బృహత్‌ ‌భారతదేశం-అఖండ భారత్‌కు ముస్లిం వేర్పాటువాదం ముప్పుగా పరిణమించడంతో పాటుగా పెరుగుతున్న ఇస్లామిక్‌ ‌రాజకీయాల నేపథ్యంలో ‘‘వీ ఆర్‌ అవర్‌ ‌నేషన్‌హుడ్‌ ‌డిఫైన్‌డ్‌’’ (‌మనం లేదా మన జాతీయత నిర్వచనం) అనే పుస్తకం వచ్చింది. పైన పేర్కొన్న పరిణామాలు చివరికి బృహత్‌ ‌భారతదేశాన్ని భారత్‌, ‌పాకిస్తాన్‌గా విభజించాయి.

అలీగఢ్‌ ఉద్యమం రూపుదిద్దుకోవడంతో, 1938లో బ్రిటిష్‌వారు ముస్లింల కోసం ప్రత్యేక పౌర చట్టాన్ని అమలు చేయడంతో, విభజనవాద ముస్లిం రాజకీయాలు అత్యంత దూకుడుగా మారాయి. ఆ చేదు సంఘటన నేపథ్యంలో వచ్చిన ఈ పుస్తకం ఒక తీవ్రమైన ప్రతిస్పందనగా ఉంది. ‘‘గందరగోళంతో, పలాయనవాదంతో కూడుకున్న జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు ఈ పుస్తకంలోని విషయాలను కచ్చితంగా ప్రభావితం చేశాయి’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేర్కొంది. అంటే, ఆ పుస్తకం సందర్భానికి పరిమితమైనది. కనుక దాని ప్రాసంగికత ఆ చేదు సందర్భానికి మించి నిలవదని ఇది సూచిస్తుంది. అందులోని విషయాలు తమ అభిప్రాయం గానీ, గురూజీ అభిప్రాయంగానీ ఎన్నడూ కాదని, అది జీడీ సావర్కర్‌ ‌మరాఠీ గ్రంథం ‘రాష్ట్ర మీమాంస’కు సంక్షిప్త ఆంగ్ల రూపమని, ఇదే విషయాన్ని గురూజీ కూడా స్వయంగా స్పష్టం చేశారని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పేర్కొంది. నిందారోపకులు ఈ కీలక వ్యాఖ్యలను కనీసం చిన్న అక్షరాలతో కూడా ముద్రించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంత ప్రచారకర్తగా గురూజీ ప్రస్థానం జూన్‌, 1940‌లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ప్రారంభమైంది. జూన్‌, 1973‌లో ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఈ ప్రస్థానం 33 ఏళ్లపాటు కొనసాగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకుడిగా ఉన్న వ•డు దశాబ్దాల కాలంలో, గురూజీ చేసిన సిద్ధాంత వివరణలలో ‘వీ ఆర్‌ అవర్‌ ‌నేషన్‌హుడ్‌ ‌డిఫైన్‌డ్‌’ ‌పుస్తకంలోని అంశాలకు మద్దతునిచ్చేలా ఏ ఒక్క వ్యాఖ్యనూ ఆయనపై నిందలు మోపే వారు చూపలేకపోయారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమర్థవంతంగా వాదించిన విషయం. ముస్లింలు సహా భారతీయులందరినీ ఏకం చేసే ‘సమ్మిళిత హిందూ సాంస్కృతిక జాతీయవాదం’ గురించి గురూజీ దశాబ్దాల తరబడి ఎంతో విస్తృతంగా, అదే సమయంలో స్థిరమైన దృక్పథంతో ప్రచారం చేశారు. అయినప్పటికీ, గురూజీ వ్యక్తం చేసిన స్థిరమైన, సందర్భాతీతమైన అభిప్రాయాలను దుష్ప్రచారం చేసేవారు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారు. ఇప్పటికీ దాచిపెడుతూనే ఉన్నారు. ఒక నిర్దిష్ట సందర్భంలో చేసిన వ్యాఖ్యల ప్రాముఖ్యత ఆ సందర్భానికే పరిమితమని తెలిసినప్పటికీ, వారు వాటిని సందర్భం లేకుండా, దురుద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తుంటారు. గురూజీ విషయంలో అనుసరించినట్లుగానే సందర్భాన్ని విస్మరిస్తే, హిట్లర్‌ ‌గురించి గాంధీ, చర్చిల్‌, ‌బోస్‌, ఇతరులు చేసిన వ్యాఖ్యలను కూడా మరింత కఠినంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. కాబట్టి, గురూజీ చేసిన సందర్భోచిత వ్యాఖ్యలను మాత్రమే ఉదహరిస్తూ సాగించే ప్రచారం అత్యంత అన్యాయమైనది, నిజాయతీ లేనిది. అందువల్ల, గురూజీపై న్యాయమైన చర్చ జరగాలంటే, ‘వీ ఆర్‌ అవర్‌ ‌నేషన్‌హుడ్‌ ‌డిఫైన్‌డ్‌’ ‌పుస్తకంలోని సందర్భోచిత అంశాలను సందర్భం లేకుండా ప్రస్తావించే ధోరణిని ఖండించాలి. గురూజీ ఆలోచనలు కాలం, ప్రాంతం, నాటి పరిస్థితుల పరిమితులను ఎలా అధిగమించాయో, అలాగే ఆయన తదనంతరం కూడా అవి ఎలా సరైనవని నిరూపితమయ్యాయో అర్థం చేసుకోవడానికి, దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాన్ని తొలగించడం అత్యవసరం.

(ఎస్‌.‌గురుమూర్తి రచించిన ‘‘గోల్వాల్కర్‌ ‌ది మోడరన్‌ ‌రిషి విత్‌ ‌మిల్లేనియల్‌ ‌విజన్‌’’ ‌పుస్తకం నుంచి)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.