“దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది” అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు నేటికీ సజీవ సత్యం. ఏ దేశానికయినా యువశక్తి గొప్ప సంపద. భారత్‌కు సహజ వనరులతో పాటు దేశంలో పెద్దఎత్తున ఉన్న యువత మనకి గొప్ప వరం. ఆ యువశక్తిని మంచికి మలచుకుంటే అంతకంటే గొప్ప ఆయుధం ఉండదు. అదే యువశక్తిలో విష బీజాలు నాటి తమ స్వార్థానికి వాడుకుంటే అల్లకల్లోలం ఖాయం.
ఇటీవల దేశంలో ఇలాంటి పరిణామాలే జరిగాయి. నీట్‌పరీక్షా పేపర్ లీకుపై ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన యువకుల నిరసనలలో స్వార్థ పూరిత శక్తులు చేరడంతో ఉద్యమం పక్కదారి పట్టింది. అదే సమయంలో ఇదే తరహా అంశంతో ఝార్ఖండ్‌లో యువత చేపట్టిన నిరసనలో అల్లకల్లోలం లేకపోవడడమే కాదు, వారి డిమాండ్‌లో నిజాయతీ కనిపిస్తోంది. ఎక్కడైనా యువత ప్రధానంగా మంచి చదువు,ఉన్నతమైన ఉపాధి కోరు కుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలే లక్షలాది యువత జీవితాలను మారుస్తాయి. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన తర్వాత ఒక పరీక్ష రాయడానికి సిద్ధమయ్యే యువతకు ప్రశ్న పత్రాల లీక్‌లు, పరీక్షలలో అక్రమాలు జరిగితే అది కేవలం ఒక పరీక్షా వైఫల్యం కాదు, వారి కలలపై, కుటుంబాల ఆశలపై, ప్రభుత్వ వ్యవస్థపై ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇటీవల దేశంలో ఇలాంటి పరిణామాలే జరిగాయి. నీట్‌పరీక్షా పేపర్‌ ‌లీకుపై ఢిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వేదికగా జరిగిన యువకుల నిరసనలలో స్వార్థ పూరిత శక్తులు చేరడంతో ఉద్యమం పక్కదారి పట్టింది. అదే సమయంలో ఇదే తరహా అంశంతో ఝార్ఖండ్‌లో యువత చేపట్టిన నిరసనలో అల్లకల్లోలం లేకపోవడడమే కాదు, వారి డిమాండ్‌లో నిజాయతీ కనిపిస్తోంది. ఎక్కడైనా యువత ప్రధానంగా మంచి చదువు,ఉన్నతమైన ఉపాధి కోరు కుంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలే లక్షలాది యువత జీవితాలను మారుస్తాయి. సంవత్సరాల తరబడి కష్టపడి చదివిన తర్వాత ఒక పరీక్ష రాయడానికి సిద్ధమయ్యే యువతకు ప్రశ్న పత్రాల లీక్‌లు, పరీక్షలలో అక్రమాలు జరిగితే అది కేవలం ఒక పరీక్షా వైఫల్యం కాదు, వారి కలలపై, కుటుంబాల ఆశలపై, ప్రభుత్వ వ్యవస్థపై ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

దేశంలో కొంత కాలంగా పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో జరిగిన వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్‌’ ‌వివాదం దేశాన్ని కుదిపివేస్తే, ప్రస్తుతం ఝార్ఖండ్‌, ‌పంజాబ్‌ ‌రాష్ట్రాల్లో ప్రభుత్వ నియామక పరీక్షలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అయితే ఈ వ•డు సందర్భాల్లో ప్రభుత్వాల స్పందన, రాజకీయపార్టీల వైఖరి, చేపట్టిన సంస్క రణలను పోల్చిచూస్తే స్పష్టమైన వ్యత్యాసం కనిపి స్తోంది. అంతేకాదు విద్యార్థులు, యువత చేపట్టిన నిరసన విధానంలో కూడా తేడాలున్నాయి. ప్రధానంగా ఢిల్లీ జంతర్‌ ‌మంతర్‌ ‌వేదికగా జరిగిన ఉద్యమంలో అసాంఘిక శక్తులు జొరబడడంతో హింసాత్మకంగా సాగింది. అదే ఝార్ఖండ్‌లో పూర్తిగా విద్యార్థులు మాత్రమే చేపట్టిన ఉద్యమంలో ఇవేవీ కానరాకుండా లక్ష్య సాధనే లక్ష్యంగా సాగుతోంది. ఢిల్లీలో విద్యార్థుల ముసుగులో జొరబడిన దేశ ద్రోహ శక్తులకు రాజకీయ పార్టీల మద్దతు కూడా తోడవడంతో చెలరేగిన అల్లర్లు దేశంలో చర్చకు దారితీసాయి. అదే ఝార్ఖండ్‌లో విద్యార్థులు ఇలాంటి శక్తులకు అవకాశం ఇవ్వకుండా ఉద్యమించడం విశేషం.

