రాష్ట్రీయం స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)‌సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబ మే 12న ఢిల్లీలోని సంస్థ కార్యాలయంలో పీటీఐతో జరిపిన సుదీర్ఘ ముఖాముఖిలో  హిందుత్వం,సనాతన ధర్మం, అంతర్జాతీయ వేదికపై భారత్‌ ‌పాత్ర, పాశ్చాత్య దేశాలలో సంస్థ విస్తరణ, పాకిస్థాన్‌తో సంబంధాలు, ప్రవాస భారతీయులు, విజ్ఞానం, ఆధ్యాత్మికత, ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న నాగరిక సవాళ్లపై మాట్లాడారు. ముఖాముఖీలోని ముఖ్యాంశాలు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రపంచ దృక్పథాన్ని విశదీకరిస్తున్నాయి.


పాశ్చాత్య ప్రపంచంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి ఉన్న అపోహలను తొలగించడం మీ పర్యటన ఉద్దేశ్యాలలో ఒకటి. దాని ఫలితంతో మీరు సంతృప్తిగా ఉన్నారా?

నేను గతంలో కూడా పాశ్చాత్య దేశాలను సందర్శించాను. ప్రధానంగా హిందూ సమాజాన్ని కలవడానికి, హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సమావేశాలలో ప్రసంగించడానికి పర్యటించాను. ఒకటి రెండు సందర్భాలు మినహా, ఆ సంభాష ణలలో చాలా వరకు భారతీయ వ•లాలున్న ప్రజలు, హిందూ సమాజ సభ్యులతోనే జరిగాయి. ఈసారి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో మా ప్రపంచవ్యాప్త ప్రచార ప్రయత్నాలలో భాగంగా, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, మేధావులు సహా సమాజంలోని వివిధ రంగాలకు చెందిన స్థానిక, ప్రభావ వంతమైన వ్యక్తులతో మరింతగా మమేక మవ్వాలని  నిర్ణయించుకున్నాము. నాకు స్టాన్‌ఫోర్డ్ ‌విశ్వవిద్యాలయంలోని గ్లోబల్‌ ‌సైంటిఫిక్‌ ఇన్నోవేషన్‌ ‌ఫోరమ్‌, ‌వాషింగ్టన్‌లోని హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఆహ్వానాలు అందాయి.ఈ కార్యక్రమాలు నాకు ఇతర ప్రదేశాలను సందర్శించడానికి, విద్యావేత్తలు, మేధోమథన బృంద సభ్యులు, నోబెల్‌ ‌బహుమతి గ్రహీతలు, •••ఎస్‌ ‌కాంగ్రెస్‌కు సంబంధించిన కొందరు సభ్యులతో కూడా సంభాషించడానికి అవకాశాలు కల్పించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే ఏమిటి? దాని తాత్వికత, భారతదేశపు ప్రాచీన నాగరిక సంస్కృతి,ఆధ్యాత్మిక సందేశం నుంచి అది ఎలా ప్రేరణ పొందింది? అనే ప్రశ్నలకు సమాధానాలను ప్రపంచానికి వివరించడానికి ఈ పర్యటన నాకు అవకాశం కల్పించింది.

మీరు చాలా మంది భారతీయులు కానివారితో సంభాషించారు కాబట్టి, మీ చర్చల సమయంలో పాశ్చాత్య ప్రపంచం నుంచి ఏ ఆందోళనలు ప్రముఖంగా కనిపించాయి?

నేను గమనించిన ఒక ప్రధాన ఆందోళన… వేగవంతమైన సాంకేతికత, వేగవంతమైన వృద్ధి గురించి. కృత్రిమమేధ వంటి ఆవిష్కరణల పట్ల ఉత్సాహం ఉన్నప్పటికీ, సమాజాలు సాంస్కృతిక సవాళ్లను ఎలా ఎదుర్కొంటాయి? మానవ సంబంధాలకు ఏమవుతుంది? మానవ సమాజం ఎలా పరిణామం చెందుతుంది? అనే విషయాలపై కూడా ఆందోళన ఉంది. పర్యావరణం మరో ముఖ్యమైన ఆందోళన. తన సుదీర్ఘ నాగరికతా అనుభవం, ప్రపంచ దృక్పథం కారణంగా, ఈ సమస్యలను పరిష్కరించడానికి భారతదేశానికి ప్రత్యేక సామర్థ్యం ఉందని నేను భావిస్తున్నాను.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గురించి, దాని చుట్టూ అల్లుకున్న అపోహల గురించి ప్రజలు మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడిగారు?

