద్వయం ప్రత్యేకంగా గానీ, మొత్తంగా బీజేపీ గానీ 2004లో ‘భారత్‌ ‌వెలుగులీనుతోంది’ ప్రచారం ద్వారా మనం నేర్చు కోవలసిన పాఠాలపైన తగినంత ఆలోచన చేయాలి.

రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీ పొందే ప్రయోజనాలను బీజేపీ నిరర్థకం చేయాలి. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనాయకత్వం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ‘అద్వానీ-అయోధ్య’ తరహా రథయాత్ర లాంటిది తలపెట్టాలి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తమకు విరామం దొరికినప్పుడల్లా అందులో పాల్గొనాలి. సోనియా కుటుంబం, కమ్యూనిస్టులు, పాకిస్తాన్‌ ‌డీఎన్‌ఏ ‌బృందాలు, కులతత్వ ప్రాంతీయ, కుటుంబ పార్టీలు, వారి అధినేతలు, ప్రముఖులు, లౌకికవాదులు, ఉదారవాదులు, జెఎన్‌యూలోని మేధావులు, మార్క్సిస్టు మదర్సాలు తదితరుల (థోడో-ఫోడో టుకెడె-టుకెడె గ్యాంగులు) తప్పుడు వ్యాఖ్యానాలను బలంగా తిప్పికొట్టాలి. ఈ యాత్రకు ‘సధర్మ-సత్య విజయ యాత్ర’ అన్న నామకరణం చేయాలి. దీని ద్వారా ఆర్థిక-పారిశ్రామిక ప్రగతి, సంక్షేమం, అందు కయ్యే వ్యయం, ధరల పెరుగుదల, గృహనిర్మాణం, ఉపాధి, జనాభా పెరుగుదల, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై వాస్తవాలను అర్థవంతంగా వెల్లడించాలి. అధర్మం నశించాలన్నా, భారత్‌, ‌హిందూ ధర్మం విజేత కావాలన్నా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీ నాయకత్వంలోని కూటమి విజయం సాధించి తీరాలి.

దిగువ పేర్కొన్న రెండు వ్యాఖ్యానాలు 2024 బ్యాలెట్‌ ‌పోరుకు మనల్ని సమాయత్తం చేస్తాయి.

భారతదేశం, హిందూయిజం రెండూ ఒకటే..

ప్రపంచంలోని గొప్ప మతాలన్నింటిని 40 ఏళ్లు, అంతకు పైబడి అధ్యయనం చేసిన తర్వాత, అంత పరిపూర్ణమైనది, శాస్త్రీయ, ఆధ్యాత్మిక, తాత్త్విక భావనలను ప్రోది చేసేది హిందూయిజం తప్ప మరేదీ నాకు కనిపించలేదు. ఈ విషయంలో తప్పులు చేయవద్దు. హిందూయిజం లేకపోతే భారత్‌కు భవిష్యత్తు లేదు.

హిందూయిజం అనేది భారతీయ మూలాల్లోకి చొచ్చుకుపోయిన భూమి లాంటిది. దాని స్థానం చెదిరితే, నేల నుంచి లాగేసిన చెట్టు లాగా అని వార్యంగా అది ఎండిపోతుంది. హిందువులు పరిరక్షించకపోతే, సమర్థించుకోకపోతే మరి హిందూయిజాన్ని ఎవరు పట్టించుకుంటారు? భారతీయ విశ్వాసాలకు సొంత బిడ్డలే కట్టుబడకుండా ఉంటే మరెవరు దానికి కాపు కాస్తారు? భారతదేశం మాత్రమే తనను తాను కాపాడుకోగలుగుతుంది. భారతదేశం, హిందూయిజం ఒక్కటే.

– అనిబిసెంట్‌

అను: డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

About Author

By editor

Twitter
Instagram