‘నీట్‌’‌లో అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కనిపించింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ ‌వద్ద భారీ నిరసనలు జరిగాయి. కాంగ్రెస్‌తో పాటు ‘ఇండి’ కూటమిలోని పార్టీలు ఈ అంశంతో లబ్ధిపొందేందుకు ప్రయత్నిం చాయి. పార్లమెంట్‌ ‌సమావేశాలు జరగకుండా అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌ ‌కేసును సీబీఐకి అప్పగించింది. జాతీయ పరీక్షా వ్యవస్థలో లోపాలను అధ్యయనం చేయడానికి ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షల భద్రతను బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. ది పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్ (‌ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ ‌మీన్స్) ‌చట్టం అమలు చేసి ప్రశ్నాపత్రాల లీక్‌లు, పరీక్షల అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షల నిబంధనలు తీసుకొచ్చింది. అనంతరం డిజిటల్‌ ‌భద్రత, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల విస్తరణ, పరీక్షా వ్యవస్థ ఆధునికీకరణ దిశగా చర్యలు కొనసాగాయి. విద్యామంత్రి ధర్మేందప్రధాన్‌చే రాజీనామా చేయించి కేందప్రభుత్వం తమ నిబద్దతను నిరూపించుకుంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలు వీడియో సందేశాలు ఇచ్చారు.

యువతకు తక్షణ న్యాయం చేసేలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్పందిస్తే ఝార్ఖండ్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఝార్ఖండ్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ (‌జేపీఎస్‌సీ), ఝార్ఖండ్‌ ‌స్టాఫ్‌ ‌సెలెక్షన్‌ ‌కమిషన్‌ (‌జేఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీక్‌లు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా జేపీఎస్‌సీ14వ సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌ప్రిలిమినరీ పరీక్షపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవడంతో వేలాదిమంది విద్యార్థులు రాంచీలో నిరవధిక ఆందోళనలు ప్రారంభించారు. పరీక్షను రద్దు చేయాలని, సీబీఐతో కానీ లేదా రాష్ట్రానికి వెలుపల ఉన్న పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయవ•ర్తులతో కానీ స్వతంత్ర విచారణ జరపాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

జంతర్‌మంతర్‌ ‌నిరసనలతో పోలిస్తే ఝార్ఖండ్‌ ఉద్యమంలో కనిపిస్తున్న గొప్పదనం అక్కడి క్రమశిక్షణ. రాంచీలోని జైపాల్‌ ‌సింగ్‌ ‌ముండా స్టేడియం వద్ద వేలాదిమంది ఉద్యోగార్థులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోజుల తరబడి టార్పాలిన్‌ ‌షెడ్ల కిందనే నిరసన కొనసాగిస్తున్నారు. వేసవిలో ఉద్యమాన్ని ప్రారంభించిన విద్యార్థులు వర్షాకాలం లోనూ తడుస్తూ దాన్ని కొనసాగిస్తున్నారు. వందే మాతరం నినాదాలతో తమ దేశభక్తిని చాటుకుంటు న్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా వంటా వార్పు చేసుకుంటున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్‌ ‌మహతో చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. హింసకు, విధ్వంసానికి తావివ్వ కుండా, ప్రజా ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించ కుండా, పరీక్షల పారదర్శకత, స్వతంత్ర విచారణ, నియామక వ్యవస్థలో సంస్కరణలనే ప్రధాన డిమాండ్లుగా శాంతియుతంగా ఆందోళన కొనసాగించడం ఈ ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. విద్యార్థుల దృష్టి కేవలం ఉద్యోగాలపై, న్యాయమైన అవకాశాలపైనే ఉండటం కూడా ఈ ఉద్యమంలో ప్రధాన లక్షణంగా నిలిచింది.