చాలా సందర్భాల్లో అది కేవలం అపోహ మాత్రమే కాదు, అజ్ఞానం కూడా. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏం ‌చేస్తున్నది చాలా మందికి నిజంగా తెలియదు. వారికి తెలిసిన దంతా ఎక్కువగా మీడియా నివేదికలు లేదా ఇతరుల ద్వారా విన్నదే. కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్‌ను ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక లేదా జాత్యహంకార సంస్థగా కూడా చూస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది సమాజసేవ, జాతీయసేవ ద్వారా మానవ, సామాజిక వ•లధనాన్ని నిర్మించడానికి పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ అని నేను వివరించాను. మా వందేళ్ల ప్రయాణంలో చేసిన మంచి పనుల గురించి, స్వయంసేవకులు ప్రజాజీవితానికి ఎలా దోహదపడుతున్నది, వారు దేశ నిర్మాణ కార్యకలాపాలకు అంకితమైన అనేక పౌర సంస్థలను స్థాపించి, వాటిని నిర్వహిస్తున్న వైనం గురించి కూడా మాట్లాడాను. ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రశ్నలు అడిగారు. సమాధానాలను శ్రద్ధగా ఆలకించారు.

అమెరికాలోని ప్రవాస భారతీయులు సంపదలోనూ,  పలుకుబడిలోనూ గణనీయంగా వృద్ధి చెందారు. కానీ ఆ ప్రవాస భారతీయులు ఇప్పటికీ ప్రాంతీయ, భాషా, కుల ప్రాతిపదికన వేరుపడి ఉన్నారని కూడా మీరు భావిస్తున్నారా?

మీరు చెప్పిన రెండు విషయాలు నిజమే. ప్రవాస భారతీయులు అమెరికాలో తమదైన ముద్ర వేశారు. భారతీయ లేదా హిందూ సమాజం గురించి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే…వారు నివసించే ఏ దేశానికీ సమస్యగా మారలేదు. ఒక సమాజంగా వారి ప్రవర్తన సాధారణంగా సానుకూలంగా ఉంది. ఇది వారి సాంస్కృతిక, నాగరిక నేపథ్యం నుంచి వచ్చిందని విశ్వసిస్తున్నాను.

అయితే, ఒకే పెద్ద సమాజంగా ఎదగడానికి బదులుగా, విదేశాల్లోని భారతీయులు కొన్నిసార్లు తెలంగాణ, తమిళనాడు లేదా ఆంధప్రదేశ్‌ల చిన్న ప్రతిరూపాలను సృష్టిస్తున్నందుకు మీరు నిరాశ చెందారా?

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమాజం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లయితే వంద సంవత్సరాలు పూర్తి చేసుకొనేది కాదు.ప్రజల పట్ల మాకు ఎనలేని విశ్వాసం ఉంది. మనమం దరం ఒకే సంస్కృతికి, ఒకే నాగరిక నేపథ్యానికి చెందిన వారమనేది ప్రధాన భావన. నేను ప్రతిచోటా నొక్కి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రజలు ‘‘విడివిడిగా కలిసి పనిచేయడం’’ అనే కళను నేర్చుకోవాలి.వివిధ సంస్థలు తాము ఎంచుకున్న ఆశయాల కోసం స్వయంప్రతిపత్తితో పనిచేయడం కొనసాగించవచ్చు. కానీ అదే సమయంలో, వారు అప్పుడప్పుడు కలిసి రావడానికి, ఉమ్మడి కార్య క్రమాలను నిర్వహించడానికి, పరస్పర మద్దతు అందించడానికి మార్గాలను కూడా కనుగొనాలి. ప్రతి ఒక్కరూ హిందూ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌కిందకు గానీ లేదా ఏదైనా ఒక సంస్థ కిందకు గానీ రాలేరు.అది ఆచరణ సాధ్యం కాదు. ఇక్కడ ముఖ్యమైనది ఉమ్మడి సాంస్కృతిక విలువల ప్రభావం,‘‘విడివిడిగా కలిసి పనిచేయడం’’ అనే భావన.