ఝార్ఖండ్‌లో ఉద్యమాన్ని ఏ రాజకీయపార్టీ ప్రారంభించలేదు. మొదటి నుంచి విద్యార్థులే దీనికి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలో హడావిడి చేసిన కాక్‌రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) ఇక్కడ అంటీ ముట్టనట్టు వ్యవహరించడంతో వారి తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో సీజేపీ విద్యార్థులకు బహిరంగ మద్దతు ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే రాంచీకి వెళ్లి సంఘీభావం తెలుపుతానని ప్రకటించారు. రాజకీయ పార్టీల నుండి ఎలాంటి అండదండలు లేకుండా ఇక్కడ విద్యార్థులు స్వతంత్రంగా ఉద్యమిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

రాజకీయంగా చూస్తే, ఇక్కడే స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగిన నీట్‌ ఉద్యమంలో కాంగ్రెస్‌తో పాటు ‘ఇండి’ కూటమిలోని పలు పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ ‌గాంధీ మరో అడుగు ముందుకేసి, ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిముందు ధర్నాచేశారు. బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌రాజకీయ లబ్ది కోసం నీట్‌ ఉద్యమాన్ని విద్యార్థుల నుండి హైజాక్‌ ‌చేయాలని చూశారు. కానీ అదే ఝార్ఖండ్‌లో పేపర్‌లీకుపై కాంగ్రెస్‌, ‌దాని మిత్రపక్షాలు మౌనం దాల్చాయి. ఇప్పటికీ రోజూ జంతర్‌మంతర్‌ అం‌శాన్ని లేవనెత్తే రాహుల్‌గాంధీ, ఝార్ఖండ్‌ ‌విద్యార్థుల కోసం పెదవివిప్పరు. ఆ రాష్ట్రంలో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ ‌రెండు నాలుకల ధోరణిని, దాటవేత వైఖరిని ప్రదర్శిస్తోంది.  కాంగ్రెస్‌ ‌పార్టీయే కాదు, సామాజిక వేత్తలుగా చెప్పుకునే మేధావి వర్గం, ప్రజా సంఘాలు, సినీ ప్రముఖులు, పక్షపాత మీడియా ఝార్ఖండ్‌ ‌విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

జంతర్‌మంతర్‌లో జరిగిన, ఝార్ఖండ్‌లో జరుగుతున్న నిరసనలు పోల్చి చూస్తే నిజంగా విద్యార్థుల కోసం జరిగిన ఉద్యమం ఏదో, విద్యార్థుల ముసుగులో స్వలాభం చూసుకున్న శక్తులేవో స్పష్టంగా తేట తెల్లమయ్యింది. విద్యార్థుల పేరుతో జంతర్‌ ‌మంతర్‌లో దేశ వ్యతిరేక శక్తులు జొరబడ్డాయని నాటి ఘటనలే నిరూపించాయి. దేశానికి వ్యతిరేకంగా ఆజాదీ నినాదాలు చేయడం, సనాతన ధర్మాన్ని కించపర్చేలా హిందూ దేవతను దూషించడం, దేశ ప్రధానమంత్రి పదవిని అగౌరపరుస్తూ ఆయనపై, ఆయన తల్లి గురించి అసభ్యకరంగా మాట్లాడడం చూస్తే, వీరు విద్యార్థులేనా అనే సందేహాలొచ్చాయి. పార్లమెంట్‌ ‌మార్చ్ ‌పేరుతో ముందస్తు ప్రణాళికతో లారీలలో రాళ్లు పోగేసుకొని వాటిని పోలీసులపై రాళ్లు రువ్వడం, భద్రతాదళాలపై పెప్పర్‌ ‌స్ప్రే చల్లడం, కొన్ని మీడియా చానెళ్లను లక్ష్యంగా చేసుకొని దాడిచేయడం వంటి ఘటనలు చూస్తే వీటి వెనుక దేశ ద్రోహశక్తులున్నాయని స్పష్టమవుతోంది. జంతర్‌ ‌మంతర్‌ అల్లర్ల వెనుక అంతర్జాతీయ శక్తుల కుట్రలుంటే, ఝార్ఖండ్‌ ఉద్యమం వెనుక విద్యార్థుల ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది.

ఝార్ఖండ్‌తో పాటు పంజాబ్‌లో కూడా పరీక్షల పారదర్శకతపై పలు వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. విద్యాశాఖమంత్రి హర్జోత్‌ ‌సింగ్‌ ‌బైన్స్ ‌రాజీనామా కోరుతున్నారు. అసెంబ్లీలో నిరసనలు, వాక్‌అవుట్‌లూ జరిగాయి. అయితే ఆప్‌ ‌ప్రభుత్వం మాత్రం ‘‘ఇది పేపర్‌ ‌లీక్‌ ‌కాదు, టెక్నాలజీ ఆధారిత చీటింగ్‌’’ అని వాదిస్తూ లీక్‌ ‌తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వెళ్లలేదని, కొందరు ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ద్వారా మోసానికి పాల్పడ్డారని తప్పించు కునేందుకు ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో సీజేపీ వెనుక ఆప్‌ ‌హస్తం ఉన్నట్టు ప్రచారమున్న నేపథ్యంలో పంజాబ్‌లో ఆ పార్టీ మౌనం దాల్చింది. ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌కూడా ఢిల్లీలో చూపిన ఉత్సాహం పంజాబ్‌లో చూపించలేదు.