అమెరికా లేదా బ్రిటన్‌లో నివసించే భవిష్యత్‌ ‌తరాలు తమ భారతీయ గుర్తింపును పూర్తిగా కోల్పోతారేమోనని మీరు ఆందోళన చెందుతున్నారా? భారతీయులు తమ సంస్కృతి పట్ల గర్వాన్ని, స్థానిక సమాజాల పట్ల గౌరవాన్ని ఎలా సమతుల్యం చేసుకోవాలి?

మనం కూడా అనేక విధాలుగా మరింత పాశ్చాత్యీకరణ చెందుతున్నాము. అసలు ప్రశ్న…ఎవరైనా అమెరికన్‌ ‌లేదా బ్రిటిష్‌ అయ్యారా? అనేది కాదు, వారు ఏ విలువలతో జీవిస్తున్నారు అనేది. అంతిమంగా కుటుంబం, సమాజం, ప్రకృతి పట్ల మానవ ప్రవర్తనే ముఖ్యమైనది. భారతదేశ ప్రపంచ దృష్టికోణం ఎల్లప్పుడూ ఈ శాశ్వతమైన విలువలపైనే దృష్టి సారించింది. దుస్తులు లేదా జీవనశైలి వంటి బాహ్య అంశాలు ఒకరు నివసించే సమాజానికి సహజంగానే అనుగుణంగా మారతాయి. ఆ కోణంలో ‘రోమ్‌లో ఉన్నప్పుడు, రోమన్‌లా ప్రవర్తించు’ అనేది ఆమోదయోగ్యమైనదే. కానీ పెద్దల పట్ల గౌరవం, కుటుంబ ఐక్యత, సమాజం పట్ల బాధ్యత, తరువాతి తరాన్ని పోషించడం వంటి విలువలు మానవ జీవితంలో ప్రాథమికమైన, శాశ్వతమైన విలువలుగా మిగిలిపోతాయి.

విదేశాలలో ఉన్న భారతీయులలో అత్యధికులు చట్టాన్ని గౌరవించేవారు. వారు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనరు. భారతీయులు కష్టపడి, ప్రతిభతో ఆర్థికంగా విజయం సాధించడం వల్ల కొన్నిసార్లు ఘర్షణలు తలెత్తు తాయి. ఉద్యోగాలు లేదా అవకాశాలు లాగేసుకుంటున్నారనే భయాలు స్థానిక సమాజంలోని కొన్ని వర్గాలలో ఉండవచ్చు. ఇక్కడే నాగరిక విలువలు ముఖ్యమవుతాయి. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు తాము నివసిస్తూ, జీవనోపాధి పొందుతున్న సమాజం, దేశం పట్ల తమ బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి విధేయత ఎన్నడూ ప్రశ్నార్థకం కాకూడదు. వారు భారత దేశంతో సంబంధాన్ని కొనసాగించడం సహజమే, కానీ అదే సమయంలో వారు తమ చుట్టూ ఉన్న స్థానిక సమాజానికి చురుకుగా సేవ చేయాలి. అక్కడి వారితో మమేకం కావాలి.

మాదకద్రవ్యాల దుర్వ్యసనం, విచ్ఛిన్నమైపోతున్న కుటుంబాలు, అతి వ్యక్తివాదం, తదితర సామాజిక సమస్యల పరిష్కారానికి భారత్‌ ‌చేస్తున్న మార్గ దర్శనం గురించి మీకు ఆతిథ్యం ఇచ్చినవారికి మీరేమి చెప్పారు?

నేను భారతీయ తాత్వికతలో పాతుకుపోయిన ప్రపంచ దృష్టికోణం గురించి మాట్లాడాను. స్వామి వివేకానంద ఇలాంటి విషయాల గురించి మాట్లాడి 100 సంవత్సరాలు దాటిపోయింది. మత దురభి మానం పరిష్కారాలను అందించలేదు. భారతీయ ప్రపంచ దృష్టికోణం సజీవ, నిర్జీవ అనే తేడా లేకుండా అన్ని ప్రాణులలో ఒకే దైవత్వాన్ని చూడాలని బోధిస్తుంది. ఈ విలువలను విద్య, కుటుంబ జీవితం, నైతిక శిక్షణ ద్వారా పెంపొందించాలి. మానవ సంబంధాలు, సామాజిక సామ రస్యం, ప్రకృతితో సామరస్యం అన్నీ ముఖ్యమైనవే. మన పండుగలు, సంప్రదా యాలు కేవలం ధార్మికపరమైన ఆచారాలు మాత్రమే కాదు. అవి మానవ బంధాలను, విలువలను బలోపేతం చేయడానికి రూపొందించిన రక్షాబంధన్‌, ‌గురు వందన వంటి సాంస్కృతిక యంత్రాంగాలు.

ప్రపంచంలో కొనసాగుతున్న సంఘర్షణల గురించి చాలా మంది ప్రస్తుత పరిస్థితిని ఒక నాగరిక సంక్షోభంగా అభివర్ణిస్తున్నారు.  మీరు ఈ యుద్ధాలను ఎలా చూస్తారు?

గత 30 సంవత్సరాల ప్రపంచ చరిత్రను మనం పరిశీలిస్తే, యుద్ధం లేదా సంఘర్షణ పూర్తిగా లేని కాలం దాదాపుగా లేదు. ఏ సమయంలోనైనా, ప్రపం చంలోని ఏదో ఒక ప్రాంతం యుద్ధం, ఉద్రిక్తత లేదా ఘర్షణను చవిచూసింది. ప్రచ్ఛన్న యుద్ధం, వియత్నాం యుద్ధం, గల్ఫ్ ‌యుద్ధం, ఇరాక్‌ ‌సంఘర్షణ, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఉన్నాయి. యుద్ధాలు మానవ మనస్సులో మొదలవుతాయి.అవి దురాశ, అహంకారం లేదా తమకు చెందని దానిని స్వాధీనం చేసుకోవాలని లేదా నియంత్రించాలనే కోరిక నుంచి పుడతాయి. ఇది వ్యక్తులు, సమాజాలు లేదా దేశాల స్థాయిలో జరగవచ్చు. అనేక ఆధునిక సంఘర్షణలు వాణిజ్య ప్రయోజనాలు, భౌగోళిక రాజకీయాతో ప్రభావిత మవుతున్నాయి. దశాబ్దాల క్రితం, కొంతమంది మేధావులు చమురు కోసం యుద్ధాలు వస్తాయని అంచనా వేశారు, ఇప్పుడు నీటి కోసం భవిష్యత్‌ ‌యుద్ధాల గురించి అంచనాలు ఉన్నాయి. దీని అర్థం మానవాళి సంఘర్షణల నుంచి పూర్తిగా విముక్తి పొందడం అసంభవం. ప్రస్తుత సంఘర్షణలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచాన్ని గణనీయమైన రీతిలో మారుస్తాయి. అయితే, ఈ యుద్ధాల కారణంగా భారత్‌ ‌వంటి దేశాలు కూడా బాధపడుతున్నాయి. ప్రధానమంత్రి ఇటీవల పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. చాలా మంది పౌరులు దానిని మనఃస్ఫూర్తిగా పాటించారు.లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి, ఇందిరాగాంధీ కూడా కష్ట సమయాల్లో పొదుపు కోసం విజ్ఞప్తి చేశారు. జాతీయ నాయకులు సంయమనం, నిరాడంబరత కోసం పిలుపునిచ్చి నప్పుడు, దానిని దేశ సంక్షేమం దృష్ట్యా చూడాలి. ప్రస్తుత ప్రధానమంత్రి విజ్ఞప్తిని కూడా అదే స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. నిజానికి యుద్ధ సమయాలకు అతీతంగా కూడా నిరాడంబరత, పొదుపు అనేవి భారతదేశ సాంప్రదాయ జీవన విధానంతో గాఢంగా ముడిపడి ఉన్న విలువలు. సంక్షోభ సమయాల్లో ఈ విలువలు మరింత అవసరం అవుతాయి.

ఇలాంటి సంక్షోభ సమయాల్లో భారతదేశం అంతర్జాతీయంగా పెద్ద పాత్ర పోషించగలదని మీరు భావిస్తున్నారా?