పేపర్‌ ‌లీక్‌పై ఈ వ•డు ఘటనలను పోల్చి చూస్తే ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కేంద్రంలో జరిగిన పరీక్షల వివాదంపై ఒక రకమైన రాజకీయ వైఖరి, కాంగ్రెస్‌ ‌భాగస్వామిగా ఉన్న ఝార్ఖండ్‌లో మరో రకమైన స్పందన, ఆప్‌ ‌పాలిత పంజాబ్‌లో ఇంకో విధమైన రాజకీయ పోరు కనిపిస్తుంది. అధికారంలో ఎవరున్నారన్నది పక్కన పెడితే, పరీక్షల అక్రమాల విషయంలో రాజకీయ పార్టీల ప్రమాణాలు ఒకేలా ఉండవా? యువత భవిష్యత్తు రాజకీయాలకు అతీతమైన అంశం కాదా? అనే ప్రశ్నలు సహజంగా తలెత్తుతున్నాయి.

మూడు చోట్ల జరిగిన పేపర్‌ ‌లీకులలో మరో ముఖ్యమైన అంశం కూడా గమనిస్తే నీట్‌ ‌వివాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం విచారణతో పాటు సంస్థాగత సంస్కరణలు ప్రారంభించింది. కానీ ఝార్ఖండ్‌లో ఇప్పటికీ ప్రధానంగా సీఐడీ విచారణ, రాజకీయవిమర్శలకే వ్యవహారం పరిమితమైంది. పంజాబ్‌లో ప్రభుత్వం కేవలం ఆరోపణలను ఖండిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షా వ్యవస్థను సవ•లంగా మార్చే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ‌స్వతంత్ర సంస్కరణల కమిటీ, కొత్త రాష్ట్ర చట్టం లేదా నియామక సంస్థల పునర్వ్యవ స్థీకరణ వంటి సంస్థాగత చర్యలు ఇప్పటివరకు ప్రకటించలేదు. కేంద్రంలోని ప్రభుత్వం విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే, ఇది తమ విజయంగా చంకలు గుద్దుకుంటూ విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్‌ ‌చేయడానికి ప్రయత్నించిన కాం•గ్రెస్‌, ‌దాని మిత్రపక్షాలు ఝార్ఖండ్‌, ‌పంజాబ్‌లో అదే తరహా చర్యలు తీసుకోకపోవడంతో దేశ ప్రజలకు వారి నిజస్వరూపం బట్టబయలైంది.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారవచ్చు. రాజకీయ పార్టీలు మారవచ్చు. కానీ పరీక్షల విషయంలో ప్రభుత్వాల నిబద్ధత మాత్రం మార కూడదు. యువత చేస్తున్నది రాజకీయ ఆరోపణలు కాదు. న్యాయమైన అవకాశాలు. హింసాత్మకమైన నిరసనలు కాదు. భవిష్యత్తులో ప్రశ్నపత్రాలు లీక్‌ ‌కాకుండా ఉండే వ్యవస్థను కోరుతున్నారు. లీకులు ఏ రాష్ట్రంలో జరిగినా ఒకే ప్రమాణంతో స్పందించి, ఒకే స్థాయి సంస్కరణలు అమలు చేసినప్పుడే ప్రజల విశ్వాసం నిలబడుతుంది. యువత భవిష్యత్తును కాపాడే పోరాటంలో రాజకీయ పార్టీలు గెలవడం కాదు, పారదర్శక వ్యవస్థ గెలవాలి. అదే దేశ భవి ష్యత్తుకు నిజమైన భరోసా. ఈ సందర్భంగా ‘‘విద్యార్థులు, యువత రాజ కీయాలపై అవగాహన పెంచుకోవాలి, కానీ అంకితభావం, నైతికత కోల్పో కూడదు..’’ అని రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అం‌బేద్కర్‌ అన్న మాటలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో విలువ ఉంది. స్వార్థపూరిత శక్తుల, కుట్రపూరిత రాజకీయ పార్టీల చేతిలో దేశ విద్యార్థులు, యువత పావులుగా కాకుండా ఉంటే ఎలా ఉంటుందో జంతర్‌ ‌మంతర్‌, ‌ఝార్ఖండ్‌ ‌విద్యార్థుల ఉద్యమా మధ్య తేడాలే నిరూపిస్తున్నాయి.

శ్రీపాద

About Author

By editor