గత దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో ప్రపంచంలో భారత్‌ ‌స్థానం గణనీయంగా మారింది. నేడు, అంతర్జాతీయంగా భారత్‌ ‌మాట వినబడు తోంది. గుర్తింపును, గౌరవాన్ని పొందుతున్నది. ఈ పరిస్థితి కారణంగా, దేశాలు, ప్రపంచ నాయకుల వివేకానికి, సదవగాహనకు విజ్ఞప్తి చేయడం ద్వారా భారత్‌ ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించగలదు.

గత సంవత్సర కాలంలో, భారతదేశం అనేక విదేశాంగ విధాన సవాళ్లను ఎదుర్కొంది. ఈ సమస్య లను ఎలా పరిష్కరించాలనే దానిపై ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇచ్చిందా?

మేము అనధికారికంగా చర్చలు జరుపుతాము. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌కు అధికారిక విదేశాంగ విధాన మేధోమథన బృందం లేదు. అయితే, ప్రధానమంత్రి విదేశాంగ విధాన వైఖరిలో కనిపించే అనేక సూత్రాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పటి నుంచో నొక్కి చెబుతున్న వాటిని, ఈ దేశ సంప్రదాయాలలో పాతుకుపోయిన విస్తృత నాగరికతా భావనలను, ప్రపంచ దృక్పథాలను ప్రతిబింబిస్తాయి.

పాకిస్తాన్‌తో భారతదేశం ఎలా వ్యవహరించా లని మీరు భావిస్తున్నారు? సంబంధాలు కొనసాగించాలా?

గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌తో సంబంధాల కోసం భారతదేశం సాధ్యమైన ప్రతి పద్ధతిని ప్రయత్నిం చింది. సంబంధాలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా అటల్‌బిహారీ వాజ్‌పేయి బస్సులో లాహోర్‌ ‌ప్రయాణించారు. ప్రస్తుత ప్రధానమంత్రి తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాకిస్తాన్‌ ‌నాయకత్వాన్ని ఆహ్వానించారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా సంప్రదింపుల ప్రయత్నాలు కూడా చేశారు. అదే సమయంలో, పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదదాడులు లేదా పుల్వామా వంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి నప్పుడల్లా, భారతదేశం తగిన విధంగా, దృఢంగా స్పందించింది. దేశ భద్రతను, ఆత్మగౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాలి. దానిని నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అయితే, దృఢంగా ప్రతిస్పంది స్తున్నప్పటికీ చర్చల ద్వారాలను పూర్తిగా వ•సివేయకూడదు. దౌత్య సంబంధాలు కొనసాగు తున్నాయి. వాణిజ్యం కొంత మేరకు కొనసాగు తున్నది. వీసాలు ఇప్పటికీ జారీ అవుతున్నాయి. ప్రస్తుతం, పాకిస్తాన్‌ ‌కఠిన వైఖరి, పదేపదే జరుగుతున్న సంఘటనల వల్ల ఏర్పడిన ఉద్రిక్తతల కారణంగా ఇరుదేశాల మధ్య అనేక మార్పిడులు నిలిచిపోయాయి. 26/11 ముంబై దాడుల తర్వాత పరస్పర విశ్వాసం గణనీయంగా బలహీనపడింది. శాంతి ప్రయత్నాలు పదేపదే ఎదురుదెబ్బలు తిన్నాయి. అయినప్పటికీ, ఇతర రకాల సంప్రదిం పులు పరిమిత మార్గాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌ ‌పౌరసమాజం నుంచి అధిక భాగస్వామ్యం సంబం ధాలను మెరుగు పరచడంలో సహాయ పడుతుందని నమ్ముతున్నాను. రాజకీయ, సైనిక నాయకత్వాల మధ్య తీవ్ర విభేదాలు లేదా అపనమ్మకం ఏర్పడవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు పౌర సమాజ సంబంధాలు కొనసాగాలి.

అమెరికా సహా పలు దేశాల్లో హిందుత్వ గురించి, హిందూ దేశం అనే భావన గురించి తరచుగా ఒక ప్రశ్న వినిపిస్తుంటుంది. మీరు వారికి భారత దేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారనే ఒక భరోసాను  ఎలా ఇస్తారు?

ఈ ప్రశ్న దశాబ్దాలుగా పదేపదే వినవస్తున్నది. కానీ మనం వాస్తవాలను పరిశీలించాలి. భారత దేశంలో ముస్లిం జనాభా తగ్గిపోయిందా? ముస్లింలు లేదా క్రైస్తవులు భారతదేశం నుంచి పారిపోవలసి వచ్చిందా? బీజేపీ పాలించే రాష్ట్రాల్లో లేదా స్వయం సేవకులు చురుకుగా ఉన్న ప్రదేశాలలో వారిని రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారా? ఇవి నిజాయితీగా పరిశీలించాల్సిన ప్రశ్నలు. మీడియాలోని కొన్ని వర్గాలలో, ప్రజా చర్చలలో ఇటువంటి ఆందోళనలను పదేపదే ప్రచారం చేయడం ద్వారా తరచుగా అనవసరంగా భయాన్ని సృష్టిస్తున్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌ ‌క్రైస్తవులు, ముస్లింలు సహా మైనారిటీ వర్గాల నాయకులతో నిరంతర సంభాష ణను కొనసాగిస్తుంది. నిజానికి, భారతదేశంలో ‘‘మతపరమైన మైనారిటీలు’’ అనే భావన వ•లచట్రం పూర్తిగా సరైనది కాదని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విశ్వసిస్తుంది. ప్రాథమికంగా మేము భారతీయు లందరినీ ఒకే ప్రజలుగా, ఉమ్మడి పూర్వికులు, ఉమ్మడి నాగరిక వారసత్వం కలిగిన వారిగా చూస్తాము. ఒకరి ఆరాధనా విధానాన్ని పుణికి పుచ్చుకోవడంల వల్ల అలా చేసిన  వారి జాతీయత మారదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక హిందూ దేశాన్ని సృష్టించడానికి ప్రయత్నిం చడం లేదు. ఈ దేశానికి ఇప్పటికే హిందూ నాగరిక స్వభావం ఉంది. దేశం, రాజ్యం అనే భావనల మధ్య తరచుగా గందరగోళం ఉంటుంది. భారతదేశంలో జాతీయతను కేవలం ఒక రాజకీయ ఏర్పాటుగా కాకుండా, విస్తృతమైన నాగరిక, సాంస్కృతిక కోణంలో అర్థం చేసుకుంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోనే ముస్లిం, క్రైస్తవ నేపథ్యాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. వారి సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చు, కానీ గాంధీజీ ప్రభావంతో హిందూ-ముస్లిం ఐక్యతను బలంగా ప్రోత్సహించిన సర్వోదయ వంటి సంస్థలలో కూడా ముస్లింల నుండి పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కనిపించలేదు. కేవలం దానిని బట్టి శత్రుత్వం లేదా బహిష్కరణ అని నిర్ధారించలేము. అందువల్ల, ఈ సమస్యల వ•లాల్లోకి మరింత లోతుగా చర్చ జరగాలని నేను నమ్ముతున్నాను.

ఈ ప్రశ్న ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి అడగ కూడదు. దీనిని ముస్లిం నాయకత్వాన్ని అడగాలి.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ ‌మరోసారి అన్నారు. ఇలాంటి ప్రకటనలకు మీరెలా స్పందిస్తారు?

అది ఆయన అభిప్రాయం. ప్రజలు కూడా ఎన్నికలద్వారా ఇలాంటి అభిప్రా యాలకు ప్రతి స్పందించారు. కానీ ఎవరో చెప్పినంత మాత్రాన సనాతనత్వం అదృశ్యం కాదు. సనాతనత్వం కేవలం ఒక ధార్మికపరమైన ఆచారం కాదు. అది ఈదేశపు స్ఫూర్తి, ఆత్మ. అదొక విలువల వ్యవస్థ, ఒక ప్రపంచ దృక్పథం. సనాతనత్వం అనే పదానికి అసలైన అర్థం శాశ్వతమైనది, నిరంతరం కొనసాగేది. శ్రీ అరబిందో కూడా సనాతనత్వాన్ని ఈ దేశ జాతీయతకు ఆధారం అని వర్ణించారు. ఆ కోణంలో సత్యం వంటి శాశ్వత విలువలు,మనం హిందూ విలువలు, భారత నాగరి కతా స్ఫూర్తి అని పిలిచే వాటిద్వారా వ్యక్తమవుతాయి.

అనువాదం: మహేష్‌ ‌ధూళిపాళ్ళ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE